1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

3
00:01:26,879 --> 00:01:31,508
కలలు నిజమవుతాయని మా అమ్మ నమ్మకం.

4
00:01:34,052 --> 00:01:37,848
పీడకల నిజం కాకుండా ఉండాలంటే,
దాన్ని నీటితో చెప్పుకోవాలి.

5
00:01:40,517 --> 00:01:45,647
నా పెళ్లి నిశ్చయ వేడుక తర్వాత,
కలలో రౌజి-ఇ-షరీఫ్ కనిపించింది.

6
00:01:48,442 --> 00:01:51,445
జనం ప్రార్ధనలు చేస్తున్నారు,
జీవితం ప్రశాంతంగా ఉంది.

7
00:02:06,502 --> 00:02:08,586
ఇంతలో, పిడుగు పడింది.

8
00:02:24,186 --> 00:02:27,648
శవపేటికల్లో బ్రెడ్ మోసుకెళ్తున్నారు.

9
00:02:49,753 --> 00:02:52,840
ఇంతలో, ఆకాశం నుంచి
రాళ్ల వర్షం కురుస్తోంది.

10
00:02:57,928 --> 00:03:03,684
నేను నిద్ర లేచాక, నా కలని
వర్షంతో చెప్పుకున్నా.

11
00:03:06,144 --> 00:03:09,564
ఒంటెపై పోయేవాడా,

12
00:03:09,565 --> 00:03:12,817
నిదానంగా వెళ్లు,

13
00:03:12,818 --> 00:03:19,199
నా ఆత్మని నీతో తీసుకెళ్తున్నావు.

14
00:03:19,783 --> 00:03:25,581
ఆమె నా గుండెని పట్టుకుంది,

15
00:03:26,081 --> 00:03:31,795
తర్వాత దాన్ని తీసుకెళ్లిపోయింది.

16
00:03:32,629 --> 00:03:38,509
భర్త ఎంత ఇవ్వగలడు అన్నదానిపై
కట్నం ఆధారపడి ఉంటుంది.

17
00:03:38,510 --> 00:03:45,475
కట్నం ఎంతివ్వాలి అనేది షరియా చట్టంలో లేదు.

18
00:03:49,229 --> 00:03:55,027
రెండేళ్ల ప్రేమ తర్వాత,
మా పెళ్లి నిశ్చయమైంది.

19
00:03:55,903 --> 00:03:58,613
ఆ వేడుకలో, తను మగాళ్ల దగ్గర ఉన్నాడు,

20
00:03:58,614 --> 00:03:59,906
నేను ఆడవాళ్ల దగ్గర ఉన్నా.

21
00:03:59,907 --> 00:04:10,918
- నీకు అమ్మాయి నచ్చిందా?
- నాకు ఆ అమ్మాయి నచ్చింది.

22
00:04:27,059 --> 00:04:30,645
{\an8}ఆగస్టు 14, 2021:
జహ్రా & ఒమీద్ వివాహ నిశ్చయ వేడుక.

23
00:04:30,646 --> 00:04:32,022
ఒమీద్
జన్మ్

24
00:04:49,248 --> 00:04:51,041
{\an8}ఆ రోజు సాయంత్రం.

25
00:04:58,465 --> 00:05:00,509
తాలిబన్ డౌన్ డౌన్!

26
00:05:03,554 --> 00:05:05,973
ఆప్ఘనిస్తాన్ జిందాబాద్!

27
00:05:11,061 --> 00:05:14,898
{\an8}ఆగస్టు 15, 2021:
తాలిబన్లు కాబూల్‌లో ప్రవేశించారు.

28
00:05:24,783 --> 00:05:27,369
అల్లా హు అక్బర్!

29
00:06:37,231 --> 00:06:39,607
- వీడియో తీయ్, వీడియో తీయ్!
- తీస్తున్నా!

30
00:06:39,608 --> 00:06:44,237
వందలమంది ఇస్లామిక్ అధికార
సైనికులు ఉన్నారు.

31
00:06:44,238 --> 00:06:50,159
నలుమూలల నుంచి
వాళ్లు మమ్మల్ని చుట్టుముట్టారు.

32
00:06:50,160 --> 00:06:51,577
మేము కేవలం 12 మంది మహిళలం.

33
00:06:51,578 --> 00:06:53,497
అయినా మేము ప్రతిఘటిస్తున్నాం.

34
00:07:19,731 --> 00:07:22,776
వీడియో తీస్తున్నా అని చెప్పా కదా,
కాల్ చేయకు.

35
00:07:35,289 --> 00:07:36,874
అక్కడ కరెంట్ లేదు, కదా?

36
00:07:44,923 --> 00:07:46,340
{\an8}జహ్రా, డెంటిస్ట్

37
00:07:46,341 --> 00:07:48,552
{\an8}ఈ తరం నాశనమైంది.

38
00:07:54,516 --> 00:07:57,311
ఇప్పటిదాకా, తాలిబన్లు డాక్టర్లని
ఇబ్బంది పెట్టలేదు.

39
00:07:58,020 --> 00:08:03,316
అయితే తాజాగా నా క్లినిక్ బోర్డుపై
నా పేరు తీసేయాలని ఆర్డర్ వేశారు.

40
00:08:03,317 --> 00:08:07,154
నా ఆఫీస్ మూసివేతకి
ఇది ప్రారంభం కాదని ఆశిస్తున్నా.

41
00:08:08,280 --> 00:08:10,531
నా మాస్క్ ఎక్కడ?

42
00:08:10,532 --> 00:08:12,743
సర్టిఫికేట్ - డాక్టర్ జహ్రా మహమ్మదీ
డెంటర్ ఇంప్లాంట్ వర్క్‌షాప్

43
00:08:27,716 --> 00:08:30,594
కొన్నిరోజులు గోరువెచ్చని నీళ్లు తాగండి.

44
00:08:31,261 --> 00:08:32,513
తర్వాత మళ్లీ ఒకసారి రండి.

45
00:08:47,778 --> 00:08:49,196
జమీల్, కెమెరా వైపు చూడు.

46
00:08:55,285 --> 00:08:59,748
నిన్న ఆరు గంటల నుంచి ఇక్కడే ఉన్నాం మేము...

47
00:09:00,916 --> 00:09:02,792
{\an8}నా మొహం ఒకసారి చూసుకోవాలి.

48
00:09:02,793 --> 00:09:04,460
{\an8}తరనోమ్
యాక్టివిస్ట్

49
00:09:04,461 --> 00:09:08,422
{\an8}నిన్న ఆరు గంటల నుంచి విమానాశ్రయంలో
ఎదురుచూస్తూ ఉన్నాం.

50
00:09:08,423 --> 00:09:12,134
చాలా గేట్లలో ప్రయత్నించాం.
కానీ లోపలికి వెళ్లలేకపోయాం.

51
00:09:12,135 --> 00:09:13,553
దేవుడే మాకు సాయం చేయాలి.

52
00:09:13,554 --> 00:09:15,513
మేము 30 లేదా 40 మంది ఉన్నాం.

53
00:09:15,514 --> 00:09:17,014
సగం మంది నిరాశతో ఇంటికి వెళ్లిపోయారు.

54
00:09:17,015 --> 00:09:18,766
మిగతావాళ్లం బలంగా నిలబడ్డాం.

55
00:09:18,767 --> 00:09:19,977
దేవుడే మాకు సాయం చేయాలి.

56
00:09:20,602 --> 00:09:22,604
మీరిద్దరూ జాగ్రత్త!

57
00:09:25,190 --> 00:09:27,651
ఇది మీ ఇద్దరికీ మంచి జ్ఞాపకంగా ఉంటుంది.

58
00:09:28,569 --> 00:09:30,153
మీరింకా చిన్నపిల్లలు.

59
00:09:31,446 --> 00:09:32,864
{\an8}రహేలా
యాక్టివిస్ట్

60
00:09:32,865 --> 00:09:37,118
{\an8}రహేలా, జహ్రా, ఫర్జానా, మీనా, నేను.

61
00:09:37,119 --> 00:09:40,873
ఇటువైపు, మగవాళ్లు, సమీ...

62
00:09:41,248 --> 00:09:43,458
ఇటు చూడు, జమీల్!

63
00:09:45,961 --> 00:09:47,920
మేమింకా ఎదురుచూస్తున్నాం.

64
00:09:47,921 --> 00:09:52,425
ప్రతి గేట్‌ ప్రయత్నించాం,
కానీ వెళ్లలేక పోయాం.

65
00:09:52,426 --> 00:09:57,764
ఇది గేట్ 1, చాలామంది జనం ఉన్నారు.

66
00:09:58,432 --> 00:10:01,518
దురదృష్టవశాత్తూ, వాళ్లు టియర్ గ్యాస్
ప్రయోగిస్తున్నారు.

67
00:10:02,144 --> 00:10:09,151
ఇంకా గందరగోళం ఉంది,
పేలుళ్లు కొనసాగుతున్నాయి...

68
00:10:14,239 --> 00:10:19,369
దుర్భరంగా ఉన్న నగరానికి నమస్కారం.

69
00:10:20,037 --> 00:10:21,538
కాబూల్.

70
00:10:31,340 --> 00:10:32,757
{\an8}షరీఫా
మాజీ ప్రభుత్వ ఉద్యోగి

71
00:10:32,758 --> 00:10:37,971
{\an8}మా ఆఫీస్‌పై నుంచి గత నెల
ఆఫ్ఘన్ జెండా తొలగించారు.

72
00:10:40,516 --> 00:10:42,767
నేను గృహనిర్బంధంలో ఉన్నా.

73
00:10:42,768 --> 00:10:45,686
దుష్టశిక్షణ శిష్టరక్షణ శాఖ అధికారులు,

74
00:10:45,687 --> 00:10:48,482
వారి కార్ల వల్ల మా ప్రదర్శన ఆగిపోయింది.

75
00:10:49,316 --> 00:10:52,193
ముగ్గురు తాలిబన్లు
నన్ను తీవ్రంగా కొడుతుండగా,

76
00:10:52,194 --> 00:10:54,029
మిగిలిన అమ్మాయిలు వచ్చారు.

77
00:10:54,530 --> 00:10:56,657
నేను తాలిబన్ల మీద అరిచాను.

78
00:10:58,408 --> 00:11:01,620
ఇప్పుడు మమ్మల్ని ట్యాక్సీలలో పడేశారు.

79
00:11:07,417 --> 00:11:11,880
డెంటల్ క్లినిక్
ఎండీ స్టమటాలజిస్ట్

80
00:11:12,798 --> 00:11:14,466
బోర్డు లోపలుంది.

81
00:11:15,801 --> 00:11:17,260
{\an8}డాక్టర్ జహ్రా మహమ్మదీ
స్టమటాలజిస్ట్

82
00:11:17,261 --> 00:11:20,137
{\an8}వీధిలోకి కనిపించేలా పెట్టు.

83
00:11:20,138 --> 00:11:22,098
{\an8}మీరు చెప్పినట్టే చేస్తా.

84
00:11:22,099 --> 00:11:24,433
{\an8}గాలికి, వానకి దెబ్బతినకుండా

85
00:11:24,434 --> 00:11:27,145
{\an8}వెల్డింగ్ గట్టిగా చేయించాలి.

86
00:11:31,525 --> 00:11:34,236
{\an8}నేను ఆ పని మీద ఉంటా.

87
00:11:35,070 --> 00:11:37,154
{\an8}మీకు ఇంకా ఏం కావాలి?

88
00:11:37,155 --> 00:11:39,824
{\an8}ఏమీ వద్దు, కాసేపట్లో వస్తా.

89
00:11:39,825 --> 00:11:43,328
{\an8}సాధ్యమైనంత త్వరగా రా.

90
00:11:49,626 --> 00:11:55,756
ఉద్యోగం, ఆహారం, విద్య.

91
00:11:55,757 --> 00:12:00,052
ఈ సమయంలోనే, మహిళలు ఇళ్లలోనే
ఉండాలని తాలిబన్లు ఆదేశించారు.

92
00:12:00,053 --> 00:12:04,223
మేము నిరసన చేయకూడదని,
లేదంటే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.

93
00:12:04,224 --> 00:12:05,892
కానీ మేము మౌనంగా ఉండబోము.

94
00:12:05,893 --> 00:12:09,563
ఇప్పటికే ఖైదు చేయబడిన స్త్రీల కోసం
మా గొంతు వినిపించాలని నిర్ణయించాం.

95
00:12:11,023 --> 00:12:12,441
నేను ఏమి రాయాలి?

96
00:12:12,774 --> 00:12:15,152
నా చేయి నొప్పిగా ఉంది, రాయలేను.

97
00:12:16,612 --> 00:12:19,114
నిరసన తెలిపిన అమ్మాయిల్ని వదిలేయండి.

98
00:12:21,909 --> 00:12:24,994
ఆగు, ఉద్దేశ్యం ఏంటంటే...

99
00:12:24,995 --> 00:12:28,290
ఇలా రాయి, "అరెస్టులు ఆపండి!"

100
00:12:28,665 --> 00:12:33,669
కేసు వేయడం ప్రతి పౌరుని హక్కు.

101
00:12:33,670 --> 00:12:35,756
డాక్టర్ జహ్రా మహమ్మదీ
మీ స్మైల్ డిజైనర్

102
00:12:44,348 --> 00:12:48,434
ఒమీద్‌తో కలిసి ఖరీదైన రెస్టారెంట్లకి
వెళ్లినప్పుడు, అవి ఖాళీగా ఉండేవి...

103
00:12:48,435 --> 00:12:51,229
...దాంతో లండన్‌లో ఉన్నట్టు
భావించమని చెప్పేవాడు.

104
00:12:51,230 --> 00:12:53,941
బయటకి వచ్చినప్పుడు, మనం ఆప్ఘనిస్తాన్
తిరిగొచ్చాం అనేవాడు.

105
00:14:04,720 --> 00:14:10,766
ఈ రోజుల్లో, ఎలా చదవాలో మా అమ్మకు
నేర్పించడం, నా సోదరుడికి చదువులో

106
00:14:10,767 --> 00:14:13,604
సాయం చేయడం, నాకున్న ఏకైక సంతోషం.

107
00:14:14,104 --> 00:14:16,064
- చెప్పింది రాశావా?
- రాశా.

108
00:14:17,983 --> 00:14:20,902
ఆప్ఘనిస్తాన్‌లో అమెరికా ఉనికికి సంబంధించి

109
00:14:20,903 --> 00:14:25,448
కొన్ని రహస్య పత్రాలను 2019లో
వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది

110
00:14:25,449 --> 00:14:28,535
వాటి పేరు ఆప్ఘనిస్తాన్ పేపర్స్.

111
00:14:37,252 --> 00:14:38,879
నీకు అర్ధమైందా ఇది?

112
00:14:39,421 --> 00:14:42,632
అమెరికా నిధులు కొల్లగొట్టేందుకు

113
00:14:42,633 --> 00:14:47,178
ఆప్ఘనిస్తాన్‌లో పారదర్శకత లేని వాతావరణం

114
00:14:47,179 --> 00:14:50,557
అమెరికా కంపెనీలకు మంచి అవకాశంగా మారింది.

115
00:14:51,141 --> 00:14:57,564
దీనినే లాటరీ తగిలినట్టు రాసింది
ఫాక్స్ న్యూస్

116
00:14:58,190 --> 00:15:04,738
- ఈ పదం ఏంటి?
- దీనీ అర్ధం ఇంటర్నెట్...

117
00:15:05,739 --> 00:15:09,993
యూకేలోని వేలకొద్దీ షాపుల్లో ఇంటర్నెట్
అమ్ముడవుతోంది.

118
00:15:10,744 --> 00:15:15,123
దీని అర్ధం, ఇంటర్నెట్ కంటే వేగంగా
మరేదీ పెరగడం లేదని అనుకుంటా...?

119
00:15:17,292 --> 00:15:23,256
ఇక్కడ స్పేస్ ఉండకూడదు. మళ్లీ రాయి.

120
00:15:23,257 --> 00:15:25,551
వీధిలోకి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండండి.

121
00:15:28,011 --> 00:15:29,805
అమ్మాయిల్ని ఇంకా అరెస్ట్ చేస్తున్నారు.

122
00:15:35,561 --> 00:15:36,812
ఏదీ పనిచేయలేదు.

123
00:15:40,107 --> 00:15:46,113
అన్నీ ప్రయత్నించాం,
కానీ ఏ దారీ తెరుచుకోలేదు.

124
00:15:48,115 --> 00:15:53,245
మేము చూపించిన ఏ డాక్యుమెంట్ కూడా
తీసుకోవడం లేదు.

125
00:15:53,871 --> 00:15:59,293
మేము ఇక్కడే ఉండాలి. పోరాడాలి.
మరో దారి మాకు లేదు.

126
00:16:01,044 --> 00:16:04,715
విద్య, ఉద్యోగం, స్వేచ్ఛ!

127
00:16:05,799 --> 00:16:08,886
ప్లీజ్ నన్ను కొట్టొద్దు...

128
00:16:09,970 --> 00:16:12,513
{\an8}ఇవాళ్టి ప్రదర్శనలో మహిళలు
స్వచ్ఛందంగా పాల్గొన్నారు...

129
00:16:12,514 --> 00:16:14,348
{\an8}స్త్రీల అంతం = మనుషుల అంతం

130
00:16:14,349 --> 00:16:18,102
{\an8}...పాఠశాలల మూసివేత, టీచర్లు రాకపోవడంపై

131
00:16:18,103 --> 00:16:20,354
{\an8}నిరసన తెలిపేందుకు వచ్చారు.

132
00:16:20,355 --> 00:16:23,608
{\an8}దురదృష్టవశాత్తూ, నిరసన
హింసాత్మకంగా మారింది.

133
00:16:23,609 --> 00:16:25,777
{\an8}అయినా, మహిళలంతా కలసికట్టుగా నిలబడ్డారు.

134
00:16:27,654 --> 00:16:31,283
ఉగ్రవాదులు నశించాలి!

135
00:16:33,702 --> 00:16:36,204
ప్రస్తుతం, 12వ తరగతి పూర్తయిన అమ్మాయిలు

136
00:16:36,205 --> 00:16:38,122
ఇళ్లకే పరిమితం కావాలి.

137
00:16:38,123 --> 00:16:41,959
డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు కావాలని
వాళ్లకి కలలు ఉన్నాయి.

138
00:16:41,960 --> 00:16:44,378
{\an8}మాతృభూమికి సేవ చేయాలనుకుంటున్నారు.

139
00:16:44,379 --> 00:16:48,508
{\an8}అమ్మాయిలు ఇళ్లకి పరిమితం కావడం విషాదం.

140
00:16:48,509 --> 00:16:51,177
{\an8}వాళ్లకి కలలు ఉన్నాయి!

141
00:16:51,178 --> 00:16:53,429
{\an8}విద్య, ఉద్యోగ అవకాశాలు పొందే హక్కు
మాకు దక్కాలి.

142
00:16:53,430 --> 00:16:59,603
ఉద్యోగం, ఆహారం, విద్య!

143
00:17:01,522 --> 00:17:04,691
పేదరికం, దుఃఖం నశించాలి!

144
00:17:07,069 --> 00:17:11,365
విద్యని రాజకీయం చేయొద్దు!

145
00:17:22,251 --> 00:17:26,171
ప్లీజ్, నేను ఒక జర్నలిస్టుని!

146
00:17:35,806 --> 00:17:39,642
చాలా అన్యాయమైన ఆంక్షలు పెట్టారు,

147
00:17:39,643 --> 00:17:43,897
ప్రశాంతంగా నిరసన చేయడాన్ని
ఒప్పుకోవడం లేదు.

148
00:17:45,732 --> 00:17:51,488
మా మిషన్ మొదలైనప్పటి నుంచి,

149
00:17:52,489 --> 00:17:55,701
కొరడాలు, లాఠీలతో

150
00:17:56,201 --> 00:18:00,162
మమ్మల్ని అణచివేయాలని చూస్తున్నారు.

151
00:18:00,163 --> 00:18:04,126
చాలామంది జర్నలిస్టులని
కొట్టడం మీరే చూస్తున్నారు.

152
00:18:04,835 --> 00:18:06,962
అమ్మాయిలూ, ఇటువైపు రండి.

153
00:18:24,563 --> 00:18:27,691
వెంటనే కారు ఎక్కండి! ఎక్కండి!

154
00:18:28,567 --> 00:18:30,777
ఆయన నీకే చెప్తున్నాడు, కారు ఎక్కు!

155
00:18:32,988 --> 00:18:34,198
నేను ఎక్కను!

156
00:18:39,453 --> 00:18:42,038
ఆమెని కారు ఎక్కించండి!

157
00:18:42,039 --> 00:18:44,707
- మిమ్మల్ని స్టేషన్‌కు తీసుకెళ్తున్నా.
- ఎక్కడికి?

158
00:18:44,708 --> 00:18:48,419
సరే, తర్వాత ఏం చేస్తారు?

159
00:18:48,420 --> 00:18:51,340
- ఆడవాళ్లని భయపెట్టడానికి వచ్చారా?
- నోరు ముయ్యి!

160
00:18:51,715 --> 00:18:53,299
ఇదంతా గొప్ప అనుకుంటున్నారా?

161
00:18:53,300 --> 00:18:55,968
మాట్లాడొద్దని చెప్పా నీకు.
ఇక్కడే చంపుతా నిన్ను!

162
00:18:55,969 --> 00:18:57,971
అయితే వచ్చి చంపు!

163
00:19:00,849 --> 00:19:02,226
వాడేమీ చేయలేడు నన్ను!

164
00:19:03,185 --> 00:19:04,393
నీ వల్ల కాదు!

165
00:19:04,394 --> 00:19:06,188
ఎందుకు యూనివర్శిటీ మూసేశారు?

166
00:19:07,606 --> 00:19:09,273
నోర్ముయ్, లేదంటే చంపుతా.

167
00:19:09,274 --> 00:19:11,901
అయితే చంపు!
యూనివర్శిటీలు, స్కూళ్లు మూసేశారు,

168
00:19:11,902 --> 00:19:14,028
మీరు నన్ను కూడా చంపొచ్చు!

169
00:19:14,029 --> 00:19:16,280
మాట్లాడొద్దు, మాట్లాడొద్దు.

170
00:19:16,281 --> 00:19:18,991
మాట్లాడొద్దు, పోలీస్ చీఫ్ ఆర్డర్ ఇది.

171
00:19:18,992 --> 00:19:21,077
ఆడవాళ్లని అరెస్ట్ చేయడం
గొప్ప అనుకుంటున్నారా?

172
00:19:21,078 --> 00:19:24,497
మాపై పెత్తనం కోసం మీరు తహతహలాడుతున్నారు.

173
00:19:24,498 --> 00:19:27,959
ఇటీవలి కాలంలో
నిరసనలు వ్యక్తం చేసే మహిళల్ని

174
00:19:27,960 --> 00:19:29,836
తాలిబన్లు అరెస్ట్ చేయడం...

175
00:19:29,837 --> 00:19:34,465
నిన్న, కాబూల్‌ వీధుల్లో కొందరు అమ్మాయిలు

176
00:19:34,466 --> 00:19:38,636
మహిళలకి ఆర్ధిక స్వేచ్ఛ, ఉద్యోగాలు
డిమాండ్ చేస్తూ

177
00:19:38,637 --> 00:19:41,514
ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు.

178
00:19:41,515 --> 00:19:44,767
అరెస్ట్ అయిన మహిళల పరిస్థితిపై

179
00:19:44,768 --> 00:19:48,313
ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

180
00:19:49,690 --> 00:19:54,986
ప్రదర్శనల్లో పాల్గొనే అమ్మాయిల్ని
చూసి గర్వపడుతున్నాను.

181
00:19:54,987 --> 00:19:59,116
కానీ వాళ్లతో నేను కలవలేను,
దానికి మా అమ్మ ఒప్పుకోదు.

182
00:20:06,456 --> 00:20:07,958
దాదాపు అయిపోయింది.

183
00:20:09,501 --> 00:20:12,129
నా బూట్లు ఎక్కడ?

184
00:20:14,298 --> 00:20:17,259
నేను వేసుకున్నా, ఇక్కడే ఉన్నాయి.

185
00:20:48,874 --> 00:20:50,959
ఇవాళ వాతావరణం బాగుంది, కదా?

186
00:20:51,460 --> 00:20:56,006
నన్ను కొన్ని ఫోటోలు తీయ్,
ఇంట్లో బోర్ కొడుతోంది.

187
00:20:57,341 --> 00:21:00,801
చుట్టూ చూడటానికి పైకప్పు పైకి రావడం

188
00:21:00,802 --> 00:21:04,514
నాకున్న ఆశలకి ఒక విచారకర పరిష్కారం.

189
00:21:04,515 --> 00:21:06,099
ఈ పరిస్థితిపై నాకు విసుగొచ్చింది.

190
00:21:06,642 --> 00:21:09,727
నాకున్న ప్రతిదీ కోల్పోతున్నాను.

191
00:21:09,728 --> 00:21:12,063
ప్రయాణాలు మిస్ అవుతున్నాను.

192
00:21:12,064 --> 00:21:17,735
మనకి ఉద్యోగం చేసే హక్కు లేదు.

193
00:21:17,736 --> 00:21:21,739
చదువుకునే హక్కు లేదు.

194
00:21:21,740 --> 00:21:23,908
ప్రతిదాని నుంచి నన్ను దూరం చేశారు.

195
00:21:23,909 --> 00:21:25,826
నాలాంటి మహిళల నుంచి,

196
00:21:25,827 --> 00:21:28,788
నా తోటి వీరవనితల నుంచి,
నా తోటి ప్రయాణికుల నుంచి.

197
00:21:28,789 --> 00:21:33,544
ఇప్పుడు, పైకప్పు పైకి రావడం
కిందకి వెళ్లడం మాత్రమే చేస్తున్నా.

198
00:21:34,211 --> 00:21:39,800
"ఛీ ఈ ఒంటరితనం, చెడు కాలం, చెడు ఆలోచనలు.

199
00:21:40,509 --> 00:21:45,013
వసంతమా, ఈ యాతనలో,
నేను లేకుండా ఎక్కడ ఉన్నావు?"

200
00:21:45,722 --> 00:21:48,225
నా ఫోటో తీస్తావా?

201
00:22:09,329 --> 00:22:11,664
పలు కారణాల వల్ల నేను ఇక్కడ ఉండలేకపోయాను.

202
00:22:11,665 --> 00:22:14,000
దురదృష్టవశాత్తూ, నేను పాకిస్తాన్
పోవాల్సి వస్తోంది.

203
00:22:14,001 --> 00:22:17,295
అక్కడికి చేరిన మరుక్షణం నుంచి
నా జీవితాన్ని చిత్రీకరిస్తాను.

204
00:22:17,296 --> 00:22:19,088
ప్రతిక్షణాన్ని.

205
00:22:19,089 --> 00:22:22,049
ఒకప్పుడు ఆప్ఘనిస్తాన్‌లో మహిళలపై
ఇలాంటి హింసకి

206
00:22:22,050 --> 00:22:27,139
అనుమతి ఉండేదని చరిత్ర గుర్తుంచుకుంటుంది.

207
00:22:27,723 --> 00:22:29,765
ఐక్యరాజ్యసమితి ముందు.

208
00:22:29,766 --> 00:22:32,978
అన్ని మానవహక్కుల సంస్థల ముందు.
మొత్తం ప్రపంచం ముందు.

209
00:22:34,146 --> 00:22:37,648
ప్రజాస్వామ్యం కోసం కేకలు పెడుతూ

210
00:22:37,649 --> 00:22:40,359
కఠిన వైఖరిని ఖండించే దేశాల ముందు.

211
00:22:40,360 --> 00:22:45,782
ఆప్ఘన్ మహిళలు ప్రతిచోటా విధానాలకు
బాధితులుగా మారారు.

212
00:22:46,116 --> 00:22:47,701
నాకు పారిపోవడం తప్ప మరో దారి లేదు.

213
00:22:57,753 --> 00:23:01,964
హలో, హాయ్...

214
00:23:01,965 --> 00:23:06,385
ఇక్కడ మైదానాల్ని, ఎడారిని, రెల్లు గడ్డిని
మీరు చూడొచ్చు.

215
00:23:06,386 --> 00:23:12,850
ఇది ప్రస్తుతం మేము ఉంటున్న సేఫ్ హౌస్.

216
00:23:12,851 --> 00:23:17,230
ఈ భవనంలోనే మేము ఉంటున్నాం.

217
00:23:17,231 --> 00:23:18,898
ఇందులో 10 - 12 గదులు ఉన్నాయి,

218
00:23:18,899 --> 00:23:23,319
ప్రతి గదిలో 3, 4, 5,10 మంది ఉంటున్నారు.

219
00:23:23,320 --> 00:23:27,031
ఇటు వైపు రెల్లు గడ్డి ఉంది,

220
00:23:27,032 --> 00:23:31,370
మీరు ఊహించే దానికంటే ఎక్కువ పాములు,
గుంటనక్కలు ఉన్నాయి.

221
00:23:32,037 --> 00:23:34,747
పది గంటలకి అవి ఊల పెట్టడం ప్రారంభిస్తాయి.

222
00:23:34,748 --> 00:23:36,415
అందుకే, రెండు రోజుల నుంచి,

223
00:23:36,416 --> 00:23:42,421
వాటిని తగ్గించేందుకు ఇక్కడ
మంట పెడుతున్నారు.

224
00:23:42,422 --> 00:23:46,218
ఇక్కడ మీరు చూస్తున్నారుగా,
రెల్లు గడ్డిని తగలబెడుతున్నారు

225
00:23:46,844 --> 00:23:48,679
దానివల్ల జంతువులు వెళ్లిపోతాయి.

226
00:23:50,055 --> 00:23:52,683
మాకు వాషింగ్ మెషీన్ లేదు,
అందుకే మా బట్టలు మురికిగా ఉన్నాయి.

227
00:23:53,225 --> 00:23:56,936
మాకు కెటిల్ లేదు, వేడి నీళ్లు లేవు.

228
00:23:56,937 --> 00:23:58,729
మా దగ్గర టీవీ లేదు.

229
00:23:58,730 --> 00:24:01,607
ఒకటి కొన్నారు కానీ అది ధ్వంసమైంది,
అందుకే దాన్ని పడేశారు.

230
00:24:01,608 --> 00:24:02,692
డాక్టర్ కూడా లేరు.

231
00:24:02,693 --> 00:24:04,652
ఉదయం నుంచి చెప్తూనే ఉన్నాను,

232
00:24:04,653 --> 00:24:06,070
కానీ ఎవరూ సాయం చేయడం లేదు.

233
00:24:06,071 --> 00:24:10,284
నాకు పంటినొప్పి దారుణంగా ఉంది,
చాలా నొప్పి ఉంది.

234
00:24:35,601 --> 00:24:39,396
- హలో, ఎలా ఉన్నారు?
- బాగున్నా, థ్యాంక్యూ.

235
00:24:41,815 --> 00:24:45,610
ప్రతిదాని ధర చాలా పెరిగిపోయింది,
అందరి ఆదాయం బాగా తగ్గిపోయింది.

236
00:24:45,611 --> 00:24:47,278
నువ్వనేది నిజమే.

237
00:24:47,279 --> 00:24:50,823
యుద్ధం వస్తుందని కొందరు అంటున్నారు.

238
00:24:50,824 --> 00:24:54,703
కొత్త ప్రభుత్వం వస్తుందని
ఇంకొందరు అంటున్నారు.

239
00:24:55,913 --> 00:24:58,874
ఎవరి అంచనాలు వాళ్లవి.

240
00:24:59,708 --> 00:25:03,377
- దీనికి అంతు లేదు.
- దీనికి ఎప్పటికీ అంతుండదు.

241
00:25:03,378 --> 00:25:05,506
హజారా ప్రజలకు ఇదెప్పటికీ అంతు తేలనిది.

242
00:25:17,643 --> 00:25:20,229
కారులో మ్యూజిక్ ప్లే చేయడం నేరం.

243
00:25:21,355 --> 00:25:24,483
ఒక మహిళ ఒంటరిగా ట్యాక్సీలో వెళ్లకూడదు.

244
00:25:29,154 --> 00:25:32,031
మా అమ్మకి ఎప్పుడూ నా గురించే బెంగ,

245
00:25:32,032 --> 00:25:35,451
కానీ ఉత్సాహంగా ఉండాలని, కనిపించాలని

246
00:25:35,452 --> 00:25:38,872
నేను కోరుకుంటా.

247
00:25:40,374 --> 00:25:43,585
నేను నా స్నేహితులతో కలిసి...

248
00:25:45,170 --> 00:25:48,924
ఆహారం పంచడానికి వెళ్లాను.

249
00:26:07,818 --> 00:26:11,654
అమ్మా, మీ పేరు ఇంకా పిలవలేదు,
కొంచెంసేపు ఆగాలి, సరేనా?

250
00:26:11,655 --> 00:26:14,991
నా పేరు పిలిచినప్పుడు చెప్తారా?

251
00:26:14,992 --> 00:26:18,579
మీ పేరు పిలిస్తే నేను చెప్తాను.

252
00:26:20,956 --> 00:26:22,623
ఇంకా ఎవరు ఉన్నారు?

253
00:26:22,624 --> 00:26:24,001
సొరాయా.

254
00:26:26,670 --> 00:26:30,465
వెనక్కి వెళ్లండి, మీ పేరు పిలుస్తారు.

255
00:27:42,412 --> 00:27:44,580
ఎందుకు దేశం వదిలి పోతున్నారు?

256
00:27:44,581 --> 00:27:47,041
మన జీవితాలకి ముప్పుందని తెలుసు,
అయినా మీ మాస్క్ తీయరు.

257
00:27:47,042 --> 00:27:48,251
సరే ఎందుకు పోతున్నారు?

258
00:27:48,252 --> 00:27:52,171
నేను మీ బృందానికి చెందిన దానిని అని

259
00:27:52,172 --> 00:27:54,716
వాళ్లు ఏదొకరోజు తెలుసుకుంటారని నా భయం.

260
00:27:55,759 --> 00:27:58,178
అదే నా భయం.

261
00:27:58,804 --> 00:28:03,100
చదువు మన హక్కు!

262
00:28:16,363 --> 00:28:19,782
మీరు మాకు భధ్రత బదులు
భయాన్ని తీసుకొచ్చారు.

263
00:28:19,783 --> 00:28:23,579
మీతో అనుబంధమే వద్దనుకుంటున్నాం!

264
00:28:27,165 --> 00:28:29,001
ఆప్ఘనిస్తాన్ స్వేచ్ఛ

265
00:28:45,809 --> 00:28:50,062
ఈ నిరసనకారులు ఆర్ధిక మంత్రిత్వశాఖ ముందు
ప్రదర్శన చేస్తున్నారు,

266
00:28:50,063 --> 00:28:53,941
కానీ దీన్ని కవర్ చేయడానికి వచ్చిన
రిపోర్టర్లు మాత్రం

267
00:28:53,942 --> 00:28:57,570
తాలిబన్ల క్రూరత్వాన్ని చూడాల్సి వచ్చింది.

268
00:28:57,571 --> 00:29:04,035
{\an8}ఇక్కడ మేము ఎప్పుడూ న్యాయాన్నే కోరుతున్నాం.

269
00:29:04,036 --> 00:29:07,830
{\an8}ఆడపిల్లల స్కూల్స్ తిరిగి ప్రారంభించాలి,

270
00:29:07,831 --> 00:29:10,416
మహిళా వ్యవహారాలశాఖని తిరిగి ప్రారంభించాలి.

271
00:29:10,417 --> 00:29:12,251
కానీ ఇవాళ మాకు ఇంకో లక్ష్యం ఉంది,

272
00:29:12,252 --> 00:29:16,340
మన చుట్టూ ఉన్న దారుణమైన ఆర్ధిక
పరిస్థితుల్ని అందరికీ తెలియజేయాలి.

273
00:29:16,757 --> 00:29:18,841
- మిసెస్ మహమ్మద్?
- చెప్పు, మై లవ్.

274
00:29:18,842 --> 00:29:24,973
ఎలాంటి వంటలు మీరు బాగా చేస్తారు?

275
00:29:25,891 --> 00:29:30,144
నేను చాలా బిజీగా ఉన్నాను,
వంట చేసే తీరిక లేదు.

276
00:29:30,145 --> 00:29:34,065
అంటే, ఉదాహరణకి, ఎలాంటి ఆహారం
ఎక్కువగా వండాలి అనుకుంటారు?

277
00:29:34,066 --> 00:29:36,651
గొప్పలు చెప్పడం లేదు, కానీ ఏదైనా వండగలను.

278
00:29:36,652 --> 00:29:39,612
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా
ప్రాణాలు పణంగా పెట్టడానికి

279
00:29:39,613 --> 00:29:44,534
అందరికీ ధైర్యం సరిపోదు.

280
00:29:44,535 --> 00:29:47,995
బెదిరింపులు వచ్చినా పోరాడతావా?

281
00:29:47,996 --> 00:29:50,791
అవును, నన్ను బెదిరించారు.

282
00:29:51,542 --> 00:29:54,670
న్యాయం కావాలని కోరిన రోజే
ప్రాణాలపై ఆశ వదిలేశాం.

283
00:29:55,045 --> 00:29:59,048
ఈ దేశం కోసం, ప్రజల కోసం
మా ప్రాణాలైనా త్యాగం చేస్తాం.

284
00:29:59,049 --> 00:30:02,218
నా కుటుంబం అనుమతించకపోయినా,

285
00:30:02,219 --> 00:30:06,013
కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా
ధైర్యంగా నిలబడ్డాను.

286
00:30:06,014 --> 00:30:11,269
ఆప్ఘన్ మహిళలు తమ సొంత తండ్రులు,
సోదరుల నుంచి

287
00:30:11,270 --> 00:30:17,526
పట్టుబట్టి అడగని హక్కులని నేను
కోరుతున్నాను.

288
00:30:18,235 --> 00:30:21,529
ఆప్ఘన్ మహిళ మొదట ఇంట్లోనే
తండ్రి నుంచి, సోదరుల నుంచి,

289
00:30:21,530 --> 00:30:27,035
భర్త నుంచి అణచివేతకు గురవుతుంది.

290
00:30:32,165 --> 00:30:35,376
ఇవి పాకిస్తాన్‌లోని వీధులు.

291
00:30:35,377 --> 00:30:39,089
వీళ్లు జోగీ తెగవాళ్లు.

292
00:30:41,842 --> 00:30:46,513
ఇది రహేలా, మరియంల వీడ్కోలు పార్టీ.

293
00:30:48,515 --> 00:30:50,808
వాళ్లంతా సహార్, బక్తాష్‌తో కలిసి

294
00:30:50,809 --> 00:30:56,023
స్పెయిన్ వెళ్తున్నారు.

295
00:30:58,025 --> 00:31:02,778
వాళ్ల వీడ్కోలు పార్టీకి

296
00:31:02,779 --> 00:31:07,409
అందరినీ ఆహ్వానించారు.

297
00:31:13,373 --> 00:31:16,919
అమ్మాయిలూ, మా క్లినిక్‌లో
గట్టిగా అరవొద్దు,

298
00:31:17,878 --> 00:31:20,880
మాపై ఆంక్షలున్నాయి.

299
00:31:20,881 --> 00:31:23,592
ఏం జరుగుతోంది? ఏంటి ఈ గోల?

300
00:31:28,055 --> 00:31:30,349
వాళ్లు మమ్మల్ని పట్టుకోవాలి
అనుకుంటున్నారా?

301
00:31:44,988 --> 00:31:46,489
ఎంత ఇస్తారు?

302
00:31:46,490 --> 00:31:49,450
ఎక్కడ కూర్చోవాలి? నేను పట్టను.

303
00:31:49,451 --> 00:31:51,161
ఇద్దరు ఇద్దరు కూర్చోండి.

304
00:32:05,801 --> 00:32:07,718
ఈ కెమెరా మీదేనా?

305
00:32:07,719 --> 00:32:12,181
వాళ్లు ఒక డాక్యుమెంటరీ తీస్తున్నారు.
ఇది సాహ్రా మని కోసం.

306
00:32:12,182 --> 00:32:13,976
అయితే ఓకే.

307
00:32:15,769 --> 00:32:17,354
భయపడొద్దు.

308
00:32:18,313 --> 00:32:24,944
వివిధ ఉద్యమ గ్రూపుల నుంచి
ఇక్కడ సమావేశం అవుతున్నాం.

309
00:32:24,945 --> 00:32:28,489
తాలిబన్లు అధికారంలోకి వచ్చాక

310
00:32:28,490 --> 00:32:31,576
కొత్త ప్రభుత్వానికి నిరసనగా కలిశాం.

311
00:32:31,577 --> 00:32:34,745
ఇంతకుముందు మేము ఒకరికొకరం తెలియదు.

312
00:32:34,746 --> 00:32:36,622
మా హక్కులకై పోరాడే క్రమంలో ఒక్కటయ్యాం.

313
00:32:36,623 --> 00:32:42,503
చాలా ఏళ్లుగా మన పేరు చెప్పుకుని
లాభపడ్డ ఒక మహిళ

314
00:32:42,504 --> 00:32:45,673
తన కుటుంబంతో సహా
దేశం విడిచి వెళ్లిపోయింది,

315
00:32:45,674 --> 00:32:50,094
ఇప్పుడామె తాలిబన్లని అధికారికంగా
గుర్తించాలని లాబీయింగ్ చేస్తోంది.

316
00:32:50,095 --> 00:32:52,638
తాలిబన్లని ఎందుకు గుర్తించాలి?

317
00:32:52,639 --> 00:32:56,475
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్‌లే సత్యమని,

318
00:32:56,476 --> 00:32:58,394
ఆ సత్యాన్ని మీరు సహించాలని అంటున్నారు.

319
00:32:58,395 --> 00:33:01,647
మన సంస్థ అస్తవ్యస్తమని కొందరు అంటున్నారు,
కానీ పూర్తి వ్యతిరేకంగా ఉన్నాం.

320
00:33:01,648 --> 00:33:06,652
మన సంస్థ వైవిధ్యమైంది.
మనలో కవులు, రచయితలు ఉన్నారు.

321
00:33:06,653 --> 00:33:10,114
నినాదాలు, నిరసన తెలిపే ప్రదేశాలు,
సమయంపై తమ అభిప్రాయాలు చెప్పడానికి

322
00:33:10,115 --> 00:33:12,867
మనం అందరికీ అవకాశం ఇస్తున్నాం.

323
00:33:12,868 --> 00:33:18,331
మనం రంగుల బట్టలు, హైహీల్స్
వేసుకుంటున్నాం, అత్తరు వాడుతున్నాం.

324
00:33:18,332 --> 00:33:21,293
స్వేచ్ఛగా ఊపిరి పీలుస్తున్నాం, రోజంతా
సరదాగా గడుపుతున్నాం.

325
00:33:25,047 --> 00:33:27,049
లేడీస్, నేను మాట్లాడొచ్చా?

326
00:33:30,802 --> 00:33:31,928
{\an8}వహీదా
రచయిత

327
00:33:31,929 --> 00:33:35,264
{\an8}మన చరిత్ర మనమే రాసుకోవాలి

328
00:33:35,265 --> 00:33:40,228
అని చెప్పిన ఒక మహిళతో మాట్లాడాను.

329
00:33:40,229 --> 00:33:43,314
ఆమె ప్రభావం నాపై తీవ్రంగా ఉంది.

330
00:33:43,315 --> 00:33:46,984
ఒక లైబ్రరీ నిర్మించాలి అనుకుంటున్నా,

331
00:33:46,985 --> 00:33:51,447
తమ కథలు తామే రాసుకునేలా

332
00:33:51,448 --> 00:33:56,160
మహిళలు రచయితలు అయ్యేలా ప్రోత్సహించడానికి.

333
00:33:56,161 --> 00:33:59,080
ప్రపంచంలో మనకి ఇంకా సరిగా గుర్తింపు
రాలేదని భావిస్తున్నాను.

334
00:33:59,081 --> 00:34:02,750
ఈసారి, ఈ విప్లవం పేజీలని
మహిళలే తిప్పుతారని

335
00:34:02,751 --> 00:34:05,795
మొదట అందరం అంగీకరించాలి.

336
00:34:05,796 --> 00:34:10,341
రెండోది, ఈ విప్లవం పౌర విప్లవం.

337
00:34:10,342 --> 00:34:14,262
ఎందుకు? ఎందుకంటే అధికారం పైనో,
ఆయుధాల పైనో, హింస పైనో, యుద్ధకాంక్ష పైనో,

338
00:34:14,263 --> 00:34:19,350
ప్రజల్ని చంపడం పైనో ఆధారపడిన
మిగిలిన విప్లవాలు విజయం సాధించలేదు.

339
00:34:19,351 --> 00:34:22,102
ఇప్పుడు, మనం పౌర విప్లవానికి
దారులు వేస్తున్నాం.

340
00:34:22,103 --> 00:34:25,231
ఇదొక ఆలోచనాత్మక విప్లవం,
యువత ఐక్యత కలిసి ఉంది,

341
00:34:25,232 --> 00:34:29,402
పరస్పర అంగీకారంతో ముందుకెళ్తున్నాం.

342
00:34:42,958 --> 00:34:45,543
- హాయ్, ఎలా ఉన్నారు?
- స్వాగతం.

343
00:34:47,087 --> 00:34:49,672
బాగున్నారా?

344
00:34:51,007 --> 00:34:52,467
మీరు వచ్చినందుకు చాలా సంతోషం.

345
00:34:52,759 --> 00:34:53,719
నాకు కూడా.

346
00:34:56,597 --> 00:35:03,187
ఎలా ఉన్నారు, బాగున్నారా? దయచేసి లేవొద్దు.

347
00:35:07,024 --> 00:35:11,485
ఏం జరుగుతోంది? మ్యూజిక్ తీసుకొచ్చారా?

348
00:35:11,486 --> 00:35:14,573
నిజంగా దాన్ని డౌన్‌లోడ్ చేశాను
కానీ తేవడం మర్చిపోయాను.

349
00:35:15,782 --> 00:35:18,618
ఆప్ఘనిస్తాన్‌లోని ఆంక్షల సమాజంలో,

350
00:35:18,619 --> 00:35:21,329
మహిళలే ఎప్పుడూ బాధితులు.

351
00:35:21,330 --> 00:35:28,252
షరీఫాకి ఉద్యోగం ఉందన్న కారణంతో,
ఆమె వివాహ లైసన్స్‌ రద్దు చేసేందుకు

352
00:35:28,253 --> 00:35:32,508
కొత్త ప్రభుత్వం ప్రయత్నించింది.

353
00:35:33,509 --> 00:35:35,343
ఆమె ఎందుకు పనిచేస్తోందని అడిగారు.

354
00:35:35,344 --> 00:35:38,012
తను ఎందుకు పని చేయకూడదో వాళ్లు చెప్పగలరా?

355
00:35:38,013 --> 00:35:39,972
వాళ్లు కచ్చితంగా కారణం చెప్పగలరా?

356
00:35:39,973 --> 00:35:44,352
మహిళలు చదువుకోవాలి, పనిచేయాలి,

357
00:35:44,353 --> 00:35:49,148
హిజాబ్ కప్పుకుని, కేవలం ఇంటికే
పరిమితం కావడం తప్పు.

358
00:35:49,149 --> 00:35:51,108
ఇప్పుడంతా వెనక్కి నడుస్తోంది.

359
00:35:51,109 --> 00:35:55,738
ఆమె భర్త విడాకులు తీసుకోను అన్నాడు.

360
00:35:55,739 --> 00:35:58,241
ఆమె జుట్టు, తన పళ్లలా తెల్లగా అయ్యేవరకు

361
00:35:58,242 --> 00:36:01,703
ఇంట్లోనే కూర్చుని ఉంటుందని.

362
00:36:06,667 --> 00:36:09,836
కొందరు మహిళలు, తమని వదిలేసిన భర్తల కోసం

363
00:36:09,837 --> 00:36:13,882
జీవితమంతా ఎదురుచూస్తూ గడుపుతారు.

364
00:36:14,591 --> 00:36:20,722
ఆప్ఘనిస్తాన్‌లో మహిళలు బానిసలు.

365
00:36:36,405 --> 00:36:39,407
అతిగా వాడటం వల్ల వాషింగ్ మెషీన్
పాడైపోయింది.

366
00:36:39,408 --> 00:36:43,870
దాదాపు రెండు నెలలుగా మురికి బట్టలు
పేరుకు పోయాయి.

367
00:36:43,871 --> 00:36:50,001
మామూలుగా, నా బట్టలు ఉతుక్కుని
బయట ఆరవేసుకుంటాను.

368
00:36:50,002 --> 00:36:52,920
ఇక్కడో రాకాసి కుక్క ఉంది

369
00:36:52,921 --> 00:36:55,966
దాన్ని వదిలితే, బహుశా మమ్మల్ని
తినేయొచ్చు అది.

370
00:36:57,301 --> 00:37:02,471
ఇంకో నెల వరకూ

371
00:37:02,472 --> 00:37:05,016
మా వంతు వస్తుందని అనుకోలేను.

372
00:37:05,017 --> 00:37:08,978
వాతావరణం ఘోరంగా ఉంది,
కాబట్టి బయట చేతులు కడుక్కోలేము.

373
00:37:08,979 --> 00:37:11,398
మరీ చలిగా ఉంది.

374
00:37:23,535 --> 00:37:29,749
"ఈ మధ్య ఎవరో నాపేరుతో
ఫేస్‌బుక్ అకౌంట్ సృష్టించారు.

375
00:37:29,750 --> 00:37:32,793
ఆ నకిలీ అకౌంట్‌తో నాపై
దుష్ప్రచారం చేస్తున్నారు,

376
00:37:32,794 --> 00:37:35,379
మన గ్రూప్ మీటింగ్స్‌లో తీసుకున్న

377
00:37:35,380 --> 00:37:38,091
నా వ్యక్తిగత ఫోటోలు వాడుతున్నారు.

378
00:37:39,218 --> 00:37:41,928
గత కొన్నిరోజులుగా నిరాశలో కూరుకుపోయా.

379
00:37:41,929 --> 00:37:43,930
ఏమీ మాట్లాడటం లేదు,
గ్రూపులో చురుగ్గా లేను.

380
00:37:43,931 --> 00:37:49,685
ఆ అకౌంట్ ఎవరు తెరిచారో అమ్మాయిలు కష్టపడి
కనుక్కున్నారు, దాన్ని హ్యాక్‌ చేయడానికి.

381
00:37:49,686 --> 00:37:56,484
చివరికి సాధించారు, అయినా ఆ దుర్మార్గులు
ఇంకో అకౌంట్ సృష్టించారు

382
00:37:56,485 --> 00:38:02,698
నేను ఫ్రెంచ్ రిపోర్టర్లతో దిగిన ఫోటోలు
తీసుకుని వాడుతున్నారు.

383
00:38:02,699 --> 00:38:04,784
వాళ్లు నన్ను బెదిరించారు.

384
00:38:04,785 --> 00:38:07,161
ఏం జరుగుతుందో అని భయంగా ఉన్నా.

385
00:38:07,162 --> 00:38:13,125
ఈ నకిలీ ఖాతాలతో

386
00:38:13,126 --> 00:38:17,548
నా గురించి తప్పుడు ప్రచారం చేయొచ్చు.

387
00:38:18,215 --> 00:38:20,341
నాకు అండగా నిలబడి, నాపై సానుభూతి చూపిన

388
00:38:20,342 --> 00:38:23,095
సోదరీమణులందరికీ రుణపడి ఉంటా."

389
00:39:01,717 --> 00:39:05,554
{\an8}ఖతూల్
మాజీ టీచర్

390
00:39:06,346 --> 00:39:10,766
మీ నుంచి దూరం కావాలని ఎప్పుడూ కోరుకోలేదు.

391
00:39:10,767 --> 00:39:15,855
మా ఇంట్లో ఒక తాలిబన్ ఉన్నాడు.

392
00:39:15,856 --> 00:39:21,736
మీకు ఎప్పుడో చెప్పా కదా, మా ఇంట్లో
ఒక తాలిబన్ ఉన్నాడని.

393
00:39:21,737 --> 00:39:24,405
తను నన్నెంత దారుణంగా కొట్టాడో

394
00:39:24,406 --> 00:39:31,495
మీకు చూపించగలను.

395
00:39:31,496 --> 00:39:36,918
నన్ను కొట్టినట్టు, జైలులో ఉన్న ఆడవాళ్లని
కూడా కొట్టి ఉండరు.

396
00:39:36,919 --> 00:39:40,087
నేనూ మనిషినే, ఇంకా ఎన్ని బాధలు పడాలి?

397
00:39:40,088 --> 00:39:42,840
పగలు స్వేచ్ఛకై పోరాడుతూ,
రాత్రి దెబ్బలు తింటున్నా.

398
00:39:42,841 --> 00:39:48,304
స్త్రీలస్వేచ్ఛ కోసం గొంతెత్తుతున్నా,

399
00:39:48,305 --> 00:39:52,434
నేను మాత్రం హింస అనుభవిస్తున్నా.

400
00:39:55,312 --> 00:40:00,024
వాళ్లు నా ఫోటో తీసుకెళ్లి షాపులో చూపించి,

401
00:40:00,025 --> 00:40:02,109
"ఈవిడతో పని ఉంది" అన్నారంట.

402
00:40:02,110 --> 00:40:05,863
భయపడొద్దు, ఏమీ కాదు. నువ్వొక యోధురాలివి.

403
00:40:05,864 --> 00:40:07,449
మనం కాబోయే అధ్యక్షులం.

404
00:40:08,408 --> 00:40:10,994
నా స్నేహితులు యోధులు.

405
00:40:13,956 --> 00:40:16,583
నా వరకు, దేవుడి తర్వాత మీరే సర్వం.

406
00:40:17,334 --> 00:40:20,504
వెళ్లిరా, జాగ్రత్త.

407
00:40:42,234 --> 00:40:43,235
ఆహారం...

408
00:40:43,777 --> 00:40:44,778
స్వేచ్ఛ...

409
00:40:49,992 --> 00:40:52,411
బాగుంది. పదండి, దీన్ని ఇలాగే ఉంచండి.

410
00:40:54,663 --> 00:40:57,916
ఆహారం, ఉద్యోగం, స్వేచ్ఛ

411
00:40:59,209 --> 00:41:01,878
ఆర్ధిక వైఫల్యం, పేదరికంపై

412
00:41:01,879 --> 00:41:05,590
డజన్లకొద్దీ మహిళలు నిరసనకు దిగారు.

413
00:41:05,591 --> 00:41:09,468
పాలనలో మహిళలకు పని కల్పించేలా,

414
00:41:09,469 --> 00:41:13,181
ఆర్ధిక కార్యకలాపాలలోనూ తమకు ప్రాధాన్యత
కల్పించేలా

415
00:41:13,182 --> 00:41:15,892
స్రీ విద్యని కొనసాగించేలా

416
00:41:15,893 --> 00:41:18,020
తాలిబన్ ప్రభుత్వం పనిచేయాలని
వారు కోరుతున్నారు.

417
00:41:18,770 --> 00:41:23,024
మన నిస్సహాయత గురించే ఇవాళ్టి ప్రదర్శన.

418
00:41:23,025 --> 00:41:29,822
పనిచేయడానికి, సంపాదించడానికి

419
00:41:29,823 --> 00:41:36,246
స్త్రీలని అనుమతించడం లేదు...

420
00:41:43,295 --> 00:41:47,381
టేబుల్ సర్దావా? లినెన్ పరిచావా?

421
00:41:47,382 --> 00:41:49,468
నీ చేతులు కడుక్కున్నావా?

422
00:42:00,270 --> 00:42:04,565
పరిస్థితి మరీ భయానకంగా మారింది.
నేనూ అమ్మాయిలతో కలవాలి అనిపిస్తోంది.

423
00:42:04,566 --> 00:42:09,780
నా తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా
దొంగచాటుగా బయటకు వెళ్లాలి.

424
00:42:12,282 --> 00:42:16,452
యాల్దా నైట్ కోసం ఏమైనా కొనడానికి
వెళ్తున్నాం మనం.

425
00:42:16,453 --> 00:42:19,622
ఒక టోపీలో డబ్బులన్నీ పోగు చేశాం.

426
00:42:19,623 --> 00:42:25,169
దాదాపు 100 డాలర్లు,
అంటే 20 అప్ఘనీలకు పైమాటే.

427
00:42:25,170 --> 00:42:28,715
- ఏం కొనాలి అనుకుంటున్నావు?
- నాలుగు కిలోల దానిమ్మకాయలు.

428
00:42:32,553 --> 00:42:35,389
అక్కడ మేము 35 మందిమి ఉన్నాం,
కాబట్టి ఇవి ఐదు కిలోలు కావాలి.

429
00:42:36,098 --> 00:42:38,933
వాళ్లని తిట్టండి, వాళ్ల దగ్గర గింజలే లేవు!

430
00:42:38,934 --> 00:42:43,021
ఎం కావాలి మీకు?
ఇక్కడ కొనడానికి పెద్దగా ఏమీ లేవు.

431
00:42:54,741 --> 00:42:59,161
యాల్దా నైట్ కోసం మాకందరికీ
ప్లాన్స్ ఉన్నాయి.

432
00:42:59,162 --> 00:43:05,042
యాల్దా నైట్‌ అంటే అందరం గౌరవిస్తాం.

433
00:43:05,043 --> 00:43:08,964
కానీ ఇప్పుడు మేమంతా శరణార్దులం,
ప్రపంచమంతా చెల్లాచెదరు అయిపోయాం.

434
00:43:18,432 --> 00:43:19,808
{\an8}హ్యాప్పీ యాల్దా నైట్!

435
00:43:35,324 --> 00:43:40,453
ఇస్లామిక్ హిజాబ్‌ని
వ్యతిరేకించిన వాళ్లని వదిలిపెట్టం.

436
00:43:40,454 --> 00:43:43,624
విద్య, ఓటు వేయడం మహిళల హక్కు.

437
00:43:44,666 --> 00:43:51,297
{\an8}తాలిబన్లు లాక్ విరగ్గొట్టి
తలుపులు తెరవడంతో,

438
00:43:51,298 --> 00:43:56,260
ఆ అమ్మాయి బాల్కనీ గ్లాస్ పగలగొట్టి

439
00:43:56,261 --> 00:43:59,263
కిందకి దూకింది.

440
00:43:59,264 --> 00:44:00,973
హెల్ప్!

441
00:44:00,974 --> 00:44:03,726
{\an8}తాలిబన్లు మా ఇంట్లోకి దూరారు,
మా సోదరీమణులు ఇంట్లో ఉన్నారు!

442
00:44:03,727 --> 00:44:04,937
{\an8}తమనా
యాక్టివిస్ట్

443
00:44:06,772 --> 00:44:08,689
మేము తలుపు తెరవబోము!

444
00:44:08,690 --> 00:44:11,609
మీరు మాట్లాడాలి అనుకుంటే, ఉదయం రండి.

445
00:44:11,610 --> 00:44:14,529
ఈ రాత్రి అమ్మాయిల దగ్గరకి
మిమ్మల్ని రానివ్వలేము.

446
00:44:14,530 --> 00:44:19,325
మేము తలుపు తెరవబోము!

447
00:44:19,326 --> 00:44:21,620
సాయం చేయండి!

448
00:44:24,373 --> 00:44:28,669
{\an8}హిజాబ్‌ని అవమానించినవారిని...

449
00:44:30,212 --> 00:44:33,005
{\an8}...ఎప్పటికీ క్షమించేది లేదు.

450
00:44:33,006 --> 00:44:38,846
వారిని వ్యభిచారులుగా పరిగణిస్తాం.

451
00:44:52,860 --> 00:44:57,405
ఇదంతా పొరపాటున జరిగిందని,

452
00:44:57,406 --> 00:45:02,327
వాళ్లు కచ్చితంగా తమనా నుంచి
వీడియో తీసుకుని ఉంటారు.

453
00:45:09,293 --> 00:45:11,420
మీ దగ్గర పెయిన్ కిల్లర్స్ ఉన్నాయా?

454
00:45:14,548 --> 00:45:19,468
{\an8}#ఆప్ఘనిస్తాన్‌లోని మహిళలకు
మద్దతుగా నిలవండి.

455
00:45:19,469 --> 00:45:24,056
మొత్తానికి మహిళల గొంతుకు
ప్రాతినిధ్యం వహించడానికి

456
00:45:24,057 --> 00:45:27,060
ఇందులో భాగం అయినందుకు సంతోషంగా ఉంది.

457
00:45:28,353 --> 00:45:31,231
దయచేసి ఈ వాక్యాలు రాస్తావా?

458
00:45:35,110 --> 00:45:39,990
"మహిళలకు మద్దతుగా నిలవండి" అని రాస్తున్నా.

459
00:45:43,827 --> 00:45:46,954
మీ చేతిని ఇలా పట్టుకోండి.

460
00:45:46,955 --> 00:45:53,961
ఆప్ఘనిస్తాన్‌లోని
మహిళలకు మద్దతుగా నిలవండి.

461
00:45:53,962 --> 00:45:58,591
అందరూ కలిసి ఇంకోసారి చెప్పండి.

462
00:45:58,592 --> 00:46:04,932
{\an8}ఆప్ఘనిస్తాన్‌లోని మహిళలకు
మద్దతుగా నిలవండి.

463
00:46:05,390 --> 00:46:09,811
{\an8}#ఆప్ఘనిస్తాన్‌లోని మహిళలకు
మద్దతుగా నిలవండి.

464
00:46:13,315 --> 00:46:18,153
"వేర్ ఈజ్" అని రాయాలా
లేక "వేర్ ఆర్" అని రాయాలా?

465
00:46:19,321 --> 00:46:22,865
తమనా, అమె సోదరీమణులు ఎక్కడ?

466
00:46:22,866 --> 00:46:29,497
{\an8}మనలోని ప్రతి ఒక్కరూ మనందరికీ ప్రతినిధులు.

467
00:46:29,498 --> 00:46:33,084
{\an8}బందీలని విడిచిపెట్టండి,
అజ్ఞానాన్ని ధ్వంసం చేయండి.

468
00:46:33,085 --> 00:46:39,799
{\an8}తమనా, ఆమె సోదరి పర్వానా ఎక్కడ?

469
00:46:39,800 --> 00:46:45,597
{\an8}మీ మాస్క్‌లు తీయండి, ఒక ఫోటో తీసుకుందాం.

470
00:46:46,181 --> 00:46:48,057
{\an8}ఇది ఫోటో కోసమా?

471
00:46:48,058 --> 00:46:49,892
{\an8}ఫోటో తీసుకుందాం.

472
00:46:49,893 --> 00:46:53,771
{\an8}మూర్ఖత్వాన్ని వదిలి, బందీలైన మహిళల్ని
విడుదల చేయండి

473
00:46:53,772 --> 00:46:56,441
మొత్తానికి, మా వంతు వచ్చింది.

474
00:46:58,652 --> 00:47:02,614
నేను రోజుల తరబడి రానూ పోనూ ఉన్నాను,
కానీ కుదరలేదు.

475
00:47:04,116 --> 00:47:10,329
ఇప్పటికి, నా బట్టలు ఉతికే వంతు వచ్చింది.

476
00:47:10,330 --> 00:47:15,334
నా బట్టలు ఉతికి ఆరబెట్టుకున్నాను.

477
00:47:15,335 --> 00:47:17,837
ఎందుకంటే బయట చాలా చల్లగా ఉంది.

478
00:47:17,838 --> 00:47:20,006
వర్షం కూడా పడుతోంది.

479
00:47:20,007 --> 00:47:27,014
వీటిని నా గదికి తీసుకెళ్లాలి.

480
00:47:28,140 --> 00:47:30,683
జరీఫా సలంగీ ఆప్ఘనిస్తాన్‌ తిరిగొచ్చింది.

481
00:47:30,684 --> 00:47:35,897
కొందరు మహిళలు తాలిబన్లకి
మద్దతు ఇచ్చారని చెప్పాను,

482
00:47:35,898 --> 00:47:38,901
మీరు నన్ను నమ్మలేదు.

483
00:47:52,247 --> 00:47:54,832
మీరు మా ఇంటికి మళ్లీ వస్తారా?

484
00:47:54,833 --> 00:47:56,834
ఇవాళ మా సొంతింటికి వెళ్తున్నా.

485
00:47:56,835 --> 00:47:58,794
నా జాకెట్ ఎక్కడ?

486
00:47:58,795 --> 00:48:02,256
మా ఇంట్లోనే ఉండండి, బయటకి వెళ్తే ప్రమాదం.

487
00:48:02,257 --> 00:48:06,677
మహిళా యాక్టివిస్టుల కోసం తాలిబన్లు
వెతకడం మొదలు పెట్టినప్పటి నుంచి,

488
00:48:06,678 --> 00:48:09,430
నేను ఒకరోజు మా ఇంట్లో ఉంటే
ఇంకో రోజు మీ ఇంట్లో ఉంటున్నా.

489
00:48:09,431 --> 00:48:11,642
ఇంకో రోజు లైలా వాళ్ల ఇంట్లో.

490
00:48:12,893 --> 00:48:15,811
బై, స్వీటీ.

491
00:48:15,812 --> 00:48:17,481
షార్జాద్, బై బై.

492
00:48:20,651 --> 00:48:22,985
తలుపులు వేసుకోండి. ఎవరొచ్చినా తెరవకండి.

493
00:48:22,986 --> 00:48:30,076
ఎవరైనా మీ ఆంటీ జహ్రా మహమ్మదీ
గురించి అడిగితే,

494
00:48:30,077 --> 00:48:32,995
మీకు ఆమె తెలియదని చెప్పండి.

495
00:48:32,996 --> 00:48:38,043
స్కూలులో ఎవరైనా అడిగినా ఏమీ చెప్పొద్దు.

496
00:48:41,380 --> 00:48:43,506
నేను కొత్తబట్టలు కొనలేదు.

497
00:48:43,507 --> 00:48:46,300
కాబూల్ నుంచి నా బట్టలన్నీ తెచ్చుకున్నా.

498
00:48:46,301 --> 00:48:52,723
నాకు ఎప్పుడైనా పొగరు తలకెక్కితే,
నా ఈ పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటా.

499
00:48:52,724 --> 00:48:57,104
నా దగ్గర కేవలం 20 అప్ఘనీలు ఉన్న దశని.

500
00:49:00,357 --> 00:49:01,566
ఎప్పటికీ మరిచిపోను.

501
00:49:01,567 --> 00:49:07,072
ఇంకా, ఇక్కడ ఆశీర్వాదం లాగా.
ఐదు డాలర్లు దాచుకున్నా,

502
00:49:09,408 --> 00:49:12,286
పాకిస్తాన్ వచ్చి ఐదు నెలలు అయింది.

503
00:49:19,209 --> 00:49:21,545
మా కుటుంబం కాబూల్‌లో ఉంది.

504
00:49:23,505 --> 00:49:28,010
నా జీవితం నుంచి బలవంతంగా దూరం కావడం...

505
00:49:30,721 --> 00:49:33,431
...చాలా బాధాకరమైన విషయం.

506
00:49:33,432 --> 00:49:37,060
బందీగా, శరణార్దిగా ఉన్నానన్న బాధ.

507
00:49:39,313 --> 00:49:41,815
పేదరికం, నిరాశ్రయం.

508
00:49:43,233 --> 00:49:46,570
అమ్మాయిలు, నా స్నేహితులని
చుట్టుముడుతున్న వివాదం.

509
00:49:48,113 --> 00:49:50,824
మాతృభూమికి దూరమైన బాధ.

510
00:49:53,076 --> 00:49:56,204
భూమిపై అత్యంత నీచుల గుప్పిట్లో

511
00:49:56,205 --> 00:50:00,500
నా కుటుంబం ఉందన్న బాధ.

512
00:50:00,501 --> 00:50:03,045
ఇదంతా చాలా దారుణం.

513
00:50:06,924 --> 00:50:08,925
మాకు భావప్రకటనా స్వేచ్ఛ కావాలి

514
00:50:08,926 --> 00:50:10,718
మహిళా హక్కులు కావాలి

515
00:50:10,719 --> 00:50:13,347
మహిళలకు సమాన హక్కులు కావాలి
బాలల హక్కుల కోసం పోరాడాలి

516
00:50:15,140 --> 00:50:16,475
ఎన్ని నినాదాల ప్రింట్ అయ్యాయి?

517
00:50:18,352 --> 00:50:19,686
పన్నెండు.

518
00:50:27,528 --> 00:50:34,283
ఇవాళ మహిళా వ్యవహారాల శాఖ దగ్గర
ప్రదర్శన జరపబోతున్నాం.

519
00:50:34,284 --> 00:50:37,995
నిన్న రాత్రి, తాలిబన్లు నాకు కాల్ చేశారు.

520
00:50:37,996 --> 00:50:45,087
నా పేరు అడిగారు, నిరసనలు ఆపుతారా
అని అడిగారు.

521
00:50:46,088 --> 00:50:52,552
ప్రతి ప్రదర్శనకి నేను బాధ్యత వహించనని
చెప్పాను వాళ్లకి.

522
00:50:52,553 --> 00:50:56,472
ఉగ్రదాడులకి నేను కారణం అని,

523
00:50:56,473 --> 00:50:58,641
నిరసనలు ఆపాలని చెప్పారు వాళ్లు.

524
00:50:58,642 --> 00:51:00,351
దానికి నేను బాధ్యురాలని కాదని చెప్పా.

525
00:51:00,352 --> 00:51:02,478
వాళ్లలో ఒకడు "రేపు ఒంటిగంటకు
కలుస్తాం" అన్నాడు.

526
00:51:02,479 --> 00:51:04,939
"ఏం బెదిరిస్తున్నావా, చంపుతావా?"
అని అడిగా.

527
00:51:04,940 --> 00:51:06,816
"నువ్వే చూస్తావు" అన్నాడు వాడు.

528
00:51:06,817 --> 00:51:09,026
"నాకెందుకు కాల్ చేస్తున్నావు?" అంటే,
"అంతటికీ కారణం నువ్వే" అన్నాడు.

529
00:51:09,027 --> 00:51:14,532
ఈ వీడియో రికార్డు చేస్తున్నాను,
నాకేదైనా జరిగితే,

530
00:51:14,533 --> 00:51:16,409
తాలిబన్లే బాధ్యులని మీకు తెలుస్తుంది.

531
00:51:16,410 --> 00:51:21,539
మనం చదువుకున్న తరం, అందుకే వాళ్లు
మనమంటే భయపడుతున్నారు!

532
00:51:21,540 --> 00:51:23,416
మనస్సాక్షి మౌనంగా ఉంది బాధ వినేవారే లేరు

533
00:51:23,417 --> 00:51:27,920
మన పోరాటం జ్ఞానం కోసం.
అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాడాలి.

534
00:51:27,921 --> 00:51:29,630
ఇరవై ఏళ్ల క్రితం ఉన్న మహిళలం కాదు మనం.

535
00:51:29,631 --> 00:51:32,675
మనం చదువుకున్న మహిళలం,
తాలిబన్ పాలనపై మౌనంగా ఉండబోము.

536
00:51:32,676 --> 00:51:36,262
మహిళే ఈసారి ఆప్ఘన్ ప్రెసిడెంట్.

537
00:51:36,263 --> 00:51:38,556
ఇవాళ వాళ్లు మనల్ని అణచివేస్తున్నారు.

538
00:51:38,557 --> 00:51:40,975
మన చేతుల్లో ఏమీ లేకపోయినా,
మనమంటే భయపడుతున్నారు,

539
00:51:40,976 --> 00:51:45,396
మాకు స్వేచ్ఛ కావాలి, ఉద్యోగాలు కావాలి,
స్వేచ్ఛ కావాలి, ఆహారం కావాలి!

540
00:51:45,397 --> 00:51:49,526
ఉద్యోగం, ఆహారం, స్వేచ్ఛ!

541
00:51:51,445 --> 00:51:53,447
ఉద్యోగం, ఆహారం, స్వేచ్ఛ!

542
00:51:58,619 --> 00:52:02,206
{\an8}మసూదా జలాల్ స్వరం
ప్రజల నుంచి ప్రతిధ్వనిస్తుంది

543
00:52:02,915 --> 00:52:09,170
మేము ప్రదర్శనకి వచ్చాం.

544
00:52:09,171 --> 00:52:14,217
అయితే తాలిబన్లు ఆయుధాలతో ఉన్నారు.

545
00:52:14,218 --> 00:52:19,263
వాళ్లు మమ్మల్ని చుట్టుముట్టారు,
మా నిరసనని అడ్డుకుంటున్నారు.

546
00:52:19,264 --> 00:52:23,685
పరిస్థితి దారుణంగా ఉంది.
ప్రత్యేక బలగాలు వచ్చాయి.

547
00:52:27,439 --> 00:52:28,565
మమ్మల్ని అడ్డుకుంటున్నారు.

548
00:52:33,487 --> 00:52:38,242
టియర్ గ్యాస్ పేలుస్తున్నారు,
మనల్ని గుడ్డివాళ్లని చేస్తారు.

549
00:52:44,164 --> 00:52:45,082
జహ్రా?

550
00:53:07,104 --> 00:53:09,438
కాబూల్‌లో నిన్న ప్రళయం వచ్చింది.

551
00:53:09,439 --> 00:53:11,607
డాక్టర్ జహ్రా మహమ్మదీని అరెస్ట్ చేశారు.

552
00:53:11,608 --> 00:53:14,652
మూడు రోజుల క్రితం అరెస్ట్ చేసిన
12 మందికి తోడు

553
00:53:14,653 --> 00:53:18,072
ఇంకో ఏడుగురు అమ్మాయిల్ని అరెస్ట్ చేశారు.

554
00:53:18,073 --> 00:53:22,493
మూడు రోజుల క్రితం 40 మంది అమ్మాయిలు
సేఫ్‌హౌస్ నుంచి పారిపోవాలని ప్రయత్నించారు.

555
00:53:22,494 --> 00:53:26,874
కొందరు తప్పించుకున్నారు, కానీ వారిలో
12 మందిని తాలిబన్లు పట్టుకున్నారు.

556
00:53:27,791 --> 00:53:32,670
వాళ్లకి దేవుడే సాయం చేయాలి,
ఈ క్రూరుల్ని నమ్మలేము.

557
00:53:32,671 --> 00:53:36,425
ఒక యువతితో వాళ్లేం చేస్తారో
ఎప్పటికీ తెలియదు.

558
00:53:36,717 --> 00:53:38,552
ఆ అమ్మాయిలకి దేవుడే సాయం చేయాలి.

559
00:53:39,303 --> 00:53:42,097
వాళ్లకి దేవుడే సాయం చేయాలి.

560
00:54:17,841 --> 00:54:23,472
ఎక్కడ చూసినా మబ్బులు, మంచు, వర్షం.

561
00:54:31,480 --> 00:54:37,069
ఇవాళ, కొందరు పిల్లలు వెళ్లిపోయారు.

562
00:54:38,862 --> 00:54:42,616
మరియం, సహర్, బక్తాష్, రాజ్మా, రహేలా.

563
00:54:44,660 --> 00:54:51,458
నా హృదయం వెయ్యోసారి ముక్కలైంది.

564
00:54:52,459 --> 00:54:58,173
కాబూల్ పతనం తర్వాత,
ప్రతిరోజూ ఇదే దుస్థితి అనుభవిస్తున్నాం.

565
00:54:59,258 --> 00:55:01,301
ఈ గదికి అంకితమవడం అసహ్యంగా అనిపిస్తోంది.

566
00:55:02,553 --> 00:55:05,764
వాళ్లని ఇంతగా మిస్ అవుతానని
ఎప్పుడూ అనుకోలేదు.

567
00:55:13,981 --> 00:55:19,110
మా వాళ్లని ఒకరి తర్వాత ఒకరిని కించపరిచారు.

568
00:55:19,111 --> 00:55:24,532
మా వనరులు లాక్కున్న రోజునే
మమ్మల్ని చంపేశారు.

569
00:55:24,533 --> 00:55:29,412
రాత్రికి రాత్రి, మా కలలు కూలిపోయాయి.

570
00:55:29,413 --> 00:55:32,874
మాతృభూమిని వదిలి వచ్చామన్న వేదన

571
00:55:32,875 --> 00:55:37,753
ప్రతిక్షణం అనుభవిస్తున్నాం.

572
00:55:37,754 --> 00:55:43,509
మేము ఏ దేశానికి చెందినవాళ్లం కాదు,
దేనినీ కోరుకోలేము.

573
00:55:43,510 --> 00:55:48,264
ఏదైనా కొనాలని ప్రయత్నించినా ప్రయోజనం లేదు,

574
00:55:48,265 --> 00:55:51,058
ఎందుకంటే అందులో మాతో
ఎంత తీసుకెళ్తామో చెప్పలేము.

575
00:55:51,059 --> 00:55:54,979
మాకు ఏమీ లేదు. ఇది చాలా కష్టం.

576
00:55:54,980 --> 00:55:57,858
నాకు కొద్దిమంది స్నేహితులున్నారు,
వాళ్లంతా రాత్రి వెళ్లిపోయారు.

577
00:56:14,166 --> 00:56:21,173
నేను ఇంట్లో ఉండగా తాలిబన్లు సోదా చేస్తే...

578
00:56:22,674 --> 00:56:26,136
...ఆ పరిస్థితినే ఊహించలేను.

579
00:56:27,095 --> 00:56:30,765
అందుకే వాళ్లు వచ్చి వెతుకుతారనే,

580
00:56:30,766 --> 00:56:34,185
ఇకపై ఇంట్లో ఉండకూడదు అనుకుంటున్నా.

581
00:56:34,186 --> 00:56:35,102
నేను భయపడ్డాను.

582
00:56:35,103 --> 00:56:38,689
కొద్దిరోజుల క్రితం వీధిలో
ఒక బాలికని చంపేశారు.

583
00:56:38,690 --> 00:56:41,026
అది నిజమేనా?

584
00:56:42,819 --> 00:56:44,279
అది భయంగా లేదా?

585
00:56:48,033 --> 00:56:50,826
చదువు కోసం దేశం విడిచిపెట్టి వెళ్లాలి
అనుకుంటున్నా.

586
00:56:50,827 --> 00:56:52,370
ఐసీసీఆర్ స్కాలర్‌షిప్.

587
00:56:52,371 --> 00:56:53,579
అది ఏ సంవత్సరం?

588
00:56:53,580 --> 00:56:58,543
ఆప్ఘనిస్తాన్‌లో చాలామంది విదేశాల్లో
తిరగడానికి పాస్‌పోర్ట్ తీసుకుంటారు,

589
00:56:58,544 --> 00:57:01,128
కానీ నేను విదేశాల్లో చదువు కోసం
తీసుకున్నా.

590
00:57:01,129 --> 00:57:03,298
ఎప్పుడు తీసుకున్నావు?

591
00:57:05,175 --> 00:57:08,095
2020 చివరలో.

592
00:57:08,929 --> 00:57:12,098
నాకు ఈ పాస్‌పోర్టు ఇచ్చిన ఆమె

593
00:57:12,099 --> 00:57:15,768
ఇలాంటి ఫోటో వాడకూడదని హెచ్చరించింది.

594
00:57:15,769 --> 00:57:19,438
తాలిబన్లు మళ్లీ వచ్చారంటే ఇబ్బందుల్లో
పడతావని చెప్పింది.

595
00:57:19,439 --> 00:57:23,109
నిరసనల్లో పాల్గొంటున్నానని మా
కుటుంబసభ్యులకు చెప్పలేను.

596
00:57:23,110 --> 00:57:25,027
మా అమ్మ, నన్ను ఇంట్లోంచి వెళ్లగొడుతుంది,

597
00:57:25,028 --> 00:57:28,322
మరి, ఈ పరిస్థితుల్లో నేను ఎక్కడికి
వెళ్లగలను?

598
00:57:28,323 --> 00:57:32,911
ఈ రోజుల్లో, తోడు లేకుండా మహిళల్ని బయటకి
వెళ్లనివ్వరు తాలిబన్లు.

599
00:57:33,287 --> 00:57:38,833
ఆప్ఘన్ మహిళల గొంతు నొక్కడం అమానుషం.

600
00:57:38,834 --> 00:57:41,836
మౌనంగా ఉంచితే మేము బెదిరిపోము.

601
00:57:41,837 --> 00:57:45,590
వాళ్లు మన గొంతులు నొక్కలేరు.

602
00:57:45,591 --> 00:57:51,345
ఆఫ్ఘనిస్తాన్‌లోని ఏ ప్రాంతంలో వినిపించే
గొంతుకైనా మేము మద్దతు ఇస్తాం.

603
00:57:51,346 --> 00:57:54,307
జహ్రా మహమ్మదీని విడిచిపెట్టాలి!

604
00:57:54,308 --> 00:57:58,186
అమ్మాయిల స్కూల్స్ అన్నీ మూసేశారు, అయినా
అంతా మౌనంగా ఉన్నారు.

605
00:57:58,187 --> 00:58:00,479
అమ్మాయిలకి యూనివర్శిటీలు మూసేశారు,
అంతా మౌనంగా ఉన్నారు.

606
00:58:00,480 --> 00:58:02,565
అమ్మాయిలకి అన్ని రకాల విద్యని
రద్దు చేశారు.

607
00:58:02,566 --> 00:58:06,777
ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు.

608
00:58:06,778 --> 00:58:10,949
తాలిబన్ డౌన్ డౌన్!

609
00:58:20,209 --> 00:58:23,253
మీరు రాక్షసులు!

610
00:58:24,505 --> 00:58:27,632
విద్య మా హక్కు,

611
00:58:27,633 --> 00:58:31,261
మేము వెనక్కి తగ్గం!

612
00:59:12,803 --> 00:59:19,810
చదువు ప్రతి మహిళ జన్మహక్కు

613
00:59:24,106 --> 00:59:27,526
షరీఫా, పద. చాలు!

614
00:59:28,110 --> 00:59:29,528
షరీఫా, పద.

615
01:00:21,038 --> 01:00:24,166
ఐ లవ్‌ యు, సోదరీ.

616
01:00:25,334 --> 01:00:26,751
వాళ్లు బాగా కొట్టారా?

617
01:00:26,752 --> 01:00:29,420
దేవుడి దయ, ఇంటికి వచ్చావు.

618
01:00:29,421 --> 01:00:32,508
థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్.

619
01:00:35,969 --> 01:00:38,722
ఒక నిమిషం కూర్చోవాలి.

620
01:00:54,071 --> 01:00:57,740
తమనాని చూశా, రక్తం వచ్చేలా కొట్టారు.

621
01:00:57,741 --> 01:01:01,869
- నీ కళ్లతో నువ్వు చూశావా?
- వాళ్లు తమనాని కొట్టారు.

622
01:01:01,870 --> 01:01:08,960
తమనా వచ్చి నన్ను కౌగిలించుకుంది,
తనని చూసి అడిగా,

623
01:01:08,961 --> 01:01:15,216
"నిన్ను ఎక్కడ చూశాను?" అని, తర్వాత
తెలిసింది అది తనే అని.

624
01:01:15,217 --> 01:01:19,137
పర్వానాని చూశా. నాతో పాటు
మొర్సల్‌ని వదిలేశారు.

625
01:01:20,013 --> 01:01:22,683
థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్.

626
01:01:23,559 --> 01:01:26,561
తమనా, పర్వానాని ఇంకా ఎందుకు ఉంచుకున్నారు?

627
01:01:26,562 --> 01:01:29,939
వాళ్లని చాలా దారుణంగా కొట్టారు.

628
01:01:29,940 --> 01:01:33,944
- నిన్ను బాగా కొట్టారా?
- లేదు, నన్నెవరూ కొట్టలేదు.

629
01:01:34,945 --> 01:01:36,153
ఆ అమ్మాయిలది పంజ్‌షిర్.

630
01:01:36,154 --> 01:01:38,990
వాళ్లు పంజ్‌షిర్‌ వాళ్లు
కావడం వల్లే కొట్టి ఉంటారు.

631
01:01:38,991 --> 01:01:42,201
తాలిబన్లు మా దేశం విడిచి వెళ్లాలని
కోరుతున్నాం.

632
01:01:42,202 --> 01:01:46,998
ఇదంతా కేవలం ఒక పీడకల కావాలని
కోరుకుంటున్నా.

633
01:01:46,999 --> 01:01:50,918
ఏదో ఒక రోజు, నిద్రలేచి మన సొంత జెండాలని,

634
01:01:50,919 --> 01:01:55,381
{\an8}వీధుల్లో మన సొంత పోలీసుల్ని చూస్తాం.

635
01:01:55,382 --> 01:01:57,466
{\an8}జై ఆప్ఘనిస్తాన్!

636
01:01:57,467 --> 01:02:01,220
{\an8}తమనా, పర్వానాల్ని విడిచిపెట్టాలి!

637
01:02:01,221 --> 01:02:04,891
ఉద్యోగం, ఆహారం, విద్య!

638
01:02:04,892 --> 01:02:08,644
{\an8}తాలిబన్లు నశించాలని కోరుతున్నాం!

639
01:02:08,645 --> 01:02:15,694
{\an8}అమ్మాయిలు, యువతులకు స్కూల్స్
మళ్లీ ప్రారంభించాలి!

640
01:02:18,071 --> 01:02:20,489
ఉద్యోగం, ఆహారం, విద్య!

641
01:02:20,490 --> 01:02:25,119
హిజాబ్ వద్దనో, కావాలనో చెప్పడం
అమ్మాయిల లక్ష్యం కాదు.

642
01:02:25,120 --> 01:02:27,330
కానీ హిజాబ్ అంటే బురఖా కాదు,

643
01:02:27,331 --> 01:02:31,959
హిజాబ్ మన కాళ్లూ, చేతులని దాచిపెట్టదు.

644
01:02:31,960 --> 01:02:35,505
ఈ కారణంతోనే తమనా, పర్వానా,
అరియానాల్ని బంధించారా?

645
01:02:35,506 --> 01:02:37,048
ఇక చాలు, మేము అలసిపోయాం!

646
01:02:37,049 --> 01:02:44,597
తాలిబన్, తాలిబన్,
మానవహక్కుల ఉల్లంఘనదారులు!

647
01:02:44,598 --> 01:02:51,563
న్యాయం కావాలి! న్యాయం కావాలి!
మీ నేరాలతో విసిగిపోయాం.

648
01:03:00,614 --> 01:03:08,038
భయపడొద్దు, మనం కలిసున్నాం.

649
01:03:14,545 --> 01:03:16,839
వేరే నరంలో ఉందది.

650
01:03:17,798 --> 01:03:19,048
లోపలికి వెళ్లలేదు.

651
01:03:19,049 --> 01:03:22,928
ప్లీజ్, చాలు. చాలు! నొప్పిగా ఉంది.

652
01:04:26,158 --> 01:04:27,575
{\an8}జహ్రా తండ్రి

653
01:04:27,576 --> 01:04:30,870
{\an8}నీ అరెస్ట్ వల్ల,
నా మొహం చూపించలేకపోతున్నా.

654
01:04:30,871 --> 01:04:36,000
చాలామంది ఉద్యమకారిణులు ఉన్నారని తెలుసు.

655
01:04:36,001 --> 01:04:39,921
వాళ్లలో చాలామంది తీవ్రంగా పోరాడారు,
దానికోసం జైళ్లకి వెళ్లారు.

656
01:04:39,922 --> 01:04:45,052
నా కుటుంబంలో దానిని నేను ఒప్పుకోలేను.

657
01:04:47,596 --> 01:04:52,934
తాతయ్య ఎక్కువ మాట్లాడతాడు,
నాకు తలనొప్పి వస్తుంది.

658
01:04:52,935 --> 01:04:58,397
తన కూతురు ఇతరులకు, తనకు తాను హీరో కావచ్చని

659
01:04:58,398 --> 01:05:01,817
మా నాన్న చెప్పారు.

660
01:05:01,818 --> 01:05:06,198
కానీ నేను నాతో పాటు, నా కుటుంబానికి
తలవంపులు తెచ్చిపెట్టాను.

661
01:05:06,907 --> 01:05:10,953
నా తలనొప్పి ఎక్కువైంది. ఇంక చాలు. చాలు.

662
01:05:14,831 --> 01:05:19,711
ఎందుకీయన ఎక్కువ మాట్లాడతాడు?

663
01:05:32,182 --> 01:05:36,103
జహ్రా, తలుపు వెనక నిలబడు,
అప్పుడే ఒమీద్‌కు కనిపించవు.

664
01:05:43,110 --> 01:05:47,114
మద్దతుగా నిలిచినందుకు థ్యాంక్యూ.

665
01:05:49,867 --> 01:05:54,454
నేను ఎప్పుడూ నీ తోడుగా ఉంటా.
గుర్తు పెట్టుకో.

666
01:06:02,796 --> 01:06:06,800
స్త్రీ ద్వేషం అసలు కార్యక్రమం,
హిజాబ్ ఒక సాకు.

667
01:06:10,053 --> 01:06:14,640
విద్య, ఉద్యోగం, స్వేచ్ఛ మా హక్కులు.

668
01:06:14,641 --> 01:06:19,146
మహిళలు సమాజంలో సగభాగం.

669
01:06:20,814 --> 01:06:25,067
వద్దు, ఇలా రాయి...
మహిళలు సమాజంలో సగభాగం.

670
01:06:25,068 --> 01:06:28,321
ఉద్యోగం, విద్య, బట్టల ఎంపిక మా హక్కులు.

671
01:06:28,322 --> 01:06:33,035
మా ప్రాధమిక హక్కులు.

672
01:06:34,036 --> 01:06:36,246
చేతిరాత బానే ఉంది.

673
01:06:37,497 --> 01:06:40,918
అవును, ఇప్పుడే వస్తున్నా.

674
01:06:41,668 --> 01:06:43,503
సరే, థ్యాంక్యూ.

675
01:06:43,504 --> 01:06:46,005
మరియా కాల్ చేసింది, నేను వెళ్లాలి.
అమ్మా, సరేనా?

676
01:06:46,006 --> 01:06:49,593
మీకు నచ్చినట్టు చేయండి.
నా మాట ఎలాగూ వినరు.

677
01:06:50,511 --> 01:06:54,472
- అది నా పని కాదు.
- నాకోసం ప్రార్ధిస్తావా?

678
01:06:54,473 --> 01:06:59,561
నువ్వు ప్రశాంతంగా ఉండాలని ప్రార్దిస్తా,
కానీ నేను చెప్పేది నువ్వు వినడం లేదు.

679
01:07:02,105 --> 01:07:05,525
రాత్రుళ్లు నిద్ర పోలేకపోతున్నా.

680
01:07:05,526 --> 01:07:12,157
కనీసం ఒక అరగంట కళ్లు మూసుకున్నా

681
01:07:13,617 --> 01:07:19,623
నీ గురించే భయపడాల్సి వస్తోంది.

682
01:07:21,375 --> 01:07:23,417
నేను జాగ్రత్తగా ఉంటున్నా.

683
01:07:23,418 --> 01:07:27,129
మాస్క్ పెట్టుకుంటున్నా,
పొడవాటి డ్రెస్ వేసుకుంటున్నా.

684
01:07:27,130 --> 01:07:30,132
ఇంకేం చేయాలి?

685
01:07:30,133 --> 01:07:32,302
నాకు తెలియదు.

686
01:07:33,470 --> 01:07:35,889
నీకు నచ్చినట్టు చెయ్.

687
01:07:47,734 --> 01:07:51,362
న్యాయం కావాలి, న్యాయం కావాలి!

688
01:07:51,363 --> 01:07:54,991
ఆంక్షలతో మేము విసిగిపోయాం.

689
01:07:54,992 --> 01:07:59,413
మా గొంతులు ఏకం చేస్తాం.

690
01:08:07,713 --> 01:08:09,630
ఆలియా ఎక్కడ?

691
01:08:09,631 --> 01:08:11,924
{\an8}ఆలియా ఎక్కడ?

692
01:08:11,925 --> 01:08:14,595
{\an8}జైనబ్‌ని ఎందుకు చంపారు?

693
01:08:15,762 --> 01:08:18,515
జైనబ్‌ని ఎందుకు చంపారు?

694
01:08:19,683 --> 01:08:21,099
న్యాయం కావాలి!

695
01:08:21,100 --> 01:08:22,809
న్యాయం కావాలి, న్యాయం కావాలి!

696
01:08:22,810 --> 01:08:26,314
ఈ బందిఖానాతో విసిగిపోయాం.

697
01:09:15,572 --> 01:09:22,577
జనం తమ విసుగు తప్పించుకోవడానికి
గోడపై బొమ్మలు వేస్తున్నారు.

698
01:09:22,578 --> 01:09:23,871
{\an8}రైహానా అహ్మదీ

699
01:09:23,872 --> 01:09:27,416
ఇది నా పెయింటింగ్.

700
01:09:27,417 --> 01:09:28,961
తరనోమ్ జీ

701
01:09:30,504 --> 01:09:34,507
ఒకరోజు నాకు పెద్దగా పనిలేక,
ఇక్కడికొచ్చి పెయింట్ వేశాను.

702
01:09:34,508 --> 01:09:36,593
ఇక్కడ సంప్రదాయ పాటలు రాశాను.

703
01:09:37,261 --> 01:09:43,559
"నేను చూడని మనుషులందరినీ
ప్రేమిస్తున్నాను."

704
01:09:44,643 --> 01:09:50,398
"నా రోగాలు మీకు అంటిస్తున్నా, మీ
ఆరోగ్యాన్ని అరువు తీసుకుంటున్నా."

705
01:09:50,399 --> 01:09:53,276
చహర్‌షన్బే సూరి అనేది
సంవత్సరంలో చివరి బుధవారం.

706
01:09:53,277 --> 01:09:55,862
ఏటా, ఆ రోజు మంట వేసి దాని పైనుంచి దూకుతాం.

707
01:09:55,863 --> 01:10:02,953
గత ఏడాదికి సంబంధించిన సమస్యలన్నీ
వదిలించుకోవడం అన్నమాట.

708
01:10:06,665 --> 01:10:11,085
ఆరోగ్యకరమైన, సంతోషకరమైన కొత్త ఏడాది కోసం.

709
01:10:11,086 --> 01:10:17,925
కొత్త ఏడాదిలో స్వేచ్ఛ రావాలని,
ఆప్ఘనిస్తాన్ కోలుకోవాలని ప్రార్దిస్తున్నా.

710
01:10:17,926 --> 01:10:20,887
శత్రువుల బారి నుంచి మన దేశాన్ని రక్షిస్తే,

711
01:10:20,888 --> 01:10:27,978
ఆప్ఘనిస్తాన్ జెండా కింద
మనమంతా ప్రశాంతంగా జీవించవచ్చని ఆశ.

712
01:10:48,707 --> 01:10:52,835
ఆహారం, ఉద్యోగం, విద్య.
బందీలుగా ఉన్న బాలికల విడుదల.

713
01:10:52,836 --> 01:10:55,213
న్యాయం, స్వేచ్ఛ కావాలి.

714
01:10:55,214 --> 01:10:58,216
థ్యాంక్ గాడ్, నిన్ను వదిలేశారు.

715
01:10:58,217 --> 01:11:03,054
బయటకి వెళ్దాం, జహ్రా.
కాస్త అలా నడిచొద్దాం, సరదాగా.

716
01:11:03,055 --> 01:11:09,436
ఒప్పుకోవా? నీకూ కాస్త తాజా గాలి తగలాలి.

717
01:11:10,354 --> 01:11:12,648
ఎందుకింత మేకప్ వేసుకున్నావు?

718
01:11:13,899 --> 01:11:16,527
మేమే బలవంతంగా ఎక్కువ మేకప్ వేశాం.

719
01:11:19,112 --> 01:11:21,447
నేను విడుదలై ఇది రెండో రోజు.

720
01:11:21,448 --> 01:11:24,700
ఇవాళ కాస్త మెరుగ్గా ఉన్నా.

721
01:11:24,701 --> 01:11:27,871
నాతో పాటు వహీదా, మొర్సల్, మా అమ్మ ఉన్నారు.

722
01:11:52,104 --> 01:11:56,315
షొకుఫా, ఈ పళ్లు తీసేయాలి,

723
01:11:56,316 --> 01:11:59,360
కానీ పై దంతాల మీద పుచ్చు ఉంది.

724
01:11:59,361 --> 01:12:03,322
తాలిబన్లు తమ గూఢచారుల ద్వారా

725
01:12:03,323 --> 01:12:07,577
అమ్మాయిల మద్య విభేదాలు సృష్టించాలని
నిశ్చయించారు.

726
01:12:07,578 --> 01:12:10,913
వారు కుట్రల్ని వ్యాప్తి చేశారు.

727
01:12:10,914 --> 01:12:17,003
సేఫ్‌హౌస్‌లలో ఉండే అమ్మాయిల్ని అరెస్ట్
చేసి వారితో బలవంతంగా నేరాలు ఒప్పించారు.

728
01:12:17,004 --> 01:12:20,089
యాక్టివిస్ట్ గ్రూపుల్లోని కొందరు అమ్మాయిలు

729
01:12:20,090 --> 01:12:22,383
రహస్యంగా తాలిబన్ల కోసం పనిచేస్తున్నారు.

730
01:12:22,384 --> 01:12:28,014
ఇది నాకు ఆగ్రహం తెప్పించింది,

731
01:12:28,015 --> 01:12:34,020
ఇది స్ఫూర్తిని దెబ్బతీసింది,

732
01:12:34,021 --> 01:12:38,025
నేను ఉద్యమాన్ని వదిలేశాను.

733
01:12:38,734 --> 01:12:41,278
నేను చాలా అలసిపోయాను.

734
01:12:50,704 --> 01:12:53,497
నేను కాబూల్ వదిలి వెళ్లాలని తెలుసు.

735
01:12:53,498 --> 01:12:57,878
అయితే అది నాకు చాలా కష్టంగా ఉంటుంది.

736
01:12:58,837 --> 01:13:05,135
కాబూల్, ఒమీద్‌లకు దూరంగా ఉండటం చాలా కష్టం.

737
01:13:27,282 --> 01:13:29,993
నాకు ఒక వింటర్ వెల్వెట్ డ్రెస్ కావాలి.

738
01:13:30,494 --> 01:13:34,081
- ఏ వయసు వాళ్లకి?
- నాలుగు వేర్వేరు వయసులకి.

739
01:13:34,873 --> 01:13:38,544
పన్నెండేళ్లు, ఎనిమిదేళ్లు, ఐదేళ్లు,
మూడేళ్ల వారికి.

740
01:13:39,378 --> 01:13:41,380
ఇంకాస్త మోడర్న్‌గా ఉండాలి.

741
01:13:56,228 --> 01:14:01,108
మీ బట్టలు కూడా వేసుకోండి.

742
01:14:04,611 --> 01:14:07,114
ఈ బట్టలు జ్ఞాపకాలుగా ఉంచుకోండి, సరేనా?

743
01:14:10,492 --> 01:14:13,161
మీ ఇంటికి రావడం ఇదే చివరిసారి.

744
01:14:15,706 --> 01:14:18,125
మడతబెట్టండి, ప్లీజ్.

745
01:14:20,586 --> 01:14:24,506
- ఆ సాక్సులు ఎవరివి?
- నావే, అవి నావే.

746
01:14:28,385 --> 01:14:30,303
దాక్కోవడానికి ఎక్కడికో పోతున్నా.

747
01:14:30,304 --> 01:14:32,930
ఎక్కడికి అనేది మా నాన్నతో సహా
ఎవరికీ తెలియదు.

748
01:14:32,931 --> 01:14:36,350
ఒక్క ఒమీద్‌కు తెలుసు, అంతే.

749
01:14:36,351 --> 01:14:39,896
ఈ బిస్కట్లు నీతో పాటు తీసుకెళ్లు.

750
01:14:39,897 --> 01:14:42,107
అవి నీకే.

751
01:14:44,193 --> 01:14:47,905
రారా, వచ్చి ఒక హగ్ ఇవ్వు.

752
01:15:16,058 --> 01:15:17,392
మై డియర్ ఒమీద్.

753
01:15:20,604 --> 01:15:22,813
దానికింద హార్ట్ గీయగలవా?

754
01:15:22,814 --> 01:15:27,986
డియర్ ఒమీద్,
మనం మళ్లీ కలుసుకునేవరకు గుడ్‌బై!

755
01:15:58,058 --> 01:16:01,770
ఏడవొద్దు. ప్లీజ్ ఏడవొద్దు.

756
01:16:26,837 --> 01:16:31,049
ఇప్పుడు నేను ఆఫీసులో పని చేయలేను,

757
01:16:31,800 --> 01:16:35,387
ఇంట్లోనే ఏదో ఒక విధంగా
చురుగ్గా ఉండేలా చూసుకోవాలి.

758
01:16:48,650 --> 01:16:55,449
ఇది బోర్ కొడుతోంది,
కానీ ఏమీ లేని దానికన్నా బెటరే.

759
01:16:55,949 --> 01:16:59,411
దీంతో టైమ్ పాస్ అవుతోంది.

760
01:17:01,872 --> 01:17:04,790
జొహ్రా తన ఇంటర్వ్యూలో ఉంది.

761
01:17:04,791 --> 01:17:08,753
బహుశా తను మాతో పాటు, లేదా మాకంటే ముందే
వెళ్లిపోవచ్చేమో, మాకు తెలియదు.

762
01:17:08,754 --> 01:17:12,007
వీడ్కోలు పార్టీ చేసుకున్నాం.

763
01:17:15,594 --> 01:17:17,429
మంచిగా వెళ్లిరా.

764
01:17:18,222 --> 01:17:21,516
బలవంతులైన మహిళలు ఎప్పుడూ ఒంటరివారే.

765
01:17:21,517 --> 01:17:23,518
మరచిపోవద్దు, ఒంటరితనం మహిళల్ని
బలంగా చేస్తుంది.

766
01:17:23,519 --> 01:17:24,811
ఐ లవ్ యు వెరీమచ్.

767
01:17:25,812 --> 01:17:27,856
ఐ లవ్ యు.

768
01:17:29,525 --> 01:17:32,027
బై బై...

769
01:17:35,739 --> 01:17:37,533
వాళ్లు వెళ్లిపోయారు.

770
01:17:42,037 --> 01:17:48,669
ఆమె ఈ ఎడారి నుంచి బయటపడింది, మేము మళ్లీ
జబీరా జైలుకు వెళ్లాలి.

771
01:17:50,170 --> 01:17:54,966
మీరు ఉపయోగించే ముందు సామాను అంతా
శుభ్రంగా ఉండాలి.

772
01:17:54,967 --> 01:17:57,510
మీ నోటికే వాటిని వాడుతున్నట్టు
ఊహించుకోండి.

773
01:17:57,511 --> 01:18:00,054
దయచేసి ఈ క్లినిక్ నియమాలకు
కట్టుబడి ఉండండి.

774
01:18:00,055 --> 01:18:02,391
రోగి పట్ల బాధ్యతగా లేకపోతే,
క్లినిక్‌కి రోగులు రారు.

775
01:18:07,688 --> 01:18:11,149
నా క్లినిక్ విడిచిపెట్టాల్సి రావడం
బాధాకరం.

776
01:18:11,692 --> 01:18:15,279
మరీ ముఖ్యంగా, నా స్నేహితుల్ని
ఎలా వదిలి పోగలను?

777
01:18:15,654 --> 01:18:19,073
నా పోరాటంలో కలిసిన నా ప్రియమైన సహచరులు.

778
01:18:19,074 --> 01:18:24,621
నా తోటి వీరవనితలకు వీడ్కోలు చెప్పడం
చాలా కష్టం.

779
01:18:25,414 --> 01:18:30,084
నేనొక సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చాను.

780
01:18:30,085 --> 01:18:32,253
కష్టపడి చదివి డాక్టర్‌ని అయ్యా,

781
01:18:32,254 --> 01:18:34,964
నా దేశంలో చీకటి నెలకొన్నా
నా పని కొనసాగించ గలిగాను.

782
01:18:34,965 --> 01:18:38,926
దీన్నంతటినీ తాలిబాన్లు నాశనం చేస్తారన్న

783
01:18:38,927 --> 01:18:44,056
ఆలోచనే నేను తట్టుకోలేను.

784
01:18:44,057 --> 01:18:47,269
నేను చేసిన ప్రతిదీ నాశనం చేస్తారని నా భయం.

785
01:19:04,661 --> 01:19:10,458
నిన్న సేఫ్‌హౌస్ నుంచి
ఒక అధికారి వచ్చి చెప్పాడు

786
01:19:10,459 --> 01:19:15,087
ఇకపై ఇక్కడ మేము ఉండటానికి కుదరదని.

787
01:19:15,088 --> 01:19:16,965
మేము బయలుదేరాల్సి వచ్చింది.

788
01:19:18,008 --> 01:19:20,885
మేము దిక్కుతోచని స్థితిలో ఉన్నాం.

789
01:19:20,886 --> 01:19:23,222
మా దగ్గర డబ్బు కూడా లేదు.
డబ్బు ఉంటే బాగుండేది.

790
01:19:26,808 --> 01:19:29,810
మా కుటుంబాలు కాబూల్‌లో ఉన్నాయి
వారి వీసాలు సిద్దంగా లేవు,

791
01:19:29,811 --> 01:19:32,314
ఇది వివాదాస్పదంగా మారింది.

792
01:19:33,482 --> 01:19:37,151
ఒక్కో వీసాకి 450 డాలర్ల ఖర్చు చేయాలి,

793
01:19:37,152 --> 01:19:43,742
మా అపాయింట్‌మెంట్
ఐదోసారి క్యాన్సిల్ అయింది.

794
01:19:44,910 --> 01:19:48,579
ఈ బాధల మధ్యలో,

795
01:19:48,580 --> 01:19:52,584
ఈ కారు కూడా పనికిరాకుండా అయింది,
ప్రతిసారీ ఆగిపోతోంది.

796
01:19:54,294 --> 01:19:59,799
మేము పేదరికాన్ని అనుభవిస్తున్నాం.

797
01:19:59,800 --> 01:20:05,805
ఆధారపడటానికి మాకు ఎవరూ లేరు.

798
01:20:05,806 --> 01:20:12,895
దేవుడు తప్ప సాయం చేసేవాళ్లు కూడా
ఎవరూ లేరు.

799
01:20:12,896 --> 01:20:19,986
ఇది మా దరిద్రానికి, దుస్థితికి పరాకాష్ట.

800
01:20:19,987 --> 01:20:22,822
మాకు ఏడ్చే ఓపిక కూడా లేదు.

801
01:20:22,823 --> 01:20:24,991
నా కళ్లలో కన్నీళ్లు ఇంకిపోయాయి.

802
01:20:24,992 --> 01:20:30,663
నిన్నటి నుచి మేము వీధి కుక్కల్లా
తిరుగుతున్నాం.

803
01:20:30,664 --> 01:20:32,415
దేవుడి మీద ఒట్టు.

804
01:20:32,416 --> 01:20:36,336
{\an8}క్లినిక్ సెక్యూరిటీ ఫుటేజ్

805
01:20:38,630 --> 01:20:41,924
అక్కడ చూడండి. ఇది కిడ్నాప్ అని నా అనుమానం.

806
01:20:41,925 --> 01:20:45,012
వాళ్లలో ఒకరి దగ్గర గన్ ఉంది.

807
01:20:49,266 --> 01:20:51,768
ఒమీద్, ఈ కారు చూడు.
ఆ గ్లాస్ గ్రే రంగులో ఉంది.

808
01:20:55,105 --> 01:20:57,732
ఈ కారులో జహ్రా ఎక్కడం చూశా.

809
01:20:57,733 --> 01:20:59,610
- ఆమె మీ భార్యా?
- అవును.

810
01:21:01,904 --> 01:21:06,032
{\an8}కాస్త రివైండ్ చేయండి.
ఇంకోసారి చెక్ చేయాలి.

811
01:21:06,033 --> 01:21:10,203
{\an8}వాడు వచ్చి డాక్టర్ జహ్రా ఎక్కడ
అని అడిగి వెళ్లాడు.

812
01:21:10,204 --> 01:21:12,997
{\an8}- వాడు తిరిగొచ్చాడా?
- వచ్చాడు.

813
01:21:12,998 --> 01:21:16,292
{\an8}ఈ వీడియోలలో చూపించే టైమ్
సరిగానే ఉందా.?

814
01:21:16,293 --> 01:21:18,002
{\an8}నిజానికి కారు కిటీకీలకు తెరలున్నాయి.

815
01:21:18,003 --> 01:21:20,214
{\an8}వాటిలోంచి చూడటం దాదాపు అసాధ్యం.

816
01:21:26,845 --> 01:21:28,639
{\an8}ప్లే చెయ్, ప్లే చెయ్.

817
01:21:41,151 --> 01:21:42,485
డాక్టర్ జహ్రా మహమ్మదీ

818
01:21:42,486 --> 01:21:47,532
తన ఆఫీస్ నుంచి అదృశ్యమై
కొన్ని నెలలు కావస్తోంది.

819
01:21:47,533 --> 01:21:50,285
ఆమె ఎక్కడుందో ఎవరికీ తెలియదు.

820
01:21:51,703 --> 01:21:56,582
స్కూళ్లు, యూనివర్శిటీలు మూసేసి
ఏడాది అవుతోంది.

821
01:21:56,583 --> 01:22:00,087
ఆప్ఘన్ మహిళలంతా ఇంటికి పరిమితమై కూడా
ఏడాది అయింది.

822
01:22:03,382 --> 01:22:05,550
ఇప్పుడు ఉదయం 3 గంటలు.

823
01:22:05,551 --> 01:22:11,597
కొన్ని రాత్రులు, నేను మేల్కొంటాను,
ఒక గ్లాస్ వేడి నీళ్లు,

824
01:22:11,598 --> 01:22:18,647
ఒక పెన్ను, పుస్తకం
నా ఒంటరి తనానికి సహచరులు.

825
01:22:19,815 --> 01:22:22,149
మేము ఇంకా తాలిబన్ల ఆంక్షలకి లోబడి ఉన్నాం.

826
01:22:22,150 --> 01:22:25,987
పరిస్థితి దారుణంగా ఉంది.
కాబూల్ ధ్వంసమైంది.

827
01:22:25,988 --> 01:22:29,741
నేను అన్నీ కోల్పోతున్నాను.

828
01:22:30,534 --> 01:22:36,163
బాలికలు రంగు బట్టలు ధరించే రోజుల్ని
మిస్ అవుతున్నాను,

829
01:22:36,164 --> 01:22:37,916
నలుపు రంగు కాదు.

830
01:22:45,007 --> 01:22:49,136
అల్లాపై ఆస్తికులం నమ్మకం ఉంచుదాం.

831
01:24:29,152 --> 01:24:34,574
న్యాయం అడగడమే నా నేరం.

832
01:24:34,575 --> 01:24:39,954
స్వేచ్ఛను కోరాను కాబట్టి ఇక్కడ దాక్కోవాలి.

833
01:24:39,955 --> 01:24:45,251
మాతృభూమి కోసం పట్టుబట్టాను,

834
01:24:45,252 --> 01:24:48,337
మహిళలకు స్వేచ్ఛ కావాలని పట్టుబట్టాను.

835
01:24:48,338 --> 01:24:54,678
నేను నా కుటుంబానికి దూరంగా ఉండాలి.

836
01:24:57,389 --> 01:25:04,396
కానీ ఈ పిల్లిపిల్ల ఎప్పుడూ
నా పక్కనే ఉంటుంది.

837
01:25:08,650 --> 01:25:13,864
ఉద్యమకారిణులు ఇలాంటి చోట్లే
దాక్కుని ఉన్నారు.

838
01:25:14,823 --> 01:25:17,283
యూనివర్శిటీ ప్రవేశ పరీక్షకు

839
01:25:17,284 --> 01:25:21,662
ఇది బాగా ఉపయోగపడుతుందని గమనించండి.

840
01:25:21,663 --> 01:25:26,793
ఉదాహరణకి, ఆప్ఘనిస్తాన్ గురించి
ఒక వాక్యం చెప్తున్నా.

841
01:25:27,419 --> 01:25:31,547
ఉహ్, నేను ఆప్ఘనిస్తాన్ గురించి
ఆలోచిస్తున్నా.

842
01:25:31,548 --> 01:25:35,802
"నేను ఆప్ఘనిస్తాన్ గురించి
ఆలోచిస్తున్నా" అని చెప్తున్నా.

843
01:25:37,763 --> 01:25:41,182
ఆగస్ట్ 15, 2021 నుంచి కాబూల్ వీధుల్లో
వేలాదిమంది మహిళలు

844
01:25:41,183 --> 01:25:43,267
ఆహారం, ఉద్యోగం, స్వేచ్ఛ కోసం
ఉద్యమిస్తున్నారు.

845
01:25:43,268 --> 01:25:46,729
వారిలో వందలమంది అరెస్ట్ అయ్యారు,
హింసకు మరణానికి లోనయ్యారు.

846
01:25:46,730 --> 01:25:50,192
చాలా మంది జాడ ఇప్పటికీ తెలియదు.

847
01:25:51,652 --> 01:25:56,907
విదేశాల్లో జహ్రా, షరీఫా, తరనోమ్
కొత్త జీవితాల్ని నిర్మించుకుంటున్నారు.

848
01:27:59,530 --> 01:28:01,532
సబ్‌టైటిల్స్: బడుగు రవికుమార్



