1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

3
00:00:24,942 --> 00:00:31,240
ఈ చిత్రం 1988 వసంతకాలంలో
ఒక వారం పాటూ జరిగింది.

4
00:01:00,686 --> 00:01:01,895
సిద్ధమా?

5
00:01:07,526 --> 00:01:10,112
అనువాదకుడు కనిపించట్లేదే.

6
00:01:13,532 --> 00:01:15,826
మైక్రోఫోన్ ఎందుకు?

7
00:01:24,543 --> 00:01:26,837
సాధారణంగా ఇక్కడే సంజ్ఞ చేస్తాను.

8
00:01:26,920 --> 00:01:28,046
అవును, ఇక్కడే.

9
00:01:29,548 --> 00:01:32,134
కానీ ఉద్వేగం వచ్చినప్పుడు
ఎక్కువ కదులుతాను.

10
00:01:40,475 --> 00:01:43,395
నేను కళ్ళద్దాలు
పెట్టుకుంటే మంచిదనుకుంటా.

11
00:01:44,021 --> 00:01:45,230
సరే.

12
00:01:49,193 --> 00:01:51,528
అవి లేకున్నా పర్లేదు.

13
00:01:51,612 --> 00:01:52,946
అందరూ సిద్ధమేనా?

14
00:01:53,655 --> 00:01:55,532
ఎస్! మొత్తానికి!

15
00:01:56,158 --> 00:01:57,701
నేనొక కథ చెప్పాలి.

16
00:02:10,672 --> 00:02:15,344
గల్లాడెట్ విశ్వవిద్యాలయం
వాషింగ్టన్, డి.సి.

17
00:02:17,095 --> 00:02:23,143
ప్రపంచంలోని ఏకైక
శ్రవణ వైకల్య విశ్వవిద్యాలయం

18
00:02:36,031 --> 00:02:37,950
నా స్నేహితురాలి గదిలో ఉన్నాను.

19
00:02:43,413 --> 00:02:46,917
ఆదివారం

20
00:02:51,380 --> 00:02:53,006
ఒక్కసారిగా…

21
00:02:56,760 --> 00:02:58,679
లైట్‌లు కొట్టుకుంటున్నాయి…

22
00:03:01,473 --> 00:03:03,392
ఒక కంపనలా అనిపించింది.

23
00:03:04,017 --> 00:03:05,894
ఎవరో తలుపు దగ్గర కొడుతున్నారు…

24
00:03:07,646 --> 00:03:09,439
దానర్థం "త్వరగా, త్వరగా!" అని.

25
00:03:10,065 --> 00:03:11,483
వెంటనే తలుపు దగ్గరకు వెళ్ళి…

26
00:03:12,943 --> 00:03:15,571
మేడ క్రింద క్యాంపస్
ప్రవేశద్వారం వైపు వెళ్ళాను.

27
00:03:22,327 --> 00:03:24,162
తమ స్కూల్
భవితవ్యం గూర్చి మాట్లాడాలంటూ

28
00:03:24,246 --> 00:03:25,581
విద్యార్థులు ధర్నా చేస్తున్న
గల్లాడెట్ యూనివర్సిటీలో

29
00:03:25,664 --> 00:03:28,375
ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం.

30
00:03:29,501 --> 00:03:30,878
కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటించబోతుండగా,

31
00:03:30,961 --> 00:03:33,297
తమలో ఒకరు అగ్రస్థానంలో
ఉండాలని విద్యార్థులు కోరుకుంటున్నారు.

32
00:03:45,475 --> 00:03:48,228
కెఎఫ్‌సి నుండి తిరిగి వెళ్తున్నాను.

33
00:03:49,188 --> 00:03:51,398
బండి నడుపుతూ సంచిలో నుండి తింటున్నాను.

34
00:03:52,816 --> 00:03:55,319
మరో చేత్తో సంజ్ఞ కూడా చేస్తున్నాను,

35
00:03:56,278 --> 00:04:00,365
కానీ వినగల్గిన నా ప్రేయసి
చాలా భయపడిపోయింది.

36
00:04:00,449 --> 00:04:04,453
ఆమె, "చెవిటి డ్రైవర్,
ఓరి దేవుడా! రోడ్డు చూడు" అంది.

37
00:04:04,536 --> 00:04:05,537
నేనన్నాను, "శాంతించు."

38
00:04:23,055 --> 00:04:24,681
నేను క్యాంపస్‌ చేరుకునేసరికి…

39
00:04:26,433 --> 00:04:28,227
జనాలు నా కార్ బోనెట్ పైన

40
00:04:28,602 --> 00:04:30,395
కొడుతున్నారు.

41
00:04:31,855 --> 00:04:34,775
లోపల ట్రస్టీల బోర్డ్
సమావేశం జరుగుతుండగా,

42
00:04:34,858 --> 00:04:36,818
ఇక్కడ విద్యార్థులు ప్రదర్శనలిస్తూ,

43
00:04:36,902 --> 00:04:39,238
గల్లాడెట్ గేట్ల బయట రోజంతా వేచి ఉన్నారు.

44
00:04:39,321 --> 00:04:40,697
ఇప్పుడు విద్యార్థులు ఇది సాధిస్తే,

45
00:04:40,781 --> 00:04:43,242
యూనివర్సిటీ 124 ఏళ్ళలో

46
00:04:43,325 --> 00:04:45,160
మొదటి బధిర అధ్యక్షుడిని పొందనుంది.

47
00:04:53,502 --> 00:04:57,923
నేను కొండ క్రిందికి నడుస్తుంటే,
గుంపుల కొద్దీ జనాలు కనిపించారు.

48
00:05:00,759 --> 00:05:02,845
అక్కడంతా ఉద్వేగంగా ఉంది.

49
00:05:03,929 --> 00:05:06,974
నాకు అనిపించింది, "వీళ్ళు
ఒక బధిరుడిని ఎంచుకుంటారు."

50
00:05:08,308 --> 00:05:11,520
ప్రపంచంలోని ఏకైక
బధిర యూనివర్సిటీ, గల్లాడెట్,

51
00:05:11,603 --> 00:05:16,191
మరియు 124 ఏళ్ళ చరిత్రలో
ఒక్క బధిరుడూ అధ్యక్షుడిగా ఎన్నుకోబడలేదు.

52
00:05:17,067 --> 00:05:20,696
ప్రపంచంలోనే మొట్టమొదటి
బధిర కళాశాలను స్థాపించే చట్టంపై,

53
00:05:20,779 --> 00:05:23,782
అబ్రహం లింకన్ 1864లో సంతకం చేశారు.

54
00:05:23,866 --> 00:05:25,951
బధిర అధ్యక్షుడు తక్షణమే!!

55
00:05:26,702 --> 00:05:28,704
ఇదే సరైన సమయం, చేయండి.

56
00:05:34,585 --> 00:05:36,962
ఎవరో ఒక పెట్టెను తీసుకొచ్చారు.

57
00:05:41,758 --> 00:05:42,968
అదొక కరపత్రాల కట్ట.

58
00:05:43,802 --> 00:05:45,429
ఎవరో నాకొక కాగితం ఇచ్చారు.

59
00:05:46,013 --> 00:05:47,431
నేనా కాగితం చూసి…

60
00:05:48,473 --> 00:05:50,267
తీసుకుని చదివాను.

61
00:06:06,366 --> 00:06:07,910
నేను చెప్పానా.

62
00:06:08,785 --> 00:06:10,412
వినగల్గిన వారు.

63
00:06:11,496 --> 00:06:14,666
చుట్టూ చూశాను, ఒక్కసారిగా…

64
00:06:19,004 --> 00:06:22,466
గల్లాడెట్ యూనివర్సిటీ వద్ద
ఈ సాయంత్రం నిరసనలు వెల్లువెత్తాయి.

65
00:06:23,175 --> 00:06:24,760
స్కూల్ ట్రస్టీల బోర్డ్,

66
00:06:24,843 --> 00:06:27,804
అధ్యక్ష పదవికి పోటీ చేసిన
ఇద్దరు బధిర అభ్యర్థులను పక్కకుపెట్టి…

67
00:06:30,891 --> 00:06:33,143
వినగల్గిన మహిళకు మద్దతునిచ్చారు.

68
00:06:35,229 --> 00:06:36,855
దీనికి నేను ఒప్పుకోను.

69
00:06:39,191 --> 00:06:41,235
ఫైనలిస్ట్‌ల‌లో
ఇద్దరు బధిర పురుషులు

70
00:06:41,318 --> 00:06:43,904
హార్వే కోర్సన్ మరియు ఐ. కింగ్ జోర్డాన్,

71
00:06:43,987 --> 00:06:46,448
గల్లాడెట్ కాలేజ్ ఆఫ్
ఆర్ట్స్ అండ్ సైన్స్ యొక్క డీన్.

72
00:06:46,532 --> 00:06:49,243
వివాదం, మూడవ అభ్యర్ధి

73
00:06:49,326 --> 00:06:51,370
వినగల్గిన ఎలిసబెత్ జిన్సర్
చుట్టూ కొనసాగుతుంది.

74
00:06:52,579 --> 00:06:56,375
బధిరులను కాక, వినగల్గిన
వారిని ఎంచుకోవడం నమ్మశక్యం కానిది.

75
00:06:59,962 --> 00:07:01,255
ఈ పేపర్లను మీరు అంగీకరిస్తారా?

76
00:07:01,338 --> 00:07:03,340
విసిరి పారేద్దామా?
కాల్చేద్దామా? అవును!!

77
00:07:04,258 --> 00:07:06,093
వాళ్ళకు చాలా కోపమొచ్చింది.

78
00:07:07,135 --> 00:07:08,887
అవమానింపబడ్డట్లుగా భావించారు.

79
00:07:10,514 --> 00:07:12,015
వాళ్ళు హింసను కోరుకున్నారు.

80
00:07:12,099 --> 00:07:14,476
నా మొదటి ఆలోచన, "కంట్రోల్."

81
00:07:17,229 --> 00:07:20,941
వాళ్ళు పూర్తిగా అదుపు తప్పి,
చేయిదాటి పోయారు.

82
00:07:25,404 --> 00:07:27,614
అప్పటి మీ ఫుటేజ్ చూశాను,

83
00:07:28,407 --> 00:07:30,701
చాలా అందంగా ఉన్నారు.

84
00:07:32,744 --> 00:07:34,413
చాలా సన్నగా ఉండేవాడిని.

85
00:07:47,134 --> 00:07:50,554
నేను నిల్చుని,
"హే అందరూ కూర్చోండి" అన్నాను.

86
00:07:51,889 --> 00:07:53,223
అంతా కూర్చున్నారు.

87
00:07:56,476 --> 00:07:58,228
దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష
ఇది బధిర వివక్ష

88
00:07:59,021 --> 00:08:03,775
బధిరులకు అర్హత లేదని

89
00:08:03,859 --> 00:08:05,736
వాళ్ళు మనతో చెప్పినప్పుడు

90
00:08:05,819 --> 00:08:07,571
నేనూ మీలాగే అవమానపడ్డాను!

91
00:08:09,198 --> 00:08:12,451
జెర్రీ

92
00:08:15,537 --> 00:08:19,458
ఆగ్రహంతో
రగిలిపోయి ముందుకు దూకే వ్యక్తి…

93
00:08:21,043 --> 00:08:23,212
మీలో నాకు కనిపించాడు.

94
00:08:25,464 --> 00:08:27,508
మీరు పుట్టినప్పటి నుండి అంతేనా?

95
00:08:35,599 --> 00:08:37,351
మిగిలినవారికి

96
00:08:37,433 --> 00:08:42,981
నేనొక అమాయకపు పిల్లాడిని. కానీ
మా తల్లిదండ్రులు "ఉహ్, ఏం కాదు" అనేవారు.

97
00:08:46,777 --> 00:08:48,946
నేనొక బుల్లి రాక్షసుడిని.

98
00:08:53,825 --> 00:08:56,286
అంటే, మీరేం అమాయకులు కారా?

99
00:08:57,621 --> 00:09:00,457
నాకొక దివ్యకాంతి ఉంది,

100
00:09:00,541 --> 00:09:02,543
కానీ కొద్దిగా మసకబారింది.

101
00:09:02,626 --> 00:09:05,087
కొంచెం వంకరగా ఉంది.

102
00:09:10,175 --> 00:09:15,180
ఆ ప్రాంతంలో మా నాన్నగారు
అత్యుత్తమ డెంటల్ ల్యాబ్ టెక్నీషియన్.

103
00:09:16,515 --> 00:09:19,893
మా నాన్నగారి కారణంగా,
అక్కడికి ఎంతోమంది వెళ్లారు.

104
00:09:19,977 --> 00:09:22,980
కానీ ఆయన బధిరుడని వారికస్సలు తెలియదు.

105
00:09:24,731 --> 00:09:26,859
ల్యాబ్ టెక్నీషియన్‌లు,

106
00:09:26,942 --> 00:09:31,196
"ఓహ్, ఈ చెవిటివాడు మనతో
పని చేయడం సిగ్గుచేటు" అనేవారు.

107
00:09:32,281 --> 00:09:34,575
అందుకని ఆయనను బేస్మెంట్‌లో ఉంచేవారు.

108
00:09:35,993 --> 00:09:38,370
ఆయన ప్రతిరోజూ అక్కడే పని చేసేవారు.

109
00:09:38,954 --> 00:09:41,456
ఆయనను మేడపైన ఎన్నడూ కూర్చోనివ్వలేదు.

110
00:09:42,457 --> 00:09:44,126
ఆయన కోపంగా ఉండేవారా?

111
00:09:47,296 --> 00:09:49,506
అప్పట్లో బధిరులకు అది అలవాటే.

112
00:09:51,175 --> 00:09:52,968
దాన్ని అంగీకరించారు.

113
00:09:54,636 --> 00:09:56,847
కానీ నేను దాన్ని అంగీకరించను.

114
00:09:59,516 --> 00:10:00,934
మీకు ఎంత బాధ ఉంది?

115
00:10:03,270 --> 00:10:04,688
ఎంత బాధ?

116
00:10:06,815 --> 00:10:08,025
ఇంకా.

117
00:10:08,692 --> 00:10:10,777
నాకలా జరగనివ్వను.

118
00:10:12,529 --> 00:10:14,907
మనల్ని ప్రపంచం ఆపలేదు!

119
00:10:19,494 --> 00:10:21,914
ఏ గుర్తింపూ లేకుండా

120
00:10:21,997 --> 00:10:24,833
తమ పని తాము చేసుకుంటున్న వారికి

121
00:10:24,917 --> 00:10:26,752
ఈ వివాదం వల్ల పబ్లిసిటీ వచ్చింది:

122
00:10:26,835 --> 00:10:29,838
వారే గల్లాడెట్ బోర్డ్ ట్రస్టీలు.

123
00:10:29,922 --> 00:10:33,509
మనకు వివరించడానికి
ఒక్క వ్యక్తిని పంపమని వారిని అడిగాను,

124
00:10:33,592 --> 00:10:35,761
అందుకు "మేం బిజీగా ఉన్నాం" అన్నారు.

125
00:10:35,844 --> 00:10:37,012
కాకమ్మ కథలు!

126
00:10:37,095 --> 00:10:38,889
బోర్డ్ సభ్యులు,

127
00:10:38,972 --> 00:10:40,974
బహిరంగంగా తగాదా పెట్టుకోదలచుకోలేదు,

128
00:10:41,975 --> 00:10:44,353
దానర్థం వారికి మేమంటే లెక్కలేదు.

129
00:10:45,771 --> 00:10:46,772
బధిర అధ్యక్షుడు తక్షణమే!

130
00:10:46,855 --> 00:10:48,106
అదీ వాళ్ళ తీరు.

131
00:10:48,190 --> 00:10:51,443
అందుకని, "బోర్డ్ ఎక్కడ?
బోర్డ్ ఎక్కడుంది? ఎక్కడ?" అన్నాం.

132
00:10:51,818 --> 00:10:53,570
ఎందుకో మాకు తెలియాలి!

133
00:10:53,654 --> 00:10:55,489
మాకు వివరణ కావాలి!

134
00:10:56,031 --> 00:10:58,075
కానీ బోర్డ్ ట్రస్టీలు
ఎక్కడున్నారో నాకు తెలుసు.

135
00:11:00,827 --> 00:11:01,995
ఈ రాత్రి
ఎన్ఇ వాషింగ్టన్

136
00:11:02,079 --> 00:11:03,622
కోపంతోనున్న
విద్యార్థులు, బోర్డ్ ట్రస్టీలు

137
00:11:03,705 --> 00:11:06,083
విందు చేసుకుంటున్న
మేఫ్లవర్ హోటల్‌కు కవాతు చేశారు.

138
00:11:08,210 --> 00:11:09,503
నేను ముందున్నాను.

139
00:11:10,212 --> 00:11:11,630
అందరినీ నడిపించాను.

140
00:11:12,339 --> 00:11:14,299
విద్యార్థులే నన్ను ఎంచుకున్నారనుకుంటా.

141
00:11:15,717 --> 00:11:17,511
నేను విద్యార్థి సంఘ అధ్యక్షుడిని,

142
00:11:17,594 --> 00:11:20,639
కానీ కొద్ది రోజుల ముందే
ప్రమాణస్వీకారం చేశాను.

143
00:11:21,139 --> 00:11:24,226
గ్రెగ్

144
00:11:25,185 --> 00:11:28,146
మనం అలా జరగనివ్వం!
జరగనివ్వం! జరగనివ్వం!

145
00:11:28,939 --> 00:11:33,819
కాబట్టి ఈత రాకుండానే
నీళ్ళలోకి నెట్టబడ్డాను.

146
00:11:34,361 --> 00:11:36,905
మొహం మీద లాగి కొట్టినట్లుంది.

147
00:11:37,781 --> 00:11:40,200
చాలామంది
నా దగ్గరకు రావడం మొదలైంది.

148
00:11:41,994 --> 00:11:44,496
నాదే బాధ్యత అన్నట్లు.

149
00:11:44,580 --> 00:11:50,085
నన్ను మార్గదర్శకుడిలా చూస్తున్నారు,
"నన్ను నిర్దేశించు. తర్వాత ఏంటి?"

150
00:11:51,587 --> 00:11:53,422
ఇంఛార్జ్ ఎవరు?

151
00:11:56,758 --> 00:11:57,801
నేను.

152
00:12:08,145 --> 00:12:10,105
ది మేఫ్లవర్

153
00:12:10,189 --> 00:12:12,524
బోర్డ్ మూడవ అంతస్తులో ఉంది.

154
00:12:12,608 --> 00:12:14,443
వాళ్ళేం చేస్తున్నారో తెలుసా?

155
00:12:15,777 --> 00:12:18,363
అక్కడ తీరిగ్గా కూర్చుని భోంచేస్తూ,

156
00:12:18,447 --> 00:12:19,907
విద్యార్థులపైన జోకులు వేసుకుంటున్నారు.

157
00:12:20,157 --> 00:12:23,619
మనతో మాట్లాడకుండా
బోర్డ్‌ను వెళ్ళనిచ్చేది లేదు.

158
00:12:29,458 --> 00:12:32,628
ప్రస్తుతం విద్యార్థుల
కన్ను, బోర్డు ట్రస్టీల కొత్త ఛైర్మన్

159
00:12:32,711 --> 00:12:34,213
జేన్ బాసెట్ స్పిల్మాన్‌పై పడింది.

160
00:12:38,967 --> 00:12:39,927
ఉహ్, ఆమెనా.

161
00:12:41,220 --> 00:12:44,515
కోపంతో రగిలిపోతున్నారు,
మాకింకా అర్థం కావట్లేదు,

162
00:12:44,598 --> 00:12:48,060
మనం ఒక బధిర అధ్యక్షుడిని
ఎన్నుకోవల్సిందని నాకనిపిస్తుంది.

163
00:12:48,519 --> 00:12:52,814
ఆమె డబ్బుకు,
అహంకారానికి ప్రతిరూపం.

164
00:12:54,566 --> 00:12:57,402
ఆమె అడ్మిరల్‌ దుస్తులు వేసుకుంది.

165
00:12:57,861 --> 00:13:01,114
మీరు బధిర సమాజానికి
ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

166
00:13:07,955 --> 00:13:10,040
గందరగోళంగా ఉంది.

167
00:13:10,916 --> 00:13:13,919
ప్రతిఒక్కరూ ఒకేసారి సంజ్ఞ చేస్తున్నారు.

168
00:13:16,463 --> 00:13:18,507
జనాన్ని అదుపు
చేయాల్సి వచ్చింది.

169
00:13:32,646 --> 00:13:35,440
డిసి పోలీసులు మిమ్మల్ని
అరెస్ట్ చేస్తామంటున్నారు.

170
00:13:35,858 --> 00:13:37,109
ఇక మీ ఇష్టం.

171
00:13:37,609 --> 00:13:40,779
దాంతో స్టేజ్ పైకి
వెళ్లాలని నిర్ణయించుకున్నాను.

172
00:13:43,031 --> 00:13:46,660
గుంపు దగ్గరగా ఉందని
పోలీసులు భావిస్తున్నారు.

173
00:13:47,536 --> 00:13:50,998
బ్రిడ్జెట్టా

174
00:13:51,623 --> 00:13:55,002
కొంచెం దారి ఇవ్వండి.

175
00:14:00,090 --> 00:14:02,092
నాకేం వినపడదు.

176
00:14:02,509 --> 00:14:04,136
నాకు పూర్తిగా చెవుడు…

177
00:14:06,430 --> 00:14:09,433
కానీ నాలో రిథమ్ ఉంది.

178
00:14:10,559 --> 00:14:13,228
ఒక తాళాన్ని ఎలా అనుకరించాలో నాకు తెలుసు.

179
00:14:19,860 --> 00:14:23,655
సంగీతాన్ని ఆస్వాదిస్తే
దాన్ని అనుసరిస్తూ కదులుతారు.

180
00:14:30,954 --> 00:14:33,373
నేను హైస్కూల్‌లో ఛీర్ లీడర్.

181
00:14:43,258 --> 00:14:45,385
మాకు ప్యాక్-మ్యాన్ డాన్స్ ఉండేది.

182
00:14:48,430 --> 00:14:50,849
మా సమాజంలో ఒక జోక్ ఉంది.

183
00:14:50,933 --> 00:14:54,561
మీరు కార్ ఎక్కి రేడియో ఆన్ చేస్తే,

184
00:14:54,645 --> 00:14:56,480
మేము "ఆహ, సంగీతం, ఆ…" అనుకునేవాళ్లం,

185
00:14:57,147 --> 00:14:58,690
తీరా చూస్తే వార్తలు.

186
00:15:02,486 --> 00:15:04,238
అదంతా…

187
00:15:07,241 --> 00:15:08,575
లయబద్దంగా కదలడమే.

188
00:15:10,327 --> 00:15:14,039
స్పిల్మాన్ బయటకు పో!
స్పిల్మాన్ బయటకు పో!

189
00:15:14,122 --> 00:15:15,958
స్పిల్మాన్ బయటకు పో!

190
00:15:16,041 --> 00:15:18,544
అందరినీ ఒకే తాళంపై ఉంచాలంటే

191
00:15:18,627 --> 00:15:21,463
మేము లయబద్దంగా ఉండాలని అర్థమైంది.

192
00:15:21,839 --> 00:15:23,215
స్పిల్మాన్ బయటకు పో!

193
00:15:40,566 --> 00:15:42,359
మీరు సాధించారు.

194
00:15:42,442 --> 00:15:45,445
ఇప్పుడు బోర్డ్ మీ మాట వింటుంది.

195
00:15:48,240 --> 00:15:50,784
విద్యార్థులతో మాట్లాడడానికి
స్పిల్మాన్ అంగీకరించింది.

196
00:15:51,660 --> 00:15:54,538
మరియు ఆమెకు రక్షణగా
పోలీసులు చుట్టూ ఉంటామన్నారు.

197
00:15:54,955 --> 00:15:58,542
నాపేరు జేన్ బాసెట్ స్పిల్మాన్.

198
00:15:58,625 --> 00:16:00,752
నేను గల్లాడెట్ ట్రస్టీల బోర్డ్ ఛైర్మన్.

199
00:16:00,836 --> 00:16:02,379
జేన్, క్షమించండి.

200
00:16:02,462 --> 00:16:04,464
ఇటీవల మీరు తీసుకున్న నిర్ణయంతో

201
00:16:04,548 --> 00:16:06,175
మేం సంతృప్తిగా లేము.

202
00:16:06,258 --> 00:16:10,262
టిమ్

203
00:16:10,345 --> 00:16:12,598
ఇప్పుడు వారికి మీరొక వివరణ ఇవ్వాలి…

204
00:16:13,140 --> 00:16:16,101
నేను స్పిల్మాన్‌ను
కలిసినప్పుడు కోపంగా ఉన్నాను.

205
00:16:16,727 --> 00:16:19,521
మాకు బధిర అభ్యర్ధులున్నారు.
అందుకు సిద్ధంగా ఉన్నాం.

206
00:16:19,605 --> 00:16:21,940
వాళ్ళు మంచి అభ్యర్ధులు.

207
00:16:23,317 --> 00:16:24,735
ఒక్క అభ్యర్ధికి ఇద్దరు.

208
00:16:24,818 --> 00:16:26,862
ఒక్క వినగల్గిన వ్యక్తి,
ఇద్దరు బధిర అభ్యర్ధులు.

209
00:16:27,571 --> 00:16:31,241
వారికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉంది.

210
00:16:31,325 --> 00:16:33,911
చూడండి టిమ్, నేను ఇక్కడికి వచ్చి

211
00:16:33,994 --> 00:16:36,955
వీరితో మాట్లాడాలని మీరు కోరుకున్నారు.

212
00:16:37,039 --> 00:16:38,540
ఆమె మర్యాదగా, సంస్కారంగా ఉంది.

213
00:16:38,624 --> 00:16:40,459
నేను విద్యార్థులతో
మాట్లాడాలని మీరు కోరుకున్నారు.

214
00:16:40,542 --> 00:16:43,921
ఒక సాంప్రదాయక ఇంగ్లండ్ మహిళలా ఉంది.

215
00:16:44,004 --> 00:16:45,547
ఎలాగంటే…

216
00:16:45,631 --> 00:16:48,634
ఒక టీ పార్టీలో మాట్లాడుకున్నట్లు సుతారంగా.

217
00:16:50,219 --> 00:16:52,137
ముందు ఒక్క నిమిషం మాట్లాడుదాం,

218
00:16:52,221 --> 00:16:56,099
తర్వాత దాని గురించి
మాట్లాడగలమేమో చూద్దాం, సరేనా?

219
00:16:57,184 --> 00:16:59,895
ఇక మీరంతా గల్లాడెట్‌కు

220
00:16:59,978 --> 00:17:02,814
తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది,

221
00:17:02,898 --> 00:17:04,273
ఈ సాయంత్రాన్ని ప్రశాంతంగా గడపుదాం--

222
00:17:04,358 --> 00:17:05,733
కాకమ్మ కథలు!

223
00:17:09,655 --> 00:17:12,241
ఊరుకోండి.

224
00:17:12,324 --> 00:17:15,327
నాదొక ప్రశ్న. నాదొక ప్రశ్న.

225
00:17:15,410 --> 00:17:17,329
మీరు సంజ్ఞ చేయగలరా? సంజ్ఞ చేయగలరా?

226
00:17:17,412 --> 00:17:18,497
లేదు, నాకు రాదు--

227
00:17:21,375 --> 00:17:23,417
బధిరులకు సంబంధించిన

228
00:17:23,919 --> 00:17:26,672
ఏ విషయంపైనా ఆమెకు అవగాహన లేదు.

229
00:17:26,755 --> 00:17:27,631
ఏమీ తెలియదు.

230
00:17:28,464 --> 00:17:29,508
సరే.

231
00:17:29,591 --> 00:17:31,134
జేన్, నేనొక మాట చెప్పవచ్చా…

232
00:17:32,469 --> 00:17:35,514
తర్వాత నేను, "ఎందుకు?

233
00:17:36,849 --> 00:17:39,142
జిన్సర్‌ను ఎందుకు నియమించారు?" అన్నాను.

234
00:17:40,060 --> 00:17:41,645
అందుకు బదులుగా ఆమె,

235
00:17:42,229 --> 00:17:46,191
"ఒక వినికిడి సమాజంలో పని చేయడానికి

236
00:17:46,275 --> 00:17:47,943
బధిరులు సిద్ధంగా లేరు."

237
00:17:49,236 --> 00:17:50,445
ఏంటి?

238
00:17:52,447 --> 00:17:54,491
నిజంగా ఆమె అలా అన్నారా?

239
00:17:54,575 --> 00:17:55,868
ఆమె అన్నారా?

240
00:17:55,951 --> 00:17:59,371
అనువాద వ్యాఖ్యాత,
"మీరు సరిగ్గానే విన్నారు" అన్నారు.

241
00:18:04,126 --> 00:18:07,004
మేము గట్టిగా
కేకలు పెట్టాలనుకున్నాం.

242
00:18:10,799 --> 00:18:12,885
కానీ మా భాషలో…

243
00:18:14,678 --> 00:18:16,096
ఎలా కేకలు పెట్టాలి?

244
00:18:17,931 --> 00:18:20,767
వారి ప్రపంచం నిశ్సబ్దమైనదై ఉండొచ్చు,

245
00:18:20,851 --> 00:18:22,436
కానీ ఈ రాత్రి వారి కోపం తీవ్రంగా ఉంది.

246
00:18:23,061 --> 00:18:25,439
నాకు కోపంతో ఒళ్ళు మండిపోతుంది.

247
00:18:26,565 --> 00:18:29,818
డాక్టర్ జిన్సర్‌,
గ్రీన్‌స్బోరో ఇంటి నుండి మాట్లాడుతున్నాం.

248
00:18:31,028 --> 00:18:33,864
ఆ గొప్ప యూనివర్సిటీకి అధ్యక్షురాలిగా

249
00:18:33,947 --> 00:18:36,450
సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నాను.

250
00:18:37,576 --> 00:18:39,453
మేము 124 ఏళ్ళు నిరీక్షించాం.

251
00:18:39,536 --> 00:18:41,705
ఎందుకు, ఎందుకు? వినగల్గిన వారే ఎందుకు?

252
00:18:42,289 --> 00:18:45,876
నాకు లోపల మండిపోతుంది.

253
00:18:45,959 --> 00:18:47,211
నా వెనుక చూస్తున్నారుగా,

254
00:18:47,294 --> 00:18:49,588
కొన్ని వందలమంది గల్లాడెట్ విద్యార్థులు

255
00:18:49,671 --> 00:18:52,007
క్యాంపస్ జిమ్‌లో పోగవుతున్నారు.

256
00:18:52,716 --> 00:18:55,260
ఒక వ్యక్తి యొక్క

257
00:18:55,344 --> 00:18:57,513
ఒక లక్షణాన్ని ఆధారంగా తీసుకుని,

258
00:18:57,596 --> 00:18:58,764
బధిరతైనా లేదా వినగల్గినా

259
00:18:58,847 --> 00:19:02,392
ఒక పదవికి అదొక్కటే అర్హతగా పరిగణించలేం.

260
00:19:12,236 --> 00:19:13,737
మేమొక చిన్న బృందంగా ఏర్పడి,

261
00:19:14,446 --> 00:19:18,200
"తర్వాత ఏం చేయాలి?" అని చర్చించాం.

262
00:19:19,368 --> 00:19:20,786
ఏదో ఒకటి చేయాల్సిందే,

263
00:19:21,203 --> 00:19:22,538
కానీ ఏంటి?

264
00:19:23,205 --> 00:19:25,666
రేపు ర్యాలీ చేయాలా, వద్దా?

265
00:19:25,999 --> 00:19:28,502
ఇది చేద్దామా?
లేదు, అలా చేయకూడదు.

266
00:19:29,503 --> 00:19:31,171
మరి ఏం చేశారు?

267
00:19:36,510 --> 00:19:38,554
ఎక్కువమందికి కోపం వచ్చేలా చేద్దాం.

268
00:19:56,905 --> 00:19:58,574
ఏ స్టోర్?

269
00:19:59,741 --> 00:20:02,619
ఫ్లోరిడా స్ట్రీట్‌లో ఉన్నదానికి వెళ్ళు.

270
00:20:03,787 --> 00:20:06,999
ఇది కేవలం
బధిర అధ్యక్షుడి ఎన్నిక కోసమే కాదు.

271
00:20:08,041 --> 00:20:09,585
అంతకు మించినది.

272
00:20:11,044 --> 00:20:13,797
వినగల్గినవారు ఎప్పుడూ
మనల్ని అణగదొక్కుతారు.

273
00:20:16,550 --> 00:20:18,343
బోర్డ్ ట్రస్టీలకు బధిరులంటే

274
00:20:18,427 --> 00:20:20,846
చిన్నచూపు అని
విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

275
00:20:21,597 --> 00:20:23,223
తక్షణమే వెళ్ళండి!

276
00:20:24,141 --> 00:20:27,728
మార్పు కోసం అగ్గి రాజేసే సమయమిదే.

277
00:20:30,147 --> 00:20:31,648
ముందుగా మీకొక ప్రశ్న, లిండా:

278
00:20:31,732 --> 00:20:33,650
విద్యార్థుల కోసం నిర్ణయాన్ని

279
00:20:33,734 --> 00:20:35,360
మార్చే అవకాశం ఏమైనా ఉందా?

280
00:20:35,444 --> 00:20:36,987
బోర్డ్ అధ్యక్షురాలు స్పిల్మాన్ ప్రకారం

281
00:20:37,779 --> 00:20:40,908
ఇదే తుది నిర్ణయం.
వారి మనసును మార్చుకోరు.

282
00:20:42,618 --> 00:20:45,037
నిప్పు రాజుకుంది.

283
00:20:46,038 --> 00:20:48,373
ఇప్పుడు కాకుంటే ఎప్పుడు.
మాకిప్పుడే కావాలి.

284
00:20:48,457 --> 00:20:50,626
ఇప్పుడే మాకొక బధిర అధ్యక్షుడు కావాలి.

285
00:21:14,858 --> 00:21:16,735
మా తాతగారు టిటివైలో

286
00:21:16,818 --> 00:21:18,820
నాకు కాల్ చేశారు.

287
00:21:18,904 --> 00:21:21,448
ఫోన్ కాల్స్ చేయడానికి
మేము ఉపయోగించే ఒక యంత్రం.

288
00:21:22,074 --> 00:21:24,910
హాయ్ తాతగారు

289
00:21:24,993 --> 00:21:27,120
జిఎ అంటే, "గో అహెడ్ అని,

290
00:21:27,996 --> 00:21:30,290
ఇక టైప్ చేయడం మీవంతు."

291
00:21:31,124 --> 00:21:33,752
కానీ ఆయన త్వరగా టైప్ చేయరు.

292
00:21:36,547 --> 00:21:39,341
మేము వార్తలను చూశాం

293
00:21:39,424 --> 00:21:41,343
మా తాతగారు అన్నారు…

294
00:21:45,639 --> 00:21:49,601
దయచేసి మీ పెద్దలను గౌరవించండి

295
00:21:50,853 --> 00:21:52,563
ఓహ్ దేవుడా.

296
00:21:53,063 --> 00:21:56,942
ఆయన చెప్పలేదు, కానీ
ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు.

297
00:21:57,860 --> 00:21:59,236
దాన్ని అంగీకరించండి.

298
00:21:59,736 --> 00:22:01,321
తల దించుకుని ఉండండి.

299
00:22:03,115 --> 00:22:06,201
నాకు ఆరేళ్ళ వయస్సులో
మా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.

300
00:22:08,537 --> 00:22:11,498
నాకు నాన్న అంటే,
నిజంగా మా తాతగారే.

301
00:22:14,835 --> 00:22:18,422
ఆయన 1930లలో
కొలంబియా యూనివర్సిటీకి వెళ్లారు.

302
00:22:18,922 --> 00:22:20,757
అక్కడ అనువాద వ్యాఖ్యాత లేరు.

303
00:22:21,091 --> 00:22:22,676
ఆయన లిప్-రీడ్ చేయాల్సివచ్చింది,

304
00:22:22,759 --> 00:22:25,804
కానీ మూడు వేర్వేరు
డిగ్రీలతో పట్టభద్రులయ్యారు.

305
00:22:26,680 --> 00:22:29,808
కాబట్టి నాపైన ఆయన
చాలా ఆశలు పెట్టుకున్నారు.

306
00:22:31,643 --> 00:22:35,272
మేం అందరిముందు సంజ్ఞలు చేస్తే తనకు నచ్చదు.

307
00:22:37,191 --> 00:22:38,317
ఆయన నాతో ఎప్పుడూ చెప్తుంటారు,

308
00:22:38,901 --> 00:22:43,822
"ఒక 18 ఇంచుల బాక్సు లోపలే
సంజ్ఞ చేయాలి, దానికి మించకూడదు."

309
00:22:44,406 --> 00:22:47,326
కాబట్టి నేను, "సరే,
క్రమక్రమంగా, నెమ్మదిగా

310
00:22:47,409 --> 00:22:50,162
పెద్దపెద్దగా సంజ్ఞ చేద్దాం" అనుకున్నాను.

311
00:22:51,163 --> 00:22:53,123
అది ఆఖరి కోరికతో సమానం.

312
00:22:54,750 --> 00:23:00,547
"వినగల్గిన వారి సమాజంలో నువ్వు
ఇమడడం చాలా ముఖ్యం" అని అనేవారు.

313
00:23:00,631 --> 00:23:02,382
నేను అనుకునేవాడిని, "ఎందుకు?

314
00:23:02,466 --> 00:23:04,801
వినిగల్గినవారి సమాజంలో
నేను ఇమడనవసరం లేదు.

315
00:23:04,885 --> 00:23:06,595
నాకు నా ప్రపంచం ఉంది."

316
00:23:21,652 --> 00:23:24,780
సోమవారం

317
00:23:27,199 --> 00:23:30,118
ఉద్రేకం మరియు అల్లర్లతో కూడిన

318
00:23:30,202 --> 00:23:31,620
ప్రదర్శనలు జరిగే కాలంలో…

319
00:23:31,703 --> 00:23:33,497
బధిర ప్రెసిడెంట్‌కై హారన్ మ్రోగించండి

320
00:23:33,580 --> 00:23:35,749
…వారి నిరసన, వారి ప్రపంచంలాగే,

321
00:23:36,208 --> 00:23:38,043
దాదాపు నిశ్శబ్దంగా ఉంది.

322
00:23:38,126 --> 00:23:38,961
సమయం ఆసన్నమైంది

323
00:23:42,422 --> 00:23:46,760
తమ స్కూల్ యాజమాన్యం
తమ మాట వినిపించుకోవట్లేదని

324
00:23:46,844 --> 00:23:50,597
గల్లాడెట్ బధిర యూనివర్సిటీ
విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

325
00:23:51,849 --> 00:23:53,183
అందుకని విద్యార్థులు

326
00:23:53,976 --> 00:23:56,019
స్కూల్‌ను మూసివేశారు.

327
00:23:59,648 --> 00:24:01,483
మేం అన్ని గేట్లకు తాళం వేశాం.

328
00:24:03,902 --> 00:24:06,113
క్యాంపస్‌కు వెళ్ళే
ప్రతి ప్రవేశద్వారాన్ని

329
00:24:08,073 --> 00:24:10,534
విద్యార్థులు బస్సులతో అడ్డగించారు.

330
00:24:13,412 --> 00:24:15,247
మీరు ఎవరు? సెక్యూరిటీనా?

331
00:24:15,330 --> 00:24:17,833
మీరిక్కడ పని చేసే సిబ్బందా?

332
00:24:17,916 --> 00:24:22,337
దాదాపు మిలటరీలా పూర్తిస్థాయిలో మోహరించి

333
00:24:22,421 --> 00:24:23,547
స్థావరాలను ఏర్పాటు చేశాం.

334
00:24:24,464 --> 00:24:28,552
ప్రవేశద్వారం మూసివేతను
విద్యార్థులు కొనసాగిస్తారా?

335
00:24:29,052 --> 00:24:31,555
ఖచ్చితంగా.

336
00:24:31,638 --> 00:24:35,517
బధిర అధ్యక్షుడిని పొందడానికి
మా ప్రాణాలైనా వదిలేస్తాం.

337
00:24:37,269 --> 00:24:39,897
అక్కడ మేం చేసిందే చట్టం.

338
00:24:44,526 --> 00:24:46,653
సంజ్ఞా భాష తెలియని వ్యక్తిని

339
00:24:46,737 --> 00:24:49,740
అధ్యక్షురాలిగా సమర్ధించిన యూనివర్సిటీ
ట్రస్టీల ఛైర్మన్ జేన్ బాసెట్ స్పిల్మాన్‌,

340
00:24:49,823 --> 00:24:52,117
సంకేతాలను, స్పిల్మాన్ కంటే
నేను బాగా అర్థం చేసుకోగలను!

341
00:24:52,201 --> 00:24:55,746
"వినగల్గిన వారున్న సమాజంలో పని చేయడానికి

342
00:24:55,829 --> 00:24:58,332
బధిరులు సిద్ధంగా లేరు" అన్న మాటతో

343
00:24:58,415 --> 00:25:00,167
విద్యార్థులు రగిలిపోయారు.

344
00:25:00,250 --> 00:25:02,920
ఆ తప్పుడు ప్రకటన--

345
00:25:03,003 --> 00:25:05,797
"వినగల్గిన వారున్న సమాజంలో
పని చేయడానికి బధిరులు సిద్ధంగా లేరు,"

346
00:25:05,881 --> 00:25:07,799
అన్న ఆరోపణ పూర్తిగా అసత్యం.

347
00:25:07,883 --> 00:25:09,843
- మీరు ఆమాట అనలేదా?
- నేనా మాట అనలేదు.

348
00:25:09,927 --> 00:25:12,054
నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు.

349
00:25:12,137 --> 00:25:13,597
మరి మీరు ఏం అన్నారు?

350
00:25:13,680 --> 00:25:16,225
నేనొక అనువాద వ్యాఖ్యాత
ద్వారా చెప్తున్నాను…

351
00:25:16,308 --> 00:25:21,188
మరియు అవి…
చాలా ప్రత్యేకమైన పరిస్థితులు,

352
00:25:21,271 --> 00:25:23,524
పైన హెలికాప్టర్‌లు తిరుగుతూ,

353
00:25:23,607 --> 00:25:26,568
కిటికీ బయట నుండి వెయ్యిమంది విద్యార్థులు

354
00:25:26,652 --> 00:25:27,986
కేకలు పెడుతూ అరుస్తున్నారు.

355
00:25:28,070 --> 00:25:29,988
అదొక గందరగోళ పరిస్థితి.

356
00:25:30,072 --> 00:25:31,740
కాబట్టి నేను ఏం చెప్పానో,

357
00:25:31,823 --> 00:25:35,452
నేనేం చెప్పానో మీకు చెప్పలేను,
ఎందుకంటే నాకవన్నీ గుర్తులేవు.

358
00:25:35,536 --> 00:25:38,747
- మీకు వర్జీనియా, బాస్సెట్‌లో ఇల్లు ఉంది.
- మూడు.

359
00:25:38,830 --> 00:25:40,749
వీటన్నిటి నుండి దాక్కోవడానికి

360
00:25:40,832 --> 00:25:41,917
మీకు మూడు ఇళ్ళు ఉన్నాయన్నమాట.

361
00:25:42,000 --> 00:25:42,835
అవును.

362
00:25:42,918 --> 00:25:45,629
"ఇక్కడి నుండి
వెళిపోదాం" అని మీకెప్పుడైనా అనిపించిందా?

363
00:25:45,712 --> 00:25:46,713
అస్సలు అనిపించలేదు.

364
00:25:47,589 --> 00:25:50,092
నేను ఏం నమ్ముతానంటే…

365
00:25:51,885 --> 00:25:55,305
నీకు సరైనదనిపించిన మార్గం ఎంచుకుని…

366
00:25:56,598 --> 00:25:59,768
తర్వాత ఎత్తు, పల్లాలు వచ్చినా
దానికే కట్టుబడి ఉండాలి.

367
00:25:59,852 --> 00:26:03,605
బధిర అధ్యక్షుడు వచ్చే వరకు…
మేము విరమించము.

368
00:26:03,689 --> 00:26:06,859
బధిర అధ్యక్షుడు తక్షణమే కావాలి!

369
00:26:06,942 --> 00:26:09,778
బధిర అధ్యక్షుడు తక్షణమే మాకు కావాలి!

370
00:26:10,487 --> 00:26:14,241
మిమ్మల్ని కలవడం బోర్డ్‌కు సంతోషంగా ఉంది,

371
00:26:14,324 --> 00:26:18,203
ఒకే ఒక్క షరతు, అంతే,

372
00:26:19,162 --> 00:26:21,874
అది మీరు క్యాంపస్‌ను తెరవడం.

373
00:26:21,957 --> 00:26:23,834
కుదరదు!

374
00:26:24,334 --> 00:26:27,254
ముందు బధిర అధ్యక్షుడు,
తర్వాత క్యాంపస్ తెరుస్తాం.

375
00:26:28,046 --> 00:26:29,965
అంటే,
మీరు క్యాంపస్ తెరిస్తే తప్ప

376
00:26:30,048 --> 00:26:31,842
కలవమని బోర్డ్ చెప్పింది.

377
00:26:33,594 --> 00:26:35,679
అవును, అదే చెప్పారు.

378
00:26:36,513 --> 00:26:38,390
నేను పూర్తి చేయవచ్చా?

379
00:26:38,473 --> 00:26:39,308
లేదు.

380
00:26:39,391 --> 00:26:41,894
అలాగైతే ఇక చర్చ లేనట్లే, బై.

381
00:26:42,728 --> 00:26:45,480
మీరు చర్చించకూడదనుకుంటే…

382
00:26:45,564 --> 00:26:47,232
మరి మీరేం అన్నారు?

383
00:26:49,484 --> 00:26:52,863
సమావేశం జరిగేటప్పుడు
మీరు క్యాంపస్ తెరవాలని మాత్రమే

384
00:26:52,946 --> 00:26:54,364
వాళ్ళు అడుగుతున్నారు.

385
00:26:55,824 --> 00:26:58,952
గల్లాడెట్‌ను
తిరిగి తెరవనిస్తే, సమావేశమవుతామన్న

386
00:26:59,036 --> 00:27:02,247
ట్రస్టీల ప్రతిపాదనను
విద్యార్థులు తిరస్కరించారు.

387
00:27:02,331 --> 00:27:04,166
చాలా భవనాలు ఖాళీగా ఉన్నాయి.

388
00:27:04,249 --> 00:27:07,127
ఒక తరగతి గదిలోని బోర్డ్‌లు
ఆ కథను వివరించాయి.

389
00:27:07,211 --> 00:27:09,046
"ఈరోజు క్లాసులు లేవు,"

390
00:27:09,129 --> 00:27:11,798
ఎవరైనా హాజరైతే వారు ద్రోహి అని రాసుంది.

391
00:27:14,134 --> 00:27:15,427
కానీ సోమవారం,

392
00:27:16,345 --> 00:27:19,014
చాలామంది విద్యార్థులు ప్రతిఘటించారు.

393
00:27:20,182 --> 00:27:22,184
సమస్యల్లో పడకూడదు అనుకున్నారు.

394
00:27:24,478 --> 00:27:27,814
వారి గ్రేడ్‌లపై ప్రభావం
పడుతుందని భయపడ్డారు.

395
00:27:28,398 --> 00:27:32,694
కొంతమంది విద్యార్థులు, ఒక బధిరుడు
చేయగలడన్న విషయాన్ని నమ్మలేదు.

396
00:27:32,778 --> 00:27:36,990
నేను "మనం వారిని
ఒప్పించాలి" అని చెప్తుండే వాడిని.

397
00:27:37,074 --> 00:27:42,371
అందుకు వారు, "లేదు,
ఒక బధిర అధ్యక్షుడిని ఎంచుకోలేం.

398
00:27:42,454 --> 00:27:44,122
అలా చేయలేము" అన్నారు.

399
00:27:45,791 --> 00:27:49,127
నా మనసులోని ఆలోచన కూడా అదే.

400
00:27:50,337 --> 00:27:51,672
నా భయానికి అవధులు లేవు.

401
00:27:52,631 --> 00:27:55,425
భయాన్ని చూపించలేదు,
కానీ కడుపులో అనిపించింది.

402
00:27:56,301 --> 00:27:57,970
మీరు భయపడ్డారా?

403
00:28:00,305 --> 00:28:01,139
లేదు.

404
00:28:04,893 --> 00:28:07,729
తాళాల ఇంఛార్జ్ ఎవరు?

405
00:28:09,857 --> 00:28:12,484
ఒక విద్యార్థి ప్రతినిథి ఉంటే,

406
00:28:12,568 --> 00:28:14,194
అతని మాటలపై దృష్టి సారిస్తారు.

407
00:28:14,278 --> 00:28:16,488
ఎవరు--
ఎవరా ప్రతినిథి?

408
00:28:18,657 --> 00:28:21,326
మేము ఒక నాయకుడిని ఎంచుకోవాలని

409
00:28:21,410 --> 00:28:22,995
అప్పుడు నిర్ణయించుకున్నాం.

410
00:28:23,579 --> 00:28:29,293
బధిర అధ్యక్షుడిని
ఎంపిక చేసుకునే సమయం మనకిప్పుడు వచ్చింది.

411
00:28:29,376 --> 00:28:30,836
టిమ్‌ గురించి చెప్పండి.

412
00:28:31,795 --> 00:28:34,131
చాలా ఉత్సాహవంతుడు, చురుకైనవాడు.

413
00:28:34,965 --> 00:28:38,343
మేము స్పిల్మాన్‌ను బోర్డ్ ఛైర్మన్‌గా
తొలగించాలనుకుంటున్నాం.

414
00:28:38,427 --> 00:28:40,345
అక్కడ అందరూ పురుషులే.

415
00:28:40,762 --> 00:28:43,682
నేను బలవంతంగా
ముందుకెళ్తున్నాను, తప్పలేదు.

416
00:28:45,684 --> 00:28:48,187
స్పిల్మాన్ వద్ద డబ్బులు ఉండవచ్చు…

417
00:28:48,770 --> 00:28:50,230
బ్రిడ్జెట్టాను ఎలా వర్ణిస్తారు?

418
00:28:50,314 --> 00:28:52,900
…కానీ బధిరులపై సానుభూతి లేదు.

419
00:28:54,193 --> 00:28:55,027
దృఢమైనది.

420
00:28:58,155 --> 00:29:00,073
ఒక స్త్రీ వాది.

421
00:29:00,782 --> 00:29:04,703
బ్రిడ్జెట్టా ఎల్లప్పుడూ "మహిళల
సమస్యలు" గురించి నొక్కి చెప్పేది.

422
00:29:06,205 --> 00:29:08,457
క్లాస్‌లో జెర్రీ మరియు మిగిలినవారు

423
00:29:08,540 --> 00:29:11,168
"ఓహ్, బ్రిడ్జెట్టా ఎప్పుడూ
మహిళా హక్కులనే తీసుకొస్తుంది."

424
00:29:11,585 --> 00:29:15,088
నేను మహిళలకు మద్దతిస్తాను,
నేను స్త్రీ వాదిని.

425
00:29:15,672 --> 00:29:20,636
ఎవరో అన్నారు, "ఒక లైఫ్‌బోట్‌లో
బధిర పురుషులు ఉంటే,

426
00:29:20,719 --> 00:29:23,388
మరొక లైఫ్‌బోట్‌లో వినగల్గిన మహిళలు ఉంటే,

427
00:29:23,472 --> 00:29:25,974
మీరు ఏ లైఫ్‌బోట్‌లోకి దూకుతారు?" అని.

428
00:29:26,058 --> 00:29:28,852
నేను మహిళా అధ్యక్షురాలికి మద్దతునిస్తాను,

429
00:29:28,936 --> 00:29:30,562
కానీ మొదటి ప్రాధాన్యత బధిరత.

430
00:29:30,979 --> 00:29:32,981
జెర్రీ గురించి చెప్పండి.

431
00:29:37,486 --> 00:29:40,030
సమయం ఆసన్నమైంది.
ఈ అణచివేత ఇక చాలు!

432
00:29:40,906 --> 00:29:44,117
అతనికి భావోద్వేగం ఎక్కువ.
త్వరగా కోపం వస్తుంది.

433
00:29:44,826 --> 00:29:47,120
తలుపు తెరవడానికి తాళం వెదకకుండా

434
00:29:47,204 --> 00:29:49,665
గోడను పిడికిలితో గుద్దుతాడు.

435
00:29:49,748 --> 00:29:51,708
గ్రెగ్, మరో వైపు…

436
00:29:53,585 --> 00:29:55,629
అందుకు పూర్తిగా భిన్నం.

437
00:29:55,712 --> 00:29:57,631
అతనికి హేతుబద్దత ఎక్కువ.

438
00:29:59,091 --> 00:30:00,884
గ్రెగ్ ఎటువంటి వ్యక్తి?

439
00:30:01,802 --> 00:30:03,804
మీరు నిజంగా మాట్లాడమంటున్నారా?

440
00:30:04,555 --> 00:30:06,056
అవును.

441
00:30:08,392 --> 00:30:10,727
గ్రెగ్ చాలా మౌనంగా ఉంటాడు.

442
00:30:11,353 --> 00:30:13,063
చిన్నచిన్న సంజ్ఞలు చేస్తాడు.

443
00:30:14,064 --> 00:30:16,692
ఎక్కువ భావోద్వేగాలను ప్రదర్శించడు.

444
00:30:18,443 --> 00:30:21,446
నాలాగ బహిరంగంగా మాట్లాడడు.

445
00:30:22,197 --> 00:30:25,576
నా శక్తి నా వ్రేళ్ళ ద్వారా
ఇతరులకు వెళుతుంది.

446
00:30:28,203 --> 00:30:30,956
నేను ప్రేక్షకులను ఉత్తేజపరచగలను.

447
00:30:35,210 --> 00:30:37,004
ఆపై గ్రెగ్ హ్లిబోక్ నాయకుడని

448
00:30:37,629 --> 00:30:40,215
మేమంతా అంగీకరించాం.

449
00:30:41,008 --> 00:30:44,178
మేమంతా అంగీకరించాం,
ఏ అభ్యంతరం లేదు.

450
00:30:46,722 --> 00:30:51,143
అతను సరైన వాడు కాదని నాకనిపించింది.

451
00:30:52,394 --> 00:30:55,022
గల్లాడెట్ యూనివర్సిటీలో

452
00:30:55,105 --> 00:30:56,857
గ్రెగ్, ఒక సాధారణ ఇంజనీరింగ్ స్టూడెంట్.

453
00:30:56,940 --> 00:30:59,860
వారి లక్ష్యానికి గుర్తుగా
ఒక చేతి కంకణం అందుకున్నాడు.

454
00:30:59,943 --> 00:31:01,945
ఉద్యమానికి అతనే నాయకుడు.

455
00:31:03,864 --> 00:31:06,200
…అది సాధించేవరకూ…

456
00:31:07,159 --> 00:31:08,493
దీనితోనే బ్రతుకుదాం.

457
00:31:10,120 --> 00:31:14,416
ఏది ఏ బొక్క అని కూడా తేడా తెలియని వాడికి

458
00:31:14,499 --> 00:31:17,419
దానిని ఇచ్చారని నాకనిపించింది.

459
00:31:25,552 --> 00:31:29,598
కానీ ఒక ప్రణాళిక లేకుంటే
మేం ఓడిపోతామని మాకు తెలుసు.

460
00:31:30,307 --> 00:31:31,975
నిర్ణయాలు తీసుకోబోయేది నేను కాదు,

461
00:31:32,059 --> 00:31:34,436
నేను కేవలం సమావేశాన్ని
అదుపులో ఉంచుతాను, అంతే.

462
00:31:34,520 --> 00:31:36,939
ఎవరు మాట్లాడాలో నేనే నిర్ణయిస్తాను.

463
00:31:37,397 --> 00:31:41,818
ఏళ్ళ తరబడి ఒక బధిర
అధ్యకుడిని పొందడానికి యత్నిస్తున్న

464
00:31:42,444 --> 00:31:45,864
ఫాకల్టీ, సిబ్బంది,
పూర్వ విద్యార్థులను కలిశాం.

465
00:31:47,032 --> 00:31:49,952
విద్యార్థులకు సలహా
ఇవ్వడానికి వారక్కడికి వచ్చారు.

466
00:31:50,410 --> 00:31:52,287
మరి తర్వాత ఏంటి?

467
00:31:52,371 --> 00:31:54,373
మీ విద్యార్థులు ఏం చేయాలనుకుంటున్నారు?

468
00:31:54,748 --> 00:31:57,417
ఆపై మేము నాలుగు డిమాండ్లతో ముందుకొచ్చాం.

469
00:31:57,501 --> 00:31:59,962
మొదటిది… ఒక బధిర అధ్యకుడు.

470
00:32:00,045 --> 00:32:02,840
ఒక బధిర అధ్యకుడిని నియమించే
వరకు మనం ఏమీ చేయము.

471
00:32:03,966 --> 00:32:07,177
రెండు… బోర్డ్ నుండి
స్పిల్మాన్ రాజీనామా చేయాలి.

472
00:32:08,011 --> 00:32:11,265
మూడు… బోర్డ్‌లో
యాభై ఒక్కశాతం బధిరులే ఉండాలి.

473
00:32:12,516 --> 00:32:16,019
నాల్గవ డిమాండ్‌ను చేర్చాలని
వారు గట్టిగా సూచించారు.

474
00:32:16,103 --> 00:32:18,021
ప్రతీకారాలు ఉండకూడదు.

475
00:32:19,690 --> 00:32:22,484
దాంతో విద్యార్థులకు పాల్గొనడం
సురక్షితంగా అనిపించింది.

476
00:32:22,943 --> 00:32:26,196
డిమాండ్‌లు నెరవేరేవరకూ

477
00:32:26,280 --> 00:32:28,282
మనం దీన్ని ముందుకు కొనసాగిస్తాం.

478
00:32:28,365 --> 00:32:30,784
విద్యార్థులకు కావల్సింది అదే కదా?

479
00:32:31,743 --> 00:32:34,788
కానీ అన్నిటికంటే
ముఖ్యమైనది, మేము విడిపోకూడదు.

480
00:32:34,872 --> 00:32:38,667
మేము కలిసి ఉండాలి,
ఒక్కటిగా ఉండాలి, దృఢంగా ఉండాలి.

481
00:32:38,750 --> 00:32:42,004
ఈ-ఈ గేట్ తెరవండి.
ఏ సమస్యా ఉండదు.

482
00:32:42,087 --> 00:32:44,089
ఈ గేట్ తెరవండి అంతే.
మాకు ఈ గేట్ తెరవాలి.

483
00:32:44,715 --> 00:32:46,717
మేం ఎందుకు చేయాలి?

484
00:32:48,927 --> 00:32:53,348
కానీ క్యాంపస్‌లోకి వెళ్ళడానికి
వారు మరో మార్గం వెతికారు.

485
00:32:58,395 --> 00:33:00,731
వారు రహస్యంగా కంచెను కత్తిరించి…

486
00:33:02,858 --> 00:33:04,443
దాని గుండా వచ్చారు.

487
00:33:05,110 --> 00:33:08,197
"ఓహ్, మేము లోనికి వచ్చేశాం"
అనుకున్నట్లున్నారు.

488
00:33:08,864 --> 00:33:09,907
తర్వాత గ్రహించారు,

489
00:33:11,033 --> 00:33:13,577
మేము ఆ ఆఫీసులకు కూడా తాళం వేశామని.

490
00:33:16,580 --> 00:33:18,332
కెమెరా ఆపుతారా?

491
00:33:18,415 --> 00:33:19,833
వద్దు. రోల్ చేయండి.

492
00:33:19,917 --> 00:33:22,252
మనం ఒక్క సెకను చర్చించుకుందామా?

493
00:33:23,253 --> 00:33:24,963
స్పిల్మాన్ మరియు బోర్డ్

494
00:33:25,714 --> 00:33:27,341
మాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని

495
00:33:28,425 --> 00:33:30,511
తర్వాత మాకు తెలియజేశారు.

496
00:33:47,486 --> 00:33:49,196
మాకు టెక్స్టింగ్ లేదు.

497
00:33:53,033 --> 00:33:55,410
మరి విద్యార్థులందరినీ కూడగట్టడం ఎలా…

498
00:33:57,246 --> 00:33:58,872
ఫైర్ అలారములన్నీ లాగుతాం.

499
00:34:00,958 --> 00:34:02,417
అందరికీ బయటకు వెళ్ళాలని

500
00:34:03,377 --> 00:34:04,837
తెలుస్తుంది.

501
00:34:14,137 --> 00:34:16,431
కిటికీలో నుండి చూశాను,

502
00:34:16,514 --> 00:34:20,060
నాకు జనసందోహం మాత్రమే కనిపించింది.

503
00:34:23,938 --> 00:34:27,900
పచ్చికబయలు అంతా వందలమంది

504
00:34:27,985 --> 00:34:29,987
స్పిల్మాన్ కోసం వేచి చూస్తున్నారు.

505
00:34:37,995 --> 00:34:42,206
ఆ క్షణంలో
గల్లాడెట్ చూసి మీకు ఏమనిపించింది?

506
00:34:53,927 --> 00:34:56,179
ఆసక్తికరమైన ప్రశ్న.

507
00:34:58,974 --> 00:35:00,809
నాకు ఏడుపు వచ్చింది.

508
00:35:12,946 --> 00:35:15,240
ఇక్కడ చూడండి.

509
00:35:17,326 --> 00:35:18,785
నేనిక్కడ పరాయివాణ్ణి.

510
00:35:20,621 --> 00:35:22,789
మీరంతా వినగల్గిన వారు.

511
00:35:30,589 --> 00:35:32,799
కానీ నేను గల్లాడెట్‌ వచ్చినప్పుడు…

512
00:35:37,804 --> 00:35:41,892
అది నా ఇల్లు, నా ప్రపంచం.

513
00:35:51,401 --> 00:35:53,862
తొలి ఏడాది విద్యార్థిగా
గల్లాడెట్ వెళ్ళినప్పుడు,

514
00:35:54,738 --> 00:35:56,073
అదొక గుడిలా అనిపించింది.

515
00:35:58,075 --> 00:36:02,162
జీవితంలో వివిధ మార్గాల ద్వారా
విద్యార్థులు గల్లాడెట్ వచ్చి,

516
00:36:02,246 --> 00:36:04,665
ఒకరిని ఒకరు కనుగొంటారు.

517
00:36:09,169 --> 00:36:13,715
ప్రపంచ నలుమూలల నుండి
విదేశీ విద్యార్థులు ఇక్కడకు వస్తుంటారు.

518
00:36:14,591 --> 00:36:18,011
ఎందుకంటే ప్రపంచంలో
ఇటువంటి చోటు ఒక్కటే ఉంది.

519
00:36:20,222 --> 00:36:22,975
బధిరులు, బధిరులుగా ఉండగల్గిన చోటు.

520
00:36:27,312 --> 00:36:31,441
అక్కడికి వెళ్ళాక ఉద్వేగానికి లోనయ్యాను.

521
00:36:34,444 --> 00:36:36,572
మరో దేశానికి వెళ్ళినట్లు ఉంటుంది,

522
00:36:38,907 --> 00:36:41,493
ప్రతిఒక్కరూ ఒక్కో భాష మాట్లాడుతున్నారు.

523
00:36:44,997 --> 00:36:47,916
మీ కుటుంబంతో ఉన్నట్లు హాయిగా,

524
00:36:48,834 --> 00:36:50,502
సురక్షితంగా ఉండడాన్ని

525
00:36:51,295 --> 00:36:53,630
మీరు ఎలా వర్ణిస్తారు?

526
00:37:04,016 --> 00:37:06,435
బధిర సమాజం యొక్క స్వర్గం,

527
00:37:08,061 --> 00:37:09,313
గల్లాడెట్.

528
00:37:10,397 --> 00:37:14,401
స్పిల్మాన్ వెళ్లి తీరాలి!

529
00:37:14,484 --> 00:37:16,695
కాబట్టి మా ప్రపంచం అర్థం కాని వ్యక్తిని

530
00:37:17,821 --> 00:37:20,157
నాయకురాలిగా మేము అంగీకరించలేము.

531
00:37:30,000 --> 00:37:33,128
స్పిల్మాన్, గదిలోకి
వస్తుందని ఎదురు చూస్తున్నాం…

532
00:37:36,131 --> 00:37:38,467
తను ఏం చెప్పబోతుందో చూడాలని.

533
00:37:39,718 --> 00:37:41,595
ఆమె మొదటి లైన్ చెప్పినప్పుడు వినండి.

534
00:37:47,184 --> 00:37:49,895
ఒకవేళ తన నిర్ణయం మార్చుకోకపోతే

535
00:37:50,437 --> 00:37:52,272
తర్వాత బయటకు వెళ్లిపోదాం.

536
00:38:21,176 --> 00:38:23,470
అందరికీ గుడ్ ఆఫ్టర్‌నూన్.

537
00:38:25,514 --> 00:38:28,767
నిన్న గల్లాడెట్ ట్రస్టీల బోర్డ్

538
00:38:28,851 --> 00:38:30,894
ఒక కొత్త ప్రెసిడెంట్‌ను ఎంపిక చేసింది.

539
00:38:31,937 --> 00:38:35,983
మెజారిటీ బోర్డు ట్రస్టీల అభిప్రాయంలో,

540
00:38:36,692 --> 00:38:41,613
డాక్టర్ ఎలిసబెత్ జిన్సర్
ఈ అర్హతలకు సరిపోతారు.

541
00:38:41,697 --> 00:38:42,906
ఒక మినహాయింపు ఉంది,

542
00:38:42,990 --> 00:38:45,868
ఇది ముఖ్యమైన మినహాయింపు అని అంగీకరిస్తాను,

543
00:38:45,951 --> 00:38:47,411
కానీ బధిరతపై అవగాహన

544
00:38:47,494 --> 00:38:52,833
మరియు విస్తృత జ్ఞానం మినహా,

545
00:38:52,916 --> 00:38:55,627
ఆమెకు అర్హత ఉంది.

546
00:38:55,711 --> 00:38:57,254
అయితే…

547
00:38:59,089 --> 00:39:04,011
ఈ మహిళ ఈ సంస్థలో
భాగమవ్వాలన్న నిబద్దతతో ఉంది.

548
00:39:04,094 --> 00:39:07,514
ఆమె ఒక మంచి,
విజయవంతమైన అధ్యక్షురాలిగా

549
00:39:07,598 --> 00:39:11,393
మీకు సేవ చేయాలనే అంకిత భావం ఉంది.

550
00:39:12,853 --> 00:39:15,439
స్పిల్మాన్ పనిని
సంజ్ఞలలో ఎలా చెప్తారు?

551
00:39:15,522 --> 00:39:18,525
ఇది బలహీనత్వం.

552
00:39:19,651 --> 00:39:22,404
ఇది బలం.

553
00:39:23,572 --> 00:39:28,702
మీతో పని చేయడానికి
మరియు బధిరులందరికీ

554
00:39:28,785 --> 00:39:33,916
శక్తివంతమైన వక్తగా
నిలవడానికి బద్దురాలై ఉంది.

555
00:39:35,584 --> 00:39:37,586
నేనిప్పుడే బోర్డ్‌తో సమావేశమయ్యాను.

556
00:39:38,378 --> 00:39:42,049
వారు మన డిమాండ్‌లను
నెరవేర్చేందుకు అంగీకరించలేదు.

557
00:39:48,972 --> 00:39:53,018
వినగల్గిన వారు
ఉన్నతులమని భావిస్తుంటారు.

558
00:40:00,817 --> 00:40:03,737
దీనికి మా భాషలో ఒక పదం ఉంది.

559
00:40:03,820 --> 00:40:05,322
వదరుబోతు.

560
00:40:10,285 --> 00:40:14,331
ఒక్కోసారి వదరుబోతుల్లా
ప్రవర్తిస్తున్నారని వారికి కూడా తెలియదు,

561
00:40:15,707 --> 00:40:18,085
కానీ కొన్నిసార్లు తెలుస్తుంది.

562
00:40:29,471 --> 00:40:32,140
తర్వాత ఎవరో అలారములను లాగారు.

563
00:40:56,832 --> 00:41:02,671
ఇంతటి శబ్దంలో మాట్లాడడం చాలా కష్టం.

564
00:41:14,308 --> 00:41:16,018
నూట ఇరవై నాలుగేళ్ళు.

565
00:41:16,476 --> 00:41:17,561
చాలు!

566
00:41:27,154 --> 00:41:29,031
సమయం ఆసన్నమైంది.

567
00:41:29,406 --> 00:41:31,158
కాకమ్మ కథలు వద్దు.

568
00:41:42,294 --> 00:41:44,296
బధిర అధ్యక్షుడు తక్షణమే

569
00:41:46,340 --> 00:41:48,717
సార్వత్రిక సమానత్వం కోసం ఐఖ్యమవ్వండి

570
00:41:50,135 --> 00:41:53,388
నాకేం బిగ్గరగా అనిపించలేదు.

571
00:41:55,557 --> 00:41:59,811
తనకు సంజ్ఞ చేయడం తెలుసుంటే,
ఆమెకు ఏ సమస్య ఉండేది కాదు.

572
00:42:02,356 --> 00:42:04,733
నిశ్శబ్ద రాత్రి

573
00:42:04,816 --> 00:42:07,528
పవిత్ర రాత్రి

574
00:42:08,278 --> 00:42:11,198
అంతా ప్రశాంతంగా ఉంది

575
00:42:11,281 --> 00:42:15,077
అంతా ప్రకాశవంతంగా ఉంది…

576
00:42:15,160 --> 00:42:18,372
నేను బధిరుల మధ్య పెరిగాను.

577
00:42:18,455 --> 00:42:20,749
ఏ అడ్డంకి లేని వాతావరణం.

578
00:42:20,832 --> 00:42:25,754
పవిత్ర శిశువు చాలా కోమలంగా
మరియు సౌమ్యంగా ఉంది…

579
00:42:26,171 --> 00:42:29,132
ఆ రోజుల్లో టీవీలలో
క్యాప్షన్‌లు వచ్చేవి కావు.

580
00:42:29,216 --> 00:42:31,343
కాబట్టి డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చుని,

581
00:42:31,426 --> 00:42:35,848
గంటల తరబడి ఒకరితో
ఒకరు సంజ్ఞలు చేసుకోవడం

582
00:42:35,931 --> 00:42:36,932
నా జీవితంలోని మధురక్షణాలలో ఒకటి.

583
00:42:38,100 --> 00:42:39,852
మేము టేబుల్‌ను గట్టిగా కొడతాం.

584
00:42:40,519 --> 00:42:42,604
మీరు సంజ్ఞలు చేస్తున్నప్పుడు,

585
00:42:42,688 --> 00:42:45,065
మీ చేతులు వస్తువులకు తగిలి

586
00:42:45,148 --> 00:42:46,525
పదార్థాలన్నీ టేబుల్‌పై చిందేవి.

587
00:42:48,777 --> 00:42:51,029
కానీ నాకు కొంచెం వినపడుతుందని

588
00:42:51,113 --> 00:42:53,365
నా బాల్యంలో మా తల్లిదండ్రులు గమనించారు.

589
00:42:54,157 --> 00:42:56,743
అందుకని వినికిడి సాధనాలను వాడసాగాను,

590
00:42:56,827 --> 00:42:59,371
అది నాకు మెరుగ్గా మాట్లాడడంలో సాయపడింది.

591
00:42:59,872 --> 00:43:03,542
ఫోన్‌లో మాట్లాడగలిగేవాడిని,
కానీ మా బామ్మకు మాత్రమే కాల్ చేసేవాడిని.

592
00:43:06,837 --> 00:43:09,673
ఎవరో "హలో?" అన్నారు,

593
00:43:10,716 --> 00:43:12,885
"హలో?" "ఓహ్, నాకర్థమైంది."

594
00:43:12,968 --> 00:43:14,553
"ఎలా ఉన్నావ్?" "మంచిది."

595
00:43:14,636 --> 00:43:17,181
"నీ రోజు ఎలా గడించింది?
వాతావరణం ఎలా ఉంది?"

596
00:43:17,931 --> 00:43:20,225
నాకు అనిపించింది, "ఓహ్!"

597
00:43:20,309 --> 00:43:24,146
కొంచెం గర్వంగా ఉంటుంది కదా?
"నేను ఇది చేయగలను" అని.

598
00:43:25,355 --> 00:43:28,817
దాంతో మా నాన్నగారు, "నువ్వు
పబ్లిక్ స్కూల్‌కు వెళ్తున్నావ్" అన్నారు.

599
00:43:29,443 --> 00:43:31,945
ఆయన బధిర పాఠశాల
తక్కువ స్థాయిదని అనుకున్నారు.

600
00:43:32,029 --> 00:43:35,991
ఆయన అనువాద వ్యాఖ్యాత
లేకుండానే ఇంజనీరింగ్ పట్టభద్రులయ్యారు.

601
00:43:36,074 --> 00:43:38,535
తనే స్వయంగా ప్రతిదీ చదువుకున్నారు.

602
00:43:39,453 --> 00:43:42,039
"నీవు బధిరుడివి అన్నది
ప్రధానం కాదు" అని భావించేవారు.

603
00:43:42,122 --> 00:43:44,291
కేవలం, "మాట్లాడడానికి యత్నించు…

604
00:43:45,042 --> 00:43:46,627
లిప్-రీడ్ చేయాలి…

605
00:43:47,586 --> 00:43:48,587
సాయశక్తులా ప్రయత్నించు."

606
00:44:03,644 --> 00:44:07,439
తరగతి గదిలో
టీచర్ మాట్లాడుతుంటుంది.

607
00:44:12,486 --> 00:44:17,741
అక్కడ ఏం జరుగుతుందో
తెలుసన్నట్లు ఊరికే తలాడించేవాడిని.

608
00:44:28,335 --> 00:44:31,880
అక్కడక్కడా కొన్ని
పదాలను అర్థం చేసుకునేవాడిని.

609
00:44:31,964 --> 00:44:34,466
రాకెట్.

610
00:44:34,550 --> 00:44:37,177
కానీ టీచర్ వెనక్కి తిరిగి

611
00:44:37,261 --> 00:44:39,930
బ్లాక్ బోర్డ్ చూసి మాట్లాడుతుంటే,

612
00:44:40,013 --> 00:44:41,723
ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు.

613
00:44:42,182 --> 00:44:45,352
అందుకని నన్ను ముందు కూర్చోమన్నారు.

614
00:44:48,522 --> 00:44:50,065
పిల్లలు అనేవారు…

615
00:44:52,526 --> 00:44:54,903
"నీ చెవులు పాడయ్యాయి" అని.

616
00:44:58,824 --> 00:45:02,077
అలా నా ప్రపంచం అంధకారమైంది.

617
00:45:06,957 --> 00:45:08,792
ఇది వినగల్గినవారి ప్రపంచం…

618
00:45:14,423 --> 00:45:16,425
నేను వారిలో ఒకడిని కాదు.

619
00:45:23,265 --> 00:45:25,017
మధ్యాహ్నం రెండు గంటల తర్వాత

620
00:45:25,100 --> 00:45:28,395
అధ్యక్షురాలు జిన్సర్ క్యాంపస్‌కు
వస్తుందన్న పుకారు వ్యాపించింది.

621
00:45:29,771 --> 00:45:32,357
మంగళవారం

622
00:45:32,441 --> 00:45:34,401
మూడవరోజున…

623
00:45:35,652 --> 00:45:39,072
జిన్సర్, తను క్యాంపస్‌కు
వస్తున్నట్లు చెప్పారు.

624
00:45:41,992 --> 00:45:44,161
దానికి ఎలా స్పందించారు?

625
00:45:47,831 --> 00:45:51,126
కొన్ని వందలమంది విద్యార్థులు
ముందు గేట్ వద్ద స్వాగతిస్తూ గుమిగూడారు.

626
00:45:51,210 --> 00:45:52,586
ఇంటికి వెళ్లిపో
జిన్సర్!

627
00:45:52,669 --> 00:45:54,254
మీరు వాళ్ళలో ఒకరు కారని,

628
00:45:54,338 --> 00:45:56,590
"మిమ్మల్ని మేము గౌరవించలేము" అంటున్న

629
00:45:56,673 --> 00:45:58,675
విద్యార్థులకు మీరు ఏం చెప్తారు?

630
00:45:58,759 --> 00:46:00,969
మేము ఒకరికొకరం పరిచయమయ్యాక,

631
00:46:01,053 --> 00:46:03,597
మాది ఒక ఆత్మీయ, ఫలప్రదమైన

632
00:46:03,680 --> 00:46:05,891
బంధమవుతుందని నమ్ముతున్నాను.

633
00:46:07,726 --> 00:46:09,603
వినగల్గిన విద్యావేత్త
గల్లాడెట్ యూ అధ్యక్షురాలిగా ఎంపిక

634
00:46:10,771 --> 00:46:13,440
ఎలిసబెత్ జిన్సర్,
నర్సింగ్‌లో గ్రాడ్యుయేట్

635
00:46:13,524 --> 00:46:15,025
మరియు మాస్టర్స్ డిగ్రీ
నేపథ్యాన్ని కలిగి ఉంది.

636
00:46:15,526 --> 00:46:17,861
కానీ బధిరులతో అనుభవం లేదు.

637
00:46:17,945 --> 00:46:19,738
జిన్సర్ ఎవరు?
బలహీన నాయకురాలు!

638
00:46:19,821 --> 00:46:21,615
కాబట్టి డాక్టర్ జిన్సర్,

639
00:46:21,698 --> 00:46:24,034
మీరు శిక్షితులైన నర్స్
మరియు పిహెచ్‌డి ఉంది.

640
00:46:24,618 --> 00:46:26,787
మా దృష్టిలో ఆమెకు అర్హత లేదు.

641
00:46:26,870 --> 00:46:31,083
బధిర సంస్కృతిని అర్థం చేసుకోగలగడం
మరియు బధిరుడు కావడమే అర్హత.

642
00:46:31,959 --> 00:46:34,670
ఈ యూనివర్సిటీలోకి ఆమెను స్వాగతించం.

643
00:46:34,753 --> 00:46:36,171
ఇది ఆమె యూనివర్సిటీ కాదు.

644
00:46:41,218 --> 00:46:46,473
పోలీసులు ఈ ఒక్క గేట్ తెరవాలనుకుంటున్నారు.

645
00:46:46,807 --> 00:46:49,101
ఇప్పుడు మేము అప్రమత్తంగా ఉండాలి.

646
00:46:49,184 --> 00:46:51,603
ఆమె క్యాంపస్‌లోకి రావడానికి
ఎలా రావాలనుకుంటుంది?

647
00:46:52,437 --> 00:46:53,689
ఒక క్యాబ్ లోపలికి రావచ్చా?

648
00:46:54,439 --> 00:46:57,442
సరే, క్యాబ్ లోపల
ఎవరున్నారో మేము చూస్తాం,

649
00:46:57,526 --> 00:47:01,655
ఎందుకంటే జేన్ బాస్సెట్ స్పిల్మాన్
మరియు జిన్సర్ లోపలికి రాకూడదు.

650
00:47:01,738 --> 00:47:02,865
న్యూస్ 4

651
00:47:02,948 --> 00:47:06,493
కొత్తగా ప్రకటింపబడ్డ
ప్రెసిడెంట్, క్యాంపస్‌లోకి

652
00:47:06,577 --> 00:47:10,414
చాటుగా వస్తుందేమోనని విద్యార్థులు
గస్తీ కార్లలోకి తొంగి చూసే పరిస్థితి.

653
00:47:11,248 --> 00:47:12,875
ఆగు.

654
00:47:12,958 --> 00:47:14,626
ట్రంక్ తెరవండి.

655
00:47:15,294 --> 00:47:18,088
"జిన్సర్ లేదు. మంచిది.
మీరు క్యాంపస్‌లోకి వెళ్ళవచ్చు."

656
00:47:18,172 --> 00:47:22,176
"పట్టుకోండి, తరిమేయండి!" అంటున్నారు,

657
00:47:23,093 --> 00:47:25,470
మేము ఒక రహస్య సైనిక స్థావరంలా,

658
00:47:25,554 --> 00:47:29,391
ఒక అద్దం పట్టుకుని
కార్ల కింద వెదుకుతున్నాం.

659
00:47:30,475 --> 00:47:34,021
విద్యార్థుల బారికేడ్ల గుండా
కొన్ని వాహనాలను మాత్రమే అనుమతించారు.

660
00:47:35,522 --> 00:47:36,523
ఆగు.

661
00:47:39,985 --> 00:47:41,195
"జిన్సర్ లేదు."

662
00:47:41,945 --> 00:47:44,031
క్యాంపస్‌లో రోజంతా
పుకార్లు షికార్లు చేశాయి.

663
00:47:44,615 --> 00:47:46,575
జిన్సర్‌ను హెలికాప్టర్‌లో తీసుకొచ్చి,

664
00:47:46,658 --> 00:47:48,076
క్యాంపస్‌లో ఎక్కడో వదిలేస్తారని.

665
00:47:49,077 --> 00:47:53,123
కాబట్టి విద్యార్థులను
హెలికాప్టర్ చుట్టూ పరిగెత్తించాను.

666
00:47:53,665 --> 00:47:57,002
ఒకవేళ అది ల్యాండ్ ఐతే,
వాళ్ళు నేల మీద పడుకునేవారు.

667
00:47:58,670 --> 00:48:02,925
బధిర అధ్యక్షుడిని చూసేవరకూ,

668
00:48:03,008 --> 00:48:06,386
జిన్సర్ లోపలికి రాకుండా
అడ్డుకుంటాం, అంతే.

669
00:48:06,470 --> 00:48:09,765
ఆ వ్యక్తిని లోపలకు సాదరంగా ఆహ్వానిస్తాం.

670
00:48:09,848 --> 00:48:12,726
అది తథ్యం, ఇంకెవరినీ రానివ్వం.

671
00:48:18,357 --> 00:48:22,110
గల్లాడెట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ విభాగ అధిపతి

672
00:48:22,194 --> 00:48:24,613
అధ్యక్ష పదవికి తిరస్కరింపబడ్డ
వారిలో ఒకరైన కింగ్ జోర్డాన్,

673
00:48:24,696 --> 00:48:27,741
తన మద్దతు తెలిపేందుకు
నిరసనకారులతో చేతులు కలిపారు.

674
00:48:27,824 --> 00:48:29,159
నేను అధ్యక్ష స్థానానికై దరఖాస్తు చేశాను.

675
00:48:29,243 --> 00:48:30,661
డాక్టర్. కింగ్ జోర్డాన్
బోర్డ్ సభ్యుడు

676
00:48:30,744 --> 00:48:33,330
నేనొక బధిరుడిని.
కాబట్టి గల్లాడెట్ యూనివర్సిటీలో

677
00:48:33,413 --> 00:48:36,375
ఒక బధిర అధ్యక్షుడిని చూడాలనుకుంటున్నాను.

678
00:48:39,878 --> 00:48:42,130
మీరు క్యాంపస్‌కు వెళ్ళినప్పుడు

679
00:48:42,214 --> 00:48:44,424
నిజంగా, నిజాయితీగా, తప్పకుండా

680
00:48:44,508 --> 00:48:47,010
విద్యార్థులు గెలుస్తారనుకున్నారా?

681
00:48:49,847 --> 00:48:50,764
లేదు.

682
00:48:52,224 --> 00:48:53,600
సరే.

683
00:48:57,312 --> 00:49:00,941
హలో నేను, ఐ కింగ్ జోర్డాన్.

684
00:49:02,067 --> 00:49:05,863
విద్యార్థులు గెలుస్తారని
మాలో చాలామంది నమ్మలేదు.

685
00:49:05,946 --> 00:49:09,491
గత ఎనిమిది నెలలుగా జరుగుతున్న వాటితో

686
00:49:09,575 --> 00:49:12,411
నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను.

687
00:49:15,497 --> 00:49:18,000
ఐ. కింగ్ జోర్డాన్ ఎలాంటి వ్యక్తి?

688
00:49:18,876 --> 00:49:21,712
చాలా మంచివాడిలా,
మర్యాదస్తుడిలా కనిపించాడు.

689
00:49:23,213 --> 00:49:25,215
ఆ నవ్వు, ఆత్మీయత.

690
00:49:26,133 --> 00:49:28,510
ఎప్పుడూ
ఒకే సందేశాన్ని ఇవ్వాలనుకుంటాను.

691
00:49:29,469 --> 00:49:33,223
అశక్తతలో "అ" అక్షరాన్ని వదిలేయండి.

692
00:49:33,849 --> 00:49:36,351
అతని వద్ద క్లాస్ తీసుకున్న ఎవరైనా

693
00:49:37,436 --> 00:49:39,730
ఆయనొక గొప్ప అధ్యాపకుడు అని చెప్పారు.

694
00:49:41,940 --> 00:49:46,737
కాబట్టి Z Y ఉత్పన్నం మైనస్ కోసం…

695
00:49:46,820 --> 00:49:49,907
ఫార్ములాను ఉపయోగించండి.

696
00:49:49,990 --> 00:49:52,117
- Y.
- Y ఉత్పన్నం, సరిగ్గా.

697
00:49:52,576 --> 00:49:54,328
అతనికి వినపడదు…

698
00:49:56,079 --> 00:49:58,540
కానీ బధిరులలా వినలేకపోవడం కాదు.

699
00:49:59,416 --> 00:50:01,126
ఇప్పుడు నాకేం వినపడదు.

700
00:50:01,210 --> 00:50:06,048
ఏ శబ్దమూ లేదు.

701
00:50:06,131 --> 00:50:10,469
అక్కడొక విమానం ఉన్నా నేనేమీ వినలేను.

702
00:50:10,552 --> 00:50:12,179
- ఏం వినపడదు.
- సున్నా.

703
00:50:12,262 --> 00:50:14,515
సున్నా, సున్నా.

704
00:50:18,393 --> 00:50:20,646
నాది వినగల్గిన వ్యక్తి జీవితమే.

705
00:50:22,022 --> 00:50:23,607
కానీ ఒక మోటర్ సైకిల్ కొన్నాను.

706
00:50:23,690 --> 00:50:26,235
ఒక రాత్రి ఇంటికి వెళ్తుండగా

707
00:50:26,318 --> 00:50:28,862
ఒక కారును గుద్దాను.

708
00:50:30,113 --> 00:50:34,034
నేను లేచే సరికి ఏ శబ్దం లేదు.

709
00:50:38,372 --> 00:50:42,876
నన్ను గల్లాడెట్ వెళ్ళమని,
అది నాకు సాయపడుతుందని చెప్పారు.

710
00:50:44,002 --> 00:50:47,047
నా మొదటి రోజున,
సంజ్ఞ చేయడానికి ప్రయత్నిస్తుంటే,

711
00:50:47,130 --> 00:50:50,509
నా చుట్టూ ఉన్నవాళ్ళు గేళి చేసేవారు.

712
00:50:52,386 --> 00:50:57,516
నా మొదటి క్లాసులో కూర్చుని,
అధ్యాపకుడిని గమనించాను…

713
00:50:59,643 --> 00:51:02,646
ఆయన కనీసం పెదవులు కూడా కదపలేదు.

714
00:51:02,729 --> 00:51:04,189
ఆయన కేవలం--

715
00:51:06,275 --> 00:51:08,819
అయ్య బాబోయ్, ఇదంతా నేనెలా చేస్తాను?

716
00:51:14,283 --> 00:51:17,828
నిజంగా నేనక్కడ ఆటలో అరటిపండు.

717
00:51:19,663 --> 00:51:24,501
మనది శక్తివంతమైన,
పెద్ద కుటుంబం. మనం…

718
00:51:24,585 --> 00:51:29,214
అధ్యక్షుడిగా నాకు
విద్యార్థులు చాలా మద్దతిచ్చారు.

719
00:51:30,048 --> 00:51:35,554
కానీ బధిర సమాజంలో,

720
00:51:35,637 --> 00:51:38,432
నేను అసలైన బధిరుడిని కాదనేవారు ఉన్నారు.

721
00:51:38,515 --> 00:51:42,936
మీరు నాతో పని చేయగలిగితే,

722
00:51:43,020 --> 00:51:49,818
బధిరులు ఏం చేయగలరో
ఈ ప్రపంచానికి నిరూపించగలం.

723
00:51:50,485 --> 00:51:51,486
ధన్యవాదాలు.

724
00:51:53,322 --> 00:51:56,700
వినగల్గిన సమాజంలోనున్న వారికి
బధిరుడిగా ఎలా ఉంటుందో అర్థం కాదు.

725
00:51:56,783 --> 00:52:01,163
ఒక బధిరుడిగా నాకెలా
ఉంటుందో వారికి అర్థం కాదు.

726
00:52:01,246 --> 00:52:06,126
ఒక్కొక్క పడవ మీద
ఒక్కొక్క కాలు పెట్టానేమో అనిపిస్తుంది.

727
00:52:06,210 --> 00:52:09,171
నేను… నేను ఊగుతున్నాను.

728
00:52:11,632 --> 00:52:15,344
మాకు వెంటనే న్యాయం కావాలి.

729
00:52:15,427 --> 00:52:17,095
అస్సలు వద్దు
మాకు వినగల్గిన ప్రెసిడెంట్ వద్దు

730
00:52:17,179 --> 00:52:19,681
ఈరోజున

731
00:52:19,765 --> 00:52:23,185
విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేసి,

732
00:52:23,268 --> 00:52:26,230
వారితో వ్యక్తిగతంగా పరిచయం పెంచుకునే

733
00:52:26,313 --> 00:52:28,607
అవకాశమివ్వమని అడుగుతాను.

734
00:52:29,650 --> 00:52:33,028
మంగళవారం మధ్యాహ్నం,

735
00:52:33,111 --> 00:52:35,489
విద్యార్థి నాయకులను కలవడానికి
జిన్సర్‌కు సాయపడాలని

736
00:52:35,572 --> 00:52:39,868
నా సూపర్‌వైజర్ నుండి ఒక అభ్యర్ధన వచ్చింది.

737
00:52:42,454 --> 00:52:45,791
అందుకని విద్యార్థుల వద్దకు వెళ్ళి

738
00:52:46,583 --> 00:52:49,044
ఆ ఫోన్ కాల్ గురించి వారితో చెప్పాను.

739
00:52:49,837 --> 00:52:53,590
మమ్మల్ని క్యాంపస్‌లో కలవమన్నారు,
మేము "వద్దు" అన్నాం.

740
00:52:54,883 --> 00:52:56,844
"మరి ఏం చేయాలనుకుంటున్నారు?" అన్నారు.

741
00:52:56,927 --> 00:52:59,513
నేను, "కలుస్తాం, కానీ
ఒక మధ్యస్థ ప్రదేశంలో" అన్నాను.

742
00:53:00,347 --> 00:53:03,058
ప్రస్తుతం నా వెనుక
చూస్తున్నారు, జిన్సర్

743
00:53:03,141 --> 00:53:05,394
మరియు విద్యార్థి నాయకుల మధ్య
సమావేశం జరగబోతుందని

744
00:53:05,477 --> 00:53:07,062
విద్యార్థులకు అందుతుంది.

745
00:53:07,396 --> 00:53:11,567
విద్యార్థులు, "దృఢంగా ఉండండి, మొండిగా
ఉండండి. పోరాడండి!" అన్నట్లు ఉన్నారు.

746
00:53:15,487 --> 00:53:16,947
డేస్ ఇన్న్

747
00:53:17,614 --> 00:53:21,577
ఒక చవకబారు హోటల్ అనుకోండి.

748
00:53:22,995 --> 00:53:24,955
జిన్సర్ లోపలకు వచ్చింది.

749
00:53:25,539 --> 00:53:29,459
విజయాన్ని సూచించే
ఒక సూట్‌ను ఆమె ధరించింది.

750
00:53:29,543 --> 00:53:33,130
బాగా అధికారికంగా,
ఒక ఉత్సాహం ఆమెలో కనిపించింది.

751
00:53:33,213 --> 00:53:37,634
ఆమె బలాన్ని
ప్రదర్శించడమే ఆమె అసలు ఉద్ద్యేశం.

752
00:53:38,468 --> 00:53:40,220
"నేనే ఇంఛార్జ్."

753
00:53:40,304 --> 00:53:42,723
కానీ తర్వాత మాట్లాడసాగింది.

754
00:54:04,828 --> 00:54:09,291
ఆమె పదేపదే,
"మీకు చాలా మంచి చేస్తాను.

755
00:54:10,584 --> 00:54:11,919
భయపడకండి.

756
00:54:12,419 --> 00:54:14,338
సాయం చేయడానికే
నేను వచ్చాను." అని చెప్పింది.

757
00:54:22,763 --> 00:54:25,390
ఆమె వైద్య నేపథ్యం నుండి వచ్చింది,

758
00:54:25,474 --> 00:54:28,060
కాబట్టి బధిరతపై

759
00:54:28,852 --> 00:54:30,604
తన దృష్టి ఎలాంటిదంటే…

760
00:54:31,897 --> 00:54:34,066
దానిని సరిచేయగలమని అనుకుంటుంది.

761
00:54:40,489 --> 00:54:44,368
అదే పాత కథ, మళ్ళీ మళ్ళీ…

762
00:54:45,244 --> 00:54:46,787
ఏళ్ళకు ఏళ్లుగా.

763
00:54:48,205 --> 00:54:50,165
"నేను నీకు సాయం చేయాలి.

764
00:54:51,208 --> 00:54:53,252
నీకోసం ఇది చేస్తాను."

765
00:54:54,461 --> 00:54:57,047
"పాడైన నీ చెవులను బాగు చేద్దాం."

766
00:54:59,800 --> 00:55:02,135
ఒక సిద్ధాంతం ఉంది…

767
00:55:04,596 --> 00:55:07,224
దాంతో బధిరులు మాట్లాడగలరని.

768
00:55:07,933 --> 00:55:09,810
టెలిఫోన్ పుట్టింది
జూన్ 2, 1875

769
00:55:09,893 --> 00:55:13,272
అలెగ్జాండర్ గ్రాహం బెల్‌తో
ఇదంతా మొదలైంది.

770
00:55:16,191 --> 00:55:19,903
ఆయన
అమెరికన్ హీరో అనుకున్నాను?

771
00:55:22,823 --> 00:55:25,409
ఆయన మరో కోణం గురించి తెలిస్తే,

772
00:55:25,492 --> 00:55:27,870
మీకు ఆయనపై భిన్న అభిప్రాయం ఉండేది.

773
00:55:29,329 --> 00:55:34,251
ఆయన భార్య బధిరురాలు.
ఆయన తల్లి బధిరురాలు.

774
00:55:34,334 --> 00:55:38,881
కానీ వారిని సమాజం ఎంత చులకనగా
చూసిందన్నది ఆయన అసలు సమస్య.

775
00:55:40,007 --> 00:55:43,677
ఆయన వారిని సరిదిద్దాల్సిన సమస్యగా చూశారు.

776
00:55:45,345 --> 00:55:49,808
కాబట్టి బధిర విద్యలో
ఈ మార్పును అమలుచేయాలని చూశారు.

777
00:55:50,517 --> 00:55:53,145
ప్రపంచం
ఒక నిశ్శబ్ద ప్రదేశంగా ఉండేది.

778
00:55:53,228 --> 00:55:54,730
గాత్ర ఇంద్రియ శాస్త్ర విజ్ఞాన పాఠశాల

779
00:55:54,813 --> 00:55:57,191
శబ్దం అన్నదే లేదు.

780
00:55:57,274 --> 00:55:58,984
వారికి పదం అంటే కూడా తెలియదు.

781
00:55:59,067 --> 00:56:02,112
పదాలు లేకుంటే, ఆలోచనలు కూడా ఉండవు,

782
00:56:02,196 --> 00:56:05,449
వాటిని ఒక్కటిగా కలపలేని
భావాలు మాత్రమే ఉంటాయి.

783
00:56:05,866 --> 00:56:07,409
నేను స్కూల్‌కు వెళ్ళినప్పుడు,

784
00:56:07,492 --> 00:56:11,580
ప్రతిరోజూ తప్పనిసరిగా
స్పీచ్ క్లాస్ ఉండేది.

785
00:56:12,664 --> 00:56:15,584
నేను క్లాస్‌లో ఉంటే,
నన్ను బయటకు లాగి

786
00:56:16,376 --> 00:56:17,586
స్పీచ్‌కు తీసుకెళ్ళేవారు.

787
00:56:18,378 --> 00:56:22,049
అతనికి 3,000 గంటల
వ్యక్తిగత స్పీచ్ ట్రైనింగ్ ఉంటుంది.

788
00:56:22,132 --> 00:56:25,260
అందులో అతను వినలేని పదాలను
పెదాల కదలికలతో నేర్చుకుంటాడు.

789
00:56:26,428 --> 00:56:29,181
నా చేతిని అధ్యాపకురాలి
ముక్కు పైన ఉంచాలి.

790
00:56:29,264 --> 00:56:31,517
వివిధ శబ్దాలు సృష్టించే
శ్వాస తరంగాలను గ్రహించి,

791
00:56:31,600 --> 00:56:36,063
అద్దం ద్వారా పెదాల కదలికలను
గుర్తించడం నేర్చుకుంటున్నాడు.

792
00:56:36,688 --> 00:56:38,440
బాగుంది. కాస్త గట్టిగా ఉంచు.

793
00:56:39,441 --> 00:56:42,444
స్పీచ్ థెరపీ మంత్‌కు
నేను ప్రచార ముఖ చిత్రం.

794
00:56:42,903 --> 00:56:44,279
బ్రిడ్జెట్టా వినలేదు…
కానీ ఆమె నేర్చుకుంటోంది

795
00:56:44,363 --> 00:56:45,531
వారు ప్రకటన చేశారు:

796
00:56:46,198 --> 00:56:49,701
"ఎలా మాట్లాడాలో, వినాలో
నేర్చుకుంటున్నది ఈ అమ్మాయే."

797
00:56:50,369 --> 00:56:53,288
పిల్లల వినికిడి
నష్ట తీవ్రతను గుర్తించేందుకు,

798
00:56:53,372 --> 00:56:56,083
బెల్ టెలిఫోన్ ల్యాబ్స్
రూపొందించిన పలు పరికరాలతో

799
00:56:56,166 --> 00:56:57,376
వారిని పరీక్ష చేస్తారు.

800
00:56:57,459 --> 00:57:00,045
ప్రత్యేకంగా శిక్షితులైన
టీచర్‌లు వారితో పని చేస్తారు.

801
00:57:01,421 --> 00:57:04,758
నా ట్రాన్స్‌మిట్టర్
మరియు హెడ్‌సెట్ తీసుకుని

802
00:57:04,842 --> 00:57:07,094
నా ఛాతీ మీద ధరిస్తాను.

803
00:57:08,262 --> 00:57:10,180
టీచర్ నుండి పిల్లల వినికిడి సాధనాలకు

804
00:57:10,264 --> 00:57:11,640
నేరుగా జోడించిన మైక్రోఫోన్

805
00:57:11,723 --> 00:57:13,600
వారు వినే శబ్దాన్ని పెంచుతుంది.

806
00:57:18,272 --> 00:57:21,400
సంజ్ఞా భాష వాడడానికి
మాకు అనుమతి లేదు,

807
00:57:21,483 --> 00:57:26,071
కానీ టీచర్ చూడనప్పుడు,
ఆమె వెనక్కి తిరిగి చూసేవరకూ

808
00:57:26,154 --> 00:57:27,823
మేం ఒకరితో ఒకరం
చాటుగా సంజ్ఞలను చేసేవాళ్ళం.

809
00:57:27,906 --> 00:57:30,576
ఒక బిడ్డను సంజ్ఞ చేసే పరిసరాలలో ఉంచితే,

810
00:57:30,659 --> 00:57:32,286
తను సంజ్ఞలు నేర్చుకుంటాడు.

811
00:57:32,369 --> 00:57:37,332
ఒకవేళ మాట్లాడే పరిసరాలలో ఉంచితే,
అతను మాట్లాడాల్సి ఉంటుంది.

812
00:57:37,749 --> 00:57:40,043
అదేం క్రూరమైన పని కాదు.

813
00:57:40,627 --> 00:57:44,173
మీరు సంజ్ఞ చేస్తే,
మీ చేతులపై రూలర్‌తో కొడుతారు.

814
00:57:46,133 --> 00:57:48,510
నేను చ శబ్దాన్ని గుర్తుపట్టగలిగే వాడిని.

815
00:57:49,761 --> 00:57:51,138
టీచర్‌లు ఆశ్చర్యపోయారు.

816
00:57:51,221 --> 00:57:53,390
"ఓహ్, నువ్వు చ శబ్దం పలుకుతావా."

817
00:57:53,473 --> 00:57:55,267
తర్వాత టీచర్ పాఠం చెప్పడం ఆపేసి,

818
00:57:55,350 --> 00:57:57,436
ఇతర తరగతులలోని టీచర్‌లందరినీ

819
00:57:57,519 --> 00:57:59,104
వరండాలోకి రమ్మని పిలిచి,

820
00:57:59,188 --> 00:58:03,066
"మళ్ళీ చెప్పు. ఏం అనుకోకుండా
మళ్ళీ 'చ' అంటావా?" అనేవారు.

821
00:58:03,984 --> 00:58:06,361
ఆపై ప్రతిఒక్కరూ, "వావ్!" అనేవారు.

822
00:58:06,445 --> 00:58:08,822
అది నా ఆత్మవిశ్వాసాన్నిపెంచింది.

823
00:58:09,031 --> 00:58:12,451
ఆర్. ఐ. పి స్క్రూజ్

824
00:58:12,534 --> 00:58:15,120
తర్వాత ఐదవ తరగతిలో
ఒక నాటకంలో ఉన్నాను,

825
00:58:15,204 --> 00:58:16,663
ఎ క్రిస్మస్ కరోల్.

826
00:58:17,414 --> 00:58:20,167
అక్కడ సంజ్ఞలు చేయడం వంటివి లేవు.

827
00:58:21,460 --> 00:58:23,462
కేవలం ప్రసంగం మాత్రమే…

828
00:58:25,839 --> 00:58:27,466
మరియు కొంతమంది
వినగల్గినవారు వచ్చారు,

829
00:58:28,383 --> 00:58:30,636
మేమేదో గొప్పగా చేశామని

830
00:58:30,719 --> 00:58:33,055
వారంతా చప్పట్లు కొడుతున్నారు.

831
00:58:33,138 --> 00:58:34,306
నాకు బాగా అనిపించింది.

832
00:58:36,725 --> 00:58:38,393
ఆ నాటకం చివరలో,

833
00:58:39,686 --> 00:58:42,397
మేమంతా, "అదేమైనా
మీకు అర్థమైందా?" అని అడిగాం,

834
00:58:42,481 --> 00:58:44,274
వినికిడిగల్గినవారు…

835
00:58:53,325 --> 00:58:55,911
"మాకు అదేమీ
అర్థం కాలేదు" అన్నారు.

836
00:59:08,715 --> 00:59:13,595
మేము వినగల్గిన వారిలా
ఆలోచించాలని మమ్మల్ని ఒత్తిడి చేశారు.

837
00:59:13,971 --> 00:59:18,517
నేను ఒక క్రిస్మస్ కార్డ్ చేశాను.

838
00:59:19,476 --> 00:59:20,727
నువ్వు ఇక్కడ ఆగాలి.

839
00:59:20,811 --> 00:59:23,188
నేను…

840
00:59:23,272 --> 00:59:25,524
మా తల్లిదండ్రులకు టీచర్‌లు చెప్పారు,

841
00:59:25,607 --> 00:59:27,943
"మీ అమ్మాయి సరిగా పురోగమించట్లేదు" అని.

842
00:59:29,111 --> 00:59:32,781
దాదాపుగా ఎలా ఉండేదంటే,
"నువ్వు వినలేవు, మాట్లాడలేవా?

843
00:59:32,865 --> 00:59:34,283
నీకు బుద్దిలేనట్లే."

844
00:59:39,538 --> 00:59:41,290
సరే కానీ, ఒక భాగం మర్చిపోయావు.

845
00:59:45,377 --> 00:59:48,422
సంజ్ఞా భాష అనేది స్వయంగా ఒక భాష.

846
00:59:50,007 --> 00:59:52,509
సంజ్ఞ చేయడం నాకు చాలా ముఖ్యం.

847
00:59:54,845 --> 00:59:56,471
అదే మేము.

848
00:59:58,390 --> 01:00:01,643
వారు బధిరులను
నష్ట జాతకులలా చూస్తారు.

849
01:00:02,436 --> 01:00:04,062
ఒక లోపంలాగ,

850
01:00:04,730 --> 01:00:06,190
ఒక తప్పిదంలాగా,

851
01:00:06,857 --> 01:00:08,984
శ్రవణ వికలాంగుడిలా చూస్తారు.

852
01:00:09,526 --> 01:00:12,696
మేము అవిటి వాళ్ళం కాదు.

853
01:00:23,874 --> 01:00:25,959
జిన్సర్ అన్నారు,

854
01:00:26,043 --> 01:00:29,129
"సంజ్ఞా భాషను నేర్పడానికి,
నేనొక టీచర్‌ను పెట్టుకుని,

855
01:00:29,213 --> 01:00:30,672
ఎలా సంజ్ఞ చేయాలో నేర్చుకుంటాను.

856
01:00:30,756 --> 01:00:33,133
ఒక రెండు నెలలో మీతో
సంభాషించగలుగుతాను."

857
01:00:36,011 --> 01:00:37,846
మీకు అర్థం కాదు.

858
01:00:37,930 --> 01:00:41,058
సంజ్ఞ భాషను నేర్చుకోవాలంటే
కొన్నేళ్ళు పడుతుంది.

859
01:00:42,142 --> 01:00:48,023
ఆ నిరాశ, బాధ అర్థం చేసుకోవాలంటే

860
01:00:48,941 --> 01:00:51,693
బధిరులతో బ్రతకాలి,
నిద్రించాలి, తినాలి, శ్వాసించాలి.

861
01:00:52,444 --> 01:00:56,073
ఆమె చెప్పిన ప్రతిదానికీ,
వారు, "లేదు, లేదు, లేదు.

862
01:00:56,156 --> 01:00:57,866
అంగీకరించలేం, కుదరదు.

863
01:00:57,950 --> 01:01:01,870
మీరు ఎన్నటికీ గల్లాడెట్‌
ప్రెసిడెంట్ కాలేరు" అన్నారు.

864
01:01:04,665 --> 01:01:06,625
నేను నిజంగా ఆశ్చర్యపోయాను.

865
01:01:09,753 --> 01:01:11,755
తర్వాత మేము వెళ్లిపోయాం.

866
01:01:11,839 --> 01:01:15,050
ఆమె ప్రయత్నం విఫలమైంది.

867
01:01:22,599 --> 01:01:25,060
మేం తిరిగి క్యాంపస్‌కు వెళ్ళాం.

868
01:01:29,231 --> 01:01:30,899
ఇక ఆ క్షణంలో,

869
01:01:32,484 --> 01:01:36,572
లోతైన బంధం ఏర్పడినట్లయింది.

870
01:01:38,323 --> 01:01:41,827
సాధికారిత భావన ఉద్భవించింది.

871
01:01:45,247 --> 01:01:47,374
మమ్మల్ని మేము నమ్మడం మొదలుపెట్టాం.

872
01:01:48,333 --> 01:01:50,878
మేము గెలవబోతున్నాం.

873
01:01:51,879 --> 01:01:55,048
టీమ్ లీడర్‌లు, వీరే మన టీమ్ లీడర్‌లు.

874
01:02:00,262 --> 01:02:02,139
ఆశ చిగురించడాన్ని చూశాం.

875
01:02:03,056 --> 01:02:06,143
డాక్టర్ జిన్సర్, ప్రెస్ క్లబ్‌కు

876
01:02:07,728 --> 01:02:10,314
వస్తున్నారని నాకు చెప్పారు.

877
01:02:13,108 --> 01:02:15,736
కాసేపట్లో చేరుకుంటారు,

878
01:02:15,819 --> 01:02:18,655
కానీ మనం మరింత ఆలస్యం చేయకుండా,

879
01:02:18,739 --> 01:02:22,993
శ్రీమతి స్పిల్మాన్
సమావేశాన్ని ప్రారంభిస్తారు.

880
01:02:26,371 --> 01:02:30,000
ముందు సీట్‌లో జిన్సర్ ఉంది,
నేను వెనుక కూర్చున్నాను.

881
01:02:30,083 --> 01:02:35,130
ఆమె ఫోన్ పట్టుకుని,
మాట్లాడడం నాకు కనిపిస్తుంది.

882
01:02:38,550 --> 01:02:41,595
నాతో అనువాద వ్యాఖ్యాత లేరు.

883
01:02:50,604 --> 01:02:52,648
సోదర సోదరీమణులారా గుడ్ ఆఫ్టర్‌నూన్.

884
01:02:54,399 --> 01:02:56,109
ఈ సమావేశ ఉద్దేశ్యం

885
01:02:56,985 --> 01:03:01,698
గల్లాడెట్ యూనివర్సిటీ బోర్డ్ ట్రస్టీలు

886
01:03:01,782 --> 01:03:03,367
ఒక ప్రకటన చేయడం కోసం.

887
01:03:04,910 --> 01:03:08,038
నేనన్నాను,
"నన్ను గల్లాడెట్ దగ్గర దింపేయండి."

888
01:03:09,498 --> 01:03:11,542
అందుకు ఆమె, "లేదు.

889
01:03:12,668 --> 01:03:15,462
మనం నేషనల్ ప్రెస్ క్లబ్‌కు
వెళ్తున్నాం" అన్నారు.

890
01:03:16,964 --> 01:03:18,715
నేను కార్‌లో లాక్ ఐపోయాను.

891
01:03:20,092 --> 01:03:21,718
మనమందరం ఏకతాటిపై ఉన్నాం.

892
01:03:25,931 --> 01:03:27,307
హలో డాక్టర్ జిన్సర్.

893
01:03:27,933 --> 01:03:31,687
హఠాత్తుగా
నా సూపర్ వైజర్ నన్ను లాగి,

894
01:03:31,770 --> 01:03:35,315
"ఇప్పుడు నువ్వు పైకెళ్ళి,

895
01:03:35,399 --> 01:03:37,568
బోర్డ్‌కు మద్దతివ్వాలి" అన్నారు.

896
01:03:38,777 --> 01:03:41,446
ఇప్పుడు నేను డాక్టర్ కింగ్ జోర్డాన్‌ను

897
01:03:42,322 --> 01:03:44,241
మీకు పరిచయం చేస్తున్నాను.

898
01:03:46,076 --> 01:03:49,288
కింగ్, మీరు ఒకటి రెండు మాటలు

899
01:03:49,371 --> 01:03:51,415
వీరితో మాట్లాడాలనుకుంటున్నారా.

900
01:03:54,960 --> 01:03:59,673
గల్లాడెట్ యూనివర్శిటీకు ఏది మంచిదో

901
01:03:59,756 --> 01:04:01,675
నేను అదే చేయాలి.

902
01:04:02,217 --> 01:04:04,928
అందుకని నేనివ్వగలిగినంత

903
01:04:05,012 --> 01:04:08,182
మద్దతును ఆమెకు ఇవ్వడం
ఒక డీన్‌గా నా బాధ్యత.

904
01:04:16,773 --> 01:04:20,027
నిరసనలు ఆపేయాల్సిందిగా
మీరు విద్యార్థులను అడుగుతున్నారా?

905
01:04:21,195 --> 01:04:23,947
ఇది, ఉహ్-- నాకు చాలా
ఇబ్బందికరమైన పరిస్థితి అని,

906
01:04:24,031 --> 01:04:26,241
మీరు తెలుసుకోండి.

907
01:04:26,325 --> 01:04:30,495
ఏదైతేనేం, ఇక్కడ నాపై
దృష్టి పడినందుకు చాలా బాధగా ఉంది.

908
01:04:31,622 --> 01:04:33,665
నిజంగా నాకు కష్టంగా ఉంది.

909
01:04:34,291 --> 01:04:39,338
నేను డీన్, వారు ఒక్క క్షణంలో
నన్ను తీసేయగలరు.

910
01:04:39,421 --> 01:04:43,217
నిరసనకు స్వస్తి
పలకాల్సిన సమయం వచ్చిందంటారా?

911
01:04:46,345 --> 01:04:48,764
అవును అనుకుంటున్నాను.

912
01:04:58,232 --> 01:05:02,945
గల్లాడెట్ కొత్త ఏడవ అధ్యక్షురాలితో

913
01:05:03,028 --> 01:05:05,614
ఒక అర్థవంతమైన చర్చకు
దిగాల్సిన సమయం వచ్చింది.

914
01:05:07,115 --> 01:05:08,116
ధన్యవాదాలు.

915
01:05:11,537 --> 01:05:13,372
నేను నిర్ఘాంతపోయాను.

916
01:05:14,790 --> 01:05:17,292
మేము అతని కోసం ఎంతో చేయాలని చూస్తుంటే,

917
01:05:17,793 --> 01:05:20,462
ఈ సమయంలో ఇలాంటి పని చేసి,

918
01:05:21,213 --> 01:05:22,548
నీ పక్షాన్ని మారుస్తావా?

919
01:05:24,216 --> 01:05:26,510
నాకు చాలా
ఇబ్బందికరమైన పరిస్థితి అని,

920
01:05:26,593 --> 01:05:28,220
మీకు తెలియజేస్తున్నాను.

921
01:05:29,972 --> 01:05:34,184
నువ్వు బలహీనుడివి,
చాలా బలహీనుడివి, ఇలా చూడు!

922
01:05:35,978 --> 01:05:37,688
నీకు మద్దతునివ్వడానికి మేమిక్కడ ఉన్నాం.

923
01:05:38,021 --> 01:05:41,400
ఆ ప్రయత్నంలో నేనివ్వగలిగినంత
మద్దతును ఆమెకు ఇవ్వడం

924
01:05:41,483 --> 01:05:42,818
ఒక డీన్‌గా నా బాధ్యత.

925
01:05:42,901 --> 01:05:44,528
దగా చేసినట్లనిపించింది.

926
01:05:46,405 --> 01:05:47,573
నాకనిపించింది,

927
01:05:48,532 --> 01:05:50,993
"అతను నిజమైన బధిరుడు కాడు."

928
01:05:52,160 --> 01:05:55,622
అతని పెంపకంలో ఇమిడిన విలువలు

929
01:05:55,706 --> 01:05:59,459
వినికిడి సమాజంలోనివి,
అవే అతనిలో నాటుకుపోయాయి.

930
01:05:59,543 --> 01:06:03,046
అతను పుట్టుకతో చెవుడు
అయ్యుంటే, ఎప్పటికీ ద్రోహి కాలేడు.

931
01:06:03,547 --> 01:06:06,508
నేను ఈ స్థానానికి
కేవలం అభ్యర్ధిని మాత్రమే,

932
01:06:06,592 --> 01:06:08,260
కానీ బధిరుడిని కాబట్టి

933
01:06:08,343 --> 01:06:13,015
అవసరమైన దానికన్నా
ఎక్కువ దృష్టి నాపై పడింది.

934
01:06:15,893 --> 01:06:17,853
న్యూస్ కాన్ఫరెన్స్‌లో విషయాలను

935
01:06:17,936 --> 01:06:19,855
క్యాంపస్‌లో విద్యార్థులకు వివరించారు.

936
01:06:22,524 --> 01:06:25,027
మాకది గడ్డుకాలం.

937
01:06:25,569 --> 01:06:28,947
బధిరత మరియ
సంజ్ఞలు గురించి నేర్చుకుంటున్న నాకు,

938
01:06:29,031 --> 01:06:33,368
అవగాహన కల్పించడంలో విద్యార్థులు
సాయపడుతారని ఆశిస్తున్నాను.

939
01:06:35,954 --> 01:06:37,706
ఎప్పుడూ వాళ్ళే గెలుస్తారు.

940
01:06:40,501 --> 01:06:46,006
ఇది విద్యార్థుల
కోపాన్ని ఉధృతం చేసింది.

941
01:06:48,634 --> 01:06:51,929
దాంతో పరిస్థితులు అదుపు తప్పాయి.

942
01:06:53,305 --> 01:06:56,433
క్యాంపస్‌లో పరిపాలనా
వ్యవస్థ విచ్ఛిన్నమైంది.

943
01:06:58,644 --> 01:06:59,728
డాక్టర్ ఎలిసబెత్ జిన్సర్

944
01:06:59,811 --> 01:07:01,188
జేన్ బి

945
01:07:02,856 --> 01:07:04,900
ఇది మరింత చేజారితే,

946
01:07:04,983 --> 01:07:07,653
అదుపులోకి తీసుకురావడానికి
చర్యలు తీసుకోవల్సి ఉంటుంది.

947
01:07:10,155 --> 01:07:13,033
ఈ సాయంత్రం మా టాప్ స్టోరీలో,

948
01:07:13,116 --> 01:07:14,910
గల్లాడెట్ క్యాంపస్‌ను
అదుపులోకి తీసుకోవాలని జరిపిన

949
01:07:14,993 --> 01:07:18,539
ప్రణాళికా సమావేశాలలో
బోర్డ్ ట్రస్టీ సభ్యులు ఈ రోజంతా గడిపారు.

950
01:07:19,331 --> 01:07:23,627
"హింస వద్దు, నష్టం చేయద్దు.
హింస వద్దు, నష్టం చేయద్దు" అని

951
01:07:23,710 --> 01:07:26,630
మేము చెప్తూనే ఉన్నాం.

952
01:07:27,381 --> 01:07:30,133
మేము చాలామందిని
అరెస్ట్ చేయాల్సి ఉంటుంది.

953
01:07:33,262 --> 01:07:34,263
మేము వెనక్కి తగ్గం!!!

954
01:07:37,099 --> 01:07:39,393
ఇప్పటికే
"మాట్లాడలేనివారు

955
01:07:39,476 --> 01:07:41,812
బుద్దిహీనులు" అనే అభిప్రాయం ఉంది.

956
01:07:42,604 --> 01:07:46,733
ఇప్పుడు దానికి హింసను జోడిస్తామా?

957
01:07:47,818 --> 01:07:49,653
నడకదారి నుండి తప్పుకోండి, సర్.

958
01:07:53,031 --> 01:07:55,742
మీడియా తమ కెమెరాలతో అక్కడ ఉంది.

959
01:07:56,410 --> 01:08:00,414
మేము గొడవ చేస్తే,
మొత్తం మద్దతు పోగొట్టుకున్నట్లే.

960
01:08:01,290 --> 01:08:04,168
మాకు బయట నుండి మద్దతు
అవసరం, ముఖ్యంగా మీడియాది.

961
01:08:04,251 --> 01:08:06,461
మాపై చాలా కెమెరాలు ఉన్నాయి.

962
01:08:08,547 --> 01:08:12,342
బెదిరింపులు, భయపెట్టడం,
ప్రదర్శనలు, అల్లకల్లోలం…

963
01:08:12,426 --> 01:08:15,012
మీరేదయినా చేయబోయే ముందు

964
01:08:15,095 --> 01:08:16,430
అసలేం జరుగుతుందో నాకు తెలియాలి.

965
01:08:16,513 --> 01:08:21,310
ఇదొక సంపాదకీయం.
"ఈ ఉద్యమంలో పాల్గొనడం వల్ల

966
01:08:21,393 --> 01:08:25,856
స్కూల్ పేరు ప్రతిష్టలకు
ఎంత నష్టం జరుగుతుందో

967
01:08:25,939 --> 01:08:27,941
విద్యార్థులు అర్థం చేసుకోవట్లేదు."

968
01:08:29,276 --> 01:08:32,988
పోలీసులు ఒక విద్యార్థి ముఖంపై కొట్టారు.

969
01:08:33,488 --> 01:08:34,573
ఎవరు రాశారో కానీ…

970
01:08:36,408 --> 01:08:37,783
వెళ్ళి పని చూసుకో.

971
01:08:40,245 --> 01:08:42,247
అమెరికన్ పన్ను చెల్లింపుదారులు,

972
01:08:42,872 --> 01:08:45,584
డెబ్బైఐదు శాతం
స్కూల్ ఖర్చులను చెల్లిస్తున్నారు.

973
01:08:46,126 --> 01:08:49,087
"ఒకవేళ మీరంతా తిరిగి
క్లాస్‌ల‌కు వెళ్లకపోతే

974
01:08:49,171 --> 01:08:51,548
కేంద్ర నిధులపై కోత విధిస్తాం"
అని కాంగ్రెస్ అంటే?

975
01:08:53,634 --> 01:08:55,886
ప్రతిదీ తగలడిపోతే…

976
01:09:00,474 --> 01:09:03,519
కాంగ్రెస్ నిధులను ఉపసంహరిస్తే?

977
01:09:06,438 --> 01:09:08,232
గల్లాడెట్ మూతపడుతుంది.

978
01:09:12,653 --> 01:09:16,323
బుధవారం

979
01:09:21,828 --> 01:09:23,412
బుధవారానికి,

980
01:09:23,497 --> 01:09:26,124
మాకు మూడు రాత్రులుగా నిద్ర లేదు.

981
01:09:28,126 --> 01:09:29,127
బధిర అధ్యక్షుడు
తక్షణమే!

982
01:09:29,211 --> 01:09:31,129
మేం పెద్దగా తినలేదు.

983
01:09:32,965 --> 01:09:36,510
కాబట్టి జనం నీరసించిపోయారు.

984
01:09:38,595 --> 01:09:40,930
మీరు అలసిపోయారని తెలుసు,

985
01:09:41,014 --> 01:09:43,015
అందుకని ఈ సమావేశాన్ని కుదిస్తున్నాను--

986
01:09:45,477 --> 01:09:49,106
నేషనల్ టీవీలో ఈ సాయంత్రం
ఒక ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం

987
01:09:49,189 --> 01:09:51,649
మనకు ఇచ్చారని ఒకరు తెలియజేశారు.

988
01:09:53,193 --> 01:09:55,696
పది లక్షలమంది ప్రేక్షకులు చూడవచ్చు.

989
01:09:56,864 --> 01:10:01,201
అందుకని జిన్సర్‌తో ప్రత్యక్ష
ప్రసారంలో పాల్గొనాలని

990
01:10:01,285 --> 01:10:02,828
వారు నన్ను అడిగారు.

991
01:10:05,747 --> 01:10:07,666
ఆస్థానంలో
మీరు ఉండాలనుకున్నారా?

992
01:10:23,724 --> 01:10:25,809
కార్‌లో చాలా గాబరా పడ్డాను.

993
01:10:26,935 --> 01:10:29,521
ఇది నాకు చాలా పెద్ద బాధ్యత.

994
01:10:30,063 --> 01:10:33,942
మా గళాన్ని వినిపించే చివరి అవకాశం.

995
01:10:37,487 --> 01:10:39,531
అందుకని నా వినికిడి
సాధనం పెట్టుకున్నాను.

996
01:10:50,375 --> 01:10:52,169
నాకు వినాలనుంది,

997
01:10:52,252 --> 01:10:55,005
ఎందుకంటే ఆ పరిసరాలపై
అవగాహన ఉండాలి.

998
01:10:58,342 --> 01:11:00,552
ఒక నిమిషంలో
ప్రత్యక్షప్రసారం ప్రారంభం.

999
01:11:06,767 --> 01:11:09,311
- మీరు సిద్ధమా?
- రోలింగ్.

1000
01:11:29,206 --> 01:11:32,793
గల్లాడెట్
బధిరుల యూనివర్సిటీ విద్యార్థులు

1001
01:11:32,876 --> 01:11:37,130
తమ మాట పట్టించుకోవడం లేదని

1002
01:11:37,214 --> 01:11:40,008
యాజమాన్యంపై ఆరోపిస్తూ,
విద్యాసంస్థను మూసివేశారు.

1003
01:11:40,425 --> 01:11:43,512
నేను నా స్నేహితులతో నా గదిలో ఉన్నాను.

1004
01:11:43,595 --> 01:11:47,140
చాలామంది విద్యార్థులు
పలు గదులలో కలిసి ఉన్నారు.

1005
01:11:47,558 --> 01:11:50,310
ఆమె మన అతిథులలో ఒకరు,

1006
01:11:50,394 --> 01:11:54,147
అలాగే గల్లాడెట్ విద్యార్థి సంఘానికి
కాబోయే అధ్యక్షుడు, గ్రెగ్ హ్లిబోక్.

1007
01:11:54,523 --> 01:11:57,818
తొమ్మిది, ఎనిమిది, ఏడు, ఆరు…

1008
01:11:57,901 --> 01:12:02,656
…ఐదు, నాలుగు,
మూడు, రెండు, ఒకటి.

1009
01:12:04,533 --> 01:12:05,450
ఆరంభించండి.

1010
01:12:08,370 --> 01:12:11,331
ఇది ఎబిసి న్యూస్ నైట్‌లైన్,

1011
01:12:11,415 --> 01:12:14,626
వాషింగ్టన్ నుండి
నివేదిస్తున్నది, టెడ్ కొప్పెల్.

1012
01:12:16,003 --> 01:12:18,547
మీకు కాస్త వింతగా అనిపించవచ్చు,

1013
01:12:18,630 --> 01:12:20,507
కానీ దేశంలో శ్రవణ సమస్య గల వారికి

1014
01:12:20,591 --> 01:12:23,760
అందుబాటులో ఉండాల్సిన
కార్యక్రమం ఏదైనా ఉందంటే,

1015
01:12:23,844 --> 01:12:25,679
అది ఇదే.

1016
01:12:25,762 --> 01:12:28,015
ఎంతోమంది బధిరులు
లేదా శ్రవణ సమస్య ఉన్నవారికి

1017
01:12:28,098 --> 01:12:33,103
క్లోజ్డ్ క్యాప్షన్‌లు అందుబాటులో లేవు,
ఈరాత్రి మీరంతా చదువుతూ చూడవచ్చు.

1018
01:12:33,187 --> 01:12:35,564
మీరు వింటూ, చూస్తున్న ఈ కథ

1019
01:12:35,647 --> 01:12:38,525
మన మధ్య శ్రవణ వైకల్యమున్న
వారికి అత్యంత ముఖ్యమైనది.

1020
01:12:39,067 --> 01:12:40,819
తొంభై సెకండ్లలో లైవ్ వెళ్తున్నాం.

1021
01:12:41,570 --> 01:12:44,531
ఆలోచించాల్సినవి ఎన్నో ఉన్నాయి,

1022
01:12:44,615 --> 01:12:47,159
ఆ ఆలోచనలన్నీ
నా బుర్రలో తిరుగుతున్నాయి.

1023
01:12:48,118 --> 01:12:51,079
ఆపై మీడియా వారు
వారి అభిప్రాయాలు చెప్తున్నారు,

1024
01:12:51,413 --> 01:12:54,041
ఆపై మేకప్ వేస్తున్నారు, నన్ను
ప్రతిఒక్కరూ తడుముతున్నారు.

1025
01:12:56,251 --> 01:12:59,838
నేను, "వద్దు, వద్దు, వద్దు,
చాలా ఎక్కువైంది అన్నాను.

1026
01:13:01,465 --> 01:13:02,799
నేను దృష్టి పెట్టాలి."

1027
01:13:06,845 --> 01:13:08,639
తర్వాత
నాకు నేను చెప్పుకున్నాను…

1028
01:13:11,391 --> 01:13:13,143
"నేను బధిరుడిని.

1029
01:13:14,645 --> 01:13:16,063
అదే నేను.

1030
01:13:16,897 --> 01:13:18,524
నేను చేయగలిగిందల్లా…

1031
01:13:20,359 --> 01:13:21,527
నేను నాలాగ ఉండడమే."

1032
01:13:21,610 --> 01:13:25,447
నాలుగు, మూడు, రెండు, ఒకటి.

1033
01:13:55,978 --> 01:13:57,271
డాక్టర్ జిన్సర్…

1034
01:13:57,354 --> 01:13:59,606
యూనివర్సిటీ తన పని తాను చేసుకోవాలి,

1035
01:13:59,690 --> 01:14:02,109
నాతో కాకపోతే, మరొకరితో
చేయించుకోవాలన్న మాట

1036
01:14:02,192 --> 01:14:05,529
మీరు చెప్పాల్సిన సమయం
వచ్చిందనుకుంటున్నారా?

1037
01:14:05,612 --> 01:14:07,322
ప్రస్తుతం నన్ను రాజీనామా చేయమని

1038
01:14:07,406 --> 01:14:10,450
చాలా దృఢమైన అభిప్రాయాన్ని

1039
01:14:10,534 --> 01:14:13,287
నాకు పంపుతున్నారు.

1040
01:14:13,370 --> 01:14:17,332
కానీ అది ఏకగ్రీవ
నిర్ణయమని నేను నమ్మట్లేదు.

1041
01:14:17,416 --> 01:14:20,377
నాకు మద్దతుగా అనేక సంకేతాలు…

1042
01:14:20,460 --> 01:14:22,129
జిన్సర్ ఎలా చేశారు?

1043
01:14:23,714 --> 01:14:25,424
ఆమె చాలా ప్రొఫెషనల్‌గా ఉంది.

1044
01:14:25,507 --> 01:14:28,635
నాకు కింగ్ జోర్డాన్ నుండి
అనేక మద్దతు సంకేతాలు వచ్చాయి.

1045
01:14:28,719 --> 01:14:29,970
చాలా ప్రశాంతంగా ఉంది.

1046
01:14:30,053 --> 01:14:31,972
ఇప్పుడు మీరు చెప్పండి, గ్రెగ్

1047
01:14:32,055 --> 01:14:33,432
అందరికీ ప్రయోజనం చేకూర్చే

1048
01:14:33,515 --> 01:14:36,143
పరిష్కారం సృష్టించడానికి
మీరు సిద్ధంగా ఉన్నారా?

1049
01:14:36,226 --> 01:14:37,686
దీంతో ఎవరికీ లాభం లేదు.

1050
01:14:38,478 --> 01:14:39,938
సరే, టెడ్…

1051
01:14:41,815 --> 01:14:43,901
నేను డాక్టర్ జిన్సర్‌ను
ఉద్దేశించి మాట్లాడుతున్నాను,

1052
01:14:43,984 --> 01:14:47,321
ఎందుకంటే ఆమె మాటలకు
సమాధానమివ్వడం చాలా ముఖ్యం.

1053
01:14:47,404 --> 01:14:50,115
సరే, నేను అడిగిన ప్రశ్నకు

1054
01:14:50,199 --> 01:14:52,117
సూటిగా సమాధానం చెప్పండి. అదేమిటంటే,

1055
01:14:52,201 --> 01:14:54,286
దీనిపై ఇంత చర్చ జరిగిన తరువాత,

1056
01:14:54,369 --> 01:14:57,539
రేపటి రోజున, మీరు కూర్చుని…

1057
01:14:57,623 --> 01:14:59,124
గ్రెగ్ ఎలా చేశారు?

1058
01:15:00,459 --> 01:15:01,543
దాదాపుగా,

1059
01:15:01,627 --> 01:15:05,297
"నా గురించి మాట్లాడుతున్నారు,
నేను నేషనల్ టీవీలో వస్తున్నాను…"

1060
01:15:05,964 --> 01:15:07,341
అభద్రతా భావంతో ఉన్నాడు.

1061
01:15:08,300 --> 01:15:10,594
…ఒక పరిష్కారం
ఆలోచించడం సాధ్యమేనా?

1062
01:15:10,677 --> 01:15:12,804
మనం విద్యా సంవత్సరం ఆఖరుకు వచ్చేశాం,

1063
01:15:12,888 --> 01:15:15,516
ఇక్కడ ఎంతో మంది జీవితాలు స్తంభించాయి.

1064
01:15:15,599 --> 01:15:18,644
ఇలాంటి సమయంలో మనం
దేన్నైనా చర్చల ద్వారా సాధించలేమా?

1065
01:15:19,895 --> 01:15:23,482
నేను కూర్చుని ఆలోచిస్తున్నాను,
"ఇది నిజంగా బాగలేదు."

1066
01:15:24,525 --> 01:15:26,109
బహుశా నేను భయపడ్డాను.

1067
01:15:26,193 --> 01:15:28,820
కాబట్టి బోర్డ్ ట్రస్టీలు
నన్ను తప్పుకోమని చెప్పేవరకూ

1068
01:15:28,904 --> 01:15:31,573
గత ఆదివారం రాత్రి నేను అంగీకరించిన

1069
01:15:31,657 --> 01:15:37,120
బాధ్యతలను నిర్వర్తించడానికి
కట్టుబడి ఉన్నాను…

1070
01:15:38,080 --> 01:15:39,623
అతను అడ్డుకోలేదు.

1071
01:15:40,040 --> 01:15:44,002
…ప్రెసిడెంట్‌గా సేవ చేయమని
ఆహ్వానించడంతో ఈ స్థానాన్ని స్వీకరించాను…

1072
01:15:44,086 --> 01:15:48,257
అతని మనస్తత్వం కూడా
మిగిలిన బధిరుల వంటిదే.

1073
01:15:50,092 --> 01:15:51,468
సరిగ్గా మా నాన్నలా.

1074
01:15:53,345 --> 01:15:56,390
"నన్ను బేస్మెంట్‌లో పెడుతారా? సరే."

1075
01:15:58,725 --> 01:16:00,352
అతను దానిని అంగీకరించాడు.

1076
01:16:03,647 --> 01:16:05,148
అదొక అలవాటు.

1077
01:16:06,233 --> 01:16:08,944
వారు చాలా ఆలస్యం చేశారు,

1078
01:16:09,027 --> 01:16:11,488
మరియు వారికున్న ప్రగాఢ నమ్మకమేమిటంటే,

1079
01:16:11,572 --> 01:16:14,741
బధిరులు అసమర్థులు అనుకుంటారు.

1080
01:16:15,534 --> 01:16:17,494
నీకు చెప్పినది చేయి.

1081
01:16:17,578 --> 01:16:18,912
ఉన్నచోటే ఉండు.

1082
01:16:18,996 --> 01:16:22,291
వాళ్ళు చేయలేరన్న మాటను
జీవితాంతం ఒంటబట్టించుకుంటారు.

1083
01:16:22,374 --> 01:16:24,793
అందుకే "కుదరదు" అన్న పదం…

1084
01:16:26,420 --> 01:16:28,839
అది వారి తలల్లో నాటుకుపోయింది.

1085
01:16:32,259 --> 01:16:34,970
మిమ్మల్ని మరొక్క ప్రశ్న అడిగి,
ఈ చర్చను ఇంతటితో ముగిద్దాం.

1086
01:16:35,053 --> 01:16:35,971
డాక్టర్ జిన్సర్,

1087
01:16:36,054 --> 01:16:39,183
ఈ విషయాన్ని మనసున్న వ్యక్తిగా
అర్థం చేసుకుంటారని తెలుసు.

1088
01:16:39,266 --> 01:16:41,059
మరి "వీళ్ళందరికీ ఇదంత ముఖ్యమైతే

1089
01:16:41,143 --> 01:16:42,519
నేను తప్పుకుంటాను" అని కూడా

1090
01:16:42,603 --> 01:16:44,021
మీరు అనగలిగే స్థాయికి

1091
01:16:44,104 --> 01:16:45,689
దీన్ని అర్థం చేసుకోగలరా?

1092
01:16:45,772 --> 01:16:48,901
తదుపరి అధ్యక్షులు ఎవరనే
విషయాన్ని తీర్మానించే అధికారం

1093
01:16:48,984 --> 01:16:52,279
ట్రస్టీల బోర్డ్‌కు ఉంది.
నాకు ఆ అర్హత లేదు.

1094
01:16:52,362 --> 01:16:53,864
చివరి 30 సెకండ్లు.

1095
01:16:53,947 --> 01:16:55,616
ధన్యవాదాలు, టెడ్. బధిరులకు

1096
01:16:55,699 --> 01:16:57,701
గొప్ప సామర్ధ్యం ఉందని నమ్ముతున్నాను--

1097
01:16:57,784 --> 01:16:58,994
మరి నిరూపించండి!

1098
01:17:01,997 --> 01:17:04,208
నేను నా ప్రకటనను పూర్తి చేయవచ్చా?

1099
01:17:07,878 --> 01:17:11,673
నేను నిజంగా--
దృఢంగా నమ్ముతున్నాను,

1100
01:17:11,757 --> 01:17:13,300
ఒక బధిరుడు ఏదో ఒక రోజున--

1101
01:17:13,383 --> 01:17:16,136
లేదు, అది పాత కథ.
ఈ ప్రకటనతో విసిగిపోయాను.

1102
01:17:16,220 --> 01:17:18,597
"ఒక రోజు" మళ్ళీ, మళ్ళీ.
"ఏదో ఒక రోజు ఒక బధిరుడు…"

1103
01:17:18,680 --> 01:17:20,015
మనం ఈ ఒరవడిని ఆపాలి.

1104
01:17:21,266 --> 01:17:23,685
దీనిని 124 ఏళ్ళుగా మేము వింటున్నాం.

1105
01:17:23,769 --> 01:17:25,562
ఈ ప్రకటన వినీ వినీ విసిగిపోతున్నాం.

1106
01:17:26,188 --> 01:17:28,023
చివరకు మాట్లాడడం మొదలుపెట్టాడు.

1107
01:17:28,106 --> 01:17:29,233
ఇది కేవలం ఒక ఒరవడి.

1108
01:17:29,316 --> 01:17:32,152
ప్రతిసారీ ఒక కొత్త అధ్యకుడు
వచ్చి, "ఒక రోజు" అంటుంటారు.

1109
01:17:32,236 --> 01:17:34,404
పాత అధ్యక్షుడు ఇదే అనేవారు.
"ఏదో ఒకరోజు…"

1110
01:17:34,488 --> 01:17:36,823
మనం ఇంకొంచెం సేపు కొనసాగిద్దాం.

1111
01:17:36,907 --> 01:17:39,368
దీనికి సమాధానమివ్వడానికి
డాక్టర్ జిన్సర్‌కు అవకాశం ఇవ్వాలి.

1112
01:17:39,451 --> 01:17:42,996
ధన్యవాదాలు, టెడ్. యూనివర్సిటీ
భవిష్యత్తులో కొనసాగడానికి

1113
01:17:43,080 --> 01:17:46,208
నిరంతర శక్తి అవసరమని నేను సూచిస్తున్నాను.

1114
01:17:46,291 --> 01:17:48,085
- ఐనప్పటికీ--
- క్షమించండి.

1115
01:17:49,086 --> 01:17:53,173
ఒక బధిరుడు దాన్ని భవిష్యత్తులో
కొనసాగించలేరు అంటున్నారా?

1116
01:17:53,257 --> 01:17:55,008
కానే కాదు.

1117
01:17:55,968 --> 01:17:59,763
గ్రెగ్, నీకు కోపం తెప్పించే ప్రకటన
చేసినందుకు క్షమాపణ చెప్తున్నాను.

1118
01:18:00,430 --> 01:18:03,350
అతని సంజ్ఞలలో భావోద్వేగం పెరిగింది.

1119
01:18:04,726 --> 01:18:06,979
గత అధ్యక్షులు, ఏ బధిర నాయకుడిని

1120
01:18:07,062 --> 01:18:10,232
అందించలేకపోయారంటే
వారు విఫలమయ్యారని తెలుస్తుంది.

1121
01:18:10,315 --> 01:18:11,775
తన గళం విప్పాడు.

1122
01:18:11,859 --> 01:18:14,111
చూడండి, బోర్డ్‌లో
17 మంది వినగల్గిన వారున్నారు.

1123
01:18:14,528 --> 01:18:16,655
దాదాపు అందరూ అస్సలు సంజ్ఞ చేయలేరు.

1124
01:18:16,738 --> 01:18:18,782
వాళ్ళందరికీ బధిరుల గురించి ఏమీ తెలియదు.

1125
01:18:18,866 --> 01:18:22,703
ఏడాదికి మూడుసార్లు వచ్చి,
కలిసి, ఓటు వేసి వెళ్లిపోతారు.

1126
01:18:22,786 --> 01:18:25,122
నేను వీలైనంత బధిరుడిగా ఉండాలనుకున్నాను.

1127
01:18:25,205 --> 01:18:27,040
వారి బధిరత గురించి ఏమీ తెలియదు.

1128
01:18:27,124 --> 01:18:29,543
డాక్టర్ జిన్సర్ బోర్డ్
ట్రస్టీలను అనుసరించకూడదు.

1129
01:18:29,626 --> 01:18:33,463
వాళ్ళు మా కోరికలను, ఆకాంక్షలను
అనుసరించాలి, ఎందుకంటే మాకు తెలుసు.

1130
01:18:33,547 --> 01:18:35,424
సరే మిత్రులారా,

1131
01:18:35,507 --> 01:18:37,467
మనం ఇక దీనికి ఒక ముగింపు పలకాల్సిందే.

1132
01:18:37,551 --> 01:18:39,469
ఈరాత్రికి ఇదీ మన అంశం,
నేను టెడ్ కొప్--

1133
01:18:56,361 --> 01:19:00,407
గురువారం

1134
01:19:21,386 --> 01:19:23,388
బధిర అధ్యక్షుడు తక్షణమే కోసం
హారన్ మ్రోగించండి

1135
01:19:40,864 --> 01:19:44,159
వారికి వినిపించని కార్ హారన్‌ల‌ మద్దతుతో

1136
01:19:44,243 --> 01:19:45,911
విద్యార్థుల బలం పెరుగుతుంది.

1137
01:19:45,994 --> 01:19:48,247
బధిర శక్తి
అమెరికా మమ్మల్ని చూడాలి/వినాలి!

1138
01:19:48,330 --> 01:19:51,083
ప్రజలు కిటికీల నుండి చేతులు ఊపుతున్నారు.

1139
01:19:52,042 --> 01:19:52,918
హారన్

1140
01:19:56,713 --> 01:19:59,800
అది-- క్షమించండి.

1141
01:19:59,883 --> 01:20:00,717
క్షమించండి.

1142
01:20:03,178 --> 01:20:05,430
ఇది వినడానికి కదా, తెలుసు.

1143
01:20:07,516 --> 01:20:09,935
నేను వార్తాపత్రిక తెరిచాను, మొదటి పేజీ.

1144
01:20:10,811 --> 01:20:12,729
గల్లాడెట్ నిరసనలో జాతీయ బృందాల చేరాయి

1145
01:20:14,731 --> 01:20:16,316
ఒళ్ళు గగుల్పొడిచింది.

1146
01:20:16,400 --> 01:20:17,776
దేశంలోని ఏకైక బధిర

1147
01:20:17,860 --> 01:20:20,904
లిబరల్ ఆర్ట్స్ కళాశాలలో
మొదలైన ఒక విద్యార్థి నిరసన

1148
01:20:20,988 --> 01:20:22,823
ఈరాత్రి దేశ దృష్టిని ఆకర్షిస్తుంది.

1149
01:20:22,906 --> 01:20:24,616
నేను విద్యార్థులకు మద్దతిస్తున్నాను.

1150
01:20:24,700 --> 01:20:25,659
ఇది అత్యవసరం.

1151
01:20:25,742 --> 01:20:27,369
ఇది మంచి ఆలోచన.

1152
01:20:28,078 --> 01:20:30,539
ఇది బలంగా పెల్లుబికింది.

1153
01:20:32,666 --> 01:20:34,877
దేశ నలుమూలల నుండి
ధనం మరియు మద్దతిస్తామని

1154
01:20:34,960 --> 01:20:36,920
మరిన్ని కాల్స్ వచ్చాయి.

1155
01:20:37,588 --> 01:20:39,339
విరాళాలను,
జాతీయ బధిర సంఘం ద్వారా,

1156
01:20:39,423 --> 01:20:43,719
తక్షణమే బధిర అధ్యక్షుడు
ఉద్యమానికి పంపించవచ్చు.

1157
01:20:44,970 --> 01:20:47,055
తమ ఉద్యమానికి 27000 డాలర్లకు పైగా

1158
01:20:47,139 --> 01:20:50,267
సేకరించామని విద్యార్థులు పేర్కొన్నారు.

1159
01:20:50,350 --> 01:20:52,644
మేము మరింత దృఢంగా,

1160
01:20:52,728 --> 01:20:54,980
మరియు మా బృందం పెద్దదవుతుంది.

1161
01:20:56,148 --> 01:20:59,276
నన్ను ఇంటర్వ్యూ ఇవ్వమని
అందరూ పదేపదే అడుగుతున్నారు.

1162
01:20:59,359 --> 01:21:00,360
గ్రెగ్ "హ్లె-బాక్."

1163
01:21:00,444 --> 01:21:01,695
గ్రెగ్ హ్లిబోక్.

1164
01:21:01,778 --> 01:21:03,322
అతను గ్రెగ్ "హిల్-బోక్."

1165
01:21:03,822 --> 01:21:05,824
ఎవరో వచ్చి నాకు మైక్రోఫోన్ ఇచ్చారు,

1166
01:21:05,908 --> 01:21:09,077
నేను, "ఓహ్ వద్దు, నాకది అక్కర్లేదు.
పర్లేదు, ధన్యవాదాలు" అన్నాను.

1167
01:21:09,703 --> 01:21:11,747
వాళ్ళు యూనివర్సిటీ మేలు కోరి

1168
01:21:11,830 --> 01:21:13,081
చేస్తున్నారని అనిపించట్లేదా?

1169
01:21:13,582 --> 01:21:14,458
లేదు.

1170
01:21:16,668 --> 01:21:17,669
దేశం నలుమూలల నుండి

1171
01:21:17,753 --> 01:21:21,089
బస్సులకొద్దీ ప్రజలు
పాల్గొనడానికి ఇక్కడికి వస్తున్నారని

1172
01:21:21,173 --> 01:21:23,550
మాకున్న సమాచారం.

1173
01:21:24,927 --> 01:21:27,137
మాకు దేశంలో నుండే కాకుండా,

1174
01:21:27,221 --> 01:21:29,014
ప్రపంచవ్యాప్త నివేదికలు అందుతున్నాయి.

1175
01:21:29,097 --> 01:21:30,682
స్వీడన్, జర్మనీ, ఆఫ్రికా.

1176
01:21:31,683 --> 01:21:33,477
చైనా నుండి ఒక ఫ్యాక్స్ వచ్చింది.

1177
01:21:33,936 --> 01:21:36,605
నాకు చైనీస్ భాష అర్థం కాలేదు కానీ,

1178
01:21:36,688 --> 01:21:39,399
అందులో ఉత్సాహంగానున్న
ఒక వ్యక్తి ఫోటో ఉంది.

1179
01:21:44,571 --> 01:21:46,865
ఇది మా పౌర హక్కుల ఉద్యమానికి తొలి అడుగు.

1180
01:21:48,659 --> 01:21:50,285
గల్లాడెట్ విద్యార్థులను

1181
01:21:50,369 --> 01:21:52,538
అణచివేశారు అనడంలో మీ ఉద్ద్యేశం ఏమిటి?

1182
01:21:52,621 --> 01:21:55,916
తెల్లజాతివారు,
నల్లజాతివారి కోసం మాట్లాడుతారా?

1183
01:21:57,125 --> 01:21:59,086
రోడ్లలో చాలామంది
ఆఫ్రికన్ అమెరికన్‌లు

1184
01:21:59,169 --> 01:22:00,587
మమ్మల్ని ప్రోత్సహించారు.

1185
01:22:01,797 --> 01:22:02,881
వాళ్ళు అర్థం చేసుకున్నారు.

1186
01:22:02,965 --> 01:22:04,550
…వినికిడి ప్రపంచంలో పనిచేయడానికి!

1187
01:22:04,633 --> 01:22:08,428
బధిరులు మౌనంగా,
అల్ప సంఖ్యాక వర్గంగా ఉండేవారు.

1188
01:22:10,722 --> 01:22:12,683
ఈవారం ఎక్కువ
డిమాండ్ చేస్తున్నది వారే.

1189
01:22:16,436 --> 01:22:20,274
వినగల్గిన వారు
మాకోసం ఏం చేస్తారో చెప్తుంటారు.

1190
01:22:20,357 --> 01:22:22,568
వాళ్ళ తరచుగా చెప్పేదేమిటంటే,
"మేము మీకు సాయం చేస్తాం"

1191
01:22:22,651 --> 01:22:25,404
కానీ మేం అడిగేది…

1192
01:22:25,487 --> 01:22:27,489
- మీకు మీరే చేసుకోగలరని?
- అవును.

1193
01:22:29,783 --> 01:22:31,702
ట్రస్టీల చర్యలపై-

1194
01:22:31,785 --> 01:22:34,830
అసంతృప్తిగా ఉన్నాం.
విద్యార్థులు చెప్పేది సరైనదే.

1195
01:22:34,913 --> 01:22:38,458
ట్రస్టీలు తమ తప్పును
అంగీకరించే సమయం వచ్చింది.

1196
01:22:39,042 --> 01:22:40,169
మేము ఇకపై ఆగము.

1197
01:22:40,252 --> 01:22:41,628
మేము పోరాటాన్ని కొనసాగిస్తాం.

1198
01:22:41,712 --> 01:22:43,630
మునుపు మేం చీకట్లో ఉన్నాం…

1199
01:22:45,424 --> 01:22:47,759
ఇప్పుడు ప్రపంచం మమ్మల్ని చూడగలదు.

1200
01:22:47,843 --> 01:22:49,887
మేము బలం పుంజుకుంటూ పుంజుకుంటూ

1201
01:22:49,970 --> 01:22:52,014
ఇప్పుడు నిజంగా శక్తివంతులయ్యాం.

1202
01:22:56,185 --> 01:23:00,522
అప్పటిదాకా దానిని
కేవలం విద్యార్ది నిరసన అనుకున్నాను.

1203
01:23:01,148 --> 01:23:03,066
ఇది కేవలం ఒక నిరసన కాదని

1204
01:23:03,150 --> 01:23:07,196
అర్థం చేసుకోవడానికి
నాకు కొంత సమయం పట్టింది.

1205
01:23:07,279 --> 01:23:09,239
ఇది ఒక విప్లవం.

1206
01:23:15,120 --> 01:23:17,122
తర్వాత అక్కడ కూర్చుని ఆలోచించాను,

1207
01:23:17,623 --> 01:23:19,583
"అసలు నేనేం చేశాను?

1208
01:23:19,666 --> 01:23:21,543
ప్రస్తుతానికి నేను డీన్…

1209
01:23:22,544 --> 01:23:25,339
కానీ శాశ్వతంగా బధిరుడిగానే ఉంటాను."

1210
01:23:26,715 --> 01:23:28,133
నిన్న,

1211
01:23:28,217 --> 01:23:33,805
గల్లాడెట్ యూనివర్సిటీకి
అధ్యక్షుడిని ప్రకటించే

1212
01:23:33,889 --> 01:23:36,725
చట్టబద్ధమైన అధికారం ఉందని,
నేను ఒక ప్రకటన చేశాను.

1213
01:23:37,643 --> 01:23:42,356
నిజానికి వారి నిర్ణయంతో
నాకు కోపం వచ్చింది,

1214
01:23:42,439 --> 01:23:44,900
ఇప్పటికీ కోపంగా ఉన్నాను.

1215
01:23:45,651 --> 01:23:50,155
గల్లాడెట్ సంఘం యొక్క అభిప్రాయానికి

1216
01:23:50,239 --> 01:23:54,368
బహిరంగంగా నా మద్దతును అందించాలి.

1217
01:23:55,202 --> 01:23:59,331
ఆపై కింగ్, "నేను తప్పు చేశాను" అన్నారు,

1218
01:23:59,831 --> 01:24:02,417
మేమంతా, "ఓహ్, ఓహ్" అనుకున్నాం.

1219
01:24:02,835 --> 01:24:05,712
ఒక మంచి
అభ్యాసకుడే మంచి ఉపాధ్యాయుడని

1220
01:24:05,796 --> 01:24:07,589
మనం తరచుగా అంటుంటాం.

1221
01:24:07,673 --> 01:24:11,635
గల్లాడెట్ యూనివర్సిటీ, తన
విద్యార్థుల నుండి చాలా నేర్చుకుంటోంది.

1222
01:24:12,261 --> 01:24:15,931
వారు మా గురువులు అయ్యారు.

1223
01:24:16,014 --> 01:24:21,019
ఇదే మన సమయమని పట్టుబట్టిన
గల్లాడెట్ యూనివర్సిటీ విద్యార్థులకు

1224
01:24:21,103 --> 01:24:25,065
బధిరులంతా ఋణపడి ఉన్నారు.

1225
01:24:28,151 --> 01:24:30,362
గల్లాడెట్ విద్యార్థి నాయకులలో ఒకరైన

1226
01:24:30,445 --> 01:24:32,406
బ్రిడ్జేట్ బోర్న్ నాతో ఉన్నారు.

1227
01:24:32,489 --> 01:24:34,783
డాక్టర్ జోర్డాన్ మనసు మార్చుకోవడంపై

1228
01:24:34,867 --> 01:24:37,286
విద్యార్థుల ప్రతిస్పందన ఏమిటో చెప్తారా?

1229
01:24:38,328 --> 01:24:40,372
ఆయన మేలుకున్నారు.

1230
01:24:41,081 --> 01:24:43,083
"నేను తెలుసుకున్నాను" అన్నట్లుగా ఉంది.

1231
01:24:45,127 --> 01:24:48,589
మరింత మెరుగైన, సరికొత్త బధిరుడుగా మారారు.

1232
01:24:49,381 --> 01:24:52,426
"ఓహ్, నేను ఓడిపోయాను…" అని
అనుకోకుండా అర్థం చేసుకున్నారు.

1233
01:24:53,260 --> 01:24:54,303
లేదు.

1234
01:24:56,221 --> 01:24:58,015
బధిరుడుగా ఉన్నా పర్లేదు.

1235
01:25:01,894 --> 01:25:04,605
నిన్న మీరు
అధ్యక్షురాలు జిన్సర్‌తో నిలబడ్డారు.

1236
01:25:04,688 --> 01:25:06,356
ఈరాత్రి వారు ఇది చూస్తుంటే,

1237
01:25:06,440 --> 01:25:08,984
మీరు వారికి ఇవ్వాలనుకునే సందేశం ఏమిటి?

1238
01:25:11,820 --> 01:25:14,239
డాక్టర్ జిన్సర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి…

1239
01:25:16,700 --> 01:25:19,453
దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో గమనించి,

1240
01:25:19,536 --> 01:25:21,747
ఇది నిజంగా బధిరులకు ఎంత ముఖ్యమైనదో

1241
01:25:21,830 --> 01:25:24,041
ఆమె చాలా లోతుగా ఆలోచించాలి.

1242
01:25:36,803 --> 01:25:39,515
గ్రెగ్ ఉన్నావా జిఎ

1243
01:25:45,521 --> 01:25:48,023
నేను గల్లాడెట్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు

1244
01:25:49,274 --> 01:25:51,527
పెరుగుతున్న సంక్షోభాన్ని గమనించాను.

1245
01:25:58,742 --> 01:25:59,952
నేను లేచాను…

1246
01:26:01,745 --> 01:26:05,123
ఆ ముందు రాత్రి, అందరూ నిద్రపోతుండగా

1247
01:26:06,416 --> 01:26:08,669
ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది.

1248
01:26:10,629 --> 01:26:14,383
ఈ హోదాకు
విశేషమైన గుర్తింపు ఉంది,

1249
01:26:14,466 --> 01:26:17,928
కావున మేం అసలు సమస్యపై స్పందించాలి.

1250
01:26:18,929 --> 01:26:20,764
పరిస్థితులను పునరుద్దరించాలంటే

1251
01:26:20,848 --> 01:26:23,350
నా రాజీనామా సమర్పించడమే ఉత్తమమైన మార్గమని

1252
01:26:23,433 --> 01:26:24,852
నేను అర్థం చేసుకున్నాను.

1253
01:26:27,354 --> 01:26:29,857
వావ్, ఆమె రాజీనామా చేసింది!

1254
01:26:38,532 --> 01:26:41,326
అందరూ, "టిటివై,
నువ్వే ఉపయోగించాలి" అన్నారు.

1255
01:26:45,706 --> 01:26:48,166
అందుకని క్యాంపస్‌లోకి వెళ్ళాను.

1256
01:26:53,463 --> 01:26:57,718
ఆదివారం

1257
01:27:03,473 --> 01:27:07,060
నేను వ్యాన్‌లోకి ఎక్కగానే,
వారు వేగంగా నడిపారు.

1258
01:27:07,644 --> 01:27:10,439
నాకు తలుపు మూసే అవకాశం కూడా లేదు.

1259
01:27:17,654 --> 01:27:21,283
ఒక గాజు గదిలో టిటివై ఉంది.

1260
01:27:22,743 --> 01:27:26,705
చిన్న బుడ్డీలో చేపను చూసినట్లు,
అందరూ నన్నే చూస్తున్నారు.

1261
01:27:28,874 --> 01:27:30,959
నేను గ్రెగ్ జిఏ

1262
01:27:33,670 --> 01:27:35,589
నేను గ్రెగ్ పక్కనే ఉన్నాను.

1263
01:27:36,173 --> 01:27:40,677
నేను, టిమ్, బ్రిడ్జెటా, మేము నలుగురం.

1264
01:27:42,304 --> 01:27:43,931
చాలా దగ్గరగా ఉన్నాం.

1265
01:27:50,354 --> 01:27:52,731
అది, "నీ సోదరులు
ఎవరు?" అని అడిగింది.

1266
01:27:53,649 --> 01:27:56,693
నాలాగ మరో వ్యక్తి
నటించట్లేదని నిర్దారించడానికి.

1267
01:27:59,112 --> 01:28:00,489
బ్రూస్ స్టీవెన్ నాన్సీ

1268
01:28:02,574 --> 01:28:04,618
జేన్ బాసెట్ స్పిల్మాన్,

1269
01:28:05,285 --> 01:28:08,247
మీతో ఒక ప్రకటన పంచుకోవాలనుకుంటుంది.

1270
01:28:08,330 --> 01:28:09,581
మిసెస్ స్పిల్మాన్?

1271
01:28:11,500 --> 01:28:12,876
గుడ్ ఈవినింగ్.

1272
01:28:14,628 --> 01:28:17,881
మనం సమస్యల జటిలత్వాన్ని

1273
01:28:17,965 --> 01:28:20,801
అర్థం చేసుకోవడంలో ఉన్న తీవ్ర అంతరాన్ని

1274
01:28:20,884 --> 01:28:24,346
ఈ వారం చవి చూశాం.

1275
01:28:24,429 --> 01:28:28,058
కొందరి దృష్టిలో,
యూనివర్సిటీ భవిష్యత్తుకు

1276
01:28:28,141 --> 01:28:30,310
నేను ఆటంకంగా మారాను.

1277
01:28:33,230 --> 01:28:35,858
నేను మీకు తెలియజేయాలనుకున్నది…

1278
01:28:36,859 --> 01:28:40,612
గల్లాడెట్ భవిష్యత్తు గురించి
అత్యంత శ్రద్ద వహిస్తూ,

1279
01:28:41,113 --> 01:28:43,323
నేను ఆ ఆటంకాన్ని తొలగిస్తున్నాను.

1280
01:28:44,449 --> 01:28:46,410
ఈరోజున నా రాజీనామాను సమర్పించాను.

1281
01:28:49,454 --> 01:28:52,457
స్పిల్మాన్ రాజీనామా చేసింది

1282
01:28:53,584 --> 01:28:56,170
ఆ గది దద్దరిల్లింది.

1283
01:28:56,253 --> 01:29:00,549
టిటివైలో వాటికవే అక్షరాలు
రావడం మొదలయ్యాయి.

1284
01:29:07,347 --> 01:29:09,057
కేవలం ఒక అధ్యక్షుడిని

1285
01:29:09,141 --> 01:29:12,144
ఎంచుకోవడానికి బోర్డ్‌ను పిలవలేదు,

1286
01:29:12,227 --> 01:29:15,272
ఒక కలను సాకారం చేయమని కోరాం.

1287
01:29:16,190 --> 01:29:18,442
ప్రపంచంలోని బధిరులు,

1288
01:29:18,525 --> 01:29:20,068
మరియు శ్రవణ లోపం ఉన్నవారి కోసమున్న

1289
01:29:20,152 --> 01:29:22,946
అత్యంత గొప్ప విద్యాసంస్థకు

1290
01:29:23,030 --> 01:29:25,407
ఒక బధిర వ్యక్తిని అధ్యక్ష పదవికి

1291
01:29:25,490 --> 01:29:26,491
ప్రోత్సహించడం కోసం.

1292
01:29:28,452 --> 01:29:30,329
ఐ కింగ్ అధ్యక్షుడు

1293
01:29:34,875 --> 01:29:36,793
విద్యార్థులు మరియ వారి నాయకులు:

1294
01:29:37,377 --> 01:29:38,504
టిమ్,

1295
01:29:39,296 --> 01:29:40,422
బ్రిడ్జెటా,

1296
01:29:40,506 --> 01:29:41,632
గ్రెగ్,

1297
01:29:41,715 --> 01:29:43,091
జెర్రీ.

1298
01:29:43,175 --> 01:29:45,093
మీరు ఐక్యతను సాధించి,

1299
01:29:45,177 --> 01:29:47,763
బలం మరియు లక్షాన్ని నిర్మించుకుని,

1300
01:29:47,846 --> 01:29:49,389
సాహసంతో,

1301
01:29:49,473 --> 01:29:51,099
మీ భవిష్యత్తును మార్చే

1302
01:29:51,183 --> 01:29:53,602
శక్తిని కనుగొన్నారు.

1303
01:30:00,359 --> 01:30:02,361
గల్లాడెట్ యూనివర్సిటీ విద్యార్థులు,

1304
01:30:02,444 --> 01:30:05,697
సాహసోపూరిత కొత్త యుగం
ఆరంభమైందని హర్షం వ్యక్తం చేస్తున్నారు

1305
01:30:09,076 --> 01:30:11,495
విద్యార్థుల నిరసనలకు ప్రతిగా

1306
01:30:11,578 --> 01:30:12,955
కక్ష సాధింపు చర్యలు ఉండవు,

1307
01:30:13,038 --> 01:30:16,291
మరియు బోర్డ్‌లో అధికశాతం
బధిరులు నియమించబడుతారు.

1308
01:30:17,417 --> 01:30:20,587
కింగ్! కింగ్! కింగ్!

1309
01:30:22,840 --> 01:30:25,384
నిజంగా మేం ఉమ్మడిగా, ఐక్యతతో

1310
01:30:25,467 --> 01:30:28,679
ఈ వారం మా హక్కుల కోసం నిలబడి

1311
01:30:28,762 --> 01:30:32,683
మా సంకోచాలను అధిగమించామని చెప్పగలం.

1312
01:30:48,991 --> 01:30:49,908
బధిర శక్తి!

1313
01:30:49,992 --> 01:30:51,785
బధిర శక్తి! బధిర శక్తి!

1314
01:30:51,869 --> 01:30:55,163
బధిర శక్తి! బధిర శక్తి! బధిర శక్తి!

1315
01:31:06,925 --> 01:31:09,219
ఎలా అనిపిస్తుందా?

1316
01:31:11,805 --> 01:31:14,766
ఆకాశంలో తేలుతున్నట్లుంది.

1317
01:31:14,850 --> 01:31:17,477
మాటల్లో చెప్పలేను.

1318
01:31:18,020 --> 01:31:20,022
చాలా గర్వంగా అనిపించింది.

1319
01:31:21,023 --> 01:31:22,774
నేను బధిరుడిని ఐనందుకు

1320
01:31:23,400 --> 01:31:24,651
ఎప్పుడూ ఇంత గర్వించలేదు.

1321
01:31:29,489 --> 01:31:31,617
మేమంతా ఒక్కటే!

1322
01:31:33,327 --> 01:31:34,328
ఆ వారంలో

1323
01:31:34,411 --> 01:31:37,039
మా మధ్య జరిగినదంతా
పూర్తిగా మర్చిపోయాం.

1324
01:31:39,833 --> 01:31:42,920
"నువ్వు చేయలేవు, నువ్వు
చేయలేవు" అని మా జీవితమంతా విన్నాం,

1325
01:31:43,003 --> 01:31:45,464
కానీ "లేదు, ఈసారి కాదు.

1326
01:31:45,547 --> 01:31:46,840
బధిరుడు చేయగలడు" అన్నాం.

1327
01:31:48,008 --> 01:31:50,093
వినికిడి సమాజంలో

1328
01:31:50,677 --> 01:31:55,641
బధిరుడు కావడం దేనికీ అడ్డు
కాదని నాకు అనిపించింది.

1329
01:31:59,770 --> 01:32:03,398
ఇది నీకు ఎప్పటికీ గుర్తుంటుంది!

1330
01:32:03,982 --> 01:32:05,984
నేను మా తాతగారితో మాట్లాడాను.

1331
01:32:06,735 --> 01:32:09,571
ఆయన, "నువ్వు చెప్పిందే కరెక్ట్" అన్నారు.

1332
01:32:13,534 --> 01:32:16,370
నా హృదయం ఉప్పొంగింది,

1333
01:32:18,747 --> 01:32:21,834
మా తాతగారు నాతో అలా అనడం చూస్తే,

1334
01:32:22,709 --> 01:32:24,753
ఏదో మంచి పనే చేసుంటాను.

1335
01:32:39,643 --> 01:32:41,937
ప్రపంచం మనకు విలువ లేదనుకుంటుంది!

1336
01:32:42,312 --> 01:32:43,814
మనకు విలువ లేదా?

1337
01:32:43,897 --> 01:32:45,899
కాదు!

1338
01:32:46,525 --> 01:32:49,403
- మనం విలువ లేదా?
- కాదు!

1339
01:32:51,071 --> 01:32:54,950
మన గొంతు వినబడాలి!

1340
01:33:20,475 --> 01:33:24,229
గల్లాడెట్‌లో సాధించిన విజయం

1341
01:33:24,313 --> 01:33:27,983
వికలాంగుల హక్కుల కోసం జరిగిన
విస్తృతమైన ఉద్యమంలో ఒక భాగం

1342
01:33:30,736 --> 01:33:34,198
రెండేళ్ల తర్వాత కాంగ్రెస్

1343
01:33:34,281 --> 01:33:37,951
వికలాంగుల హక్కుల చట్టాన్ని ఆమోదించింది

1344
01:33:40,370 --> 01:33:45,876
ఐ. కింగ్ జోర్డాన్ గల్లాడెట్ యూనివర్సిటీ
అధ్యక్షుడిగా 18 సంవత్సరాలు సేవలందించారు

1345
01:33:45,959 --> 01:33:51,298
నాటి నుండి ఆ పదవిలో ఎప్పుడూ
ఒక బధిర అధ్యక్షుడే కొనసాగుతున్నాడు

1346
01:39:22,546 --> 01:39:24,548
భావన ముమ్మడిశెట్టి



