1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.BZ

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.BZ

3
00:00:29,196 --> 00:00:31,573
జాన్ ట్రవోల్టా రూపొందించిన చిత్రం

4
00:01:53,030 --> 00:01:55,991
జాన్ ట్రవోల్టా రాసిన నవల ఆధారంగా రూపొందించిన చిత్రం

5
00:02:00,245 --> 00:02:03,081
జాన్ ట్రవోల్టా దర్శకత్వం

6
00:02:06,001 --> 00:02:07,628
డిెసెంబరు 28, 1962

7
00:02:07,711 --> 00:02:09,463
ఐడల్ వైల్డ్ ఎయిర్ పోర్ట్, న్యూ యార్క్

8
00:02:16,094 --> 00:02:17,513
అది అర్ధరాత్రి వేళ,

9
00:02:17,596 --> 00:02:19,181
టెర్మినల్ దాదాపు నిర్మానుష్యంగా ఉంది.

10
00:02:24,561 --> 00:02:27,898
త్వరలో విడుదల కాబోతున్న మూవీలో
నటి లిజ్ టేలర్ ఫోటోని మా అమ్మ చూసింది.

11
00:02:27,981 --> 00:02:29,399
ఆ మూవీ పేరు 'ద వి.ఐ.పి.స్'

12
00:02:29,483 --> 00:02:31,360
సరిగ్గా అలాంటి కోటునే కొనాలని అనుకుంది,

13
00:02:31,443 --> 00:02:33,862
అయితే ఆ కోటుని చర్చ్ బేస్మెంట్ సేల్ లో కొనుక్కుంది

14
00:02:33,946 --> 00:02:36,740
బాగా డబున్న వాళ్లు తమ సెకండ్ హ్యాండ్ దుస్తుల్ని
అక్కడ అమ్ముతుంటారు.

15
00:02:37,449 --> 00:02:39,451
- గుడ్ బై, అమ్మమ్మ.
- గుడ్ బై, బంగారం.

16
00:02:39,535 --> 00:02:41,161
- మ్వాహ్.
- నిన్ను మిస్ అవుతాను.

17
00:02:41,787 --> 00:02:42,788
గుడ్ బై, అమ్మా.

18
00:02:42,871 --> 00:02:43,872
గుడ్ బై, హనీ.

19
00:02:44,540 --> 00:02:46,458
ట్రాన్స్ వరల్డ్ ఎయిర్ లైన్స్ నుండి చివరి కాల్,

20
00:02:46,542 --> 00:02:50,963
లండన్ వెళ్లే ఫ్లయిట్ 700
రాయల్ ఎంబాసిడర్ సూపర్ జెట్ సర్వీస్.

21
00:02:51,046 --> 00:02:52,965
ఇప్పుడు మూడవ గేట్ లో బోర్డింగ్ అవుతోంది.

22
00:02:53,048 --> 00:02:54,049
అందరూ దయచేసి బోర్డింగ్ కాగలరు.

23
00:02:54,132 --> 00:02:57,594
స్పీకర్లలో వినిపిస్తున్న గొంతు
మృదుమధురంగా వినబడుతోంది.

24
00:02:57,678 --> 00:03:00,055
ఆ గొంతు ఎవరిదో కానీ
వాళ్లు చాలా అందంగా ఉంటారని నేను ఊహించుకున్నాను,

25
00:03:00,138 --> 00:03:01,932
బహుశా ఎవరైనా ఒక నటి అయి ఉంటుంది అనుకున్నాను.

26
00:03:02,516 --> 00:03:05,269
బహుశా నేను మార్లిన్ మాన్రో మాదిరిగా యాక్ట్ చేస్తే,

27
00:03:05,352 --> 00:03:07,688
ఆ టికెట్ ఏజెంట్ మనల్ని ఫస్ట్ క్లాస్ లో కూర్చోపెడతాడేమో.

28
00:03:08,397 --> 00:03:10,858
ఆ విధంగా విమానంలో ప్రయాణిస్తే

29
00:03:10,941 --> 00:03:12,526
మాకు అన్ని డ్రింక్స్ ఉచితంగా ఇస్తారని కూడా ఆమె చెప్పింది.

30
00:03:12,609 --> 00:03:16,738
కానీ నేను ఆ మాటలేవీ పట్టించుకోలేదు,
ఎందుకంటే మేము విమానంలో వెళ్లడమే ముఖ్యం అనుకున్నాను.

31
00:03:18,073 --> 00:03:20,617
ట్రాన్స్ వరల్డ్ ఎయిర్ లైన్స్, ఫ్లయిట్ 393

32
00:03:20,701 --> 00:03:23,036
పిట్స్ బర్గ్ కి సూపర్ కాన్ స్టిలేషన్ సర్వీస్,

33
00:03:23,120 --> 00:03:25,539
డేటన్, షికాగో, కన్సాస్ సిటీ,

34
00:03:25,622 --> 00:03:27,249
డెన్వర్ ఇంకా లాస్ ఏంజెలెస్.

35
00:03:27,332 --> 00:03:29,084
ఇప్పుడు వెస్ట్ ఆర్కేడ్ లో బోర్డింగ్ జరుగుతోంది.

36
00:03:29,168 --> 00:03:30,752
అందరూ విమానంలో బోర్డింగ్ కావాల్సిందిగా మనవి.

37
00:03:30,836 --> 00:03:32,421
నా వొళ్లంతా ఉత్సాహంతో నిండిపోయింది

38
00:03:32,504 --> 00:03:34,590
కారణం ఇలాంటి అనుభూతి
నాకు ఇంతకుముందెప్పుడూ కలగలేదు.

39
00:03:34,673 --> 00:03:38,385
ఇంకా కొద్ది నిమిషాల్లోనే నేను మొదటిసారి గాలిలోకి
ఎగరబోతున్నానని తెలిసినప్పుడు కలిగిన ఆ ఫీలింగ్

40
00:03:38,468 --> 00:03:39,928
దేనితోనూ పోల్చలేము,

41
00:03:40,012 --> 00:03:42,556
మా వీధిలో పిల్లలతో కలిసి ఆడే 'డాక్టర్-పేషెంట్'
ఆట కూడా దాని ముందు తక్కువే.

42
00:03:42,639 --> 00:03:44,766
ఎనిమిదేళ్ల వయసులో నాకు,
ఆ ఆట కంటే పెద్ద విషయం ఇంకేం ఉంటుంది.

43
00:03:47,144 --> 00:03:48,979
ఆ రాత్రి జరిగినదంతా నాకు గుర్తుంది.

44
00:03:49,479 --> 00:03:51,523
టెర్మినల్ లో లైట్లు మసకగా ఉన్నాయి,

45
00:03:51,607 --> 00:03:53,358
వెస్ట్ ఆర్కేడ్ లో గేట్ వైపు మేము వేగంగా వెళ్తుంటే

46
00:03:53,442 --> 00:03:56,320
ఆ విమానం గుర్తు రంగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

47
00:03:56,403 --> 00:03:58,322
ఆఖరికి మా అమ్మ కూడా ఉద్వేగంగా కనిపించింది,

48
00:03:58,405 --> 00:04:00,616
కానీ దానికి పూర్తిగా వేరే కారణాలు ఉన్నాయని
నేను ఖచ్చితంగా చెప్పగలను.

49
00:04:00,699 --> 00:04:03,619
బహుశా తనకి ఉచితంగా డ్రింక్స్ ఇస్తారన్న ఉత్సాహం కావచ్చు,

50
00:04:03,702 --> 00:04:06,413
లేదా విమానంలో ఒక అందమైన వ్యక్తిని
కలుసుకునే అవకాశం ఉందన్న ఉత్సాహం కావచ్చు.

51
00:04:07,039 --> 00:04:10,834
మా అమ్మకి అప్పుడు సుమారు 49 ఏళ్లు ఉండచ్చు,
తను చాలా అందంగా ఉండేది.

52
00:04:10,918 --> 00:04:12,794
నీలి కళ్లు, చక్కని జుట్టు,

53
00:04:12,878 --> 00:04:15,380
ఆ వయసుకి తగ్గట్టుగా మంచి ఫిగర్ మెయింటైన్ చేసేదాన్ని అని
తనే నాకు చెప్పేది.

54
00:04:16,005 --> 00:04:19,468
నన్ను అంత ఆలస్యంగా కని ఉండకపోతే
తన ఫిగర్ ఇంకా బాగుండేదని తనే అంటుండేది.

55
00:04:20,010 --> 00:04:22,804
పైగా తనకి కొంచెం పొట్ట ఉన్నా కూడా
చాలామంది మగవాళ్ళకి పెద్దగా అభ్యంతరం ఉండదని తన ఫీలింగ్.

56
00:04:22,888 --> 00:04:25,057
కొందరు మగవాళ్లకి అదే చాలా సెక్సీగా
అనిపిస్తుందని ఆమె అనుకునేది.

57
00:04:25,724 --> 00:04:28,185
బహుశా విమానం నడిపే కెప్టెన్ తోనో లేదా మరెవరైనా

58
00:04:28,268 --> 00:04:30,437
ఒక మంచి వ్యక్తితో ప్రేమలో పడాలని తను కోరుకునేది.

59
00:04:31,396 --> 00:04:34,399
ఐడల్ వైల్డ్ ఎయిర్ పోర్ట్ గుండా వెళ్లడం
చాలా సరదాగా అనిపించింది.

60
00:04:34,483 --> 00:04:37,778
ఈసారి మేము నిజంగానే విమానంలో ప్రయాణిస్తున్నామంటే,
నేను నమ్మలేకపోయాను.

61
00:04:39,571 --> 00:04:42,908
మేము ఎక్కువసార్లు వేరేవాళ్లకి వీడ్కోలు చెప్పడానికే
ఎయిర్ పోర్ట్ కి వచ్చేవాళ్లం.

62
00:04:42,991 --> 00:04:45,244
ఒకసారి వేసవి సెలవుల్లో మా అమ్మ
ఒక థియేటర్ లో ఏదో నాటకం వేసే పని మీద

63
00:04:45,327 --> 00:04:47,704
విమానంలో వెళ్లాల్సి వచ్చింది.

64
00:04:47,788 --> 00:04:50,207
కానీ ఈసారి నేను కూడా తనతో వెళ్తున్నాను.

65
00:05:04,930 --> 00:05:06,598
అదంతా ఒక భ్రాంతిలా అనిపించింది.

66
00:05:07,099 --> 00:05:08,684
ఒక ఉద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను.

67
00:05:11,144 --> 00:05:13,480
ప్రతి కదలిక స్లో మోషన్ లో జరుగుతున్నట్లు అనిపించింది.

68
00:05:14,314 --> 00:05:15,941
అది చాలా అందంగా ఉంది.

69
00:05:16,024 --> 00:05:19,319
వెండి ఇంకా తెలుపు రంగు,
దాని మీద రెండు ఎర్రని అసెంట్ చారలు

70
00:05:19,403 --> 00:05:22,364
ఇంకా పక్కన టి.డబ్ల్యు.ఏ. అనే అక్షరాలు ముద్రించి ఉన్నాయి.

71
00:05:22,948 --> 00:05:24,116
ఓహ్, ఎంత కనువిందుగా ఉంది.

72
00:05:24,741 --> 00:05:29,246
చల్ల గాలి నా ముఖాన్ని తాకుతూ వీచింది,
కానీ నా మొదటి ప్రేమకి అది అంతరాయం కలిగించలేకపోయింది.

73
00:05:31,790 --> 00:05:34,877
చూడటానికి గంభీరంగా,
బలీయంగా ఇంకా పవర్ ఫుల్ గా కనిపించింది.

74
00:05:36,587 --> 00:05:39,089
నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక అనుభూతి
అక్కడ మొదలైంది.

75
00:05:42,426 --> 00:05:44,928
మేము విమానం మెట్టు ఎక్కుతుండగా,

76
00:05:45,012 --> 00:05:46,972
ఒక విచిత్రమైన దానిని నేను గమనించాను.

77
00:05:47,055 --> 00:05:49,057
మాతో పాటు విమానం ఎక్కేవాళ్లు ఎక్కువ మంది లేరు.

78
00:05:49,141 --> 00:05:50,475
చాలా తక్కువ మంది ఉన్నారు.

79
00:05:50,559 --> 00:05:54,062
ఆ విమానం కేవలం నా కోసం ఇంకా మా అమ్మ కోసం అని
నేను మనసులో అనుకున్నాను,

80
00:05:54,146 --> 00:05:55,355
అది ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ కదా?

81
00:06:01,403 --> 00:06:03,822
విమానంలోకి స్వాగతం. ఇక్కడ కాస్త వెచ్చగా ఉంటుంది.

82
00:06:03,906 --> 00:06:06,658
మెట్ల పైన ఒక స్టివార్డెస్ సన్నగా, పొడవుగా

83
00:06:06,742 --> 00:06:08,368
ఆత్మీయమైన చిరునవ్వులు చిందిస్తూ నిలబడి ఉంది.

84
00:06:42,277 --> 00:06:44,363
మీకు ఎమర్జెన్సీ మ్యాప్ కూడా అందిస్తున్నాం.

85
00:06:44,446 --> 00:06:46,323
ఆమెలో ఏదో తెలియని ప్రత్యేకత ఉంది.

86
00:06:46,406 --> 00:06:47,950
అదేమిటన్నది స్పష్టంగా చెప్పడం కష్టం.

87
00:06:48,700 --> 00:06:51,161
కానీ తరువాత ఆమె గురించి మా అమ్మ ఎక్కువ తెలుసుకుంది.

88
00:06:51,245 --> 00:06:52,579
వాళ్లు దాదాపు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు.

89
00:06:52,663 --> 00:06:55,666
మిగతా అందరికన్నా లిజ్ ఎందుకు
చాలా ప్రత్యేకంగా ఉందని మా అమ్మని అడిగాను,

90
00:06:55,749 --> 00:06:58,502
ఆమె కాన్సన్ ట్రేషన్ క్యాంప్ నుంచి ప్రాణాలతో బయటపడిందని

91
00:06:58,585 --> 00:07:01,463
అందుకే ఆమె జీవితంలో చాలా కష్టాలు
ఇంకా విషాదం ఉన్నాయని మా అమ్మ నాకు చెప్పింది.

92
00:07:02,798 --> 00:07:05,342
ఒక్కొక్కటిగా, ఇంజన్లు స్టార్ట్ అవుతుండగా,

93
00:07:05,968 --> 00:07:09,346
నేను ఒక పెద్ద, మెత్తని, సౌకర్యవంతమైన
కుర్చీలో కూర్చున్నాను.

94
00:07:09,930 --> 00:07:11,431
ఆ ఇంజన్ల శబ్దాలు నాకు పెద్దగా వినబడలేదు.

95
00:07:11,974 --> 00:07:16,353
ఆ భారీ ప్రొపెల్లర్లు గిర్రున తిరుగుతుంటే
వెనుక నుండి మంటలు బయటకు వచ్చాయి.

96
00:07:17,104 --> 00:07:18,522
అది జెట్ ఇంజన్ల యుగమని నాకు తెలుసు,

97
00:07:18,605 --> 00:07:21,191
కానీ ఒక జెట్ విమానంతో పోలిస్తే
రెండింతలు ఎక్కువ సమయం తీసుకునే

98
00:07:21,275 --> 00:07:24,444
ఇలాంటి విమానంలో ప్రయాణించడంలో
ఒక విధమైన మజా ఉంది,

99
00:07:24,528 --> 00:07:26,196
ముఖ్యంగా ఇది నా మొదటి విమానప్రయాణం కాబట్టి.

100
00:07:28,532 --> 00:07:31,577
ఒక నల్లని పూల పర్సులో
నేను చిల్లర నాణేలు దాచుకోవడం నాకు గుర్తుంది.

101
00:07:32,202 --> 00:07:34,746
నీ అమ్మమ్మ, అంటే మా అమ్మ,

102
00:07:34,830 --> 00:07:37,207
డబ్బులు దాచుకోవడానికి నాకు ఈ పూల పర్సు ఇచ్చింది.

103
00:07:38,041 --> 00:07:40,544
ఇక ఇప్పటి నుండి నువ్వు ఇందులో డబ్బులు దాచుకో,

104
00:07:40,627 --> 00:07:42,754
ఆ తరువాత బహుశా మనిద్దరం ఒక చిన్న టూర్ కి వెళ్లచ్చు.

105
00:07:42,838 --> 00:07:46,049
మనం ఫిలడెల్ఫియా, హార్ట్ ఫోర్డ్ కి వెళ్లచ్చు.

106
00:07:46,133 --> 00:07:47,759
మనం బోస్టన్ వెళ్లచ్చు!

107
00:07:47,843 --> 00:07:48,927
అవును.

108
00:07:49,678 --> 00:07:52,431
మా అమ్మ దేని గురించయినా ఎగ్జయిట్ అయిందంటే,
ఆ ఫీలింగ్ వేరేలా ఉండేది.

109
00:07:52,514 --> 00:07:55,184
మొత్తం ప్రపంచమంతా వెలుగు,
ఆశలతో అందంగా కనిపించేది.

110
00:08:05,736 --> 00:08:06,737
సరే.

111
00:08:06,820 --> 00:08:07,738
సరే.

112
00:08:07,821 --> 00:08:09,573
నిన్ను సర్ ప్రైజ్ చేద్దామని ఈ విషయాన్ని దాచాను,

113
00:08:10,532 --> 00:08:13,285
కానీ మనం లాస్ ఏంజెలెస్ కి మారిపోతున్నాం.

114
00:08:14,661 --> 00:08:15,704
నిజం… నిజంగానా?

115
00:08:19,041 --> 00:08:22,753
ఫిబ్రవరి నెలలోగా మనం పశ్చిమం వైపు మారిపోగలిగితే

116
00:08:23,337 --> 00:08:27,090
తను తీయబోయే సినిమాలో పని చేసే అవకాశం ఇస్తానని

117
00:08:28,050 --> 00:08:31,595
అలెన్ టౌన్ ప్లేహౌస్ లో
నాకు తెలిసిన ఒక డైరెక్టర్ ఫ్రెండ్ చెప్పాడు.

118
00:08:31,678 --> 00:08:32,679
నిజంగానా?

119
00:08:33,472 --> 00:08:34,640
నేను ఇది నమ్మలేకపోతున్నాను.

120
00:08:35,890 --> 00:08:37,726
అమ్మ ఇప్పటికే జూనియర్ ఆర్టిస్టుగా

121
00:08:37,808 --> 00:08:39,269
కొన్ని సినిమాల్లో నటించింది,

122
00:08:39,352 --> 00:08:41,355
కాబట్టి ఆ అవకాశం రావడం పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు.

123
00:08:41,438 --> 00:08:43,357
స్కూలులో ఆమె డ్రామా పాఠాలు కూడా బోధించింది,

124
00:08:43,440 --> 00:08:45,859
ఇంకా దానికంటే ముందు
ఆమె పూర్తిస్థాయిలో నటనా వృత్తిలో కొనసాగింది.

125
00:08:46,902 --> 00:08:49,947
ఆమెకు పని లేనప్పుడు, తన అత్యుత్తమ ప్రేక్షకుడిని నేనే.

126
00:08:50,030 --> 00:08:51,281
నేను ఇప్పుడే వస్తాను.

127
00:08:51,365 --> 00:08:53,450
నేను వెంటనే నా షెడ్యూల్స్ చూసుకోవాలి.

128
00:08:55,702 --> 00:08:57,871
నేను దాదాపుగా మెట్ల మీద ఎగురుకుంటూ నా గదిలోకి వెళ్లాను,

129
00:08:57,955 --> 00:08:59,790
అక్కడ నా ఎయిర్ లైన్ షెడ్యూల్స్ ఉన్నాయి.

130
00:09:04,878 --> 00:09:07,840
యునైటెడ్, అమెరికన్, టి.డబ్ల్యు.ఏ.

131
00:09:11,093 --> 00:09:14,054
ఇదిగో ఇక్కడ ఉంది.
"ప్రొపెలర్ వన్-వే నైట్ కోచ్.

132
00:09:14,137 --> 00:09:17,224
పూర్తి ధర 95 డాలర్లు, పిల్లలకి హాఫ్ టికెట్."

133
00:09:17,307 --> 00:09:18,308
ఇదే!

134
00:09:18,392 --> 00:09:20,102
ఇప్పుడు విమానం వేళలు చూద్దాం.

135
00:09:21,353 --> 00:09:23,814
"ట్రాన్స్ వరల్డ్ ఎయిర్ లైన్స్, ఫ్లయిట్ 393

136
00:09:23,897 --> 00:09:26,275
ఐడల్ వైల్డ్ ఎయిర్ పోర్ట్ లో రాత్రి 9 గంటలకి బయలుదేరుతుంది.

137
00:09:26,358 --> 00:09:28,443
లాస్ ఏంజెలెస్ కి సూపర్ కాన్ స్టిలేషన్ సర్వీసెస్
అందుబాటులో ఉన్నాయి

138
00:09:28,527 --> 00:09:30,737
ఇంకా మధ్యలో పిట్స్ బర్గ్,

139
00:09:30,821 --> 00:09:34,867
డేటన్, షికాగో, కన్సాస్ సిటీ, డెన్వర్ నగరాలలో ఆగి
లాస్ ఏంజెలెస్ చేరుకుంటుంది.

140
00:09:34,950 --> 00:09:37,244
మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటలకి చేరుకుంటుంది."

141
00:09:37,911 --> 00:09:39,872
కేవలం ట్రాన్స్ వరల్డ్ ఎయిర్ లైన్స్ మాత్రమే

142
00:09:39,955 --> 00:09:44,877
అమెరికాలోని 70 నగరాలలో, ఇంకా విదేశాలలోని
15 ప్రపంచ కేంద్రాలలో సర్వీసులు అందిస్తోంది.

143
00:09:45,419 --> 00:09:46,795
దేశమంతటా, ప్రపంచమంతటా

144
00:09:46,879 --> 00:09:47,921
ఆధారపడతారు…

145
00:09:48,005 --> 00:09:49,256
టి.డబ్ల్యు.ఏ.

146
00:09:50,549 --> 00:09:52,301
టి.డబ్ల్యు.ఏ. ఒక్కటే మార్గం

147
00:10:01,185 --> 00:10:02,728
నేను తిరిగి కిందకి వచ్చేసరికి,

148
00:10:02,811 --> 00:10:04,396
లివింగ్ రూమ్ లో లైట్లు ఆఫ్ చేసి ఉన్నాయి.

149
00:10:06,356 --> 00:10:09,860
ఇంకా స్టీరియోలో రేడియో నుండి పాట మంద్రంగా ప్లే అవుతోంది,

150
00:10:10,527 --> 00:10:12,863
అది జాక్ జోన్స్ పాడిన "వైవ్స్ అండ్ లవర్స్" పాట.

151
00:10:12,946 --> 00:10:16,742
చీకటిలో ఆమె తాగుతున్న సిగరెట్ మండుతోంది,
ఆమె పక్కన గ్లాసులో వైట్ వైన్ ఉంది.

152
00:10:18,035 --> 00:10:21,205
అప్పుడు నేను కంగారుపడ్డాను,
లాస్ ఏంజెలెస్ కి మారిపోతున్నామని ఆమె చెప్పింది

153
00:10:21,288 --> 00:10:22,372
అబద్ధం కావచ్చని అనుమానం కలిగింది.

154
00:10:23,165 --> 00:10:24,958
అది ఆమె కనే పగటి కలల్లో ఒకటి కావచ్చు.

155
00:10:27,211 --> 00:10:28,295
ఓహ్, సరే.

156
00:10:28,378 --> 00:10:30,672
డబ్బు ఆదా చేసి
ఒక చిన్న ట్రిప్ కి వెళ్లచ్చులే అనుకున్నాను.

157
00:10:30,756 --> 00:10:33,342
బహుశా నేను…
నేను నా షెడ్యూల్స్ ని మళ్లీ చూసుకోవాలి.

158
00:10:39,139 --> 00:10:42,059
మా అమ్మమ్మకి 57 మోడలు ప్లిమత్ బెల్వడెర్ కారు ఉండేది.

159
00:10:42,601 --> 00:10:45,896
ఎట్టకేలకి మేము బయలుదేరాము, 1962 డిసెంబరులో,

160
00:10:45,979 --> 00:10:50,067
ఐడల్ వైల్డ్ ఎయిర్ పోర్ట్ వైపు వెళ్తున్నాం,
నా మనసులో ఫ్లయిట్ 393 మెదులుతోంది.

161
00:10:50,984 --> 00:10:52,528
మనం అక్కడికి ఎంతసేపట్లో వెళతాం?

162
00:10:52,611 --> 00:10:55,822
బుజ్జీ, మన ఓడోమీటరు 62 కి చేరినప్పుడు,

163
00:10:55,906 --> 00:10:57,282
మనం అక్కడికి చేరుకుంటాం.

164
00:10:58,742 --> 00:11:00,786
ప్రయాణికులకి అనేక సదుపాయాలు ఉన్నాయని చాటుతూ

165
00:11:00,869 --> 00:11:04,414
రోడ్డు పక్కన ఉన్న పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ ని
చూడటం మజాగా ఉంది,

166
00:11:04,498 --> 00:11:06,750
"పాన్ ఆమ్ లో ప్రయాణించండి, పారిస్ కి ఏడు గంటల్లో చేరండి."

167
00:11:06,834 --> 00:11:10,003
లేదా "టి.డబ్ల్యు.ఏ., కారిఫోర్నియాకి చేరుకోవడానికి
ఇదే మేలైన ఎయిర్ లైన్."

168
00:11:11,338 --> 00:11:12,965
ఇంక ఇదిగో నేను ఈ విమానంలో కూర్చున్నాను

169
00:11:13,048 --> 00:11:15,551
ఈ ఎయిర్ లైన్ అందించే
సుదీర్ఘమైన ట్రిప్స్ ఒకదానిలో ప్రయాణిస్తున్నాను.

170
00:11:16,593 --> 00:11:20,222
ఈ విమానం మొదటి సెగ్మెంట్ లో
మొత్తం 15 మంది ప్రయాణికులు ఉన్నారు.

171
00:11:20,305 --> 00:11:23,058
నేను హంటర్స్ క్యాప్ పెట్టుకుని ఉన్నాను,
దాన్ని తీయడం మర్చిపోయాను,

172
00:11:23,141 --> 00:11:25,352
బహుశా చలి వాతావరణం నుండి లోపలికి రావడం వల్ల కావచ్చు.

173
00:11:25,435 --> 00:11:27,980
ఏది ఏమైనా, టేకాఫ్ సమయానికి, నా లుక్ ఇలా ఉండింది.

174
00:11:29,481 --> 00:11:31,942
నా విషయంలో అమ్మ చాలా ఎగ్జయిట్ అయిందని చెప్పగలను,

175
00:11:32,025 --> 00:11:35,612
కానీ ఆమె ప్రస్తుతం చాలా అసహనంగా ఎదురుచూస్తోంది

176
00:11:35,696 --> 00:11:37,823
ఎందుకంటే విమానం గాలిలోకి తేలగానే
తను సిగరెట్ ఇంకా డ్రింక్ తాగచ్చని చూస్తోంది.

177
00:11:43,620 --> 00:11:47,124
ఇంజన్ల వెనుక భాగం నుండి మంటలు
ఎగజిమ్మడాన్ని చూసి నేను చాలా ఎంజాయ్ చేశాను.

178
00:11:47,749 --> 00:11:49,543
విమానంలో ఇచ్చే మ్యాగజీన్ లో రాసిన వివరాల ప్రకారం

179
00:11:49,626 --> 00:11:51,712
ప్రొపెల్లర్ ఇంజన్లలో అది ప్రత్యేకమైనదట.

180
00:11:59,136 --> 00:12:00,888
వచ్చి నాతో పాటు ఎగురు

181
00:12:00,971 --> 00:12:04,558
మనం ఎగిరిపోదాం, దూరంగా ఎగిరిపోదాం

182
00:12:05,726 --> 00:12:09,021
మంచి విదేశీ మద్యం తాగాలి అనుకుంటే

183
00:12:09,104 --> 00:12:10,731
దూరంగా బాంబేలో ఒక బార్ ఉంది…

184
00:12:10,814 --> 00:12:14,735
మేము రన్ వే మీద వేగంగా దూసుకెళ్తుంటే,
మళ్ళీ ఆ వింత అనుభూతి నన్ను ఆవహించింది.

185
00:12:14,818 --> 00:12:17,404
ఇంకా ఆ క్షణం, విమానం నేలను విడిచి గాలిలోకి తేలింది.

186
00:12:22,534 --> 00:12:24,286
నేను విమానంలో వెళ్తున్నానంటే నమ్మలేకపోతున్నాను.

187
00:12:25,120 --> 00:12:26,622
మా అమ్మ నేరుగా చూసింది,

188
00:12:26,705 --> 00:12:29,124
తరువాత తల తిప్పి నన్ను చూసి నవ్వింది.

189
00:12:29,208 --> 00:12:31,293
అలా నవ్వే మా అమ్మని నేనెప్పుడూ గుర్తుపెట్టుకుంటాను.

190
00:12:38,717 --> 00:12:42,179
నేను ఊహించుకున్నదాని కంటే టేకాఫ్ చాలా సాఫీగా జరిగింది.

191
00:12:42,262 --> 00:12:45,224
ఎందుకో గానీ, ఆ రాత్రి ప్రతీదీ చాలా చక్కగా

192
00:12:45,307 --> 00:12:46,350
సంతృప్తిగా జరిగినట్లు అనిపించింది.

193
00:12:46,433 --> 00:12:50,312
ఎన్ని ఏళ్లయినా సరే,
నా జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా గానీ,

194
00:12:50,395 --> 00:12:52,147
నేను ఎయిర్ పోర్ట్ కి బయలుదేరినప్పటి నుండి

195
00:12:52,231 --> 00:12:54,691
నా గమ్యాన్ని చేరుకునే వరకూ,

196
00:12:54,775 --> 00:12:57,319
నా జీవితమంతా సురక్షితంగా ఉన్నట్టు అనిపిస్తుంది.
ఆ సమయంలో నేను చాలా సంతోషంగా ఉంటాను.

197
00:13:02,199 --> 00:13:04,034
మా అమ్మ మన్హాటన్స్ ని ఇష్టపడేది,

198
00:13:04,117 --> 00:13:05,953
కానీ నాకు కోకా కోలా అంటే ఇష్టం.

199
00:13:10,165 --> 00:13:12,584
లిజ్ మా సీట్స్ పక్కకు వచ్చింది.

200
00:13:12,668 --> 00:13:14,169
ఇప్పుడు మీకు ఏ డ్రింక్ తీసుకురమ్మంటారు?

201
00:13:14,253 --> 00:13:16,004
- నాకు కోక్ ఇస్తారా?
- తప్పకుండా.

202
00:13:16,088 --> 00:13:17,673
- నాకు మన్హాటన్ నచ్చుతుంది.
- తప్పకుండా.

203
00:13:17,756 --> 00:13:19,216
ఇంక ఇప్పుడు స్మోక్ చేస్తే ఫర్వాలేదా?

204
00:13:19,299 --> 00:13:20,300
తప్పకుండా, తాగచ్చు.

205
00:13:22,344 --> 00:13:24,513
న్యూపోర్ట్ ఫిల్టర్ సిగరెట్లు.

206
00:13:24,596 --> 00:13:27,266
ఆ లేత నీలం రంగు పెట్టె,
దాని మధ్యలో అర్ధచంద్రాకారపు గుర్తు చూడగానే,

207
00:13:27,349 --> 00:13:30,060
నాకు ఎప్పుడూ పాత మధుర జ్ఞాపకాలే గుర్తొస్తాయి.

208
00:13:32,479 --> 00:13:33,480
ఆమె సిగరెట్ వెలిగించినప్పుడు,

209
00:13:33,564 --> 00:13:36,692
ఆమె నోటి నుండి సంతృప్తికరంగా పొగ బయటకి వచ్చినప్పుడు

210
00:13:37,401 --> 00:13:38,986
"ఎంత వేడుకగా ఉంది" అనుకునేవాడిని.

211
00:13:39,736 --> 00:13:42,239
థియేటర్ లో మా అమ్మ ఫ్రెండ్స్ అందరూ స్మోక్ చేసేవారు.

212
00:13:42,322 --> 00:13:45,200
నిజం చెప్పాలంటే, అప్పట్లో సిగరెట్ అలవాటు లేని పెద్దవాళ్లని
నేను అసలు చూడనేలేదు.

213
00:13:49,162 --> 00:13:51,331
ఆ రాత్రి ఆకాశంలో ప్రతి నక్షత్రాన్ని నేను చూడగలిగాను.

214
00:13:53,458 --> 00:13:56,336
కిటికీలోంచి బయటకి చూస్తున్న నాకు మాత్రం
అంతా అలాగే అనిపించింది.

215
00:13:57,045 --> 00:14:00,507
"ఇది చాలా అందంగా ఉంది.
మనుషులు విమానాల్లో ఎందుకు నివసించరు?"

216
00:14:00,591 --> 00:14:03,677
నేను మంచం మీద పడుకుని ఆలోచించే వాడిని.
ఇంటి దగ్గర ఉన్నప్పుడు,

217
00:14:03,760 --> 00:14:05,888
కొన్నిసార్లు అర్ధరాత్రి వేళ, నిద్రపట్టక అలాగే పడుకుని,

218
00:14:05,971 --> 00:14:08,765
బహుశా అవి న్యూ యార్క్ లేదా లాగార్డియా ఎయిర్ పోర్ట్ ల నుండి
ఇప్పుడే బయలుదేరి,

219
00:14:10,058 --> 00:14:12,853
మా ఇంటి పైనుంచి వెళ్తున్నాయేమో అనిపించేది.

220
00:14:13,729 --> 00:14:16,857
"ఇంత ఆలస్యంగా ఈ విమానం
ఎక్కడికి వెళ్తోంది?" అనుకునేవాడిని.

221
00:14:17,441 --> 00:14:18,859
ఆ విమానంలో ఎవరు ఉన్నారు?

222
00:14:18,942 --> 00:14:21,653
వాళ్లు ఇప్పుడు పడుకున్నారా?
విమానంలో మంచాలు ఉంటాయా?"

223
00:14:23,113 --> 00:14:24,239
ఇదిగో, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను,

224
00:14:24,323 --> 00:14:27,576
బహుశా గతంలో నేను గమనించిన విమానంలోనే
ప్రస్తుతం ప్రయాణిస్తున్నానేమో.

225
00:14:29,953 --> 00:14:34,541
అక్కడ 3డి సీటులో కూర్చున్న వ్యక్తి
ఈ డ్రింక్ మీ కోసం కొన్నారు.

226
00:14:34,625 --> 00:14:37,252
ఓహ్, ఆయన ఎంత మంచివారు.

227
00:14:37,336 --> 00:14:39,796
ఓహ్, నా తరఫున ఆయనకి థాంక్స్ చెప్పండి, ప్లీజ్.

228
00:14:39,880 --> 00:14:41,965
మా అమ్మ ఎవరినైనా ఇంప్రెస్ చేయాలి అనుకుంటే,

229
00:14:42,049 --> 00:14:44,343
ఆమె గొంతు మరింత గంభీరంగా,
మరింత మృదువుగా మారిపోతుంది.

230
00:14:44,426 --> 00:14:46,553
అది నాటకాల గొంతు అనేవాడిని.

231
00:14:46,637 --> 00:14:48,805
నేను ఆ మాట అనడం ఆమెకి నచ్చేది కాదు,

232
00:14:48,889 --> 00:14:50,599
కానీ అలా మాట్లాడటం మాత్రం ఎప్పుడూ ఆపేది కాదు.

233
00:14:51,308 --> 00:14:53,227
కొద్దిసేపటికే, కరెక్ట్ టైమ్ కి అన్నట్టుగా,

234
00:14:53,310 --> 00:14:56,021
దాదాపు 50 ఏళ్ల వయసున్న ఒక అందమైన వ్యక్తి వచ్చి,

235
00:14:56,104 --> 00:14:58,315
మా పక్కనే ఉన్న ఐల్ అవతలి సీట్లో కూర్చున్నాడు.

236
00:14:58,398 --> 00:15:00,567
మాకు డ్రింక్స్ కొన్న జెంటిల్మెన్ అతనే అయి ఉంటాడా అని

237
00:15:00,651 --> 00:15:02,611
మా అమ్మ ఒక్క క్షణం ఆలోచించింది.

238
00:15:02,694 --> 00:15:04,571
మీ పక్కన కూర్చుంటే ఏమీ అనుకోరు కదా?

239
00:15:04,655 --> 00:15:07,282
మీరు కూర్చోకపోతే, నేనే మిమ్మల్ని వెనక్కి లాగుతాను.

240
00:15:09,576 --> 00:15:11,745
విమానంలో ప్రయాణించినప్పుడు నేను చాలా నెర్వస్ ఫీల్ అవుతాను.

241
00:15:11,828 --> 00:15:13,121
నువ్వు భయపడవు కదా.

242
00:15:13,205 --> 00:15:14,623
నా మాటకి అడ్డు చెప్పకు.

243
00:15:14,706 --> 00:15:16,416
కానీ నువ్వు భయపడవు కదా, అమ్మా.

244
00:15:16,500 --> 00:15:20,254
బుజ్జీ, నువ్వు కాక్ పిట్ దగ్గరకి వెళ్లి
పైలెట్లని పలకరించవచ్చు కదా?

245
00:15:21,171 --> 00:15:22,840
నిజానికి, అది మంచి ఐడియా,

246
00:15:22,923 --> 00:15:25,008
కాకపోతే అమ్మ తిడుతుందనే భయం నాకు లోపల ఉంది.

247
00:15:25,092 --> 00:15:27,010
ఇక అమ్మను తన ఇష్టానికే వదిలేశాను.

248
00:15:28,053 --> 00:15:32,391
నేను కాక్ పిట్ వైపు వెళ్తుండగా సగం దారిలోనే
ఒక వింత దృశ్యం నా కంటపడింది.

249
00:15:38,230 --> 00:15:40,858
హలో. నేను పది అడుగుల పొడవు మనిషిని.

250
00:15:41,358 --> 00:15:42,943
నా ఆటోగ్రాఫ్ కావాలా?

251
00:15:44,069 --> 00:15:45,112
ఎవరు?

252
00:15:45,195 --> 00:15:46,196
పది అడుగుల పొడవు మనిషి!

253
00:15:46,280 --> 00:15:48,490
నేను 'బార్నమ్ అండ్ బెయిలీ సర్కస్'లో పని చేస్తాను.

254
00:15:48,574 --> 00:15:50,325
నేను పది అడుగుల పొడవు మనిషిని.

255
00:15:51,785 --> 00:15:52,995
సరే.

256
00:15:57,624 --> 00:16:00,460
అప్పట్లో, 1960ల కాలంలో,
కాక్ పిట్ తలుపులు లాక్ చేసేవారు కాదు,

257
00:16:00,544 --> 00:16:02,546
ఎవరయినా కాక్ పిట్ లోకి వెళ్లడానికి వెసులుబాటు ఉండేది,

258
00:16:02,629 --> 00:16:04,882
అయితే స్టీవర్డెస్ అనుమతి తీసుకుంటే సరిపోయేది.

259
00:16:04,965 --> 00:16:06,091
లిజ్ నాకు కనిపించలేదు,

260
00:16:06,175 --> 00:16:08,510
దానితో నేను ఎలాగో కాక్ పిట్ తలుపు తెరిచాను.

261
00:16:09,178 --> 00:16:12,181
అక్కడ ముగ్గురు మగవారు ముందుకు చూస్తూ
కూర్చుని ఉన్నారు, దానితో నేను ప్రవేశించడం గమనించలేదు.

262
00:16:12,264 --> 00:16:14,641
- చెప్పు, ఆమె అందంగా ఉంది కదా?
- నా ఉద్దేశం, ఆమె చాలా అందంగా ఉంది.

263
00:16:14,725 --> 00:16:17,311
ఆమె మన అందరితో అలా వ్యవహరించిందంటే
నేను నమ్మలేకపోతున్నాను.

264
00:16:17,394 --> 00:16:18,562
- నాకు తెలుసు.
- నేను నమ్మగలను.

265
00:16:18,645 --> 00:16:20,731
ఒకాయన చెబుతున్న కథలో కొంత భాగమే నేను విన్నాను.

266
00:16:20,814 --> 00:16:23,358
కానీ వాళ్లు సెక్స్ గురించో,
మరి దేని గురించో మాట్లాడుకుంటున్నారని,

267
00:16:23,442 --> 00:16:25,903
నేను పెద్దయిన తరువాతే నాకు అర్థమైంది.

268
00:16:28,655 --> 00:16:31,742
హేయ్, నువ్వు…
నువ్వు ఈ రాత్రి పిట్స్ బర్గ్ వెళ్తున్నావా?

269
00:16:32,326 --> 00:16:34,369
లేదు, లాస్ ఏంజెలెస్ వెళ్తున్నాను.

270
00:16:35,537 --> 00:16:37,164
నువ్వు అసలు ఈ 'మిల్క్ రన్' విమానంలోకి ఎలా వచ్చావు?

271
00:16:37,247 --> 00:16:39,333
నేను విమానంలో వీలైనంత
ఎక్కువసేపు గడపాలని అనుకున్నాను,

272
00:16:39,416 --> 00:16:41,627
కానీ మా అమ్మకి నాన్ స్టాప్ జెట్ టికెట్ కొనేంత స్తోమత లేదు.

273
00:16:42,419 --> 00:16:45,214
నాకు విమానాలంటే బాగా ఇష్టమని చెబితే
వాళ్లు మెచ్చుకుంటారని అనుకున్నాను,

274
00:16:45,714 --> 00:16:48,967
కానీ వాళ్లు ఆ విమానంలో ఉండే అసౌకర్యం గురించి
ఎక్కువ మాట్లాడారు.

275
00:16:49,051 --> 00:16:51,094
సరే, సరే. కానీ, మేము నీతో పాటు షికాగో వరకే వస్తాము.

276
00:16:51,178 --> 00:16:53,805
కాబట్టి, చూడు, నీకు ఎప్పుడు బోరు కొట్టినా,
ఇక్కడికి వచ్చేయవచ్చు.

277
00:16:53,889 --> 00:16:56,433
కానీ ఈసారి వచ్చేటప్పుడు
స్టీవర్డెస్ ని అనుమతి అడగడం మర్చిపోవద్దు, సరేనా?

278
00:16:57,142 --> 00:16:58,143
తప్పకుండా.

279
00:17:00,812 --> 00:17:01,813
థాంక్యూ.

280
00:17:06,026 --> 00:17:07,194
ఈ పది అడుగుల పొడుగు మనిషి ఎవరు?

281
00:17:07,986 --> 00:17:09,154
అది నీ కొత్త గర్ల్ ఫ్రెండ్.

282
00:17:09,238 --> 00:17:12,907
ఏది ఏమైనా, నేను విమానంలో ప్రయాణించాను,
ఇంకా ఆ రాత్రంతా ప్రయాణం సాగింది.

283
00:17:12,991 --> 00:17:14,117
ఇంతకన్నా అందమైన జీవితం ఉంటుందా?

284
00:17:14,701 --> 00:17:16,286
నేను నా సీటు దగ్గరకి తిరిగి చేరుకునేసరికి,

285
00:17:16,369 --> 00:17:17,788
అమ్మ రెండో డ్రింక్ తాగుతోంది

286
00:17:17,871 --> 00:17:20,374
ఇంకా తన కొత్త ఫ్రెండ్ హ్యారీతో
చాలా సన్నిహితంగా కబుర్లు చెబుతోంది.

287
00:17:20,958 --> 00:17:23,167
వీడు నా బుజ్జి బాబు, జెఫ్.

288
00:17:23,252 --> 00:17:25,127
- హాయ్, జెఫ్.
- హేయ్.

289
00:17:25,212 --> 00:17:26,797
ఈయన పేరు హ్యారీ.

290
00:17:26,880 --> 00:17:28,674
హ్యారీ పిట్స్ బర్గ్ నుంచి వచ్చాడు, హనీ.

291
00:17:29,424 --> 00:17:30,801
ఈయన లాయరు.

292
00:17:30,884 --> 00:17:33,470
ఇంకా పిట్స్ బర్గ్ స్టీలర్స్ జట్టులో
కొంతమంది ఆటగాళ్లు తనకి పరిచయం.

293
00:17:34,012 --> 00:17:35,097
ఇది అద్భుతం కదా?

294
00:17:36,557 --> 00:17:38,809
మీకు పెళ్లయిందా? మీకు పిల్లలు ఉన్నారా?

295
00:17:40,519 --> 00:17:42,896
ఎందుకు, అవును, నాకు పెళ్లయింది.
నాకు ఒక బాబు ఇంకా పాప ఉన్నారు.

296
00:17:43,981 --> 00:17:44,982
ఓహ్. అది మంచి విషయం.

297
00:17:55,701 --> 00:17:57,119
నీకు చికెన్ అంటే ఇష్టం కదా.

298
00:17:57,202 --> 00:17:58,745
నాకు ఫ్రయిడ్ చికెన్ అంటే ఇష్టం.

299
00:17:58,829 --> 00:18:00,581
సరే, ఇది కూడా అలాగే ఉంటుంది.

300
00:18:00,664 --> 00:18:04,543
దీనిని చికెన్ కార్డాన్ బ్లూ అంటారు,
ఇది చాలా రుచిగా ఉంటుంది.

301
00:18:04,626 --> 00:18:07,087
సరే. నేను కొద్దిగా రుచి చూస్తాను.

302
00:18:15,596 --> 00:18:17,055
నేను తిరిగి నా సీటు దగ్గరికి వచ్చినప్పుడు,

303
00:18:17,139 --> 00:18:19,474
హ్యారీ మా అమ్మ చెవిలో ఏదో గుసగుసగా మాట్లాడుతున్నాడు.

304
00:18:20,142 --> 00:18:23,562
అతను చెప్పేంతవరకూ వెయిట్ చేశాను
లేదంటే మా అమ్మ కోప్పడుతుందని భయం.

305
00:18:30,611 --> 00:18:32,946
ఓహ్, అతను చాలా గొప్ప మనిషి.

306
00:18:33,030 --> 00:18:34,489
చాలా చక్కగా మాట్లాడాడు.

307
00:18:34,573 --> 00:18:36,325
ఎవరైనా స్పష్టంగా, పదాలను చక్కగా ఉచ్చరిస్తూ

308
00:18:36,408 --> 00:18:38,577
అనర్గళంగా మాట్లాడితే మా అమ్మకి చాలా ఇష్టం.

309
00:18:38,660 --> 00:18:40,954
ఎవరైనా యాసతో మాట్లాడితే అమ్మకి పెద్దగా నచ్చేది కాదు,

310
00:18:41,038 --> 00:18:43,207
కానీ వాళ్ళు ఏదైనా పాత్ర కోసం
అలా మాట్లాడుతుంటే మాత్రం ఒప్పుకునేది.

311
00:18:43,290 --> 00:18:46,460
చక్కగా మాట్లాడటం అనేది వారు ఎంత బాగా చదువుకున్నారో,
వారి సంస్కారం ఏంటో తెలియజేస్తుందని అమ్మ చెప్పేది.

312
00:18:47,085 --> 00:18:49,129
ఆమె ఫ్రెండ్ జూలియా చాలా అందమైన మహిళ,

313
00:18:49,213 --> 00:18:51,632
చాలా సంపన్నురాలు, ఒక సంపన్నుడైన ఇన్వెంటర్ ని పెళ్లాడింది,

314
00:18:51,715 --> 00:18:53,342
ఇంకా ఆమె అన్ని భోగాలనూ అనుభవించేది,

315
00:18:53,425 --> 00:18:55,677
అయినా కానీ ఆమె పూర్తిగా న్యూ జెర్సీ యాసతో మాట్లాడేదని

316
00:18:55,761 --> 00:18:57,846
మా అమ్మ ఎప్పుడూ ఈసడించుకునేది.

317
00:18:57,930 --> 00:18:59,681
ఆమె అంటూ ఉండేది, "ఎంత సిగ్గుచేటు.

318
00:18:59,765 --> 00:19:02,976
అంత అందం, అంత సంపద ఉన్నా
ఆమె న్యూ జెర్సీ యాస మాత్రం ఘోరంగా ఉంటుంది" అనేది.

319
00:19:03,685 --> 00:19:05,229
ఫన్నీ విషయం ఏమిటంటే

320
00:19:05,312 --> 00:19:07,856
కొన్నిసార్లు మా అమ్మ కూడా అదే యాసలో మాట్లాడేది.

321
00:19:08,982 --> 00:19:13,403
మనం ఎప్పుడైనా పిట్స్ బర్గ్ వెళితే,
హ్యారీ మనల్ని డిన్నర్ కి తీసుకువెళతానని చెప్పాడు.

322
00:19:13,487 --> 00:19:16,323
ఓహ్, ఆయన భార్య, పిల్లలతోనా?

323
00:19:17,032 --> 00:19:18,200
తెలివైన వెధవ.

324
00:19:21,787 --> 00:19:24,122
కిటికీ బయట రాత్రి చీకట్లు

325
00:19:24,206 --> 00:19:25,415
మంచు మేఘాలుగా మారుతున్న సమయంలో,

326
00:19:25,499 --> 00:19:27,626
నా ముందు ఏదో పెట్టినట్లు గ్రహించాను.

327
00:19:27,709 --> 00:19:29,336
ఇది నీ కోసం.

328
00:19:29,419 --> 00:19:32,756
అది చికెన్ కార్డాన్ బ్లూ అని దాని వాసన బట్టి తెలిసింది.

329
00:19:32,840 --> 00:19:36,426
వావ్. అది నిజంగా ఫ్రయిడ్ చికెన్ మాదిరిగా కనిపించింది,
కానీ రుచి ఇంకా బాగుంది.

330
00:19:37,052 --> 00:19:38,387
నేను తినడం మొదలుపెట్టాను.

331
00:19:43,350 --> 00:19:45,894
నాకు చికెన్ అంటే ఇష్టం, చీజ్ అంటే ఇష్టం.

332
00:19:45,978 --> 00:19:48,021
కానీ వాటిని కలిపి తింటే ఎలా ఉంటుందో తెలియదు.

333
00:19:48,522 --> 00:19:50,566
అమ్మా, నాకు ఇది అంతగా నచ్చలేదు.

334
00:19:50,649 --> 00:19:51,733
నేను ఇంకో కోక్ తాగచ్చా?

335
00:19:51,817 --> 00:19:53,485
ఓహ్, అలాగే, హనీ.

336
00:19:57,239 --> 00:19:59,825
పిట్స్ బర్గ్ ప్రాంతంలో
మా విమానం కిందికి దిగుతున్న సమయంలో,

337
00:19:59,908 --> 00:20:01,785
నేను కిటికీ నుంచి బయట ప్రపంచాన్ని ఎట్టకేలకి చూడగలిగాను.

338
00:20:02,536 --> 00:20:04,538
మేము ఇప్పటికి మేఘాల పొరకి దిగువగా వచ్చేశాము,

339
00:20:04,621 --> 00:20:06,498
ఇంకా బయట మంచు కూడా బాగా పడుతోంది.

340
00:20:07,124 --> 00:20:09,960
నిజానికి కింద కనిపిస్తున్న ఆ సిటీ చాలా అందంగా ఉంది,

341
00:20:10,043 --> 00:20:11,753
ఆ వాతావరణంలో నగరం మెరుస్తున్నట్లు కనిపించింది.

342
00:20:12,337 --> 00:20:14,464
అప్పుడు నాలో ఒక ఆలోచన మొదలైంది

343
00:20:14,548 --> 00:20:17,176
కింద ఏదో ఒక ఇంట్లో ఒక పిల్లవాడు ఉండే ఉంటాడు,

344
00:20:17,259 --> 00:20:19,678
ఆకాశంలో విమానం ఇంజన్ల హోరు వింటూ ఉండి ఉంటాడు

345
00:20:19,761 --> 00:20:22,431
ఇంకా "ఇంత రాత్రిపూట ఆ విమానంలో ఎవరు ఉండి ఉంటారు?

346
00:20:22,514 --> 00:20:25,142
వాళ్లంతా ఎక్కడికి వెళ్తున్నారు?
వాళ్లు విమానంలో పడుకున్నారా లేదా?" అని ఆలోచిస్తూ ఉంటాడు.

347
00:20:29,897 --> 00:20:32,441
విమానం ల్యాండ్ అయినట్లే మాకు అనిపించలేదు.
అంత స్మూత్ గా ల్యాండ్ అయింది.

348
00:20:32,524 --> 00:20:33,525
పిట్స్ బర్గ్

349
00:20:33,609 --> 00:20:35,694
టాక్సీవే పైన వరుసగా అమర్చిన నీలం రంగు లైట్లు

350
00:20:35,777 --> 00:20:37,821
ఆ మంచులో మరింత అందంగా కనిపించాయి.

351
00:20:38,447 --> 00:20:39,948
విమానం గేటు దగ్గరకి చేరుకుంటున్న సమయంలో,

352
00:20:40,032 --> 00:20:43,118
మా విమానం గురించి స్పీకర్లలో ఎనౌన్స్ మెంట్ జరుగుతోంది.

353
00:20:43,702 --> 00:20:45,329
నేను మీ కెప్టెన్ ని మాట్లాడుతున్నాను.

354
00:20:45,412 --> 00:20:47,789
హఠాత్తుగా మంచు తుఫాను ఏర్పడిన కారణంగా

355
00:20:47,873 --> 00:20:50,209
డేటన్ ఇంకా షికాగో లకు వెళ్లవలసిన ప్రయాణికులకు
ఆలస్యం అవుతుంది,

356
00:20:50,292 --> 00:20:53,003
తదుపరి సమాచారం ఇచ్చేవరకూ వేచి ఉండగలరు.

357
00:20:53,086 --> 00:20:56,298
మరింత సమాచారం కోసం గేటు దగ్గర
టికెట్ ఏజెంట్ ని దయచేసి సంప్రదించండి.

358
00:20:58,217 --> 00:20:59,218
ఏమీ కంగారు లేదు.

359
00:20:59,301 --> 00:21:02,679
ప్రయాణికులకు హోటల్ లో వసతి సదుపాయాల్ని
టి.డబ్ల్యు.ఏ. అందిస్తుంది.

360
00:21:02,763 --> 00:21:04,139
- అది పూర్తిగా ఉచితం. సరే.
- థాంక్యూ.

361
00:21:04,223 --> 00:21:05,557
అయితే మాకు హోటల్ రూమ్ ఉంటుందా?

362
00:21:05,641 --> 00:21:07,309
- అవును. ఆందోళన పడకండి.
- మంచిది.

363
00:21:08,101 --> 00:21:09,102
సరే.

364
00:21:14,608 --> 00:21:17,444
ఆ హోటల్ ఎప్పుడు కట్టారని కౌంటర్ లో ఉన్న వ్యక్తిని అడిగాను.

365
00:21:17,528 --> 00:21:19,112
అది 1952లో కట్టారని చెప్పాడు.

366
00:21:19,821 --> 00:21:22,074
ఇప్పుడు నేను, 1952 నుండి ఇప్పటి వరకు

367
00:21:22,157 --> 00:21:23,992
అర్ధరాత్రి పూట మాలాగే

368
00:21:24,076 --> 00:21:26,578
ఎంతమంది కష్టపడి ఉంటారో ఊహించుకోగలను.

369
00:21:32,626 --> 00:21:33,627
సరే, బంగారం.

370
00:21:33,710 --> 00:21:36,630
విమానాలు రెడీ అయ్యాక ఎయిర్ లైన్ వాళ్లు ఫోన్ చేస్తారు,

371
00:21:36,713 --> 00:21:40,217
కానీ దానికి కొన్ని గంటలు పడుతుంది.
కాబట్టి, నువ్వు కాసేపు హాయిగా నిద్రపో.

372
00:21:40,300 --> 00:21:41,635
- సరేనా?
- అలాగే.

373
00:21:41,718 --> 00:21:43,428
నేను నైట్ క్యాప్ కోసం కింద లాంజ్ వరకూ వెళ్లొస్తాను.

374
00:21:43,512 --> 00:21:44,513
అలాగే.

375
00:21:44,596 --> 00:21:46,557
- సరే. ఫర్వాలేదు కదా?
- ఫర్వాలేదు.

376
00:21:46,640 --> 00:21:48,642
- సరే. ఐ లవ్ యూ.
- ఐ లవ్ యూ టూ.

377
00:21:50,894 --> 00:21:53,105
ఈ విషయంలో హ్యారీ పాత్ర కూడా ఉందని
ఎందుకో నాకు అనిపించింది

378
00:21:53,188 --> 00:21:54,773
కానీ నేను నోరు జారకుండా అదుపు చేసుకున్నాను.

379
00:22:24,219 --> 00:22:25,220
హలో?

380
00:22:26,471 --> 00:22:28,223
అలాగే, మేము వచ్చేస్తాము.

381
00:22:30,434 --> 00:22:32,978
నేను తలుపు తోసుకుని పరిగెత్తాను.
హాల్ వే లోకి పరుగున వెళ్లాను,

382
00:22:33,061 --> 00:22:35,439
తరువాత ఎలివేటర్ బటన్ ని పదే పదే నొక్కాను.

383
00:22:36,231 --> 00:22:38,150
వద్దు. నువ్వు ఇంక ఆపాలి.

384
00:22:40,569 --> 00:22:43,447
అమ్మా! అమ్మా, పద!
మనం ప్లేన్ మిస్ అవుతాం!

385
00:22:45,991 --> 00:22:48,076
అమ్మా, పద!
ప్లేన్ ఇంకో 20 నిమిషాల్లో బయలుదేరుతుంది!

386
00:22:48,160 --> 00:22:49,161
మనం మిస్ అయిపోతాం!

387
00:22:49,912 --> 00:22:52,497
నేను హాల్ లోకి వెళ్లాక,
వేరే రూమ్ నుంచి అమ్మ రావడం చూశాను.

388
00:22:52,581 --> 00:22:53,582
వస్తున్నాను.

389
00:22:53,665 --> 00:22:55,876
ఆమె హ్యారీతో ఉన్నా కూడా, అది పెద్ద విషయం కాదు.

390
00:22:55,959 --> 00:22:58,337
మా ప్రయాణం కొనసాగాలంటే
మేము గేటు దగ్గరకి 20 నిమిషాల్లో చేరడమే

391
00:22:58,420 --> 00:23:00,672
ఇప్పుడు ముఖ్యమైన విషయం.

392
00:23:01,381 --> 00:23:04,092
తెల్లవారుజామున మూడు గంటలకు,
మా అమ్మ చాలా ఉల్లాసంగా మంచి మూడ్ లో ఉంది.

393
00:23:04,176 --> 00:23:05,177
నేను కూడా అంతే ఉత్సాహంగా ఉన్నాను.

394
00:23:05,260 --> 00:23:08,013
మూడు గంటల నిద్ర ఇంకా
మా మిగతా ప్రయాణం మొదలవుతోంది.

395
00:23:09,640 --> 00:23:12,518
పిట్స్ బర్గ్ నుండి డేటన్ కు ప్రయాణం
గంట కంటే తక్కువే పట్టింది,

396
00:23:13,268 --> 00:23:15,479
కానీ వెనక్కి తిరిగి ఆలోచిస్తే, ఆ ప్రయాణం
ఊహించిన దానికంటే ఆసక్తికరంగా సాగింది.

397
00:23:16,271 --> 00:23:19,358
ఆ 40 నిమిషాల్లో మా అమ్మ
ఎన్నో భావోద్వేగాలకు లోను కావడం నేను గమనించాను

398
00:23:19,441 --> 00:23:21,109
ఆమెని అలా అంతకుముందు నేనెప్పుడూ చూడలేదు.

399
00:23:22,027 --> 00:23:23,695
తను ఆమెకి ఏం చెబుతుండచ్చు?

400
00:23:23,779 --> 00:23:26,406
తరువాత కాలంలో, లిజ్ గురించి పూర్తి కథని
నేను తెలుసుకున్నాను.

401
00:23:26,907 --> 00:23:28,367
అదంతా చూసి,

402
00:23:28,450 --> 00:23:30,536
అయోమయానికి గురవ్వడం తప్ప నాకు పెద్దగా ఏమీ గుర్తులేదు.

403
00:23:30,619 --> 00:23:34,957
కానీ మేము దేశాన్ని విడిచి పారిపోవాలని ప్రయత్నించినప్పుడు
నా వయస్సు తొమ్మిదేళ్లు మాత్రమే,

404
00:23:35,040 --> 00:23:38,836
కానీ నేను, నా తమ్ముడు మాత్రమే తప్పించుకోగలిగాము.

405
00:23:38,919 --> 00:23:43,882
ఇంకా, దురదృష్టం ఏమిటంటే, మా పేరెంట్స్ ని వాళ్లు
మా కళ్ల ముందే తీసుకుపోయారు.

406
00:23:46,009 --> 00:23:47,594
అయ్యో, హనీ.

407
00:23:47,678 --> 00:23:51,431
లేదు, ఫర్వాలేదు. ఫర్వాలేదు.
నేను ఆ విషాదం నుండి బయటపడ్డాను.

408
00:23:51,515 --> 00:23:54,309
ఆ కాలంలో న్యూ యార్క్ ప్రాంతంలో ఒక టీవీ షో నడిచేది

409
00:23:54,393 --> 00:23:55,686
దాని పేరు 'రిమెంబర్ అస్.'

410
00:23:56,270 --> 00:23:58,564
నాజీల దురాగతాల వాస్తవ
దృశ్యాల్ని అందులో ప్రదర్శించేవారు.

411
00:23:58,647 --> 00:24:01,817
నాకైతే వేరే వాటికంటే కూడా
ఆ దృశ్యాల వల్లే ఎక్కువగా పీడకలలు వచ్చేవి.

412
00:24:02,317 --> 00:24:04,528
నాకు ఎప్పుడూ లిజ్ గురించి బాధగా అనిపిస్తూ ఉండేది.

413
00:24:04,611 --> 00:24:06,572
ఏది ఏమైనా, అమ్మ తనని చాలా బాగా చూసుకునేది.

414
00:24:07,114 --> 00:24:10,117
ఒకరు ఆమెకంటే ఎక్కువ బాధలో ఉండటం

415
00:24:10,200 --> 00:24:11,493
ఆమెకు కాస్త ఊరట ఇచ్చినట్టు అనిపించింది.

416
00:24:13,203 --> 00:24:16,623
నేను ఆ పది అడుగుల పొడవు మనిషి గురించి
తెలుసుకోలేకపోయినందుకు హఠాత్తుగా బాధ కలిగింది.

417
00:24:16,707 --> 00:24:18,458
కనీసం నాతో ఎవరైనా మాట్లాడితే బాగుండేది అనిపించింది.

418
00:24:19,710 --> 00:24:22,629
కానీ ఈ రాత్రి నేను నక్షత్రాలతో కాలక్షేపం చేస్తాను.

419
00:24:23,672 --> 00:24:27,509
నిశ్శబ్ద రాత్రులలో నిశ్చలంగా మెరిసే నక్షత్రాలు

420
00:24:27,593 --> 00:24:31,096
నా గిటార్ నుండి వినిపించే సన్నని రాగాలు

421
00:24:31,180 --> 00:24:34,141
మన చుట్టూ అలముకున్న నిశ్శబ్దంలో
అలా తేలిపోతున్నట్లుగా ఉంది

422
00:24:34,224 --> 00:24:37,436
డేటన్ లో ఆగినప్పుడు
మేము విమానంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాం.

423
00:24:37,519 --> 00:24:39,396
అమ్మ, నేను కొద్దిగా కునుకు తీశాము కూడా.

424
00:24:39,479 --> 00:24:40,480
డేటన్

425
00:24:40,564 --> 00:24:42,858
మాకు మెలకువ వచ్చేలోపే విమానం మళ్లీ బయలుదేరింది.

426
00:24:43,400 --> 00:24:46,153
మేము కూర్చున్నంత సేపూ లిజ్ మమ్మల్ని హాయిగా నిద్రపోనిచ్చేది.

427
00:24:46,236 --> 00:24:48,113
డేటన్ లో ఎవ్వరూ ఫ్లయిట్ ఎక్కలేదు.

428
00:24:48,197 --> 00:24:50,949
అంటే, ఆసక్తి కలిగించేలా ఎవరూ కనిపించలేదు.

429
00:24:51,033 --> 00:24:52,743
తెల్లవారుజామున నాలుగు గంటలకు, అలా ఎవరు కనిపిస్తారు?

430
00:24:52,826 --> 00:24:53,827
షికాగో

431
00:24:53,911 --> 00:24:55,621
కాబట్టి షికాగో చేరే వరకూ మేము నిద్రపోయాము.

432
00:24:59,458 --> 00:25:02,461
కొత్తగా కట్టిన ఓ హారే టెర్మినల్ కి మేము చేరుకునేసరికి
అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది.

433
00:25:04,421 --> 00:25:06,131
ఇదే నా చివరి స్టాప్.

434
00:25:06,215 --> 00:25:07,341
ఇది నా హోమ్ బేస్.

435
00:25:07,841 --> 00:25:11,136
కానీ మీ కోసం నేను కొన్ని సర్ ప్రైజులు ప్లాన్ చేశాను.

436
00:25:12,513 --> 00:25:14,890
మీ ఇద్దరూ

437
00:25:14,973 --> 00:25:16,892
కన్సాస్ సిటీ ఇంకా డెన్వర్ వరకూ

438
00:25:16,975 --> 00:25:19,561
ఫస్ట్ క్లాసులో ప్రయాణించేలా ఏర్పాటు చేశాను.

439
00:25:19,645 --> 00:25:23,607
అయితే మీ కోసం డెన్వర్ లో మరొక సర్ ప్రైజ్ ఎదురుచూస్తోంది.

440
00:25:24,191 --> 00:25:25,192
కాబట్టి…

441
00:25:30,072 --> 00:25:32,241
ఆ వివరాలు ఇవిగో.

442
00:25:32,324 --> 00:25:33,992
టికెట్ ఏజెంట్ కి మీరు ఇవి ఇవ్వండి చాలు.

443
00:25:34,076 --> 00:25:35,244
- సరేనా?
- థాంక్యూ.

444
00:25:35,327 --> 00:25:37,663
- సరే. గుడ్ బై.
- థాంక్యూ.

445
00:25:40,290 --> 00:25:42,918
ఒకవేళ మాకు మేముగా ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కోవాలంటే

446
00:25:43,001 --> 00:25:45,045
మాకు ఎంత ఖర్చయ్యేదా అని నేను ఆలోచిస్తూ ఉండిపోయాను.

447
00:25:45,838 --> 00:25:48,131
వన్ వే ప్రయాణానికి 185 డాలర్ల వరకూ కావచ్చు.

448
00:25:48,715 --> 00:25:51,426
నేను ఎన్ని బొమ్మలు, హాట్ డాగ్స్ కొనుక్కోవచ్చో.

449
00:25:51,510 --> 00:25:54,388
ఇంకా బహుశా ఇలాంటి ట్రిప్స్
ఇంకో రెండు మూడు కూడా చేసుండచ్చు.

450
00:25:54,888 --> 00:25:56,265
ఆ లిజ్ ఎంత గొప్ప అమ్మాయి.

451
00:25:57,558 --> 00:25:59,977
హఠాత్తుగా, మా అమ్మ ప్రవర్తన అంతా మారిపోయింది.

452
00:26:00,561 --> 00:26:02,896
ఆమెలో ఆ మార్పు నాకు స్పష్టంగా కనిపించింది.

453
00:26:02,980 --> 00:26:07,025
ఆమె నిటారుగా, తల పైకెత్తి, హుందాగా నడుస్తోంది.

454
00:26:07,109 --> 00:26:08,527
మేము ఫస్ట్ క్లాస్ లో ప్రయాణిస్తున్నాం.

455
00:26:08,610 --> 00:26:12,322
ఆమె వెస్ట్ కోస్ట్ కి ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించే ఒక నటి.

456
00:26:13,031 --> 00:26:16,118
మేము ఇంటి నుండి బయలుదేరే ముందు నేను వద్దని వారించిన
ఆ నకిలీ లెపర్డ్ కోట్ వేసుకుంటే బాగుండు అని

457
00:26:16,201 --> 00:26:18,745
తను మనసులో అనుకుంటోందని నాకు తెలుసు.

458
00:26:27,337 --> 00:26:28,547
హాలీవుడ్ పిలిచింది.

459
00:26:29,965 --> 00:26:32,009
వెంటనే విమానంలో బయలుదేరి రమ్మని చెప్పారు.

460
00:26:33,051 --> 00:26:34,136
అయితే మీరు నటి కదా?

461
00:26:34,219 --> 00:26:36,805
అవును. మీరు ఎలా గెస్ చేశారు?

462
00:26:36,889 --> 00:26:39,933
మా అమ్మ అప్పుడప్పుడు
ఇలాంటి అనవసరమైన కామెంట్స్ చేస్తుండేది.

463
00:26:40,017 --> 00:26:41,185
హాలీవుడ్ లో మీకు గుడ్ లక్.

464
00:26:41,852 --> 00:26:43,103
థాంక్యూ.

465
00:26:48,150 --> 00:26:50,402
ఆ టెర్మినల్ చాలా అందంగా ఉంది. ఎందుకో తెలియదు గానీ,

466
00:26:50,485 --> 00:26:52,779
తెల్లవారుజామున నాలుగు గంటలకు కూడా
హాట్ డాగ్ దుకాణం తెరిచే ఉంది.

467
00:26:52,863 --> 00:26:54,323
- హలో.
- నాకు రెండు తినాలని ఉంది.

468
00:26:54,406 --> 00:26:55,490
మా అమ్మ ఒక్కటే ఆర్డరు చేసింది.

469
00:26:56,116 --> 00:26:57,910
- మీరు తినడం పూర్తయిందా?
- అయింది.

470
00:26:58,994 --> 00:27:00,621
నేను ఇంకో హాట్ డాగ్ తినచ్చా?

471
00:27:01,288 --> 00:27:04,041
నీకు నిజంగా, నిజంగా ఇంకో హాట్ డాగ్ కావాలా?

472
00:27:04,666 --> 00:27:07,044
అవును, నాకు నిజంగా, నిజంగా కావాలి.

473
00:27:07,544 --> 00:27:08,545
సరే.

474
00:27:16,220 --> 00:27:18,180
జీవితం అనే ఈ మహావృక్షం నుండి…

475
00:27:18,263 --> 00:27:20,182
ప్రొపెల్లర్ విమానాలలో ఫస్ట్ క్లాస్ విభాగాలు

476
00:27:20,265 --> 00:27:23,352
సాధారణంగా విమానం వెనుక భాగంలో ఉంటాయి,
జెట్స్ లో అందుకు భిన్నంగా ఉంటాయి.

477
00:27:23,894 --> 00:27:26,563
నేను మొదటగా ఏం గుర్తించానంటే, సీట్లు పెద్దగా ఉన్నాయి.

478
00:27:26,647 --> 00:27:28,398
ఇక రెండో విషయం, అందమైన మ్యూరల్ అలంకరించి ఉంది.

479
00:27:31,902 --> 00:27:34,321
ఖచ్చితంగా చెప్పగలను, అసలైన మజా ముందుంది

480
00:27:34,404 --> 00:27:37,282
మంచి కాలం ఇంకా రాబోతోంది

481
00:27:40,202 --> 00:27:42,454
మంచి కాలం ఇంకా రాబోతోంది

482
00:27:42,538 --> 00:27:45,874
కానీ, బేబీ, అది బాగుంటుంది కదా?

483
00:27:48,210 --> 00:27:52,005
నువ్వు సూర్యుడిని చూశాను అనుకుంటున్నావేమో
కానీ అసలైన మెరుపుని నువ్వింకా చూడలేదు

484
00:27:52,089 --> 00:27:54,424
మేము టేకాఫ్ అయ్యాక,
ఇంజన్ల హోరు పెద్దగా వినిపించలేదు.

485
00:27:54,508 --> 00:27:57,678
బహుశా అందుకేనేమో, ఫస్ట్ క్లాస్ సీటింగ్
వెనుక భాగంలో ఏర్పాటు చేసి ఉంటారు.

486
00:27:57,761 --> 00:27:59,179
జెట్ విమానాలలో, ముందు భాగంలో శబ్దం ఉండదు.

487
00:28:00,097 --> 00:28:02,933
ఫస్ట్ క్లాసులో ప్రయాణిస్తున్నందుకు
మా అమ్మ నిజంగానే బాగా ఎగ్జయిట్ అయింది.

488
00:28:03,016 --> 00:28:07,187
చూడు, ఏదైనా ఫిల్మ్ స్టూడియో నన్ను ఇలాగ రప్పిస్తే గనుక,

489
00:28:07,271 --> 00:28:11,650
నన్ను తిరిగి ఇదే ఫస్ట్ క్లాసులో పంపాలని
స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ పట్టుపడుతుంది.

490
00:28:12,609 --> 00:28:14,111
అది రూలు.

491
00:28:19,950 --> 00:28:22,327
విమానం పశ్చిమం దిశగా ప్రయాణం కొనసాగిస్తుండగా,

492
00:28:22,411 --> 00:28:24,872
సూర్యుడు అప్పుడే ఉదయిస్తుండటాన్ని నేను చూశాను.

493
00:28:24,955 --> 00:28:26,999
మా విమానం కొద్దిగా కుడి వైపు తిరగడంతో,

494
00:28:27,082 --> 00:28:28,709
సూర్యకిరణాలు కిటికీ గుండా ప్రసరించి

495
00:28:28,792 --> 00:28:31,837
మా అమ్మ ముఖం మీద డాన్స్ చేస్తున్నట్లు అనిపించింది.

496
00:28:33,422 --> 00:28:37,759
వేసవి సెలవుల్లో 'లైట్ అప్ ద స్కై' నాటకంలో
నేను నటించినప్పుడు, నీకు గుర్తుందా, బంగారం?

497
00:28:37,843 --> 00:28:43,765
ఆ క్రిటిక్ ఒకాయన నన్ను చూసి,
నేను క్రాఫోర్డ్ ఇంకా స్టాన్విక్ ల కలయికలా ఉన్నానని అన్నాడు.

498
00:28:44,975 --> 00:28:47,227
అది ఒక అద్భుతమైన నటనా ప్రదర్శన.

499
00:28:49,897 --> 00:28:51,565
అది చాలా గొప్ప విషయం కదా?

500
00:28:53,567 --> 00:29:00,574
ఇది ఒక అలజడి లేని మధ్యాహ్నం…

501
00:29:02,367 --> 00:29:05,704
నేను కుడి వైపు చూసినప్పుడు,
బంగారు రంగులో, మెరుస్తున్న కర్టెన్లు కనిపించాయి.

502
00:29:05,787 --> 00:29:07,456
వాటి వెనుక ఏం ఉందా అని అనుమానం వచ్చింది.

503
00:29:08,081 --> 00:29:10,626
స్టీవార్డెస్ గురించి ఆ నడవలో అటూ ఇటూ చూశాను.

504
00:29:10,709 --> 00:29:12,503
ఒకామె గ్యాలీ దగ్గర నిలబడి ఉండటం నా కంటపడింది.

505
00:29:13,545 --> 00:29:14,713
నేను ఆమెకు సైగ చేశాను,

506
00:29:14,796 --> 00:29:17,007
స్కూలులో మా టీచరుకి ఎలా సైగ చేస్తానో
అదే విధంగా చేయి ఊపాను.

507
00:29:21,970 --> 00:29:25,307
పొడవుగా, మెరుస్తున్న చాయతో ఇంకా ఆ యవ్వనపు అందంతో

508
00:29:25,390 --> 00:29:28,810
ఈపనీమా సుందరి అలా నడిచి వెళ్తుంటే

509
00:29:28,894 --> 00:29:30,854
ఆమె అలా నడిచి వెళ్తుంటే

510
00:29:30,938 --> 00:29:34,358
ఆమె వెళ్తుంటే ప్రతి ఒక్కరూ "ఆహ్" అంటారు

511
00:29:34,441 --> 00:29:35,859
చెప్పు బాబు? నీకు ఏమైనా సాయం కావాలా?

512
00:29:36,568 --> 00:29:38,278
అది చాలా పరిచయం ఉన్న గొంతులా అనిపించింది.

513
00:29:38,820 --> 00:29:41,949
న్యూ యార్క్ టెర్మినల్ లో నేను విన్న వాయిస్
ఈమె వాయిస్ లాగే ఉంది.

514
00:29:42,991 --> 00:29:45,702
ఆ మనిషి ఎలా ఉంటుందని నేను ఊహించుకున్నానో
ఆమె అచ్చు అలాగే ఉంది.

515
00:29:47,496 --> 00:29:48,580
అది దేని కోసం?

516
00:29:50,791 --> 00:29:53,544
క్రాస్ కంట్రీ ఓవర్ నైట్ ఫ్లయిట్స్ లో
ప్రయాణించే వారి కోసం అది స్లీపర్ సర్వీస్.

517
00:29:53,627 --> 00:29:55,087
ఇప్పుడు వీటిని మేము పెద్దగా ఉపయోగించడం లేదు.

518
00:29:55,671 --> 00:29:58,006
మీరు వీటిని ఎప్పుడు ఉపయోగించేవారు? ఏ సంవత్సరం?

519
00:29:58,090 --> 00:30:00,467
మీరు వీటిని వాడటం ఎందుకు మానేశారు?
ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయి?

520
00:30:00,551 --> 00:30:02,386
ఒకసారి ఒక్క ప్రశ్న అడగచ్చు కదా?

521
00:30:02,469 --> 00:30:03,762
సరే.

522
00:30:03,846 --> 00:30:05,889
అంటే, ఈ విమానం కొత్తగా వచ్చినప్పటి నుండి,

523
00:30:05,973 --> 00:30:08,267
1959లో జెట్ విమానాలు వచ్చే వరకూ,

524
00:30:08,350 --> 00:30:10,936
ఈ సర్వీసుని దూర ప్రాంతాలకు వెళ్లే
నాన్ స్టాప్ ఫ్లయిట్స్ లో ఉపయోగించేవారు.

525
00:30:11,019 --> 00:30:14,106
ఈ విమానం ఎనిమిది గంటల పైన
ప్రయాణించాల్సి వచ్చింది అనుకుందాం.

526
00:30:14,189 --> 00:30:16,441
దేశంలో ఒక మూల నుంచి ఇంకో మూలకి
రాత్రంతా ప్రయాణించాల్సి వచ్చింది అనుకుందాం.

527
00:30:16,525 --> 00:30:19,278
వాటిల్లో ప్రయాణికులు పడుకుంటారు.
ఇది ఫస్ట్ క్లాస్ టికెట్ ధరలో భాగంగా ఉండేది.

528
00:30:19,361 --> 00:30:20,529
ఓహ్, బాగుంది.

529
00:30:20,612 --> 00:30:22,447
నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు?

530
00:30:22,531 --> 00:30:24,992
అంటే, మా అమ్మ ఈ ఎయిర్ లైన్ ఇండస్ట్రీలో
చాలా ఏళ్లు పని చేసింది,

531
00:30:25,075 --> 00:30:26,952
ఒరిజినల్ గా 1930ల కాలంలో స్టీవార్డెస్ గా ఉండేది.

532
00:30:27,035 --> 00:30:28,078
వావ్.

533
00:30:28,161 --> 00:30:31,373
ఆమె 1939లో రిటైర్ అయింది, కానీ ఆనాటి నుండి

534
00:30:31,456 --> 00:30:34,042
ఆమె న్యూ యార్క్ ఎయిర్ పోర్ట్స్ లో
ఫ్లయిట్ ఎనౌన్స్ మెంట్లు చేస్తోంది.

535
00:30:34,960 --> 00:30:35,961
నేను ఇప్పుడే వస్తాను.

536
00:30:39,798 --> 00:30:41,216
నువ్వు తమాషాగా అంటున్నావు. నిజంగానా?

537
00:30:41,300 --> 00:30:44,928
ఆమెకి ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది?
ఆమె ఎలాంటి విమానాలలో పని చేసింది?

538
00:30:45,012 --> 00:30:47,306
ఆమె ఎయిర్ పోర్ట్ లో ఎక్కడ నుండి
ఆ ఎనౌన్స్ మెంట్లు చేస్తుంది?

539
00:30:47,931 --> 00:30:53,187
అంటే, ఆమె వయసు 58 ఏళ్లు ఇంకా
ఆమె ఎక్కువగా డిసి-3 విమానాల్లో పని చేసింది.

540
00:30:53,687 --> 00:30:57,149
ఆమె టి.డబ్ల్యు.ఏ. టెర్మినల్ వెనుక ఒక చిన్న గది నుండి
ఆ ఎనౌన్స్ మెంట్లు చేస్తుంది అనుకుంటా.

541
00:30:57,232 --> 00:30:59,735
నువ్వు చాలా ప్రశ్నలు అడుగుతున్నావు.
నీకు విమానాల్లో తిరగడం బాగా ఇష్టం, కదా?

542
00:30:59,818 --> 00:31:00,903
నువ్వు విమానం ఎక్కడం ఇదే మొదటిసారా?

543
00:31:01,445 --> 00:31:03,906
డోరిస్ నా ప్రశ్నలన్నింటికీ జవాబులు చెప్పింది
ఇంకా చాలా విషయాలు వివరించింది.

544
00:31:03,989 --> 00:31:05,490
తను నా కొత్త బెస్ట్ ఫ్రెండ్.

545
00:31:07,326 --> 00:31:08,535
అమ్మా! అమ్మా! మేలుకో!

546
00:31:08,619 --> 00:31:09,953
నువ్వు ఇంక నిద్రలేవాలి!

547
00:31:10,787 --> 00:31:13,040
- ఏంటి విషయం?
- నువ్వు ఇది నమ్మలేవు.

548
00:31:13,123 --> 00:31:15,542
ఐడల్ వైల్డ్ ఎయిర్ పోర్ట్ లో వాయిస్ డోరిస్ తల్లిదే.

549
00:31:15,626 --> 00:31:19,171
ఆమె వయస్సు 58 సంవత్సరాలు ఇంకా
ఆమె మొట్టమొదటి స్టీవార్డెస్ అట.

550
00:31:19,254 --> 00:31:20,631
అమ్మా, నువ్వు ఆమెని చాలా ఇష్టపడతావు.

551
00:31:20,714 --> 00:31:23,300
తనకి ఎలాంటి యాస లేదు ఇంకా తను చాలా అందంగా ఉంది.

552
00:31:23,383 --> 00:31:25,344
- ఎవరు?
- డోరిస్!

553
00:31:25,427 --> 00:31:28,847
ఓహ్, అది అద్భుతం, నా బుజ్జి బాబు.

554
00:31:28,931 --> 00:31:31,266
అమ్మా, డోరిస్ ముందు నన్ను అలా పిలవకు, సరేనా?

555
00:31:31,350 --> 00:31:33,685
అలాగే, డార్లింగ్. ఇంక నన్ను పడుకోనివ్వు.

556
00:31:40,776 --> 00:31:43,362
ఆమె హెయిర్ స్టైల్ సరిగ్గా నాకు నచ్చినట్టే ఉంటుంది.

557
00:31:43,445 --> 00:31:44,613
లేత రంగు కళ్లు.

558
00:31:44,696 --> 00:31:46,406
నేను ఆమె నుండి చూపు తిప్పుకోలేకపోయాను.

559
00:31:47,449 --> 00:31:48,575
నీ వయసెంత?

560
00:31:48,659 --> 00:31:49,743
ఇరవై ఒకటి.

561
00:31:50,285 --> 00:31:51,662
నీ ఫేవరెట్ ఎయిర్ ప్లేన్ ఏది?

562
00:31:52,913 --> 00:31:54,498
బోయింగ్ 707.

563
00:31:54,581 --> 00:31:58,043
- ఎందుకు?
- ఎందుకంటే అది అందంగా ఉంటుంది, వేగంగా వెళుతుంది.

564
00:31:58,836 --> 00:31:59,962
అది చాలా బాగుంటుంది.

565
00:32:00,045 --> 00:32:01,213
నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా?

566
00:32:02,297 --> 00:32:03,841
నాకు ఉండేవాడు. ఈ మధ్యనే మేము విడిపోయాం.

567
00:32:05,175 --> 00:32:06,677
మా అమ్మ ఒక నటి, తెలుసా?

568
00:32:06,760 --> 00:32:08,136
అవునా?

569
00:32:08,220 --> 00:32:10,889
ఎవరినైనా ఇంప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు
నేను ఈ మాటని ఉపయోగించేవాడిని.

570
00:32:11,390 --> 00:32:12,724
ఇది చాలా ఆసక్తికరంగా ఉంది.

571
00:32:12,808 --> 00:32:14,852
అవును, మేము హాలీవుడ్ కి వెళ్తున్నాం.

572
00:32:14,935 --> 00:32:16,019
వాళ్లు ఆమెని రమ్మని పిలిచారు.

573
00:32:16,103 --> 00:32:19,273
ఆమె పాల్ న్యూమాన్ తో
ఏదో మూవీ చేయాల్సి ఉంది, అనుకుంటా.

574
00:32:19,898 --> 00:32:21,066
పాల్ న్యూమాన్ తోనా, నిజంగానా?

575
00:32:21,942 --> 00:32:23,318
ఓహ్, నేను ఇది నమ్మలేకపోతున్నాను.

576
00:32:24,653 --> 00:32:26,363
సరే, నేను ఇంక వెళ్లాలి.

577
00:32:26,446 --> 00:32:27,614
మా అమ్మకి ఏదో కావాలట.

578
00:32:27,698 --> 00:32:28,949
సరే.

579
00:32:29,032 --> 00:32:30,617
ఓహ్, దేవుడా. నేనెందుకు అబద్ధం చెప్పాను?

580
00:32:30,701 --> 00:32:31,910
అది చాలా తెలివితక్కువ పని.

581
00:32:32,452 --> 00:32:35,080
ఆమె అప్పటికే నటి అని చెప్పగానే ఇంప్రెస్ అయింది.

582
00:32:39,918 --> 00:32:42,296
కన్సాస్ సిటీ ఎయిర్ పోర్ట్ పెద్దగా నచ్చలేదు.

583
00:32:42,379 --> 00:32:43,505
కన్సాస్ సిటీ

584
00:32:43,589 --> 00:32:44,840
ఒక్క ఈ బొమ్మల దుకాణం తప్ప.

585
00:32:46,008 --> 00:32:47,843
ఓహ్, దేవుడా. ఓహ్, దేవుడా.

586
00:32:48,844 --> 00:32:53,182
అచ్చు మేము ప్రయాణించే విమానం లాంటిదే
బ్యాటరీతో నడిచే నమూనా బొమ్మ అక్కడ ఉంది.

587
00:33:00,105 --> 00:33:02,733
అలాంటి గొప్ప బొమ్మ ఇప్పటివరకూ
ప్రపంచంలోనే తయారు కాలేదు.

588
00:33:05,611 --> 00:33:08,071
తలుపు తెరుచుకుంది, ప్రయాణికులు అదృశ్యం అవుతారు,

589
00:33:08,906 --> 00:33:10,699
స్టీవార్డెస్ ప్రత్యక్షం అవుతుంది.

590
00:33:10,782 --> 00:33:12,159
ఓహ్, దేవుడా.

591
00:33:12,743 --> 00:33:13,952
తలుపు మూసుకుంటుంది,

592
00:33:14,828 --> 00:33:16,038
ప్రయాణికులు తిరిగి ప్రత్యక్షం అవుతారు.

593
00:33:17,289 --> 00:33:19,458
ఒక్కొక్కటిగా, ఇంజన్లు ఆన్ అవుతాయి.

594
00:33:20,083 --> 00:33:22,252
ఓహ్, దేవుడా. విమానం బయలుదేరుతుంది.

595
00:33:25,339 --> 00:33:28,884
ఆ క్షణంలో జీవితం ఎంత బాగుందంటే
ఆ అనుభూతి నుండి బయటపడటం నాకు చాలా కష్టమైపోయింది.

596
00:33:28,967 --> 00:33:30,802
- అయితే ఇది 12.95 డాలర్లు. టాక్స్ తో కలిపి.
- సరే.

597
00:33:30,886 --> 00:33:32,095
సరే, నేను రశీదు రాస్తాను.

598
00:33:32,179 --> 00:33:33,180
అలాగే. మంచిది.

599
00:33:34,973 --> 00:33:36,517
ఆ విమానాన్ని విరగొట్టాక నా ఆనందం ఆవిరైంది.

600
00:33:39,353 --> 00:33:40,979
నేను గంట వరకూ ఆపకుండా ఏడ్చాను,

601
00:33:41,063 --> 00:33:43,607
డెన్వర్ దిశగా విమానం బయలుదేరి
టెకాఫ్ అయ్యేవరకూ ఏడుస్తూనే ఉన్నాను.

602
00:33:44,525 --> 00:33:45,943
మా ప్రయాణంలో సుదీర్ఘ సమయం ఇదే అవుతుంది,

603
00:33:46,026 --> 00:33:48,570
బలమైన గాలులు వీస్తుండటం వల్ల
సుమారు నాలుగు గంటల లోపు సమయం అవుతుంది.

604
00:33:50,447 --> 00:33:51,698
ఏమైంది?

605
00:33:51,782 --> 00:33:53,075
నా విమానం విరిగిపోయింది.

606
00:33:55,994 --> 00:33:57,454
సరే, అసలైన విమానాలు కూడా విరిగిపోతుంటాయి, తెలుసా?

607
00:33:58,330 --> 00:33:59,498
అవి విరుగుతాయా?

608
00:33:59,581 --> 00:34:00,707
అవును, అవి విరుగుతాయి.

609
00:34:02,084 --> 00:34:04,127
సరే, నాకు ఆ విషయం తెలియదు.

610
00:34:04,211 --> 00:34:07,214
డోరిస్ నాకు ఆ విషయం చెప్పడంతో
నా జీవితం అప్పటి నుండి పూర్తిగా మారిపోయింది.

611
00:34:07,297 --> 00:34:09,675
పర్ఫెక్ట్ గా లేని వస్తువులు నన్ను ఎప్పుడూ చిరాకు పెట్టేవి

612
00:34:09,757 --> 00:34:10,967
కానీ దానికి కారణం ఏమిటో తెలియదు,

613
00:34:11,051 --> 00:34:12,844
ముఖ్యంగా మెకానికల్ వస్తువులు సరిగ్గా లేకపోతే నచ్చవు.

614
00:34:12,928 --> 00:34:16,681
కానీ నేను ఈ రోజుకీ వాడుకోగల జవాబు ఆమె దగ్గర ఉంది.

615
00:34:16,764 --> 00:34:18,433
అసలైనవి కూడా విరిగిపోతుంటాయి.

616
00:34:18,516 --> 00:34:20,853
నువ్వు కాసేపు పడుకోవడానికి బెర్త్ సిద్ధం చేయమంటావా?

617
00:34:20,936 --> 00:34:21,937
అలాగే!

618
00:34:22,020 --> 00:34:24,481
డోరిస్, థాంక్యూ, కానీ అది అవసరం లేదు.

619
00:34:24,565 --> 00:34:26,817
- అమ్మా!
- లేదు, నిజంగా. మరేం ఫర్వాలేదు.

620
00:34:26,900 --> 00:34:28,150
నేను వెంటనే ఏర్పాటు చేస్తాను.

621
00:34:49,464 --> 00:34:51,717
ఆ బెర్త్ లో పడుకుని కిటికీ గుండా ఆకాశం వైపు చూస్తూ

622
00:34:51,800 --> 00:34:53,594
నేను చాలా ఎగ్జయిట్ అయ్యాను.

623
00:34:54,261 --> 00:34:55,929
నాకు అస్సలు నిద్రపట్టలేదు.

624
00:34:57,139 --> 00:34:59,391
నేను మెలకువగా ఉండి ఎంజాయ్ చేయాలి అనుకున్నాను,

625
00:34:59,474 --> 00:35:01,101
చివరికి నా మీల్ కూడా ఇక్కడే తినాలని అనుకున్నాను.

626
00:35:04,062 --> 00:35:06,315
- మీరు నటి అని మీ అబ్బాయి చెప్పాడు.
- అవును.

627
00:35:06,398 --> 00:35:09,359
ఇంకా పాల్ న్యూమాన్ మూవీలో నటిస్తున్నందుకు
మీకు కంగ్రాట్స్ చెప్పాలి.

628
00:35:09,443 --> 00:35:10,694
అది చాలా సంతోషకరమైన విషయం.

629
00:35:11,904 --> 00:35:13,739
వాడు అపార్థం చేసుకుని ఉంటాడు.

630
00:35:13,822 --> 00:35:15,532
ప్రత్యేకంగా సినిమా ఏదీ చేయడం లేదు.

631
00:35:15,616 --> 00:35:18,327
కేవలం ఒక ఫ్రెండ్ నాకు సినిమాలలో వేషాల కోసం
ప్రయత్నించి సాయం చేస్తాను అన్నాడు.

632
00:35:18,994 --> 00:35:21,997
పాల్ న్యూమాన్ ని నటుడిగా నేను ఇష్టపడతానని వాడికి తెలుసు,

633
00:35:22,080 --> 00:35:24,750
కాబట్టి వాడు రెండు విషయాల్నీ కలిపి చెప్పి ఉంటాడు.

634
00:35:25,417 --> 00:35:28,086
నేను సిగ్గుతో కుంగిపోయాను,
అసలు ఇక బతకాలని కూడా అనిపించలేదు.

635
00:35:28,795 --> 00:35:31,507
లంచ్ దాదాపు రెడీ అయింది, తను తింటాడేమో అడిగి చూస్తాను.

636
00:35:31,590 --> 00:35:32,883
- థాంక్యూ, డోరిస్.
- నేను ఇప్పుడే వస్తాను.

637
00:35:32,966 --> 00:35:33,967
నువ్వు చాలా మంచిదానివి.

638
00:35:37,304 --> 00:35:38,430
లంచ్ దాదాపు రెడీ అయింది.

639
00:35:38,514 --> 00:35:39,765
నీకు చికెన్ అంటే ఇష్టం అనుకుంటా.

640
00:35:39,848 --> 00:35:41,433
నాకు ఫ్రయిడ్ చికెన్ అంటే ఇష్టం.

641
00:35:41,517 --> 00:35:43,644
సరే, ఇది కూడా అలాగే ఉంటుంది. ఇంకా బాగుంటుంది కూడా.

642
00:35:43,727 --> 00:35:44,728
ఓహ్, అవునా?

643
00:35:44,811 --> 00:35:46,396
దీనిని చికెన్ కార్డాన్ బ్లూ అంటారు.

644
00:35:47,356 --> 00:35:48,815
నాకు ఇంకొక కోక్ ఇస్తావా?

645
00:35:48,899 --> 00:35:50,609
తప్పకుండా. ఇప్పుడే వస్తాను.

646
00:35:50,692 --> 00:35:51,693
సరే.

647
00:36:00,953 --> 00:36:04,081
నా అంచనా ప్రకారం అది 7డి అనుకుంటా,
ఆ సీటులో కూర్చున్న వ్యక్తి

648
00:36:04,164 --> 00:36:06,834
చాలా తాగుతున్నాడు ఇంకా పాల్ మాల్స్ సిగరెట్లు తాగుతున్నాడు,

649
00:36:06,917 --> 00:36:10,420
అవి చాలా ఘాటైన ఫిల్టర్ లేని సిగరెట్లని మా అమ్మ నాకు చెప్పింది.

650
00:36:10,504 --> 00:36:12,297
న్యూపోర్ట్ సిగరెట్లు అంత ఘాటుగా ఉండవు.

651
00:36:12,923 --> 00:36:16,093
కన్సాస్ సిటీ స్టార్ అనే పత్రిక హెడ్ లైన్ వార్తని

652
00:36:16,176 --> 00:36:18,178
ఆయన పదేపదే చదువుతున్నాడు.

653
00:36:18,887 --> 00:36:22,516
"ఘోరప్రమాదం: ఐడల్ వైల్డ్ లో నేలకూలిన జెట్ ఎయిర్ లైనర్"
అని ఉంది.

654
00:36:22,599 --> 00:36:24,893
ఆ హెడ్ లైన్ కింద అస్పష్టంగా ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంది.

655
00:36:25,853 --> 00:36:29,106
విమానాలు నేలకూలిపోవడం, నా చిన్నతనంలో
నాకు ఆందోళన కలిగించడం కన్నా ఎక్కువ ఆసక్తి కలిగించేవి.

656
00:36:29,648 --> 00:36:31,567
నేను అంతగా ప్రాణప్రదంగా ప్రేమించిన ఒక వస్తువు

657
00:36:31,650 --> 00:36:34,736
ఎవరినైనా గాయపరుస్తుందని, ప్రాణాలు కూడా తీస్తుందన్న ఆలోచనే

658
00:36:34,820 --> 00:36:35,988
నన్ను కలవరపరుస్తుంది.

659
00:36:36,822 --> 00:36:39,908
తరువాత ఆయన డోరిస్ కాకుండా
మరొక స్టీవార్డెస్ తో మాట్లాడటం నేను విన్నాను.

660
00:36:39,992 --> 00:36:41,493
సర్, మీరు బాగానే ఉన్నారా?

661
00:36:46,331 --> 00:36:47,457
నిజానికి, బాగా లేను.

662
00:36:49,126 --> 00:36:52,045
ఈ వార్త చదవడం నాకు చాలా కష్టం అనిపిస్తోంది
ఎందుకంటే కొద్ది రోజుల కిందటే,

663
00:36:52,129 --> 00:36:55,799
నేను వ్యాపారం పని మీద
షికాగో నుంచి న్యూ యార్క్ కి టికెట్ బుక్ చేసుకున్నాను,

664
00:36:55,883 --> 00:36:59,011
కానీ నేను… నేను ఆ విమానం ఎక్కలేకపోయాను.

665
00:37:00,220 --> 00:37:04,183
నాకు సీటు కావాలని గొడవ పడ్డాను,
కానీ వాళ్లు నాకు సీటు ఇవ్వలేకపోయారు.

666
00:37:05,684 --> 00:37:10,814
నేను చాలా కలత చెంది ఇంటికి తిరిగి వెళ్లిపోయాను,
కానీ నేను ఇంటికి చేరుకుని

667
00:37:11,815 --> 00:37:14,943
టీవీ ఆన్ చేసేసరికి,
నేను ఎక్కవలసిన విమానం నేలకూలిందన్న వార్త చూశాను.

668
00:37:16,111 --> 00:37:17,571
నేను టికెట్ బుక్ చేసుకున్న విమానం.

669
00:37:18,822 --> 00:37:22,784
కాబట్టి, నాకు… నాకు… విమాన ప్రయాణం అంటే భయమేస్తోంది.

670
00:37:23,619 --> 00:37:24,745
అది వినడం నాకు బాధగా ఉంది.

671
00:37:24,828 --> 00:37:28,749
కానీ మన విమానానికి అలాంటిదేమీ జరగదని హామీ ఇవ్వగలను,
మన విమానం క్షేమంగా ఉంది.

672
00:37:28,832 --> 00:37:31,043
మీకు ఏమైనా కావాలంటే, నేను అందుబాటులోనే ఉంటాను.

673
00:37:32,211 --> 00:37:33,378
సరే. అది తెలియడం సంతోషం.

674
00:37:34,546 --> 00:37:36,298
ఆయన భయపడటంలో అర్థం ఉంది అనిపించింది.

675
00:37:36,381 --> 00:37:39,051
అది పక్కనపెడితే, ఆయన మనసు కుదుటపడటానికి
నేను ఎలా సాయం చేయగలను?

676
00:37:39,134 --> 00:37:40,385
నా విమానం విరిగిపోయింది.

677
00:37:40,469 --> 00:37:42,846
దానిని చూడటానికే ఆయన బహుశా భయపడిపోవచ్చు.

678
00:37:43,847 --> 00:37:45,891
అప్పుడు నాకు ఒక గొప్ప ఆలోచన తట్టింది.

679
00:37:45,974 --> 00:37:47,809
బహుశా నా విమానాన్ని కెప్టెన్ బాగుచేయగలడేమో.

680
00:37:47,893 --> 00:37:49,061
నా బొమ్మ, ఇది.

681
00:37:52,314 --> 00:37:53,774
మీకు పెళ్లయిందా?

682
00:37:53,857 --> 00:37:55,526
లేదు, ఇంకా కాలేదు.

683
00:37:56,360 --> 00:37:57,444
ఈ మధ్యనే డైవోర్స్ అయింది.

684
00:37:59,029 --> 00:38:00,739
ఇది యాదృచ్ఛికంగా ఉంది కదా?

685
00:38:01,406 --> 00:38:02,991
మా అమ్మ ఒక నటి.

686
00:38:03,909 --> 00:38:05,994
యాదృచ్ఛికం అంటే అర్థం ఏమిటో నాకు తెలుసు అనుకోను.

687
00:38:06,578 --> 00:38:07,496
ఆయన దాన్ని బాగుచేశాడు.

688
00:38:07,996 --> 00:38:09,331
దేవుడా, అతను చాలా గొప్పవాడు.

689
00:38:09,414 --> 00:38:11,041
అతను మా అమ్మని పెళ్లి చేసుకోవచ్చు కదా?

690
00:38:13,377 --> 00:38:14,461
థాంక్యూ!

691
00:38:14,545 --> 00:38:17,422
మీకు తెలుసా, మా అమ్మ ఒక మూవీలో నటించబోతోంది,

692
00:38:17,506 --> 00:38:21,051
అందులో కర్క్ డగ్లస్ ఇంకా ఎలిజబెత్ టేలర్ నటిస్తారని
నాకు చెప్పింది.

693
00:38:23,762 --> 00:38:24,972
ఇంకా పాల్ న్యూమాన్ కూడా.

694
00:38:25,722 --> 00:38:27,724
నిజంగానా? పాల్ న్యూమాన్ నటిస్తాడా?

695
00:38:28,559 --> 00:38:31,353
- నువ్వు చెప్పనేలేదు.
- సరే, నేను ఇంక వెళ్లాలి.

696
00:38:31,979 --> 00:38:33,188
థాంక్యూ.

697
00:38:37,109 --> 00:38:38,360
హాయ్, డార్లింగ్.

698
00:38:38,443 --> 00:38:40,153
కెప్టెన్ ఈ విమానాన్ని బాగు చేశారు.

699
00:38:40,237 --> 00:38:42,489
- ఆయన చాలా మంచివాడు.
- ఓహ్, మంచిది.

700
00:38:42,573 --> 00:38:44,116
నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది, బుజ్జీ.

701
00:38:44,199 --> 00:38:46,243
ఆమె సంతోషపడింది, అది ఎందుకో నాకు తెలుసు.

702
00:38:46,326 --> 00:38:48,871
కొత్త లైనెన్ ఇంకా అందమైన గాజు పాత్రలు,

703
00:38:48,954 --> 00:38:52,165
వెండి వస్తువులు ఆమె ముందు చూడముచ్చటగా పెట్టారు.

704
00:38:52,249 --> 00:38:53,792
ఓహ్, దేవుడా.

705
00:38:56,920 --> 00:38:57,963
లెనక్స్.

706
00:38:59,715 --> 00:39:02,718
మనుషుల ఎదురుగా ప్లేట్ ని తిప్పడం మంచి ప్రవర్తన కాదు.

707
00:39:03,343 --> 00:39:06,180
మా అమ్మకి పురాతన వస్తువులన్నా,
ఖరీదైన గాజు వస్తువులన్నా చాలా ఇష్టం.

708
00:39:07,097 --> 00:39:10,517
ఆమె మెన్యూని గట్టిగా పైకి చదవడం మొదలుపెట్టింది,
అది ఆమెకు అలవాటు.

709
00:39:10,601 --> 00:39:13,020
ఆమె చాలా లోతయిన, నాటకీయమైన గొంతుతో చదువుతుంది

710
00:39:13,103 --> 00:39:15,147
రెస్టారెంట్లలో అది నన్ను ఎప్పుడూ ఇబ్బందిపెట్టేది.

711
00:39:15,230 --> 00:39:18,567
"మీరు ఎంచుకునే అపెటైజర్: రొయ్యల కాక్ టేల్

712
00:39:18,650 --> 00:39:20,652
లేదా స్టఫ్డ్ మష్రూమ్స్ ఇంకా పీతల మాంసం.

713
00:39:21,570 --> 00:39:23,822
మెయిన్ కోర్స్ కోసం, ఆ జూ ఇంకా బీఫ్

714
00:39:24,448 --> 00:39:26,700
- లేదా చికెన్ కార్డాన్ బ్లూ."
- చికెన్ కార్డాన్ బ్లూ.

715
00:39:33,290 --> 00:39:35,501
నేను పైన నా చిన్ని స్వర్గంలోకి తిరిగి ఎక్కేశాను,

716
00:39:35,584 --> 00:39:36,919
అది నా సొంత ప్రైవేటు ప్రపంచం.

717
00:39:37,586 --> 00:39:43,175
ఈ అందమైన జీవితం

718
00:39:44,551 --> 00:39:50,349
సరదాల ప్రయాణం
బతకడానికి ఇదే చక్కని మార్గం

719
00:39:51,183 --> 00:39:52,184
థాంక్యూ.

720
00:39:54,895 --> 00:39:58,357
అందమైన జీవితం

721
00:39:58,440 --> 00:40:04,363
మనం ఫీల్ అయ్యే విషాదాన్నంతా మనల్ని దాచేయనిస్తుంది…

722
00:40:08,867 --> 00:40:10,911
నేను పై నుంచి కింద మా అమ్మ కూర్చున్న చోటుని చూశాక,

723
00:40:11,453 --> 00:40:13,789
ఈ సంవత్సరం నా పుట్టినరోజున
మేము ఏం చేస్తామా అని ఆలోచించడం మొదలుపెట్టాను.

724
00:40:14,373 --> 00:40:17,668
నా చిన్నతనంలో, నా ఐదో పుట్టిన రోజుని తల్చుకోగానే
నేను నవ్వుకోవడం మొదలుపెట్టాను.

725
00:40:17,751 --> 00:40:21,046
అది ఎంత బాగా జరిగిందంటే,
నేను ప్రతి రోజూ పార్టీ చేసుకోవాలని అనిపించింది.

726
00:40:21,755 --> 00:40:23,966
మా అమ్మ నాకు ఐదు రోజుల వేడుక చేసింది.

727
00:40:24,550 --> 00:40:26,301
కానీ తరువాత నేను ఒక ఘోరమైన నిజం తెలుసుకున్నాను,

728
00:40:26,385 --> 00:40:29,137
సాధారణంగా పుట్టినరోజుల్ని
కేవలం ఒక్క రోజే జరుపుకొంటారనే విషయం.

729
00:40:29,805 --> 00:40:32,641
కానీ ప్రతి నెలా పుట్టినరోజు జరుపుకోకూడదని
నాకు ఎవరూ చెప్పలేదు.

730
00:40:32,724 --> 00:40:34,268
నాకు బాగా గుర్తుంది

731
00:40:34,351 --> 00:40:37,688
ఒకసారి ఏప్రిల్ లో నా బర్త్ డే జరుగుతుండగా
మా అమ్మ ఫ్రెండ్ ఇంటికి వచ్చి,

732
00:40:37,771 --> 00:40:39,439
"వీడి పుట్టినరోజు ఫిబ్రవరిలో కదా?" అని అడిగింది.

733
00:40:39,523 --> 00:40:42,025
"అవును, కానీ వాడికి ఆ విషయం చెప్పకు" అని అమ్మ అంది.

734
00:40:42,693 --> 00:40:44,194
అలాంటి విషయాలలో మా అమ్మ మంచిది.

735
00:40:45,028 --> 00:40:47,114
- థాంక్యూ.
- సంతోషం.

736
00:40:48,365 --> 00:40:50,075
నేను ఒక పక్కగా పడుకున్నాను.

737
00:40:50,158 --> 00:40:53,203
ఇంజన్ల శబ్దం ఒక రకంగా
నాకు జోలపాట పాడుతున్నట్లు అనిపించింది.

738
00:40:53,287 --> 00:40:55,706
కాసేపట్లోనే, నేను నిద్రలోకి జారుకున్నాను.

739
00:40:55,789 --> 00:40:57,249
ఆ తర్వాత చాలా ఏళ్ల వరకు,

740
00:40:57,332 --> 00:40:59,168
నాకు సమయం ఉన్నప్పుడల్లా

741
00:40:59,251 --> 00:41:02,921
ఎయిర్ లైన్ షెడ్యూల్స్ వెతికి మరీ ప్రొపెల్లర్ ప్లేన్స్ ఎక్కేవాడిని,

742
00:41:03,005 --> 00:41:04,965
కేవలం ఆనాడు విమానంలో పట్టినంత హాయిగా
నిద్రపోవాలని అలా చేసేవాడిని.

743
00:41:05,048 --> 00:41:09,428
అది ఎందుకో ఒకవేళ నువ్వు ఆలోచిస్తే…

744
00:41:09,511 --> 00:41:12,264
నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకుని ఉన్నంత వరకు
ఇక్కడే ఉండొచ్చు, సరేనా?

745
00:41:12,347 --> 00:41:13,724
- సరే.
- సరే.

746
00:41:13,807 --> 00:41:15,726
నేను మీ కెప్టెన్ ని మాట్లాడుతున్నాను.

747
00:41:15,809 --> 00:41:18,729
రాబోయే 20 నిమిషాల పాటు విమానం కొంచెం
అటూ ఇటూ ఊగుతుందని అంచనా వేస్తున్నాం.

748
00:41:18,812 --> 00:41:21,440
దయచేసి మీ సీట్లలో కూర్చోండి ఇంకా
మీ సీటు బెల్టులు పెట్టుకుని ఉండండి.

749
00:41:21,523 --> 00:41:24,276
విమానం కొద్దిగా అటు ఇటు ఊగుతూ,
గడగడమంటూ శబ్దం చేయడం మొదలైంది.

750
00:41:24,359 --> 00:41:27,946
మా విమానం మేఘాల పైకి వెళ్లడం మొదలుపెట్టగానే,
ఇంజన్ శబ్దం ఒక్కసారిగా మారిపోయింది.

751
00:41:28,697 --> 00:41:30,908
అయితే, విమానం ఇంకా ఎక్కువ ఊగిపోతోంది,

752
00:41:30,991 --> 00:41:33,160
దానితో కొందరు ప్రయాణికులు దిక్కులు చూడటం మొదలుపెట్టారు

753
00:41:33,243 --> 00:41:36,663
ఈ సమస్య నుండి బయటపడటానికి
పరిష్కారం కోసం చూస్తున్నారు అనిపించింది.

754
00:41:38,373 --> 00:41:40,292
ఒకాయన 12ఏ సీటు నుండి లేచాడు

755
00:41:40,375 --> 00:41:42,127
ఇంకా విచిత్రంగా విమానం వెనుక భాగం వైపు నడిచాడు.

756
00:41:42,211 --> 00:41:43,212
మీరు బాగానే ఉన్నారా?

757
00:41:43,295 --> 00:41:44,588
ఆయన గట్టిగట్టిగా అరుస్తున్నాడు.

758
00:41:44,671 --> 00:41:46,006
నా వెంట రాకండి!

759
00:41:47,424 --> 00:41:48,759
సర్? సర్, మీకు ఏమైనా సాయం కావాలా?

760
00:41:48,842 --> 00:41:51,428
పేరు తెలియని ఒక స్టీవార్డెస్ఆ యన వెంట పరుగెత్తింది.

761
00:41:51,512 --> 00:41:53,805
- సర్, మీకు ఏమైనా సాయం చేయనా? మరేం ఫర్వాలేదు.
- ఆ దృశ్యం విచిత్రంగా ఉంది.

762
00:41:53,889 --> 00:41:56,475
ఆ వ్యక్తి ఆ యువతి మెడని పట్టుకున్నాడు,

763
00:41:56,558 --> 00:41:58,977
దానితో ఆమె కూడా అతని మెడని పట్టుకుంది.

764
00:41:59,770 --> 00:42:02,105
వారిద్దరి మధ్య ఒక సహజమైన ప్రతిఘటన కనిపించింది.

765
00:42:02,189 --> 00:42:03,232
నాకు అర్థమైంది. ఇది మాకు అలవాటే.

766
00:42:03,315 --> 00:42:05,776
కానీ వాళ్ల మధ్య సంభాషణలు మామూలుగానే సాగాయి.

767
00:42:05,859 --> 00:42:07,861
పైకి కనిపించేదాని కన్నా ఆ వ్యక్తిత్వం గంభీరంగా ఉంది.

768
00:42:07,945 --> 00:42:09,446
- ఒక సమస్య తలెత్తింది.
- గట్టిగా ఊపిరి వదలండి.

769
00:42:09,530 --> 00:42:10,614
థాంక్యూ.

770
00:42:10,697 --> 00:42:12,783
ఆయన అందరికన్నా ముందు విమానం ఎక్కినప్పుడు,

771
00:42:12,866 --> 00:42:15,369
ఆయనకు మత్తుమందులు ఇచ్చి

772
00:42:15,452 --> 00:42:18,997
డెన్వర్ చేరుకోగానే వేరే మెంటల్ హాస్పిటల్ కి
ఆయనని తరలించడానికి ప్రత్యేకంగా కూర్చోపెట్టారు అనుకుంటా.

773
00:42:19,081 --> 00:42:20,290
ఓహ్, చాలా థాంక్స్.

774
00:42:20,374 --> 00:42:21,917
- ఆవేశపడకండి.
- సారీ.

775
00:42:22,000 --> 00:42:23,502
మీకు ఏమైనా కావాలంటే, నాకు చెప్పండి.

776
00:42:23,585 --> 00:42:25,587
వాళ్లు చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నారు.

777
00:42:25,671 --> 00:42:27,673
అక్కడ ఏదైనా గొడవ జరిగిందంటే నమ్మడం కష్టం.

778
00:42:28,465 --> 00:42:30,592
ఇద్దరూ కలిసి ఆయనని శాంతపరిచారు.

779
00:42:31,218 --> 00:42:33,846
అయినా కూడా, మేము విమానం దిగే వరకూ
అందరూ ఇబ్బందిపడుతున్నట్లు కనిపించారు.

780
00:42:33,929 --> 00:42:37,015
- మిమ్మల్ని కూర్చోపెడదాం, సరేనా?
- అలాగే, నేను బాగానే ఉన్నాను.

781
00:42:41,228 --> 00:42:44,481
డెన్వర్

782
00:42:47,234 --> 00:42:49,152
మీ పాల్ న్యూమాన్ మూవీకి గుడ్ లక్.

783
00:42:52,406 --> 00:42:53,907
దేనికి, థాంక్యూ.

784
00:42:53,991 --> 00:42:54,992
అది నాకు అవసరం.

785
00:42:57,327 --> 00:42:58,996
మన విమానం ఎందుకు చెడిపోయింది అంటావు?

786
00:42:59,079 --> 00:43:01,331
నాకు తెలియదు, డార్లింగ్,

787
00:43:01,415 --> 00:43:02,624
కానీ మరేం ఫర్వాలేదు.

788
00:43:02,708 --> 00:43:04,459
అది మనకి హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.

789
00:43:04,543 --> 00:43:08,338
రేపు మన ఫ్లయిట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది.

790
00:43:09,506 --> 00:43:11,800
మనం కలిసి ఒక నాటకం చదివితే ఎలా ఉంటుంది?

791
00:43:12,509 --> 00:43:16,930
మనం 'ద ఫిలడెల్ఫియా స్టోరీ' చదివితే
బాగుంటుంది అనుకుంటున్నాను.

792
00:43:17,014 --> 00:43:18,390
- అలాగే.
- సరే.

793
00:43:19,641 --> 00:43:21,852
నిజానికి, డెన్వర్ లో బస చేయడం సరదాగా ఉంది.

794
00:43:21,935 --> 00:43:24,855
ఆ రాత్రి, అమ్మ ఒక నాటకంలో రెండు అంకాలని పైకి చదివింది.

795
00:43:24,938 --> 00:43:26,273
నాకు గుర్తున్నప్పటి నుండి,

796
00:43:26,356 --> 00:43:29,151
అమ్మ నాకు జానపద కథల బదులు
గుడ్ నైట్ నాటకాలనే చదివి వినిపించేది.

797
00:43:32,571 --> 00:43:34,907
డెన్వర్ టెర్మినల్ రెస్టారెంట్ లో
మేము లంచ్ చేయడానికి వెళ్లాం.

798
00:43:35,490 --> 00:43:38,535
గ్రిల్డ్ చీజ్ తింటూ కోక్ తాగుతూ
వచ్చేపోయే విమానాలను చూస్తూ కూర్చున్నాను.

799
00:43:39,786 --> 00:43:41,121
అది చాలా గొప్పగా అనిపించింది.

800
00:43:41,205 --> 00:43:43,832
అంత మంచి అనుభూతిని మించి మరేం ఉంటుంది?

801
00:43:43,916 --> 00:43:44,958
ఏదీ ఉండదు.

802
00:43:45,042 --> 00:43:46,376
నేను ఎప్పటికీ ఇలాగే బతకాలని కోరుకున్నాను.

803
00:43:46,919 --> 00:43:49,254
- మీ ఫ్లయింట్ ని ఆస్వాదించండి.
- థాంక్యూ. మీ ప్రయాణం బాగా జరగాలి.

804
00:43:50,297 --> 00:43:54,134
హాయ్, నీ కోసం ఒక నోట్ ఉంది.

805
00:43:55,511 --> 00:43:57,054
అవును, దాని గురించి లిజ్ నాకు చెప్పింది.

806
00:43:57,137 --> 00:43:58,847
ఆగు! మనం వేరే గేట్ లో ఉన్నాం!

807
00:43:58,931 --> 00:44:00,474
అమ్మా, మనం ప్లేన్ ని మిస్ అవుతున్నాం!

808
00:44:00,557 --> 00:44:02,059
మనం ఎక్కాల్సింది ఇది కాదు, అమ్మా. చెబుతున్నానుగా!

809
00:44:02,142 --> 00:44:04,436
ఇది లాస్ ఏంజెలెస్ కి వెళ్లే నాన్ స్టాప్ ఫ్లయిట్.

810
00:44:04,520 --> 00:44:05,729
నాకు ఇది కంఠతా వచ్చు.

811
00:44:05,812 --> 00:44:09,233
స్టార్ స్ట్రీమ్ బోయింగ్ 707
రాయల్ అంబాసిడర్ సర్వీస్.

812
00:44:09,316 --> 00:44:11,527
- థాంక్యూ. వాడి టికెట్ కూడా నేనే తీసుకుంటాను.
- మీ ఫ్లయిట్ ని ఎంజాయ్ చేయండి.

813
00:44:11,610 --> 00:44:12,736
థాంక్యూ.

814
00:44:12,819 --> 00:44:14,530
సర్ ప్రైజ్, బంగారం.

815
00:44:14,613 --> 00:44:17,407
మనం జెట్ విమానంలో వెళ్తున్నాం.

816
00:44:18,700 --> 00:44:19,952
ఏంటి?

817
00:44:20,953 --> 00:44:22,204
నేను ఇది నమ్మలేకపోతున్నాను.

818
00:44:22,287 --> 00:44:24,373
మనం లాస్ ఏంజెలెస్ కి 707 విమానంలో వెళ్తున్నాం.

819
00:44:28,377 --> 00:44:29,795
నీకు ఎగ్జయిటింగ్ గా ఉందా, బుజ్జీ?

820
00:44:30,546 --> 00:44:32,548
ఇది లిజ్ నీ కోసం ఏర్పాటు చేసిన సర్ ప్రైజ్.

821
00:44:36,218 --> 00:44:37,261
ఏం అయింది, బేబీ?

822
00:44:37,344 --> 00:44:39,763
ఏమీ లేదు. ఇది కేవలం…

823
00:44:39,847 --> 00:44:43,392
అంటే, మనం ఈ విమానం ఎక్కుతాం
తరువాత నువ్వు ఆడంబరంగా ప్రవర్తించడం మొదలుపెడతావు.

824
00:44:49,481 --> 00:44:52,067
సరే, మనం గేటు దగ్గరకి వెళదాం, సరేనా?

825
00:44:54,027 --> 00:44:55,195
నిజంగానే చాలా ఎగ్జయిట్ అయ్యాను.

826
00:44:55,279 --> 00:44:57,865
కానీ కొన్నిసార్లు దాన్ని ఎలా వ్యక్తం చేయాలో నాకు తెలియదు.

827
00:45:00,367 --> 00:45:02,452
ఎందుకో నేను ఏదో కోల్పోయినట్లు ఫీల్ అయ్యాను.

828
00:45:04,371 --> 00:45:07,165
బహుశా ఆ భారీ, అందమైన కోనీ విమానానికి
నేను గుడ్ బై చెప్పాల్సి వచ్చినందుకు కావచ్చు,

829
00:45:07,666 --> 00:45:09,710
లేదా బహుశా డోరిస్ ని మళ్లీ ఎప్పటికీ చూడలేనన్న బాధ కావచ్చు.

830
00:45:12,171 --> 00:45:14,923
ఆమె ఏమీ మాట్లాడలేదు, అది నాకు చాలా బాధ కలిగించింది.

831
00:45:21,013 --> 00:45:24,433
అదిగో అక్కడ ఉంది.
విమానం అంటే ఇదీ అనిపించే అద్భుతమైన ఎయిర్ క్రాఫ్ట్.

832
00:45:25,601 --> 00:45:27,895
అది కళ. నన్ను నమ్మండి, అది కళ.

833
00:45:36,904 --> 00:45:39,990
నేను జెట్ విమానంలో ఫస్ట్ క్లాసులో ఉన్నాను.

834
00:45:40,866 --> 00:45:42,075
నేను అది నమ్మలేకపోయాను.

835
00:45:43,076 --> 00:45:44,912
నాకు ఇష్టమైన చోట కూర్చోమని అమ్మ చెప్పింది

836
00:45:44,995 --> 00:45:47,331
ఎందుకంటే నేను ఒంటరిగా ప్రయాణిస్తున్న
అనుభూతి పొందవచ్చని ఆమె అభిప్రాయం.

837
00:45:47,414 --> 00:45:49,958
ఆమె బార్బరా అనే
ఒక అందమైన మహిళ పక్కన కూర్చోవాలని నిర్ణయించుకుంది.

838
00:46:02,846 --> 00:46:05,224
ఒక్కసారిగా పెరిగిన ఆ ఇంజన్ పవర్
నన్ను సీటులో వెనక్కి నెట్టింది.

839
00:46:21,323 --> 00:46:23,450
వావ్. అద్భుతం.

840
00:46:23,534 --> 00:46:25,202
అది చాలా అద్భుతంగా ఉంది.

841
00:46:25,285 --> 00:46:26,662
నేరుగా ఆకాశంలోకి ఎగిరిపోయాము.

842
00:46:28,455 --> 00:46:30,791
చూస్తుండగానే మేము కోలరాడో పర్వతాల పైనుండి ప్రయాణించాం.

843
00:46:31,375 --> 00:46:35,754
మధ్యాహ్నం వెలుగులో ఆ మంచు కప్పిన పర్వతపు అంచులు
మరింత ధగధగ మెరిశాయి.

844
00:46:37,464 --> 00:46:40,300
విమానం ఆకాశంలో స్థిరపడింది,
తరువాత కెప్టెన్ స్పీకర్ లో మాట్లాడాడు.

845
00:46:40,884 --> 00:46:43,595
లేడీస్ అండ్ జెంటిల్మెన్, జెట్ యుగానికి స్వాగతం.

846
00:46:43,679 --> 00:46:48,559
మనం గంటకి 965 కిలోమీటర్ల వేగంతో
33 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నాం.

847
00:46:48,642 --> 00:46:52,896
లాస్ ఏంజెలెస్ కి మనం గంటా 52 నిమిషాలలో చేరుకుంటాం.

848
00:46:52,980 --> 00:46:55,232
కాబట్టి మీరు నిశ్చింతగా కూర్చుని ప్రయాణాన్ని ఆస్వాదించండి.

849
00:46:55,315 --> 00:46:56,733
నా తరపున షాంపైన్ ఆస్వాదించండి.

850
00:47:02,447 --> 00:47:04,533
బార్బరా మా అమ్మకన్నా వయసులో కాస్త పెద్దది,

851
00:47:04,616 --> 00:47:07,244
కానీ చాలా అందంగా ఉంది ఇంకా మా అమ్మకి నచ్చినట్లుగానే,

852
00:47:07,327 --> 00:47:09,580
హుందాగా, సంపన్నంగా ఎలాంటి యాస లేకుండా ఉంది.

853
00:47:10,330 --> 00:47:11,415
లేదు, లేదు.

854
00:47:11,498 --> 00:47:14,543
దురదృష్టం కొద్దీ, నా భర్త చాలా ఏళ్ల కిందటే చనిపోయారు.

855
00:47:14,626 --> 00:47:17,629
ఆయన పేరు హెన్రీ ఇంకా…

856
00:47:17,713 --> 00:47:19,047
ఓహ్, నేను ఆ కథంతా మీకు చెబుతాను.

857
00:47:19,131 --> 00:47:24,052
క్రాకర్ బ్యాంక్ ప్రెసిడెన్సీని స్వీకరించడానికి
ఆయన పోడియం మీదకి వెళ్లినప్పుడు

858
00:47:24,136 --> 00:47:25,971
- ఆయనకి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది.
- ఓహ్, దేవుడా.

859
00:47:26,054 --> 00:47:28,140
- ఓహ్, బార్బరా.
- నలభై మూడేళ్ల వయస్సులో.

860
00:47:29,057 --> 00:47:31,018
నేను క్యాబిన్ అంతా తిరగాలని నిర్ణయించుకున్నాను.

861
00:47:33,896 --> 00:47:35,939
నేను చాలా గర్వంగా అడుగులేస్తూ నడిచాను.

862
00:47:36,523 --> 00:47:38,567
తను చేస్తున్నది ఒక ప్రత్యేకమైన పని అని తెలిసిన

863
00:47:38,650 --> 00:47:40,819
ఒక ఎనిమిదేళ్ల కుర్రవాడు మాత్రమే అలా నడవగలడు.

864
00:47:51,538 --> 00:47:53,540
ఆ నడవలో, నేను ఎడమ వైపు చూసినప్పుడు,

865
00:47:53,624 --> 00:47:55,083
అక్కడ ఒక చిన్న పిల్లవాడిని చూశాను.

866
00:47:55,751 --> 00:47:57,294
అతను వయసులో నాకన్నా చిన్నవాడు.

867
00:47:57,377 --> 00:47:58,879
సుమారు రెండేళ్లు తేడా ఉంటుందేమో.

868
00:47:59,713 --> 00:48:03,759
అతను అఫీషియల్ ఎయిర్ లైన్ గైడ్,
లేదా ఓ.ఏ.జి. చదువుతూ కూర్చుని ఉన్నాడు,

869
00:48:03,842 --> 00:48:06,512
పెద్ద పెద్ద కంపెనీలలో కేవలం ట్రావెల్ ఏజెంట్ల దగ్గర మాత్రమే
ఆ పుస్తకం ఉంటుంది.

870
00:48:06,595 --> 00:48:08,555
అది ఓ.ఏ.జి. తాజా సంచికేనా?

871
00:48:09,306 --> 00:48:11,934
అందరికంటే ముందుగా మా నాన్నకి ఇది మెయిల్ లో వస్తుంది.

872
00:48:12,017 --> 00:48:14,144
ఓహో, నువ్వు చాలా లక్కీ.

873
00:48:14,728 --> 00:48:15,896
నేను ఇప్పుడే వస్తాను.

874
00:48:17,981 --> 00:48:19,191
అమ్మా, నాకొక కొత్త బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు!

875
00:48:19,274 --> 00:48:21,193
- అతని దగ్గర ఓ.ఏ.జి. ఉంది. ఓహ్, దేవుడా…
- ఓహ్, జెఫ్, డార్లింగ్.

876
00:48:21,276 --> 00:48:22,569
జెఫ్, ఈవిడ పేరు బార్బరా.

877
00:48:22,653 --> 00:48:26,281
ఇంకా నువ్వు నమ్ముతావో లేదో,
ఆమె తండ్రికి సొంతంగా ఎయిర్ లైన్ కంపెనీ ఉంది.

878
00:48:26,365 --> 00:48:28,784
ట్రాన్స్ కరేబియన్ ఎయిర్ లైన్స్.

879
00:48:28,867 --> 00:48:30,327
- నిజంగానా?
- అవును.

880
00:48:30,410 --> 00:48:33,664
ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి, అదేమిటంటే
బార్బరా అనే నా పేరుని,

881
00:48:33,747 --> 00:48:37,709
మా నాన్న సరికొత్త డిసి-8 జెట్ విమానం
ముందు భాగంలో రాయించారు.

882
00:48:37,793 --> 00:48:39,962
వావ్. అది చాలా మంచి విషయం.

883
00:48:40,629 --> 00:48:42,422
ఆమె పేరు రాసి ఉండే ఒక విమానం.

884
00:48:43,465 --> 00:48:47,886
నేను ఇక్కడ ఉండాలా లేదా
నా కొత్త ఫ్రెండ్, స్కిప్పర్ దగ్గరకి వెళ్లనా?

885
00:48:50,806 --> 00:48:51,807
పిల్లలు.

886
00:48:52,933 --> 00:48:55,561
ఆ తరువాత గంట సేపు

887
00:48:55,644 --> 00:48:57,729
నాకు, స్కిప్పర్ కీ మధ్య సంభాషణ చాలా ఆసక్తికరంగా సాగింది.

888
00:48:57,813 --> 00:49:01,233
టి.డబ్ల్యు.ఏ.కి లండన్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో మధ్య
ఒక నాన్ స్టాప్ విమాన సర్వీసు ఉండేదని

889
00:49:01,316 --> 00:49:06,363
ఆ ప్రయాణానికి 22 గంటల సమయం పట్టేదంటే నమ్మగలవా?

890
00:49:06,446 --> 00:49:07,948
వావ్, నిజంగానా?

891
00:49:08,782 --> 00:49:10,826
నా ఫ్రెండ్స్ లో ఎవరూ ఏవియేషన్ గురించి చదవరు,

892
00:49:10,909 --> 00:49:11,994
కానీ ఇప్పుడు నాకు స్కిప్పర్ దొరికాడు.

893
00:49:12,077 --> 00:49:14,204
- మీ నాన్న ఎక్కడ?
- అదిగో అక్కడ ఉన్నారు.

894
00:49:14,288 --> 00:49:15,372
ఆయన ఏం చేస్తారు?

895
00:49:15,455 --> 00:49:17,249
- ఆయన లాయరు.
- మీ అమ్మగారు ఎక్కడ?

896
00:49:17,332 --> 00:49:19,334
ఓహ్, నా మూడేళ్ల వయసులో ఆమె చనిపోయారు.

897
00:49:19,960 --> 00:49:22,296
ఓహ్, అవునా? నీకు కొత్త అమ్మ ఉందా?

898
00:49:22,379 --> 00:49:25,924
లేదు, మా అమ్మ చనిపోయాక మా నాన్న
రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు,

899
00:49:26,008 --> 00:49:28,177
కానీ వాళ్లు కూడా క్యాన్సర్ తోనే చనిపోయారు.

900
00:49:28,260 --> 00:49:30,262
- అందరూ.
- నువ్వు అబద్ధం చెబుతున్నావు.

901
00:49:31,180 --> 00:49:32,264
ఆయన ఏదైనా యాసలో మాట్లాడతాడా?

902
00:49:32,347 --> 00:49:33,640
నాకు తెలియదు. అది అంత అవసరమా?

903
00:49:33,724 --> 00:49:34,850
అంటే, కొద్దిగా అవసరమే.

904
00:49:34,933 --> 00:49:36,310
ఆయనకి ఏ యాస లేదనుకుంటా.

905
00:49:36,393 --> 00:49:38,270
ఓహ్, మంచిది. మా అమ్మ ఆయనని ఇష్టపడుతుంది.

906
00:49:38,353 --> 00:49:40,272
ఎలాంటి యాస లేనివాళ్లని మా అమ్మ ఇష్టపడుతుంది.

907
00:49:40,814 --> 00:49:42,065
హాలీవుడ్ కోసం.

908
00:49:42,608 --> 00:49:43,650
- మన కోసం.
- అవును.

909
00:49:43,734 --> 00:49:44,860
- ఇప్పటికీ నమ్మలేకపోతున్నా…
- అమ్మా!

910
00:49:44,943 --> 00:49:46,028
ఇతను నా కొత్త బెస్ట్ ఫ్రెండ్,

911
00:49:46,111 --> 00:49:48,864
కానీ వాళ్ల నాన్న బాగా రిచ్ ఇంకా బాధలో ఉన్నాడు
ఇంకా ఆయనకి ఎలాంటి యాస లేదు.

912
00:49:50,449 --> 00:49:52,451
సరే, నేను ఏ వరుసలో కూర్చున్నానో ఆయనకి తెలియజేయి.

913
00:49:54,286 --> 00:49:55,287
హాయ్.

914
00:49:56,330 --> 00:49:57,623
నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు?

915
00:49:57,706 --> 00:50:00,584
అంటే, మిమ్మల్ని చివరిసారి కలవడం కోసం
నా విమానాన్ని మార్చుకున్నాను.

916
00:50:01,543 --> 00:50:03,504
నేను ఇంకెప్పుడూ నా ముఖాన్ని కడుక్కోను.

917
00:50:04,254 --> 00:50:05,422
అది చాలా బాగుంది.

918
00:50:05,506 --> 00:50:09,134
నా గర్ల్ ఫ్రెండ్, నా మిత్రుడు, మా అమ్మ కాబోయే కొత్త భర్త.

919
00:50:09,927 --> 00:50:12,513
ఇంకా మేమంతా కొత్త జెట్ లో
పశ్చిమం దిశగా ప్రయాణిస్తున్నాం.

920
00:50:12,596 --> 00:50:15,724
జీవితం అంతకన్నా అందంగా ఉండటం అనేది
సైంటిఫిక్ గా అసాధ్యం.

921
00:50:21,313 --> 00:50:24,024
హలో. మీరు షాటౌబ్రియాన్ తీసుకుంటారా?

922
00:50:25,192 --> 00:50:26,276
- వద్దు.
- వద్దు.

923
00:50:26,360 --> 00:50:27,611
మీకు చికెన్ ఇష్టమేనా?

924
00:50:28,195 --> 00:50:29,321
పెద్దగా ఇష్టం లేదు.

925
00:50:29,404 --> 00:50:30,739
నీకు ఫ్రయిడ్ చికెన్ ఇష్టం లేదా?

926
00:50:30,822 --> 00:50:32,199
నాకు ఫ్రయిడ్ చికెన్ ఇష్టం.

927
00:50:32,699 --> 00:50:34,868
అయితే, ఇది కూడా అచ్చు అలాగే ఉంటుంది.

928
00:50:34,952 --> 00:50:36,495
దీనిని చికెన్ కార్డాన్ బ్లూ అంటారు.

929
00:50:38,539 --> 00:50:42,793
కానీ మా జెట్ ఫ్లయిట్స్ లో,
మేము పిల్లల కోసం ప్రత్యేకమైన మెన్యూ అందిస్తాము,

930
00:50:42,876 --> 00:50:45,879
హాట్ డాగ్, హాంబర్గర్, పీనట్ బటర్ ఇంకా జెల్లీ శాండ్విచ్ లలో

931
00:50:45,963 --> 00:50:47,965
మీరు ఏదైనా ఎంచుకోవచ్చు.

932
00:50:48,757 --> 00:50:50,300
నాకు మస్టర్డ్ సాస్ వేసిన హాట్ డాగ్ కావాలి.

933
00:50:50,384 --> 00:50:53,053
నాకు మస్టర్డ్ లేకుండా హాట్ డాగ్ కావాలి, కెచప్ కూడా వద్దు.

934
00:50:53,136 --> 00:50:54,304
మంచి ఎంపిక.

935
00:50:54,388 --> 00:50:55,848
నాకు మూర్ఛ వస్తుందేమో అనుకున్నాను.

936
00:50:55,931 --> 00:50:58,642
హాట్ డాగ్ 35 వేల అడుగుల ఎత్తులో తినడమా?

937
00:50:58,725 --> 00:51:01,520
నేను ఎంత ఎగ్జయిట్ అయ్యానంటే నాకు మాటలు రాలేదు.

938
00:51:01,603 --> 00:51:03,981
కానీ నేను ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి స్కిప్ వైపు తిరిగాను.

939
00:51:04,064 --> 00:51:06,316
నీ అఫీషియల్ ఎయిర్ లైన్ గైడ్ బుక్ నాకు నచ్చింది.

940
00:51:06,400 --> 00:51:07,442
థాంక్స్.

941
00:51:09,611 --> 00:51:12,865
సూర్యుడు మెరిసిపోతున్నాడు,
ఆకాశం అందమైన నీలం రంగులో ఉంది,

942
00:51:12,948 --> 00:51:15,742
ఇంకా నా కొత్త బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి

943
00:51:15,826 --> 00:51:18,912
గంటకి 965 కిలోమీటర్ల వేగంతో వెళ్లే విమానంలో
హాట్ డాగ్ తింటున్నాను, కోక్ తాగుతున్నాను.

944
00:51:19,872 --> 00:51:23,208
ఆ క్షణం నుండి, అలాంటి అందమైన క్షణాలు
మళ్లీ వస్తాయని నేను అనుకోలేదు.

945
00:51:42,936 --> 00:51:45,147
లాస్ ఏంజెలెస్

946
00:51:45,230 --> 00:51:46,607
మేము రన్ వే మీద వెళుతుంటే,

947
00:51:46,690 --> 00:51:49,860
లాస్ ఏంజెలెస్ ఎయిర్ పోర్ట్ లో కొత్త స్పేస్ ఏజ్ తరహా
రెస్టారెంట్ నాకు కనిపించింది.

948
00:51:50,485 --> 00:51:51,737
అది నిజంగా చాలా అందంగా ఉంది.

949
00:51:51,820 --> 00:51:54,156
ఏదో ఒక రోజు అక్కడ తినాలని అనుకున్నాను.

950
00:51:58,952 --> 00:52:00,579
కిటికీ గుండా,

951
00:52:00,662 --> 00:52:04,124
మా విమానానికి జత కావడానికి జెట్ వే రావడం నాకు కనిపించింది.

952
00:52:10,756 --> 00:52:12,633
అమ్మా, బయట మూవీ కెమెరాలు ఉన్నాయి.

953
00:52:13,217 --> 00:52:15,636
- నువ్వు తమాషాగా అంటున్నావు.
- లేదు, తను అబద్ధం చెప్పడం లేదు.

954
00:52:15,719 --> 00:52:17,262
- బాధపడే కంటే సేఫ్ గా ఉండటం మంచిది.
- అవును.

955
00:52:17,346 --> 00:52:19,014
కానీ, మీరు చాలా అందంగా ఉన్నారు.

956
00:52:40,452 --> 00:52:42,162
బయట అన్ని కెమెరాలు ఎందుకు ఉన్నాయి?

957
00:52:42,246 --> 00:52:43,705
అతను మన జెట్ నడిపిన కెప్టెన్.

958
00:52:43,789 --> 00:52:46,500
ఆయన వయసు 62 ఏళ్లు,
ఇంకా ఇదే పైలెట్ గా ఆయన చివరి ఫ్లయిట్.

959
00:52:46,583 --> 00:52:48,043
మీ గురించి డోరిస్ అంతా చెప్పింది.

960
00:52:48,126 --> 00:52:49,711
- నీ పేరు జెఫ్ కదా?
- అవును.

961
00:52:49,795 --> 00:52:52,589
నాతో పాటు జెట్ వేలో నడుస్తావా?

962
00:52:52,673 --> 00:52:55,592
లైఫ్ మ్యాగజీన్ వాళ్లు
ఆయన మీద ఒక ప్రత్యేక టీవీ షో షూట్ చేస్తున్నారు.

963
00:53:02,182 --> 00:53:04,351
సరే, చివరిగా నాదొక ప్రశ్న.

964
00:53:05,102 --> 00:53:07,104
మీరు ఇప్పుడు రిటైర్ అయ్యారు గనుక
తరువాత ఏం చేయబోతున్నారు?

965
00:53:08,355 --> 00:53:11,567
అంటే, నేను సైన్ అవుట్ చేసేవరకూ
అఫీషియల్ గా రిటైర్ కానట్లే లెక్క,

966
00:53:11,650 --> 00:53:15,612
కానీ మీ కెమెరాల ముందే మీరు నన్ను రిటైర్ చేస్తే గనుక…

967
00:53:17,155 --> 00:53:18,574
నేను అనుకోవడం…

968
00:53:19,449 --> 00:53:21,535
నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే

969
00:53:22,202 --> 00:53:23,704
నా వింగ్స్ ని

970
00:53:24,955 --> 00:53:26,081
ఈ చిన్న పిల్లవాడికి ఇచ్చేస్తాను

971
00:53:26,999 --> 00:53:28,292
నా దృష్టిలో…

972
00:53:31,044 --> 00:53:32,629
ఫ్లయింగ్ అనేది ఇతని రక్తంలోనే ఉంది.

973
00:53:40,971 --> 00:53:43,557
ఆ సంఘటనని నేను నా జీవితంలో చాలా సీరియస్ గా తీసుకున్నాను

974
00:53:44,141 --> 00:53:46,185
కాబట్టే ఈ రోజు నేనే కెప్టెన్ అయ్యాను.

975
00:53:46,268 --> 00:53:49,813
నేను డోరిస్ ని పెళ్లి చేసుకున్నాను, అయితే మా మధ్య
వయసు తేడాని అధిగమించడానికి నేను కష్టపడాల్సి వచ్చింది.

976
00:53:50,314 --> 00:53:52,065
సరిగ్గా చెప్పాలంటే పదమూడేళ్లు.

977
00:53:52,149 --> 00:53:54,318
కానీ ఏది ఏమైనా, మేము దంపతులుగా సంతోషంగా ఉన్నాం.

978
00:53:54,401 --> 00:53:56,320
పూర్తి స్థాయిలో మేము ఒక ఏవియేషన్ జంట అయ్యాం.

979
00:53:56,820 --> 00:53:59,781
నిజం చెప్పాలంటే, నేను ఆమెని ప్రతి రోజూ చూడగలుగుతాను.

980
00:54:00,616 --> 00:54:04,620
ఆమె జె.ఎఫ్.కె. ఎయిర్ పోర్ట్ లో కొత్త ఎనౌన్సర్,
ఇంకా నేను న్యూ యార్క్, లాస్ ఏంజెలెస్ మధ్య ప్రయాణిస్తాను.

981
00:54:04,703 --> 00:54:06,079
చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

982
00:54:06,163 --> 00:54:07,164
ఓహ్, అవును.

983
00:54:07,247 --> 00:54:10,667
మా అమ్మ గురించి మీరు ఆలోచిస్తుంటే గనుక,
ఆమె స్కిప్పర్ నాన్నని పెళ్లి చేసుకోలేదు,

984
00:54:10,751 --> 00:54:12,753
కానీ కొద్దికాలంపాటు ఆమె ఆయనతో డేట్ చేసింది.

985
00:54:12,836 --> 00:54:14,546
అది వర్కవుట్ అవుతుందని మేమంతా నటించాము.

986
00:54:14,630 --> 00:54:15,714
కానీ ఆమె సంతోషంగానే ఉంది.

987
00:54:16,298 --> 00:54:19,259
ఆమె కాలిఫోర్నియాలోని పాసడేనా ప్లేహౌస్ లో
యాక్టింగ్ పాఠాలు చెబుతోంది.

988
00:54:19,801 --> 00:54:22,846
ఆమెకి ఇప్పుడు 80 ఏళ్లు కానీ
ఇప్పటికీ కుర్రవాళ్లతో గడపడం అంటే ఆమెకు ఇష్టం.

989
00:54:23,555 --> 00:54:27,351
ఇంకా దాదాపు 20 ఏళ్లుగా లిజ్ మా అమ్మకి ఫేవరెట్ స్టూడెంట్,
అది ఇప్పటికీ కొనసాగుతోంది.

990
00:54:28,185 --> 00:54:29,561
నా జీవితం చాలా అద్భుతంగా గడిచింది.

991
00:54:33,440 --> 00:54:35,150
ఈ ఫిల్మ్ ని వీరికి అంకితం ఇస్తున్నాను

992
00:54:35,234 --> 00:54:36,568
కెల్లీ

993
00:54:36,652 --> 00:54:37,945
జెట్

994
00:54:38,028 --> 00:54:39,363
బెన్

995
00:54:39,446 --> 00:54:40,739
ఇంకా ఎల్లా

996
00:54:40,822 --> 00:54:42,449
మా అమ్మా నాన్నలకి

997
00:54:42,533 --> 00:54:44,326
నా బ్రదర్స్ ఇంకా సిస్టర్స్ కి

998
00:54:44,409 --> 00:54:48,413
నా జీవితానికి స్ఫూర్తిని ఇచ్చిన ప్రతి ఒక్కరికీ

999
00:55:18,068 --> 00:55:21,071
వ్యాఖ్యానం జాన్ ట్రవోల్టా

1000
00:59:53,093 --> 00:59:54,928
ఇది కల్పిత కథ.

1001
00:59:55,012 --> 00:59:57,264
వాస్తవంగా ఎవరైనా వ్యక్తులను,

1002
00:59:57,347 --> 00:59:59,683
వారు జీవించి ఉన్నా లేదా మరణించినా,
లేదా వాస్తవ సంఘటనలను

1003
00:59:59,766 --> 01:00:01,810
ఇందులోని పాత్రలు, సన్నివేశాలు పోలి ఉంటే గనుక
అది పూర్తిగా యాదృచ్ఛికం.

1004
01:00:09,318 --> 01:00:11,236
తెలుగు అనువాదకర్త: హరీష్



